Department of Posts
-
పోస్టాఫీసుల్లో మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూఢిల్లీ: తపాలా శాఖల్లో 2028–29 నాటికి మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు వీలుగా తపాలా శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ‘భారత ఆర్థిక సదస్సు 2024’ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 6,40,000 విక్రయ కేంద్రాలున్నాయని, ప్రపంచంలో మరే సంస్థకు ఈ స్థాయి నెట్వర్క్ లేదన్నారు. పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు 2017తో ప్రారంభం కాగా.. 1.52 కోట్ల మందికి పైగా సేవలు అందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి. -
Lok Sabha Election 2024: ఖాతా తెరిస్తే రూ.లక్ష!
అది బెంగళూరులోని జనరల్ పోస్టాఫీస్. సాధారణంగా ఓ మోస్తరు రద్దీయే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా జనం ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారు! ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు చాంతాడంత క్యూలు కడుతున్నారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది సంగతేమిటని ఆరా తీస్తే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకొస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్న హామీ ప్రభావమని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8,500 జమ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం తెలిసిందే. దాంతో కేంద్రంలో ఇండియా కూటమి వస్తే తమకు ప్రయోజనం దక్కుతుందని భావించిన స్థానికులు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్ వద్ద బారులు తీరుతున్నారు. తాను పొద్దున ఎప్పుడో వచ్చానని క్యూలో నిల్చున్న ఓ మహిళ చెప్పడం గమనార్హం. ఖాతా తెరిచిన తొలి రోజు నుంచే డబ్బులు జమవుతాయని పొరుగింటావిడ చెప్పడంతో వచ్చానని మరో మహిళ వెల్లడించింది. శివాజీనగర్, చామరాజపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇలా వస్తున్నారు! నిజం కాదు... తపాలా శాఖ ఒక్కో ఖాతాలో రూ.2,000 నుంచి రూ.8,500 వరకు జమ చేస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ఖాతా తెరిచేందుకు వస్తున్నట్టు బెంగళూరు జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ హెచ్ఎం మంజేశ్ చెప్పారు. ‘‘నిజానికి ఇదో వదంతి. తపాలా శాఖ ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. కాకపోతే ఆన్లైన్ నగదు బదిలీ ప్రయోజనానికి ఈ ఖాతా ఉపకరిస్తుంది’’ అని వెల్లడించారు. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో, అందులో వెంటనే డబ్బులు జమవడం మొదలవుతుందన్న వార్తలు వదంతులేనంటూ కార్యాలయం ఆవరణలో పోస్టర్లు కూడా అంటించారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో చేసేది లేక అదనపు కౌంటర్లు తెరిచారు. గతంలో రోజుకు కనాకష్టంగా 50 నుంచి 60 కొత్త ఖాతాలే తెరిచేవారు. ఇప్పుడు రోజుకు కనీసం 1,000 ఖాతాలకు పైగా తెరుస్తున్నట్టు మంజేశ్ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకొస్తే ప్రతి నెలా రూ.8,500 ఖాతాలో జమ చేస్తామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడమే ఈ రద్దీకి కారణమని అక్కడి సిబ్బంది అంటున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
దశాబ్ద కాలంలో భారత్ పురోభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: అవిరళ కృషి, అత్యాధునిక సాంకేతికతతో భారత్ కీర్తి విశ్వవ్యాప్తమవుతోందని భార త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్ని విధాలా పురోగమిస్తోందని అన్నారు. దశాబ్ద కాలంలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విలువలతో జన్మించిన రైతుబిడ్డ కొండా మాధవరెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమన్నారు. భారత్ అమృత్ కాల్ జరుపుకుంటున్న వేళ ఆయనకు సముచిత స్థానం ఇవ్వడం అభినందనీయమన్నారు. భారత్ వైపు ప్రపంచం చూపు యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. జీ–20 తర్వాత మనం ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదిగామని అన్నారు. ఈ సదస్సు ద్వారా భారత్ శక్తియుక్తులు ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యాయని చెప్పారు. సాంకేతిక విప్లవం సవాళ్ళతో పాటు కొత్త అవకాశాలను కల్పిస్తోందని, ఈ రంగంలో దూసుకెళ్ళేందుకు భారత్ చేసే ప్రయత్నాలన్నీ ప్రపంచ దేశాలతో పోటీపడేలా చేస్తున్నాయని వివరించారు. ఇ–కోర్టుల ఏర్పాటు, పారదర్శక న్యాయ విధానం, డిజిటలైజేషన్, మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం, పెండింగ్ కేసులు తగ్గించడంపై శ్రద్ధ.. న్యాయ వ్యవస్థలో సంస్కరణలుగా ఆయన పేర్కొన్నారు. సొంత భాషలోనే తీర్పులివ్వడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు. కొద్ది రోజుల క్రితమే చట్టసభల ఆమోదం పొందిన క్రిమినల్ కోడ్ బిల్లులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన తీర్పులు నేటికీ ఆదర్శం: తమిళిసై న్యాయమూర్తిగా కొండా మాధవరెడ్డి ఇచ్చిన తీర్పులు నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఇచ్చి న తీర్పులు ఇప్పటికీ న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగానే ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి పాల్గొన్నారు. -
ఏజెన్సీ విద్యార్థులకు ‘గిరిదర్శిని’!
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నడుంబిగించింది. ఈ మేరకు ‘గిరిదర్శిని’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు ఇంకా తెరుచుకోకపోవడం, ఆన్లైన్ పద్ధతిలోనే బోధన సాగుతుండటంతో విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయుక్తం కానుంది. అయితే పాఠశాలలకు విద్యార్థులు వచ్చి స్టడీ మెటీరియల్ తీసుకునే బదులుగా వారి ఇళ్లకే నేరుగా పంపడం, అందులోని నిర్దేశిత అసైన్మెంట్ను పూర్తి చేసిన తర్వాత తిరిగి వాటిని సేకరించి పాఠశాలలకు చేర్చే బాధ్యతను తపాలా శాఖకు అప్పగించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య తపాలాశాఖ వారధిగా వ్యవహరించనుంది. గిరిజన సంక్షేమ శాఖతో తపాలాశాఖ అవగాహన కుదుర్చుకుంది. 3 నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికీ స్టడీ మెటీరియల్ అందించేలా గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆన్లైన్ సౌకర్యం లేని వారికి.. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ ఫోన్లు, వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. దాదాపు 5 వేల ఆవాసాల్లోని 400 పాఠశాలల పరిధిలో అలాంటి విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ ఆన్లైన్ బోధనతోపాటు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో బోధన, అభ్యసన కార్యక్రమాల నిమిత్తం స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. నాలుగైదు రోజుల్లో నిర్దేశించిన పాఠశాలల విద్యార్థులకు తపాలా శాఖ ద్వారా స్టడీ మెటీరియల్ పంపిణీ కానుంది. స్టడీ మెటీరియల్ వినియోగం, అసైన్మెంట్ వర్కవుట్‌పై సూచనలూ అందులోనే ఇచ్చారు. మరోవైపు ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులతో ఉపాధ్యాయులు నిత్యం మాట్లాడి సందేహాలను నివృత్తి చేస్తారు. -
మహిళల ముద్ర
ఆకాశంలా.. మహిళాశక్తి అనంతం.ఈ విషయాన్ని మహిళాలోకం ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. తాజాగా ఇప్పుడు మహిళలు అధిగమించిన మరో మైలురాయి.. ముంబాయి మాహిమ్ బజార్ పోస్టాఫీస్. శనివారం మాహిమ్ బజార్ పోస్ట్ఆఫీస్ శాఖ ‘మహిళా డాక్ఘర్’గా గుర్తింపు తెచ్చుకుంది. అంటే ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ అయింది. ఈ పోస్ట్ ఆఫీస్‌లో ఇప్పుడు పోస్ట్ మాస్టర్ (ఇన్చార్జ్) నుంచి కౌంటర్ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ మహిళలే! మాహిమ్ బజార్ పోస్ట్ ఆఫీస్ శాఖకు వచ్చే వాళ్లలో 70 శాతం మంది మహిళలే. వారికి సౌకర్యంగా ఉండడం కోసమే పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ వస్తోంది. అందుకోసం అవసరమైతే మగ ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేసి మరీ మహిళలతో భర్తీ చేస్తోంది. ‘‘ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ ఒక మంచి ఏర్పాటు. ఇందువల్ల పోస్టాఫీస్‌కు వచ్చేవారికే కాక, ఇక్కడ పనిచేస్తున్న మహిళలకూ అనువైన పని వాతావరణాన్ని కల్పించడం సాధ్యమౌతుంది’’ అంటారు ముంబాయి రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ స్వాతి పాండే. ఇప్పుడు ఈ వరుసలోనే అంధేరీ, బోరివెల్లి, వదాలా శాఖలను కూడా ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్‌లుగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారామె. హెడ్ పోస్ట్ ఆఫీస్‌లను ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్‌లుగా మార్చడానికి మాత్రం కొంత సమయం తీసుకుంటున్నామని, తొలి ప్రయత్నంలో చిన్న శాఖలను మహిళా డాక్‌ఘర్‌లుగా మార్చుతున్నామని స్వాతి తెలిపారు. ప్రస్తుతం ముంబాయి రీజియన్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో స్త్రీ పురుష ఉద్యోగుల నిష్పత్తి 60–40గా ఉంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్‌లను మహిళాశక్తితో నడిపించడం కష్టమేమీ కాదు. ముంబాయి నగరంలో ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ ఇప్పటికే ఒకటి ఉంది. అది టౌన్ హాల్ పోస్ట్ ఆఫీస్. ఇప్పుడీ మాహిమ్ బజార్ శాఖ కూడా ఆ హోదాను దక్కించుకుంది. ఈ రెండిటికంటే ముందు.. న్యూఢిల్లీ ఈ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. భారతీయ తపాలా శాఖ న్యూఢిల్లీలో 2013లోనే ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్‌ను నెలకొల్పింది. -
సేవలకు తలుపులు తెరిచిన తపాలా
తపాలా శాఖ తన సేవలను విస్తృతం చేసింది. కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడానే కాకుండా బహుముఖాలుగా సేవలందిస్తోంది. జిల్లా పరిధిలో రెండు పోస్టల్ డివిజన్లలో 927 పోస్టాఫీసులున్నాయి. ఒంగోలు పోస్టల్ డివిజన్ పరిధిలో నాలుగు హెడ్పోస్టాఫీసులతో పాటు 94 సబ్‌పోస్టాఫీసులు, 565 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి. మార్కాపురం హెడ్ పోస్టాఫీసు పరిధిలో 29 సబ్‌పోస్టాఫీసులు, 234 బ్రాంచ్ పోస్టాఫీసులున్నాయి. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు. ఆశీర్వచనం ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫోటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు. మై స్టాంప్ స్టాంప్ అనగానే అదొక మంచి గుర్తింపు ముద్ర అని అందరికీ తెల్సిన విషయం. గతంలో లాల్‌బహుదూర్‌శాస్త్రి, సర్దార్ వల్లభాయ్‌పటేల్ వంటి ప్రముఖుల ఫొటోలు, చారిత్రక ప్రదేశాల ఫొటోలు స్టాంపులుగా పోస్టల్ శాఖ అందించింది. అయితే ఈ మధ్య కాలంలో మైస్టాంప్ పేరుతో కొత్త సౌకర్యం అందుబాటు లోకి వచ్చింది. దీనిద్వారా ఎవరి ఫొటో వారు స్టాంపుగా తయారు చేయించుకోవచ్చు. దీనికి కేవలం రూ.300 సొమ్ము పోస్టల్‌శాఖకు చెల్లిస్తే సరిపోతుంది. రూ.240 పోస్టల్‌శాఖ ఖాతాకు జమకాగా, రూ.5 విలువగల 12 స్టాంపులను వినియోగదారునికి అందజేస్తారు. ఈ స్టాంపులు దూరప్రాంతాలకు పంపే కవరులపై అంటించినా చెల్లుబాటు అవుతాయి. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం లభిస్తుంది. ముందుగా పోస్టల్ కార్యాలయంలో డబ్బు జమ చేయగానే, మనీ అందుకోవాల్సిన సంబంధిత చిరునామా గల వ్యక్తి మొబైల్‌కు ఓ కోడ్ నంబర్ ఆన్లైన్ ద్వారా మెసేజ్‌గా వెళ్తుంది. అనంతరం ఆ కోడ్ నంబర్‌గల మొబైల్‌ను డబ్బులు అందుకోవాల్సిన వ్యక్తి పోస్టల్ కార్యాలయంలో చూపిస్తే వెను వెంటనే బల్క్ మొత్తం డబ్బులు అయినా ఒక ఐడీ ఫ్రూఫ్‌ను తీసుకుని పోస్టల్ సిబ్బంది అందజేస్తారు. త్వరలో మరికొన్ని.. పోస్టల్‌శాఖలో మరికొన్ని సేవలు వస్తాయని తెలుస్తోంది. కూరగాయలను వేరే ప్రాంతాలకు చేరవేయడం, పోస్టల్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చి అన్ని ప్రాంతాలకు విస్తరించడం వంటి సౌకర్యాలు వస్తాయి. వీటితోపాటు మరికొన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికి ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది. లాజిస్టిక్ పోస్టు ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్షిప్టింగ్కు కూడా వినియోగింపవచ్చు.ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. -
రెండు నెలల్లో ‘పోస్టు’ బ్యాంకులు
కోర్ బ్యాంకింగ్ సేవల్లోకి తపాలా శాఖ ఎక్కడైనా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు హైదరాబాద్: పూర్తిస్థాయి బ్యాంకుగా అవతారమెత్తేందుకు ఉవ్విళ్లూరుతున్న తపాలా శాఖ తొలుత కోర్ బ్యాంకింగ్ సేవలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్ని తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధాన పరిచే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల) పరిధిలో మరో రెండు నెలల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి నగరంలోని సనత్‌నగర్ పోస్ట్ ఆఫీసులో తాజాగా సెంట్రల్ సర్వర్‌ను ఏర్పాటు చేసి కార్యకలాపాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కాగానే ఏ పోస్టాఫీసు నుంచైనా నగదును పొందే వీలుంటుంది. ఇప్పటి వరకు పొదుపు ఖాతా(సేవింగ్స్ అకౌంట్) ఉన్న పోస్టాఫీసు నుంచి మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా నగదును పంపే వెసులుబాటు కూడా అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం పొదుపు ఖాతాలకు ఐదు అంకెలతో ఉన్న సంఖ్యను 16 అంకెల సంఖ్యగా మార్చబోతున్నారు. రెండు నెలల్లో ఈ కసరత్తు మొత్తాన్ని పూర్తి చేసి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఉత్తరాలను ప్రజలు మరిచిపోతున్న తరుణంలో మసకబారుతున్న తపాలా సేవలకు మళ్లీ పాత కళ వస్తుందని ఆ శాఖ ఆశపడుతోంది. క్రమంగా తాము ఇతర బ్యాంకులకు పోటీనిచ్చే స్థాయికి చేరుకుంటామని తపాలా శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రూ. 18 వేల కోట్లతో ‘ఇంటర్నెట్’ కనెక్టివిటీ తపాలా కార్యాలయాల ఆధునికీకరణ వేగంగా జరుగుతోంది. వాస్తవానికి ‘ఇండియన్ పోస్ట్ ప్రాజెక్టు-2012’ పేరుతో దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలను ఆధునికీకరించాలని యూపీఏ ప్రభుత్వం లక్ష్యించింది. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం దాన్ని శరవేగంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 18 వేల కోట్ల వ్యయంతో గ్రామీణ తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌తో అనుసంధానించే బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం ఏపీ సర్కిల్ పరిధిలో కేవలం సబ్ పోస్టాఫీసు స్థాయి వరకే ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 16,500 పోస్టాఫీసులుంటే కేవలం 2,300 పోస్టాఫీసుల్లోనే ఆన్లైన్ సేవలు ఉన్నాయి. కోర్‌బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అన్నింటినీ ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చాలా ప్రాంతాల్లో నగదు చెల్లింపు లావాదేవీలు తపాలా కార్యాలయాల ద్వారానే జరుగుతున్నాయి. దీని వల్లే ఏపీ సర్కిల్ పరిధిలోనే దాదాపు రెండు కోట్ల పొదుపు ఖాతాలున్నాయి. ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తే ఈ సంఖ్య ఒక్కసారిగా రెట్టింపవడం ఖాయమని తపాలా శాఖ ఆశాభావంతో ఉంది. గంటల్లో ‘మనీ ఆర్డర్’ ప్రస్తుతం మనీ ఆర్డర్ సేవలకు గరిష్టంగా రెండు రోజుల సమయం తీసుకుంటోంది. అన్ని తపాలా కార్యాలయాలకు అన్లైన్ సేవలు లేకపోవడంతో బ్రాంచి పోస్టాఫీసుల నుంచి నగదు తీసుకుని సంబంధిత తపాలా కార్యాలయాలకు చేరవేయాల్సి వస్తోంది. ఇందుకు కొంత సమయం పడుతోంది. అన్ని పోస్టాఫీసులు అన్లైన్ పరిధిలోకి వస్తే ఈ కసరత్తు కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది. ఉదయం మనీ ఆర్డర్ చేస్తే మధ్యాహ్నానికి డబ్బులు గమ్యం చేరతాయి. పూర్తి స్థాయి బ్యాంకుగా రూపొందడానికి అనుమతి కోసం తపాలా శాఖ రిజర్వు బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. అనుమతి రాగానే ఏటీఎంలను ప్రారంభించి పూర్తిస్తాయి పోస్టు బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే చెన్నైలో ఏటీఎం సేవలను కూడా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. -
తిరుగుటపాలో దరఖాస్తు పత్రాలు
కంగుతిన్న పోస్టుమెన్ ఉద్యోగార్థులు హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం తపాలాశాఖ పోస్టుమెన్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో చాలామంది నిరుద్యోగ యువకులు సంబరపడి దరఖాస్తులు పంపారు. కానీ కేవలం తపాలాశాఖ వెబ్సైట్లో పొందుపర్చిన దరఖాస్తు కాలంను పూరించి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నా.. ఇలా దరఖాస్తులు అందటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వాటన్నింటిని తిరుగుటపాలో అభ్యర్థులకు పంపటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. అభ్యర్థుల అవగాహనలేమిని అవకాశంగా చేసుకుని దళారులు దరఖాస్తు పత్రాలు రూ.50 నుంచి రూ.200 చొప్పున అమ్మారు. 18తో గడువు సమాప్తం: 379 పోస్టుమెన్, 31 మెయిల్ గార్డ్స్ పోస్టుల కోసం తపాలాశాఖ గతనెల 17న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు గడువు ఈనెల 18తో ముగియనుంది. ఇప్పుడు మ్యాన్యువల్ దరఖాస్తులు తిరుగుటపాలో రావటంతో అభ్యర్థులు హడావుడిగా ఆన్లైన్లో మళ్లీ దరఖాస్తు చేసే పనిలో పడ్డారు. కేవలం ఆన్లైన్లో అందే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని, అభ్యర్థుల www.appost.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులు నింపి పంపాలని తపాలాశాఖ ఏపీ సర్కిల్ రిక్రూట్మెంట్ విభాగం అసిస్టెంట్ డైరక్టర్ శనివారం తెలిపారు. -
తపాలా శాఖ రెండు ముక్కలు
విభజన కసరత్తు షురూ ఏడెనిమిది నెలల్లో ‘తెలంగాణ సర్కిల్’ ఏర్పాటు ప్రస్తుత ఏపీ సర్కిల్ ఆంధ్రకు పరిమితం విజయవాడ రీజియన్ నుంచి విడిపోనున్న ఖమ్మం పోస్టు రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్స్ 58:42 నిష్పత్తిలో సిబ్బంది కేటాయింపు హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకుz. రాష్ట్రం విడిపోయినా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను విడగొట్టాల్సిన అవసరం లేదని తొలుత భావించిన కేంద్రం క్రమంగా మనసు మార్చుకుంది. రాజకీయ ఒత్తిడి పెరగడంతో వాటిని కూడా విభజించాలని నిర్ణయించింది. పైగా రెండు రాష్ట్రాలకు ఒకే చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ఉంటే ఇబ్బంది తలెత్తుతుందన్న కారణంతోనూ తపాలా శాఖ విభజనకు కేంద్రం మొగ్గుచూపింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేను విభజించేందుకు కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే దారిలో తపాలా శాఖను కూడా ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్గా రెండు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న తపాలా శాఖ మరో ఏడెనిమిది నెలల్లో రెండు సర్కిళ్లుగా మారబోతోంది. సేవలపరంగా ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపకున్నా.. అంతర్గతంగా తపాలా శాఖలో భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోబోతున్నాయి.ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్‌గా ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి సుధాకర్ వ్యవహరిస్తున్నారు. ఇక ముందు ఇలాంటి మరో పోస్టును సృష్టించి ఆ ర్యాంకు అధికారిని కేంద్రం కేటాయిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు రీజియన్లున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ సిటీ రీజియన్, మిగతా తెలంగాణ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రీజియన్ ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 13 తపాలా డివిజన్లున్నాయి. కొత్తగా తెలంగాణ సర్కిల్ ఏర్పడితే ఈ రీజియన్లను మూడుగా విభజించే అవకాశం ఉంది. ప్రస్తుత ఏపీ సర్కిల్‌ను ఆంధ్రపదేశ్‌కు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్టణం, కర్నూలు రీజియన్లున్నాయి. వీటి పరిధిలో 36 తపాలా డివిజన్లున్నాయి. హైదరాబాద్ ఆబిడ్స్‌లో ప్రస్తుతమున్న జనరల్ పోస్టాఫీసు(జీపీఓ) తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ కొత్తగా ప్రధాన తపాలా కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుబంధంగా అక్కడే చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్రమే నిధులు సమకూరుస్తుంది. ప్రస్తుత ఏపీ సర్కిల్ పరిధిలో 16 వేల సాధారణ పోస్టాఫీసులు, 2,500 డిపార్ట్మెంటల్ పోస్టాఫీసులున్నాయి. తెలంగాణలో ఇవి 8,500 ఉన్నాయి. విభజన తర్వాత ఏ ప్రాంతంలోవి ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ప్రసుతం విజయవాడ సర్కిల్ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లాను తెలంగాణ పరిధిలోకి మార్చుతారు. దీంతో తెలంగాణ పోస్టాఫీసుల సంఖ్య కొంత పెరుగుతుంది. ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 45 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని 58:42 నిష్పత్తిలో విభజిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మెయిల్ మోటారు సర్వీసు(ఎంఎంఎస్) తరహా వ్యవస్థలను ఆంధ్రా ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిధి విస్తృతంగా ఉన్నందున సేవలపరంగా తపాలా శాఖలో కొన్ని లోపాలు తలెత్తుతున్నాయి. విభజనతో పరిధి తగ్గి సేవలు మెరుగుపడే అవకాశముంది. అలాగే కేంద్ర బడ్జెట్లో నిధులు కూడా పెరగనున్నాయి. రెండు సర్కిళ్లకు విడివిడిగా నిధులు దక్కుతాయి. -
సేవలకు తలుపులు తెరిచిన తపాలా
బహుముఖ సేవలందిస్తున్న తపాలా శాఖ * బ్యాంకింగ్, బీమా, హౌస్ * షిఫ్టింగ్, మైస్టాంప్ సేవలు * ప్రశంసిస్తున్న వినియోగదారులు నల్లగొండ అర్బన్ : పోస్టాఫీసులంటే ఒకప్పుడు ఉత్తరాల బట్వాడాకే పరిమితం. మరిప్పుడు... బ్యాంకుల్లోలా డబ్బులు వెయ్యచ్చు..తీయవచ్చు. వేరే ఊరికి డబ్బులు పంపొచ్చు. ఏటీఎం సేవలూ లభ్యం. తపాలా సేవలతో అతితక్కువ ఖర్చుతో ఇల్లు మారవచ్చు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం, బీమా సేవలు... వీటితో పాటు మీకో చక్కటి వరం తిరుపతి వెంకన్న స్వామి అక్షింతలతో ‘ఆశీర్వచనం’ సేవలు. ‘మై స్టాంప్’ సేవల కింద మీ ఫొటోలతోనే స్టాంపులు మీకు లభ్యం. నిన్నమొన్నటి వరకు కొన్ని రకాల సేవలకే పరిమితమైన తపాలా శాఖ ప్రస్తుతం తలుపులు బార్లా తెరిచి బహుముఖాలుగా తన సేవలను విస్తరించింది. జిల్లాలో 4 హెడ్‌పోస్టాఫీసులున్నాయి. ఇవి నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేటలలో సేవలందిస్తున్నాయి. మండల కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో 37 సబ్పోస్టాఫీసులుండగా 349 బ్రాంచ్ పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇవేకాకుండా ప్రభుత్వ పింఛన్ల పంపిణీ, ఉపాధిహామీ కూలీల భృతి చెల్లించేందుకు 269 గ్రామాల్లో ఏజెన్సీల ద్వారా పోస్టల్ సేవలందుతున్నాయి. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు. ఆశీర్వచనం ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫోటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికి ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది. లాజిస్టిక్ పోస్టు ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్షిప్టింగ్కు కూడా వినియోగింపవచ్చు.ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. మై స్టాంప్ స్టాంప్ అనగానే అదొక మంచి గుర్తింపు ముద్ర అని అందరికీ తెల్సిన విషయం. గతంలో లాల్‌బహుదూర్‌శాస్త్రి, సర్దార్ వల్లభాయ్‌పటేల్ వంటి ప్రముఖుల ఫొటోలు, చారిత్రక ప్రదేశాల ఫొటోలు స్టాంపులుగా పోస్టల్ శాఖ అందించింది. అయితే ఈ మధ్య కాలంలో మైస్టాంప్ పేరుతో కొత్త సౌకర్యం అందుబాటు లోకి వచ్చింది. దీనిద్వారా ఎవరి ఫొటో వారు స్టాంపుగా తయారు చేయించుకోవచ్చు. దీనికి కేవలం రూ.300 సొమ్ము పోస్టల్‌శాఖకు చెల్లిస్తే సరిపోతుంది. రూ.240 పోస్టల్‌శాఖ ఖాతాకు జమకాగా, రూ.5 విలువగల 12 స్టాంపులను వినియోగదారునికి అందజేస్తారు. ఈ స్టాంపులు దూరప్రాంతాలకు పంపే కవరులపై అంటించినా చెల్లుబాటు అవుతాయి. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం లభిస్తుంది. ముందుగా పోస్టల్ కార్యాలయంలో డబ్బు జమ చేయగానే, మనీ అందుకోవాల్సిన సంబంధిత చిరునామా గల వ్యక్తి మొబైల్‌కు ఓ కోడ్ నంబర్ ఆన్లైన్ ద్వారా మెసేజ్‌గా వెళ్తుంది. అనంతరం ఆ కోడ్ నంబర్‌గల మొబైల్‌ను డబ్బులు అందుకోవాల్సిన వ్యక్తి పోస్టల్ కార్యాలయంలో చూపిస్తే వెను వెంటనే బల్క్ మొత్తం డబ్బులు అయినా ఒక ఐడీ ఫ్రూఫ్‌ను తీసుకుని పోస్టల్ సిబ్బంది అందజేస్తారు. త్వరలో మరికొన్ని.. పోస్టల్‌శాఖలో మరికొన్ని సేవలు వస్తాయని తెలుస్తోంది. కూరగాయలను వేరే ప్రాంతాలకు చేరవేయడం, పోస్టల్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చి అన్ని ప్రాంతాలకు విస్తరించడం వంటి సౌకర్యాలు వస్తాయి. వీటితోపాటు మరికొన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్లు పోస్టల్ సేవలం కోసం నల్లగొండలోని హెడ్‌పోస్టాఫీసు 08682-244204, భువనగిరి ప్రాంతం వరకు 08682-242585 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఫోన్ 08682-244267 ద్వారా సంప్రదించవచ్చు అందుబాటులో అన్ని రకాల సేవలు హెడ్పోస్టాఫీసుల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మీ సేవ ద్వారా పొందే సేవలన్నింటినీ ఇక్కడ పొందవచ్చు. కరెం ట్బిల్లులు, అన్ని నెట్‌వర్క్‌ల టెలిఫోన్ బిల్లులు, అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీ ఫీజులను చెల్లించవచ్చు. త్వరలో పోస్టుమాన్ ఉద్యోగాల కోసం పరీక్ష నిర్వహిస్తున్నాం. దీనికి ఇక్కడ ఫీజు చెల్లించవచ్చు. - రఘునాథస్వామి, జిల్లా ఇన్చార్జ్ పోస్టల్ సూపరింటెండెంట్