Deputy C.M
-
భట్టివిక్రమార్క ఇంట్లో చోరీ..నిందితుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్14లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులు పోలీసులకు చిక్కారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.చోరీకి పాల్పడ్డవారిని బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్,ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వీరి నుంచి రూ.2.2లక్షల నగదు,100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
మళ్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా..?
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలవడంతో కొత్త వాదనకు తెరలేచింది. సిసోడియాను మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమిస్తారని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ కేసులో జైలులో ఉండడంతో సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇటు పాలనాపరంగా అటు రాజకీయంగా పార్టీకి బలం చేకూరుతుందని ఆప్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను త్వరలోనే మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమించి కీలకమైన ఆర్థిక, విద్యా శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు.గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన తర్వాత సిసోడియా తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న సిసోడియాకు శుక్రవారం(ఆగస్టు 9) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రమే ఆయన జైలు నుంచి విడుదలై సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిశారు.ప్రస్తుతం సిసోడియా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
మధిరకు త్వరలో ఐటీ హబ్..
ఖమ్మం: మధిర నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.సోమవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధిరకు త్వరలో ఐటీ హబ్ తీసుకొస్తామని చెప్పారు. మండలంలోని యండపల్లి గుట్ట వద్ద ఎంఎస్ఎమ్ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ పనులకు శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు.మధిరలోని యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకే ఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎంఈ పరిశ్రమలు పెట్టుకునే యువతకు ప్రభుత్వం నుంచి అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని వివరించారు. ట్రెడిషనల్ వ్యాపారాన్ని పారిశ్రామికీకరణ చేసి ఉత్పత్తి, వినియోగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా డెయిరీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. స్థానికుల అభిప్రాయం మేరకే పట్టణంలో రహదారుల విస్తరణ కార్యక్రమం ఉంటుందన్నారు. -
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌తో పవన్.. క్యాంపు ఆఫీసు పరిశీలన
సాక్షి, విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. పవన్ ఆలోచనలు, అభిరుచి మేరుకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆఫీసు నిర్మాణం చేపట్టారు. పవన్ మెచ్చే విధంగా ఆయనకు నచ్చిన రంగుల్లో క్యాంపు ఆఫీస్ నిర్మాణం జరిగింది. ఇదంతా చూసిన తర్వాతే ఆఫీసుకు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం.కాగా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి మంగళవారం తన ఆఫీసును పవన్ పరిశీలించారు. ఆఫీసు నిర్మాణంలో భాగంగా భవనంలో పైన అంతస్తులో నివాసం, కింద కార్యాలయం ఏర్పాటు చేశారు. అదే భవనంలో సమావేశం మందిరం కూడా అందుబాటులో ఉండటంతో ప్లాన్‌కు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం. తన ఆలోచనలు, అభిరుచులకు తగిన విధంగా క్యాంపు ఆఫీసులో పవన్ మార్పులు సూచించడంతో అందుకు తగినే విధంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే ఆఫీసును వినియోగించుకున్నారు. మరోవైపు.. కాసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి పవన్ బయలుదేరారు. అలాగే, ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచిన విషయం తెలిసిందే. వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా పవన్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇక.. రేపు పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం చంద్రబాబు
-
హిమాచల్ ఉపముఖ్యమంత్రికి సతీ వియోగం
హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సతీమణి ప్రొఫెసర్ సిమి అగ్నిహోత్రి కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఉపముఖ్యమంత్రి స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ దంపతుల కుమార్తె ఆస్థా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సిమి అగ్నిహోత్రి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం చండీగఢ్‌కు తీసుకెళ్తుండగా, కురలి సమీపంలో ఆమె కన్నుమూశారు. हमारी प्रिय प्रोफेसर सिम्मी अग्निहोत्री हमारा और आस्था का साथ छोड़कर चली गई। — Mukesh Agnihotri (@Agnihotriinc) February 9, 2024 -
ప్రధానిపై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ నేత
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ మాయకత్వంలో ఛత్తీస్‌గఢ్ చాలా అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకముందని అన్నారు. మాకు చాలా ఇచ్చారు.. ఛత్తీస్‌గఢ్‌లోని తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం లక్ష మందికి సికిల్ సెల్ వ్యాధి కౌన్సెలింగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా ఛత్తీస్గఢ్లోఅనేక మేజర్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ ప్రధానిని స్వాగతిస్తూ.. మీరు మాకేదో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు చాలా ఇచ్చారు. భవిష్యతులో కూడా మాకు చాలా ఇస్తారని విశ్వసిస్తున్నాను అన్నారు. కేంద్రంలోని మీ నాయకత్వంలో మేమంతా పనిచేశాము. ఇంతవరకు కేంద్రాన్ని ఎలాంటి సాయం అడిగినా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించి రాష్ట్రానికి చాలా చేశారన్నారు. మా రాష్ట్రం కేంద్రం సహాయంతో అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళుతుందని ఆశిస్తున్నానన్నారు. Chattisgarh Deputy CM TS Singh Deo praises PM Modi for always supporting Chattisgarh Govt pic.twitter.com/QuavHjfgQD — DR.TEENA KAPOOR SHARMA (@Teenasharma_77) September 15, 2023 ఈ రాష్ట్రం పవర్‌హౌస్.. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో పవర్‌హౌస్ లాంటిదని ఇలాంటి పవర్‌హౌస్‌లు తమ శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తేనే దేశం కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నామని అందులో భాగంగానే ఈరోజు కొన్నిటికి శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ సంఫర్బంగా జులైలో రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్, అలాగే రాయ్‌పూర్-ధన్‌బాద్ ఎకనామిక్ కారిడార్ శంకుస్థాపన కోసం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. छत्तीसगढ़ देश के लिए पावर हाउस की तरह है, आज दुनिया भारत से सीखने की बात कर रही है! - प्रधानमंत्री श्री @narendramodi जी #विजय_शंखनाद_रैली pic.twitter.com/8BbzdKXz5u — BJP Chhattisgarh (@BJP4CGState) September 14, 2023 అదీ అసలు కారణం.. ఛత్తీస్‌గఢ్‌లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూకుడును పెంచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం రేసులో ఉన్న టీస్ సింగ్ దేవ్‌ను కాదని భూపేష్ బాఘేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి టీఎస్ సింగ్ దేవ్ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు. అసలే త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి వైఖరి కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇది కూడా చదవండి: ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి.. -
ఖబడ్ధార్ నారా లోకేష్... ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు..
అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్బంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరావని ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరావని విమర్శించారు. దౌర్జన్యం చేయడానికి వచ్చావా? పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్త్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టమొచ్చినట్లు రౌడీలను పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నావ్ ఖబడ్దార్ లోకేష్ అని హెచ్చరిస్తూనే నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నావ్? అసలు నువ్వొచ్చింది ప్రజల బాగోగులు తెలుసుకోవడానికా? దౌర్జన్యం చెయ్యడానికా? అంటూ ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత.. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నావ్. భీమవరంలో అయితే వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మీ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు అవగాహన లేక మాట్లాడుతున్నాడని 'పప్పు' అనుకునేవారు. కానీ ఈ పాదయాత్రతో ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నావ్. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మారణాయుధాలు ఎందుకు? నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచి లాగా, ఒక సైకో లాగా తయారయ్యాడని ప్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ.. దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. మీ పాదయాత్రకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే మీ మనుష్యులతో ఆ పోలీసులనే కొట్టిస్తున్నావు.. నీ వెనుక ఉన్న వారిలో నేర చరిత్ర ఉన్నవాళ్లని ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మీద దాడి చేస్తే సహించేది లేదు ఖబడ్దార్.. లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు, ప్రజల్లో తిరిగేందుకు అస్సలు పనికిరావు. నీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు, మరణయుధాలు తీసుకుని వెళ్తున్నావ్. తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకే.. చంద్రబాబు బండారం బయట పడిపోయింది. అతనిపై ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో వారిలో గుబులు మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పులకు జైలుకి వెళ్లడం ఖాయం. నారా లోకేష్ కూడా పాదయాత్ర ఇలాగే చేస్తే అతను కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లా ద్రోహి చంద్రబాబు: మంత్రి రోజా -
ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఉన్నట్టుండి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా ఎన్సీపీలో నాయకత్వ మార్పుపై అసంతృప్తిగా ఉన్న అజిత్ పవార్ ముఖ్యమంత్రి షిండేతో చేతులు కలిపారు. 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి గవర్నరుని కలవడం, సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అంతా ఆగమేఘాలమీద జరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా ఇటీవల ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుప్రియా సూలే తోపాటు నియమితులైన ప్రఫుల్ పటేల్ కూడా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్బంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే మాట్లాడుతూ.. అజిత్ పవార్ చేరికతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయ్యింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే అజిత్ పవర్ తో చేతులు కలిపాము. ఇందులో మా ప్రోద్బలం ఏమీ లేదు. ఆయనంతట ఆయనే వచ్చి మాతో చేతులు కలిపారని తెలిపారు. ఆయనతోపాటు ఎన్డీయేలో చేరిన మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఛగన్ భుజబల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావు బాబా ఆత్రం, అదితి తాత్కరే, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పుడు ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ఎన్డీయే ప్రభుత్వం మరింత బలోపేతమైంది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగినా జనసేన కార్యకర్తలు ఉంటున్నారు : కొట్టు సత్యనారాయణ
-
ప్రభుత్వం పై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి : ముత్యాల నాయుడు
-
వారి అవినీతికి ‘ట్విన్ టవర్స్’ సజీవ సాక్ష్యం: డిప్యూటీ సీఎం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు క్షణాల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్జోన్లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్‌ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా అథారిటీ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో విపక్షాలపై విమర్శలు గుప్పించింది ఉత్తర్‌ప్రదేశ్ అధికార బీజేపీ. అలాంటి అక్రమ కట్టడాలతో రాజకీయ నాయకులు, బిల్డర్స్, అధికారుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుందని విమర్శించింది. భవిష్యత్తులో రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణానికి 2004లో అనుమతులు లభించాయి. దీంతో అప్పటి సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. ‘సమాజ్ వాదీ పార్టీ అవినీతి, అరాచకాలకు నోయిడా ట్విట్ టవర్స్ సజీవ సాక్ష్యం. నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎస్పీ అవినీతి భవనం కూలిపోతుంది. ఇదే న్యాయం, ఇదే సుపరిపాలన.’ అని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. नोएडा का सुपरटेक ट्विन टॉवर श्री अखिलेश यादव और सपा के शासनकाल के भ्रष्टाचार और अराजकता की नीति का जीवंत प्रमाण है। आज मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी के नेतृत्व में भाजपा की सरकार में सपा के भ्रष्टाचार की इमारत ढहेगी। यह है न्याय, यही सुशासन।#TwinTowers — Keshav Prasad Maurya (@kpmaurya1) August 28, 2022 డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపణలను తిప్పికొట్టింది సమాజ్ వాదీ పార్టీ. ‘ఈ అవినీత కట్టడం నిర్మించటానికి బీజేపీ సైతం కారణం. బీజేపీకి సూపర్‌టెక్ భారీగా నిధులు ముట్టజెప్పింది. కాషాయ పార్టీకి చెందిన ఆఫీసులో కూర్చుని ఓ బ్రోకర్ అందుకు బ్రోకరేజ్ అందుకున్నాడు.’ అని ఆరోపించింది. ఇదీ చదవండి: Noida Twin Towers: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే.. -
చంద్రబాబు కుట్రలను మీరే తిప్పి కొట్టాలి: ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా
-
డిప్యూటీ సీఎం పదవి రావడం పై కొట్టు సత్యనారాయణ రియాక్షన్
-
Karnataka: టార్గెట్ 2023.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు
బెంగళూరు: గత కొద్ది రోజుల నుంచి కర్ణాటక రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మార్పు గురించి పలు ఊహాగానాలు వెలువడినప్పటికి మాజీ సీఎం యడియూరప్ప వాటిని ఖండించారు. కానీ దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలు పెట్టింది. యడ్డీ వారసుడిగా ఆయన మంత్రివర్గంలో పని చేసిన బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోనే.. బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సీఎం బొమ్మై కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బొమ్మై, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాక అతని కేబినెట్లో ఆరు నుంచి ఎనిమిది మంది కొత్తవారికి.. అందునా యువకులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బొమ్మై క్యాబినెట్లో గరిష్టంగా 34 మంది సభ్యులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 లో ఐదుగురు డిప్యూటీ సీఎంలతో కూడిన జంబో బృందాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేబినెట్ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు కర్ణాటక బీజేపీ సీనియర్ కార్యనిర్వాహక అధికారి ఒకరు తెలిపారు, ఎస్సీలు, ఎస్టీలు, వోక్కలిగాస్, లింగాయతులు, ఓబీసీ అనే ఐదు ప్రధాన సామాజిక వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 2008 నుంచి అసెంబ్లీ ఎన్నికలలో 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటడానికి బీజేపీ కష్టపడుతోంది. ఈ క్రమంలో అన్ని వర్గాల వారికి చేరువయ్యేందుకు బీజేపీ అధిష్టానం ఐదుగురు డిప్యూటీ సీఎంల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా, పార్టీ కేంద్ర నాయకత్వం మాజీ సీఎం బీఎస్ యడియూరప్పతో పాటు లింగాయత్ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచింది. ప్రస్తుతం వారు ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. -
డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టు..వ్యక్తి అరెస్టు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్‌లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై గత అక్టోబర్‌లో ఎల్విన్‌మెంట్ పీఎస్‌లో మంత్రి ఫిర్యాదు చేశారు. పుష్ప శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగుళూరులలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. -
డిప్యూటీ సీఎంపై అభ్యంతరకర పోస్టులు వ్యక్తి అరెస్ట్
-
ఇలా ఉంటే చదువు సాగేదెలా...?
గుమ్మలక్ష్మీపురం: చదువుకోవడానికి పాఠ్యపుస్తకాలు లేవు. ప్రయోగాలు చేసుకునేందుకు ల్యాబ్‌లు లేవు. కూర్చునేందుకు తగిన బెంచీలు లేవు. రెగ్యులర్ బోధకులు లేరు. ప్రిన్సిపాల్ లేరు. అసంపూర్తిగా నిలిచిపోయిన బోధన గదులు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ఉల్లిపాయలు వేయకుండా... ఎక్స్పైర్ అయిన సామగ్రితో వంటలు. ఇదీ గుమ్మలక్ష్మీపురంలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల(ఎస్టీ)లో దుస్థితి. వాటిని ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చలించిపోయారు. గత పాలకుల నిర్లక్ష్యానికి విస్తుపోయారు. ఇప్పటికైనా దానిని పూర్తి మౌలిక సదుపాయాలతోతీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అసలేమైందంటే...: గుమ్మలక్ష్మీపురంలో మంగళవారం నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు. ఆ సందర్భంలో అక్కడి పాలిటెక్నిక్ విద్యార్థులు ఆమెకు కళాశాలలోని సమస్యలు వివరించారు. వెంటనే స్పందించిన ఆమె అప్పటికప్పుడు కళాశాలను సందర్శించారు. అక్కడ నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు చదువుకోసం వస్తే గత టీడీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలేవీ కల్పించకుండా భవనాన్ని నిర్మించి నిర్లక్ష్యంగా వదిలేయడం బాధాకరమన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఎప్పుడూ తన దృష్టికి రాలేదని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులను చూస్తే ఎంతగానో బాధకలుగుతోందని, ఈ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కళాశాలలో నెలకొన్న సమస్యలను నివేదిక రూపంలో అందజేయాలని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహకు ఆమె ఆదేశించారు. ఆమె వెంట వైఎస్సార్సీపీ శ్రేణులు ఉన్నారు. -
చంద్రబాబును ఓడించేందుకు డిప్యూటీ సీఎం : పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అవసరానికి మించి రెట్టింపు స్థాయిలో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు, డీజీపీ స్థాయి అధికారితో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొట్టి ఇసుకను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, లోకేశ్, ఆ పార్టీ శాసనసభ్యులదని విమర్శించారు. చంద్రబాబు ఉపయోగిస్తున్న భాష సంస్కారహీనంగా, అభ్యంతరంగా ఉందని ఆక్షేపించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంచార్జ్‌గా నియమించబోతున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సొంత జిల్లా కుప్పంలో మెజార్టీ సాధించలేని చంద్రబాబు రాష్ట్రంలో పార్టీని ఏమేరకు నడిపిస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. -
శక్తివంచన లేకుండా సమగ్రాభివృద్ధి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, దీనికి అవసరమైన వనరుల సేకరణకు శక్తివంచన లేకుండా శ్రమిద్దామని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పిలుపునిచ్చారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆయన సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అక్టోబర్ రెండో తేదీ నుంచి జిల్లాలో 1,271 పూర్తిస్థాయి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వీటి ద్వారా ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున జిల్లాలో 24,570 మంది వలంటీర్లను నియమించామని తెలిపారు. గ్రామ వలంటీర్లు గురువారం నుంచే తమ విధులు ప్రారంభిస్తారన్నారు. జిల్లాలో ఏర్పాటు కానున్న 1,271 గ్రామ సచివాలయాల్లో 13,981 మంది సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 1న పరీక్షలు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి, అక్టోబర్ 2 నుంచే వారు విధుల్లో చేరేవిధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇటీవల వరద పీడిత గ్రామాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఎంపీ వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ ఐవీ రావు, జాయింట్ కలెక్టర్–2 రాజకుమారి, డీఆర్వో సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ⇔ఉపాధి హామీ పథకం కింద పేదలకు ఉపాధి కల్పన, సుస్థిర గ్రామీణాభివృద్ధి, ఆస్తుల కల్పన, పర్యావరణ పరిరక్షణ, జీవన ప్రమాణాల పెంపుదలే లక్ష్యంగా ఈ ఏడాది జిల్లాలో రూ.732 కోట్లు ఖర్చు చేయాలన్నది లక్ష్యం. ⇔రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని కుటుంబాలకూ ఉగాది నాటికి 25 లక్షల ఇంటిస్థలాలు అందించనున్నాం. ఇందుకు అనువైన భూమిని గుర్తించే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో 1.40 లక్షల మంది లబ్ధిదారులకు 300 ఎకరాలు గుర్తించాం. గృహ వసతి లేని 1.03 లక్షల కుటుంబాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ వెబ్సైట్లో నమోదు చేశాం. వీరందరికీ రానున్న నాలుగేళ్లలో దశల వారీగా వివిధ పథకాల ద్వారా గృహవసతి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. ⇔జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచేందుకు, అధికోత్పత్తులు సాధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో ఖరీఫ్‌లో 13.88 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించాం. ⇔జిల్లాలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులపై రూ.145.75 కోట్లు మంజూరు చేశాం. ప్రతి నియోజకవర్గంలోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పరీక్షల కోసం ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ⇔వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకూ పెట్టుబడి రాయితీ కింద ఏటా రూ.12,500 చెల్లిస్తాం. ఈ పథకం అక్టోబర్ 15 నుంచి అమలులోకి వస్తుంది. ⇔ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన కింద ఖరీఫ్, రబీ కాలంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి రైతూ ఒక్క రూపాయి మాత్రమే చెల్లించడం ద్వారా బీమా పొందుతారు. ఈ నెల 21 వరకూ మాత్రమే గడువు ఉన్నందున రైతులందరూ దీనిని వినియోగించుకోవాలి. సమీకృత వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం కోసం కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ⇔మత్స్యకారుల పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. వేట నిషేధ సమయంలో వారికిచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం. డీజిల్ సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంకుల ద్వారా పంపిణీ చేయడం, ప్రమాదవశాత్తూ మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ⇔వైఎస్సార్ భరోసా కింద జిల్లాలో 2,39,344 మంది వృద్ధులు, 11,009 మంది చేనేత పనివారు, 2,26,000 మంది వితంతువులు, 67,114 మంది విభిన్న ప్రతిభావంతులు, 5,856 మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతున్నారన్నారు. అభయహస్తం కింద 10,332 మంది ఒంటరి మహిళలకు, 7,971 మంది మత్స్యకారులకు, 1,669 మంది చర్మకారులకు, 1,411 డప్పు కళాకారులకు, 598 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, 184 మంది ట్రాన్స్జెండర్లకు రూ.140 కోట్లు అందిస్తున్నాం. ⇔ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా జిల్లాలోని 86,674 మహిళా సంఘాలకు నాలుగు విడతలుగా రూ.2,395.32 కోట్ల మేర రుణమాఫీ చేస్తాం. స్త్రీనిధి లక్ష్య సాధనలో 44.83 శాతంతో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ⇔జిల్లాలోని వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలతో పాటు విద్యా ప్రమాణాలు పెంపొందించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు.. వివిధ కార్పొరేట్ సంస్థలు, దాతలు, మేజర్ కాంట్రాక్టర్ల సహకారంతో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభించాం. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.14 కోట్లు మంజూరు చేశారు. ⇔జగ్జీవన్‌జ్యోతి ఉచిత విద్యుత్ పథకం కింద ఎస్సీలకు 100 యూనిట్లు ఉన్న విద్యుత్ రాయితీని 200 యూనిట్లకు పెంచాం. ⇔గిరిజనేతర విద్యార్థులతో సమానంగా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే అవకాశాలు కల్పిస్తున్నాం. చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ‘శబరి’ వాటర్ తయారీలో శిక్షణ ఇచ్చి, వారి ఉత్పత్తులు మార్కెటింగ్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. ⇔వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసింది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలరింగ్ వృత్తి చేసుకునే వారికి ఏటా రూ.10 వేలు వారి ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ⇔వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నాం. ⇔పోలవరం ప్రాజెక్టు ఆర్ఆర్ ప్యాకేజీ అమలులో గత ప్రభుత్వం చేసిన జాప్యం మూలంగా ఏజెన్సీ గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిని నివారించేందుకు సీజన్ అయిన వెంటనే నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నాం. ⇔సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల కోసం జిల్లాలో 83.24 ఎకరాల్లో 4 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ⇔పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే విధంగా జిల్లాలో వివిధ పనులు చేపడుతున్నాం. ⇔ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నాం. ⇔రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. ⇔జిల్లాలో ఇప్పటికే 37,198 అర్జీలు రాగా, వీటిలో 21,713 అర్జీలు మంజూరు దశలో ఉన్నాయి. 1,986 అర్జీలు పరిష్కరించాం. 11,521 అర్జీలు పరిష్కార దశలో ఉన్నాయి. ⇔ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రజల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ⇔వికాస ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. ⇔జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యాన రూ.40.30 కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నాం. ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ.4 కోట్లతో రాజానగరం మండలం కలవచర్లలో క్రీడాప్రాంగణం మంజూరు చేశాం. -
సమస్య ఏదైనా నా ఇంటికి రండి
బాపట్లటౌన్: గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే నాకు తెలుసు. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే. ఇన్నాళ్లు మన చేతిలో అధికారం లేకపోవడం వలన పనులు చేయలేకపోయాను. దేవుని దయ...మీ అందరి ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం జగన్మోహన్రెడ్డి చోరవతో ఉప సభాపతి అయ్యాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నా ఇంటికి ఎప్పుడైనా రావోచ్చు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తానంటూ డెప్యూటీ స్పీకర్ కోనరఘుపతి శనివారం మండలంలోని కొండుబోట్లవారిపాలెం, ఈస్ట్బాపట్ల, పిన్నిబోయినవారిపాలెం, ముత్తాయపాలెం, మరుప్రోలువారిపాలెం, అసోదివారిపాలెం, వెస్ట్బాపట్ల పంచాయతీల్లో జరిగిన గ్రామసభల్లో మాట్లాడారు -
దేశానికే ఆదర్శ సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : గిరిజన మహిళనైన తనను ఉప ముఖ్యమంత్రిని చేసి యావత్ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో పుష్పశ్రీవాణి పుట్టినరోజు వేడుకలు పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతూ.. చిన్నవయసులోనే తనకు పెద్దపదవి అప్పగించి గిరిజన మహిళలు, ప్రజల పట్ల అత్యున్నత గౌరవాన్ని చూపించిన తమ నాయకుడు జగన్మోహన్రెడ్డికి తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మేనిఫెస్టో అంటే ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వపాలన ఉంటుందని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇళ్లు రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలన్నారు. రైతుబాంధవుడిగా చెరగని ముద్రవేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ‘రైతు భరోసో’ పేరుతో అత్యున్నత సంక్షేమ పథకం సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేశారని తెలిపారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా కింద అర్హులైన రైతులకు రూ.12,500 జమ చేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు వారాలు కాకుండానే పదికి పైగా సంక్షేమ పథకాలు అమలుచేశారని కొనియాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 600 పైగా హామీలిచ్చి ఒక్క హామీకూడా పూర్తిగా అమలు చేసిన పాపానపోలేదన్నారు. అందుకే ప్రజలు టీడీపీనీ భూస్థాపితం చేశారని, మరో 25 ఏళ్ల పాటు టీడీపీ మనుగడే ఉండదని జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీని వాస్ మాట్లాడుతూ మహిళలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శులు సత్తిరామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, నడిపల్లి కృష్ణంరాజు, పేర్లవిజయచందర్, మొల్లి అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం అధికారప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు కొండారాజీవ్ పాల్గొన్నారు. -
జీసీసీని లాభాల్లో తెచ్చేందుకు ప్రణాళిక: పుష్పశ్రీవాణి
అమరామతి : అర్హులైన గిరిజనులకు లబ్ది చేకూరకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అధికారులను ఆదేశించించారు. అమరావతిలో గిరిజన సంక్షేమశాఖపై ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ట్రైకార్ రుణాల మంజూరు విషయంలో అవినీతిని గుర్తించిన డిప్యూటీ సీఎం.. తక్షణమే కార్ల కొనుగోలు రుణాల మంజూరులో అవినీతిపై విచారణకు ఆదేశించించారు. అర్హులైన గిరిజనులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జీసీసీ భవనాన్ని 5 కోట్లతో నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. నష్టాల్లో ఉన్న జీసీసీని లాభాల్లో తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అలాగే మినీ గురుకులాల విద్యార్థులకు హాస్టల్ వసతి పూర్తిగా కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 గురుకులాల నిర్మాణం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడానికి వీల్లేదని, ఏకలవ్య పాఠశాలల్లో నాణ్యమైన ఉపాధ్యాయులను నియమించాలని అధికారులను సూచించారు. -
రాజప్పకు మళ్లీ చుక్కెదురు
సాక్షి, కాకినాడ: ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అవినీతి, అక్రమమైనింగ్లతో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఆయనకు ఎక్కడికి వెళ్లినా ఛీత్కారాలు తప్పడం లేదు. మూడు రోజుల క్రితం సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో అక్కడి ప్రజలు ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మరో భంగపాటు ఎదురైంది. మాధవపట్నం సమీపంలోని జమునా నగర్‌కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఐదేళ్లుగా తమ గ్రామ సమస్యలేవీ తీర్చారంటూ నిలదీశారు. స్మశానానికి దారిలేదంటూ ఎన్నో సార్లు సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరించలేదని మండిపడ్డారు. ఎవరైనా చనిపోతే రైలుపట్టాలు మీదుగా మృతదేహాన్ని స్మశానవాటికి తీసుకువెళ్లాల్సి వస్తోందని ఎన్నో సార్లు చెప్పినా నాడు మీరు ఎందుకు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవపట్నం, జమునానగర్లలో స్థానిక సమస్యలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాజప్ప డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో రాజప్పకు మింగుడుపడలేదు. ఎన్నికలైన తరువాత ఈ సమస్యకే తొలి ప్రాధాన్యం ఇస్తానని రాజప్ప హామీ ఇవ్వగా మూడేళ్ల కిందటి నుంచి ఇదే మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘చెప్పింది విను’ అని రాజప్ప చెప్పడంతో ‘ఎన్నిసార్లు వినాలి’ అంటూ కేకలు వేశారు. ఆ గ్రామ మాజీ సర్పంచి పిల్లి కృష్ణ ప్రసాద్ ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినకపోవడంతో ‘వాహనం ముందుకు పోవాలి’ అని రాజప్ప చెప్పి జారుకున్నారు. వరుస వ్యతిరేక చర్యలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాజప్ప ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి పెద్దాపురంలో నెలకొందంటూ ఆ పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
అరుణాచల్ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి