- సుష్మకు మహమూద్ అలీ వినతి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో బుధవారం సుష్మాస్వరాజ్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పిం చారు. అలాగే హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర మైనార్టీ, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అబ్బాస్ నఖ్వీని కలిసిన అలీ మైనార్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న పథకాలకు చేయూత అందించాలని కోరారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ గురజాడ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలసి వివరాలు తెలిపారు. ఢిల్లీ టూర్‌లో సౌదీ అంబాసిడర్లతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు.