Passport seva
-
పాస్‌పోర్ట్ కష్టాలకు చెల్లుచీటి.. కొత్త విధానం అమలుపై జై శంకర్ ప్రకటన!
త్వరలో భారత్‌లో రెండవ దశ పాస్‌పోర్ట్ సేవ ప్రోగ్రామ్ (పీఎస్పీ - వెర్షన్ 2.0)ను లాంచ్ చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రకటించారు. పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..దేశ పౌరుల పాస్ పోర్ట్ సేవల్ని మరింత సులభతరం చేసే అంశంలో కేంద్రం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమయానుకూలంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా పాస్‌పోర్ట్‌లను రెన్యూవల్ చేయాలని పాస్ పోర్ట్‌లను జారీ చేసే అధికారులకు జై శంకర్ పిలుపునిచ్చారు. పీఎస్పీ - వెర్షన్ 2.0లో ఈ - పాస్ట్ పోర్ట్‌లను సైతం అప్‌గ్రేడ్ చేసుకోనేలా అవకాశం లభించనుంది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ సిటిజన్ పోగ్రామ్’ ద్వారా దేశ పౌరులకు మెరుగైన పాస్ పోర్ట్ సేవల్ని అందించే విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని జై శంకర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇందుకోసం, EASE : E : ఎన్ హ్యాన్స్డ్ పాస్‌పోర్ట్ టూ సిటిజెన్స్, A : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సర్వీస్ డెలివరీ, S : స్మూతర్ ఓవర్ సిస్ ట్రావెల్ యూజింగ్ చిప్ ఎనేబుల్డ్ ఈ - పాస్‌పోర్ట్, E : ఎన్హ్యాన్స్డ్ డేటా సెక్యూరిటీ విధానాన్ని సత్వరమే అమలు చేసేలా పాస్‌పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. తద్వారా దేశ పౌరులకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సలుభతరం కానున్నాయని సూచించారు. Here is a message from EAM @DrSJaishankar, as we observe the Passport Seva Divas today. #TeamMEA reaffirms its commitment to provide passport and related services to citizens in a timely, reliable, accessible, transparent and efficient manner. pic.twitter.com/k1gmaTPLKq — Arindam Bagchi (@MEAIndia) June 24, 2023 -
పాస్‌పోర్టు ఇక సులువు
మంచిర్యాలక్రైం: మంచిర్యాల, కుమురంభీం జిల్లాల ప్రజలకు ఇక పాస్‌పోర్టు ఇబ్బందులు దూరం కానున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఒక పోస్టాఫీస్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్లో గల పాత హెడ్ పోస్టాఫీసులో ఈ నెల 15న పాస్‌పోర్టు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మరో పది రోజుల్లో అధికారికంగా ప్రజాప్రతినిధులతో పూర్తి పాస్‌పోర్టు సేవాకేంద్రంను ప్రారంభించేందుకు పోస్టల్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 15 చొప్పున పాస్‌పోర్ట్ స్లాట్స్‌ను బుకింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానం ద్వారా బుకింగ్‌కు అవకాశం ఉంది. బుకింగ్ చేసుకున్న తర్వాత పోలీసుల వెరిఫికేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ల అనంతరం వారం రోజుల్లో పాస్‌పోర్టు అందజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తు ఇలా.. ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్ బాట పడుతున్నాయి. పాస్‌ఫోర్ట్ సేవలూ ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఆన్లైన్ పోర్టల్‌లో రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. పాస్‌ఫోర్ట్ సేవా వెబ్సైట్ హోమ్ పేజీలో అప్లై సెక్షన్లో కనిపించే రిజిష్టర్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాస్‌ఫోర్ట్ సేవా ఆన్లైన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. పాస్‌పోర్ట్ దరఖాస్తును పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్మెంట్ పొందేందుకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంటు లింక్‌పై క్లిక్ చేయాలి. బుకింగ్ అపాయింట్మెంట్కు ఆన్లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ లింక్ క్లిక్ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసిన సమయానికి సంబంధిత పాస్‌పోర్ట్ çసేవా కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో పాస్‌పోర్ట్ ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. అవసరమైన పత్రాలు.. భారత్‌లో విదేశీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అన్ని రకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. అవన్నీ ఒకేవిధంగా ఉండాలి, ఎందులోనైన ఒక్క చిన్నతప్పు దొరికినా ఇక అంతే సంగతి కథ మళ్లీ మొదటికి వచ్చేది. ఒకవేళ అన్ని ఉన్నా ఇచ్చిన సమాచారాన్ని నిజ నిర్ధారణ చేసుకునేందుకు పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం తాజాగా విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు దరఖాస్తుతోపాటు నాలుగు పత్రాలు ఉంటే చాలు వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు(ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి), ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటికార్డు, పాన్‌కార్డ్, లాయర్ అఫిడవిట్(స్థానికత, క్రిమినల్ రికార్ట్, ఇంటి చిరునామతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండాలి) ఇవి సమర్పిస్తే చాలు ఇందులో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న తర్వాత పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. తగ్గనున్న దూరభారం.. మంచిర్యాలలో పోస్టాఫీస్‌కు అనుసంధానం చేస్తూ పాస్‌పోర్టు సేవలు ప్రారంభించనున్నారు. కార్యాలయం ఏర్పాటు, ఆఫీస్ నిర్మాణం సుమారుగా పూర్తయింది. ఆన్లైన్ ద్వారా స్లాట్స్ బుకింగ్ ప్రక్రియ మొదలైంది. రోజుకు 15 చొప్పున స్లాట్స్ బుకింగ్ అవుతున్నాయి. గతంలో వందకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు వెళ్లేవారు. ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని లాడ్జీలు, బంధువుల ఇళ్లలో రెండ్రోజులు ఉండాల్సి వచ్చేది. మంచిర్యాలలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు కావడంతో కుమురంభీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు ఎటూ వంద కిలోమీటర్లలోపే అందుబాటులోకి రానుంది. రెండు జిల్లాల ప్రజలు పాస్‌పోర్టు పొందడం ఇకపై సులభతరం కానుంది. -
చికాగో సీజీఐలో ప్రారంభమైన ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమం
చికాగో: భారత ప్రభుత్వం చికాగోలోని భారత కాన్సులేట్ కార్యాలయం(సీజీఐ)లో ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులను మరింత సరళతరం చేసేందుకు భారత విదేశాంగ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాన్సులేట్ అధికారులతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా గడిచిన నాలుగున్నరేళ్లలో భారత్ పాస్‌పోర్ట్ జారీలో పెను మార్పులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. పాస్‌పోర్ట్ సర్వీస్‌లలో 2017 సంవత్సరంలో 19 శాతం వృద్ధి సాధించామని తెలిపింది. కేవలం ఒక నెలలోనే పది లక్షల అప్లికేషన్లు వచ్చాయని.. పాస్‌పోర్ట్ సేవా ద్వారా ఆరు కోట్ల మందికి పాస్‌పోర్ట్‌లు జారీ చేసినట్టు వెల్లడించింది. పాస్‌పోర్ట్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. పాస్‌పోర్ట్ విధానాలను సరళతరం చేయడమే కాకుండా పాస్‌పోర్ట్ సేవలను ప్రజల చెంతకే తీసుకువచ్చినట్టు స్పష్టం చేసింది. భారత్‌లోని అన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్‌లలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అందులో భాగంగా ఇప్పటివరకు 236 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని.. మరికొన్ని సేవా కేంద్రాలు కూడా త్వరలో వినియోగంలోకి రానున్నాయని తెలిపింది. దేశంలో ఉన్న పాస్‌పోర్ట్ ఆఫీసులు, గతంలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను కలుపుకుంటే.. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నపాస్‌పోర్ట్ కార్యాలయాల సంఖ్య 365కు చేరిందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్లలో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపింది. అందులో భాగంగా తొలుత లండన్‌లోని భారత్ హైకమిషన్ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి.. ఆ తర్వాత బర్మింగ్‌హామ్, ఎడిన్‌బర్గ్‌లలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో దీనిని విజయవంతంగా చేపట్టినట్టు పేర్కొంది. యూఎస్ విషయానికి వస్తే.. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో, న్యూయార్క్, శాన్‌ఫ్రానిస్కో, అట్లాంటా, హోస్టన్‌లలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలలో ఈ పోగ్రామ్‌ను చేపట్టినట్టు ప్రకటించింది. చికాగోలో ప్రారంభించిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అక్కడి ఎన్ఆర్ఐలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపింది. ఈ నూతన పద్దతిలో ప్రజలు సులువుగా దరఖాస్తులు సమర్పించడమే కాకుండా, డిజిటల్ పరిశీలన, భద్రతోపాటు అప్లికేషన్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో అన్ని భారత రాయబార కార్యాలయాల్లో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపింది. -
పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం
మర్రిపాలెం (విశాఖపట్నం): పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్‌కు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో ‘పాస్‌పోర్ట్ సేవామిత్ర’గా ఇంటర్న్‌షిప్‌కు కేంద్రం అవకాశం కల్పిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 81 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 37 ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయా ల్లో ఈ-గవర్నెన్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ జరుగుతుందన్నారు. జూన్ 8న ప్రారంభమయ్యే ఇంటర్న్‌షిప్ 4-8 వారాలు కొనసాగుతుందన్నారు. డిగ్రీ చేసినవారు www.passportindia.gov.in లో పొందుపరిచిన ఫారంలో వివరాలు నమోదు చేసి, ఈ నెల 31లోగా ‘ది డెరైక్టర్(పిఎస్పి), సి.పి.వి. డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్స్ అఫైర్స్, న్యూఢిల్లీ’ చిరునామాకు పంపాలని తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులకు మినహాయింపు పాస్‌పోర్ట్ మంజూరులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఉద్యోగులు, విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగులు ఎన్వోసీకి దరఖాస్తు చేసినట్టు ఫారం అనెక్సర్ ఎన్, ఎం, బి, నకలు సమర్పిస్తే దరఖాస్తు స్వీకరిస్తామన్నారు. 1989 జనవరి 26 తర్వాత పుట్టిన వారికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్, పది లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికెట్, ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జారీచేసిన ధ్రువీకరణ పత్రం లేదా కోర్టు ద్వారా జారీ అయిన ధ్రువపత్రం.. వీటిలో ఏ ఒక్కటున్నా మినహాయింపు వర్తిస్తుందన్నారు. ఏపీలో తొలిసారిగా ఓ హిజ్రాకు పాస్‌పోర్ట్ ఇచ్చినట్లు చౌదరి చెప్పారు.