
న్యూఢిల్లీ: తపాలా శాఖల్లో 2028–29 నాటికి మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు వీలుగా తపాలా శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ‘భారత ఆర్థిక సదస్సు 2024’ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.
తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 6,40,000 విక్రయ కేంద్రాలున్నాయని, ప్రపంచంలో మరే సంస్థకు ఈ స్థాయి నెట్‌వర్క్ లేదన్నారు. పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు 2017తో ప్రారంభం కాగా.. 1.52 కోట్ల మందికి పైగా సేవలు అందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment