అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్బంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరావని ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరావని విమర్శించారు.
దౌర్జన్యం చేయడానికి వచ్చావా?
పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్త్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టమొచ్చినట్లు రౌడీలను పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నావ్ ఖబడ్దార్ లోకేష్ అని హెచ్చరిస్తూనే నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నావ్? అసలు నువ్వొచ్చింది ప్రజల బాగోగులు తెలుసుకోవడానికా? దౌర్జన్యం చెయ్యడానికా? అంటూ ప్రశ్నించారు.
అంతటా వ్యతిరేకత..
ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నావ్. భీమవరంలో అయితే వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మీ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు అవగాహన లేక మాట్లాడుతున్నాడని 'పప్పు' అనుకునేవారు. కానీ ఈ పాదయాత్రతో ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నావ్. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
మారణాయుధాలు ఎందుకు?
నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచి లాగా, ఒక సైకో లాగా తయారయ్యాడని ప్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ.. దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. మీ పాదయాత్రకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే మీ మనుష్యులతో ఆ పోలీసులనే కొట్టిస్తున్నావు.. నీ వెనుక ఉన్న వారిలో నేర చరిత్ర ఉన్నవాళ్లని ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మీద దాడి చేస్తే సహించేది లేదు ఖబడ్దార్.. లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు, ప్రజల్లో తిరిగేందుకు అస్సలు పనికిరావు. నీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు, మరణయుధాలు తీసుకుని వెళ్తున్నావ్.
తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకే..
చంద్రబాబు బండారం బయట పడిపోయింది. అతనిపై ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో వారిలో గుబులు మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పులకు జైలుకి వెళ్లడం ఖాయం. నారా లోకేష్ కూడా పాదయాత్ర ఇలాగే చేస్తే అతను కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు.
ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లా ద్రోహి చంద్రబాబు: మంత్రి రోజా
Comments
Please login to add a commentAdd a comment