
హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి గురువారం స్వల్ప గుండెనొప్పి రావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు రెండురోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాల్సిందిగా కుటుంబసభ్యులకు సూచించారు. ఆయనను ఐసీయూలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment