త్వరలో భారత్‌లో రెండవ దశ పాస్‌పోర్ట్ సేవ ప్రోగ్రామ్ (పీఎస్‌పీ - వెర్షన్ 2.0)ను లాంచ్ చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రకటించారు. పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..దేశ పౌరుల పాస్ పోర్ట్ సేవల్ని మరింత సులభతరం చేసే అంశంలో కేంద్రం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సమయానుకూలంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా పాస్‌పోర్ట్‌లను రెన్యూవల్ చేయాలని పాస్ పోర్ట్‌లను జారీ చేసే అధికారులకు జై శంకర్ పిలుపునిచ్చారు. పీఎస్‌పీ - వెర్షన్ 2.0లో ఈ - పాస్ట్ పోర్ట్‌లను సైతం అప్‌గ్రేడ్ చేసుకోనేలా అవకాశం లభించనుంది.
‘ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ సిటిజన్ పోగ్రామ్’ ద్వారా దేశ పౌరులకు మెరుగైన పాస్ పోర్ట్ సేవల్ని అందించే విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని జై శంకర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇందుకోసం, EASE : E : ఎన్ హ్యాన్స్‌డ్ పాస్‌పోర్ట్ టూ సిటిజెన్స్, A : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సర్వీస్ డెలివరీ, S : స్మూతర్ ఓవర్ సిస్ ట్రావెల్ యూజింగ్ చిప్ ఎనేబుల్డ్ ఈ - పాస్‌పోర్ట్, E : ఎన్‌హ్యాన్స్‌డ్ డేటా సెక్యూరిటీ విధానాన్ని సత్వరమే అమలు చేసేలా పాస్‌పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. తద్వారా దేశ పౌరులకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సలుభతరం కానున్నాయని సూచించారు.
Here is a message from EAM @DrSJaishankar, as we observe the Passport Seva Divas today. #TeamMEA reaffirms its commitment to provide passport and related services to citizens in a timely, reliable, accessible, transparent and efficient manner. pic.twitter.com/k1gmaTPLKq
— Arindam Bagchi (@MEAIndia) June 24, 2023
Comments
Please login to add a commentAdd a comment