Bhimavaram
-
Sankranti: ఆతిథ్యంలో గోదారోళ్లది అందెవేసిన చెయ్యి
సాక్షి, భీమవరం: సినిమా షూటింగ్ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) వచ్చిన ప్రముఖ సినీనటుడు వీరమాచనేని జగపతిబాబు ఇక్కడి ఆతిథ్యం గురించి పోస్టు చేసిన వీడియో చాలానే వైరల్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నన్నాళ్లూ ఓ అభిమాని ప్రతిరోజూ రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తనకు విందు భోజనం పంపారని చెప్పుకొచ్చారు. వాటిని చూపిస్తూ ‘బకాసురుడిలా తింటాను.. కుంభకర్ణుడిలా పడుకుంటా’నంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు గోదావరి జిల్లాల(Godavari Districts) ఆతిథ్యాన్ని ఎన్నో వేదికలపై గుర్తుచేసుకున్న సందర్భాలెన్నో.. ఆయ్.. అండి.. రండీభాషలో ‘ఆయ్..’ అనే యాస ఉన్నా.. మాటనిండా మమకారమే దాగి ఉంటుంది. దారి చెప్పమంటే నేరుగా ఇంటికే తీసుకెళ్లేంత మర్యాద ఉంటుంది. తిండి పెట్టి చంపేస్తారన్నది నానుడైతే.. పెట్టుపోతలతో మైమరచిపోయేలా చేయడం వీరి నైజం. అడుగడుగునా వెటకారమే అనిపించినా.. అణువణువునా ఆప్యాయతే కనిపిస్తుంది. అరమరికలు లేని వ్యక్తిత్వాలు.. అబ్బురపరిచే సంప్రదాయాలు.. గోదావరి వాసుల పడికట్లు. అందుకే.. గోదారోళ్ల పిల్లను చేసుకోవడానికి ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. గోదారోళ్ల ఆతిథ్యం చూడాలంటే వారి ఇంటి అమ్మాయిని వివాహమాడాల్సిందే. పెళ్లిచూపులు లగాయితు అప్పగింతల వరకు అడుగడుగునా వారి అతిథి మర్యాదలు, సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి.సంక్రాంతి వస్తోందంటేసంక్రాంతి(Sankranti Festival) వస్తోందంటే గోదావరి మర్యాదలే గుర్తొస్తాయి. ఎక్కడెక్కడో ఉన్న బంధువులను పండక్కి వారం ముందే రమ్మని పిలిచి.. ఉన్నన్ని రోజులూ వారికి ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు గుమ్మం వద్దే చెంబులతో చేతికి నీళ్లందించి కాళ్లు కడుక్కోమని మర్యాదలు చేస్తారు. చేతులు తుడుచుకోవడానికి భుజాలపై తుండు (టవల్) అందిస్తారు. ప్రయాణం బాగా సాగిందా అంటూ మనసు నిండా అభిమానంతో స్వాగతం పలుకుతారు. కోడి పందేలు, జాతరలు, సినిమాలు, పల్లె అందాలను తిప్పి చూపిస్తుంటారు. సరదా పడాలే గానీ తాటికల్లు రుచి చూపిస్తారు. ఉన్నన్ని రోజులూ నచ్చిన వంటకాలను వండి వారుస్తుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే అరిటాకులో విందు భోజనం చేస్తుంటారు.అత్తల హడావుడి అంతాఇంతా కాదుకొత్త అల్లుడు మొదటిసారిగా పండుగకు ఇంటికి వచ్చే అల్లుళ్ల కోసం పల్లెల్లో అత్తలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు, పోకుండలు, గోరుమిటీలు వంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. తలుపు చాటున నిల్చుని అల్లుడు గారికి అవి పెట్టు.. ఇవి పెట్టు అంటూ కూతురికి చెబుతూ అత్తలు సంబరపడిపోయే దృశ్యాలు అనేకం. తామేమీ తక్కువ కాదన్నట్టు కొంటె మరదళ్లు గాజులతో గారెలు.. గోళీలతో పొంగడాలు.. ఘాటైన మిరపకాయలతో బజ్జీలు చేసి బావలను ఆట పట్టించడం ఇక్కడ షరా మామూలే.వియ్యపురాలా.. నీవొచ్చెవేళకొందరు అల్లుడితో పాటు వియ్యపురాలిని సైతం ఇంటికి ఆహ్వానించి కానుకలు, కొత్త దుస్తులు అందిస్తారు. వియ్యపురాలు సైతం వస్తూవస్తూ ఇంటిల్లిపాదికీ కొత్త దుస్తులు తెచ్చి ఇవ్వడం ఇక్కడి ఆచారం. తద్వారా ఇరు కుటుంబాల మధ్య బంధాలు బలపడతాయని గోదారోళ్ల నమ్మకం. పండుగలు ముగిసి స్వస్థలాలకు తిరిగి వెళ్లే బంధువులకు ఇంటిలో చేసిన పిండివంటలను ప్యాక్ చేసి ఇస్తారు. బరువెక్కిన గుండెలతో వీధి చివరి దాకా వచ్చి వీడ్కోలు చెబుతూ వచ్చే ఏడాది ముందుగానే రావాలంటూ మాట తీసుకుని మరీ సాగనంపడం గోదారోళ్ల ప్రత్యేకత.కొత్త అల్లుడికి గుర్తుండిపోయేలా..సంక్రాంతి వస్తోందంటే కొత్తగా పెళ్లయిన ఇళ్లల్లో సందడికి అంతే ఉండదు. తమ స్తోమతకు తగ్గట్టుగా అల్లుడికి తొలి పండుగ కలకాలం గుర్తుండిపోయేలా అత్తింటి వారు మర్యాదలు చేస్తారు. వినూత్న రీతిలో అల్లుడికి స్వాగతం పలుకుతారు. విందులో ఎన్నెన్నో (కొందరైతే వందకు పైగా) వంటకాలను వడ్డించి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. గత ఏడాది భీమవరానికి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబం తమ అల్లుడికి ఏకంగా 173 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరో కుటుంబం వారు తమకు కాబోయే అల్లుడికి వంద రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. పండక్కి మొదటిసారి వస్తున్న అల్లుడిని భీమవరానికి చెందిన అత్తింటివారు డోలు, సన్నాయి మేళంతో ఎడ్ల బండిపై ఊరేగిస్తూ ఇంటికి ఆహ్వానించారు. భారతదేశం మ్యాప్‌పై దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన 29 వంటకాలతో అల్లుడికి విందు ఏర్పాటు చేసి అబ్బురపరిచారు. -
సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!
సంక్రాంతి పందేల్లో కాలు దువ్వేందుకు సింహపురి నుంచి కోడి పుంజులొచ్చేశాయి. నెల్లూరు ప్రాంతంలో పెంచిన కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల పుంజులు పందేలరాయుళ్లను ఆకర్షిస్తున్నాయి. రకాన్ని బట్టి ఒక్కొక్క పుంజు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు రావులపాలెం–ఏలూరు హైవే, రద్దీ రోడ్ల వెంబడి వీటిని విక్రయిస్తున్నారు. – సాక్షి, భీమవరం భీమవరం బ్రీడ్నే అక్కడ పెంచి..సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, వెంప, సీసలి, దుంపగడప, తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం కోడిపందేలకు పేరొందాయి. పెద్ద బరుల్లో రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. సంక్రాంతి మూడు రోజులు వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు కోడిపుంజులు అవసరమవుతాయి. పందేలకు వినియోగించే ‘భీమవరం బ్రీడ్’ పుంజులకు గిరాకీ అంతాఇంతా కాదు. సంక్రాంతి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినఅమిరం, కాళ్ల, కోనసీమలోని అమలాపురం, లంక, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భీమవరం బ్రీడ్ కోడిపుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. భీమవరం బ్రీడ్ పుంజులకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని నెల్లూరీయులు వీటిని అక్కడ పెంచుతున్నారు. అనంతరం వాటిని గోదావరి జిల్లాలకు తెచ్చి విక్రయిస్తున్నారు.నెల ముందే వ్యాపారుల రాకవారం రోజుల్లో సంక్రాంతి నెల పట్టనుండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు అప్పుడే గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 15 నుంచి 20 పుంజులను తెస్తున్నారు. నలుగురైదుగురు గుంపుగా వచ్చి రావులపాలెం–ఏలూరు హైవే వెంబడి, రద్దీ రోడ్లు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పుంజుల్ని ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. పందెం కోళ్లలోని దాదాపు అన్ని రకాల జాతులు వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సాధారణంగా పందేల కోసం గోదావరి జిల్లాల్లో సిద్ధం చేసే పుంజులు చాలా ధర ఉంటాయి. పందెం పుంజులను కొత్త అల్లుళ్ల మాదిరిగా పెంచుతుంటారు. వాటికి మూడు నెలల ముందునుంచే మటన్ కీమా, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుంటారు. శరీర పటుత్వాన్ని పెంచేందుకు వాకింగ్, ఈత కొట్టించడం, నీళ్లపోతలు, శాఖాలు తదితర రూపాల్లో ప్రత్యేకంగా ట్రైనర్లతో శిక్షణ ఇస్తుంటారు. వాటికందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.లక్ష కూడా దాటిపోతోంది. చూసేందుకు స్థానిక పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా సైజులు, రంగుల్లో నెల్లూరు పుంజులు ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలలోపే ధరలు ఉండటంతో వీటి కొనుగోలుకు పందెంరాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. వాటి కాళ్ల సామర్థ్యం, ప్రత్యర్థిపై దాడిచేసే వేగాన్ని పరీక్షించేందుకు అక్కడే డింకీ పందేలు కట్టి బాగున్న వాటిని బేరమాడి తీసుకుంటున్నారు. నెలరోజుల పాటు వాటికి తగిన మేతను అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా పందేలకు సన్నద్ధం చేసే వీలుంటుందంటున్నారు.ఇక్కడే గిరాకీ బాగుంటుంది సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడిపుంజులకు గిరాకీ బాగుంటుంది. నెల్లూరు జిల్లా నుంచి చాలామంది పెంపకందారులు, వ్యాపారులు ఇక్కడకు కోడిపుంజులు తెచ్చి విక్రయిస్తుంటారు. నేను సొంతంగా పెంచిన వాటితో పాటు అక్కడ కొనుగోలు చేసిన పుంజులను తీసుకువచ్చాను. – వెంకటేష్, నెల్లూరు ముందుగానే వచ్చాం నాలుగేళ్లుగా ఏటా సంక్రాంతి ముందు కోడి పుంజులను తీసుకువస్తున్నాం. గతంలో రెండు వారాల ముందు వచ్చేవాళ్లం. మరింత ముందుగా వస్తే పందేలరాయుళ్లు మా వద్ద కొనుగోలు చేసిన పుంజులను పెంచుకునేందుకు బాగుంటుందని కొందరు చెప్పడంతో ఈ ఏడాది నెల రోజులు ముందే వచ్చా. అమ్మకాలు బాగుంటే రూ.10 వేల వరకు మిగులుతాయి. – సంగయ్య, నెల్లూరు -
ప్రభాస్ లేకుండానే జరిగింది.. లేకపోతే నేను బలి: జగపతి బాబు ఫన్నీ వీడియో
టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరో క్రేజీ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఓ మూవీ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో తాను ఆరగించే భోజనం గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.(ఇది చదవండి: చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?)అయితే ఆ భోజనాన్ని జగపతిబాబుకు పంపంది మరెవరో కాదు.. సినిమా సెట్స్‌లో అందరి ఆకలి తీర్చే రెబల్ స్టార్ ప్రభాస్. భీమవరం రాజుల ప్రేమ అంటూ విందు భోజనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇదంతా ప్రభాస్ ప్రమేయం లేకుండానే జరిగింది.. ఎవరికీ చెప్పొద్దు.. తాను పెట్టే ఫుడ్ తింటే ఈ బాబు బలి.. అది బాహుబలి స్థాయి అంటూ చాలా ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. జగపతి బాబు ఈ ఏడాది సూర్య కంగువా చిత్రంలో నటించారు. అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించారు. Vivaaha bojanambu..idhi prabhasa premayam Leykunda jarigindhi. evaru cheppaddhu. Chepthe ee Tanu petey food tho ee babu bali… Adhee baahubali level.. pandikoku laaga thini ambothlaaga Padukuntunanu. pic.twitter.com/64TPjI46L1— Jaggu Bhai (@IamJagguBhai) December 9, 2024 -
ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం
ప్రభాస్ బర్త్‌డే ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాదంగా మారింది. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23)సందర్భంగా కొంతమంది ఫేక్ ఫ్యాన్స్‌తో కలిసి ప్రసన్న సాహో డబ్బులు వసూలు చేసి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆరోపించారు. ఆ ఈవెంట్‌ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ఎలాంటి కమర్షియల్ ఈవెంట్ చేయడం లేదని ప్రసన్న సాహో వర్గం వివరణ ఇచ్చింది. (చదవండి: రేణు దేశాయ్ ఇంట చండీ హోమం)ఎవరి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని, కావాలనే తనను టార్గెట్ చేశారంటూ ప్రసన్న మండి పడ్డారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తామని ప్రసన్న సాహో వర్గం వెల్లడించింది.(చదవండి: టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్)కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ రావడంతో పాటు ఆయన నటించిన ఆరు సినిమాలు రీరిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బర్త్‌డే రోజు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు. -
సంక్రాంతి పందెం పుంజులకు స్పెషల్ ట్రైనింగ్!
సాక్షి, భీమవరం: సంక్రాంతి పేరు చెబితే గుర్తొచ్చేవి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలే. పండుగ మూడు రోజులు నిర్వహించే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. పందేల బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పందెం పుంజుల సన్నద్ధతకు పెద్ద కసరత్తే మొదలవుతుంది.కోడి పందేలకు ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగానే పుంజుల పెంపకంలో పందెంరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాలు వద్ద పుంజులను పెంచితే.. ఎక్కువ మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను ఎంచుకుని వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకే అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందే అడ్వాన్స్‌లు చెల్లిస్తుంటారు. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపక కేంద్రాలు ఉన్నాయి.అత్యంత గోప్యంగా..కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతులకు చెందిన ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీటి పాత ఈకలు ఊడిపోయి కొత్త ఈకలు వస్తుంటాయి. అనంతరం వీటికి శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు శిక్షణ ప్రారంభిస్తారు. అందుకోసం ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తారు. పుంజులకిచ్చే ఆహారం, మందులు నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నదీ ఇతరులకు తెలియకుండా గోప్యత పాటిస్తారు. మకాంలోని ఐరన్ కేజ్‌లలో ఉండే పందెం కోళ్లను బయటకు తీసి ఆరుబయట కట్టడం మొదలుపెడతారు. అప్పటి నుంచే వీటి శిక్షణ మొదలవుతుంది.చదవండి: ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’ప్రస్తుతం చాలా మకాంల వద్ద పుంజులను బయట కట్టడం ప్రారంభించారు. రోజు ఉదయాన్నే వేడి నీటిని పట్టిస్తారు. బరిలో చురుగ్గా కదిలేందుకు వీలుగా కాళ్లల్లో చురుకుదనానికి నెలరోజులు పాటు రోజు విడిచి రోజు సమీపంలోని చెరువులు, నీళ్ల తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. తర్వాత ‘వీ’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) కొట్టిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ వాకింగ్ చేయిస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తారు. పండుగలు దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు.5 వేలకు పైగా కోళ్లుకోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఇలా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి పందేల కోసం 5వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిద్వారా రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.మేత దర్జానే వేరుశిక్షణలో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు పందెం పుంజులకు ఈ మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. కోడి సైజును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మేక మాంసం, 5 వరకు బాదం గింజలు, రెండు వెల్లుల్లి రేకలు, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డును ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం చోళ్లు, గంట్లు, రాగులు మొదలైన వాటిని ఆహారంగా ఇస్తారు. -
స్వరంతో గిన్నిస్ రికార్డు..ఏకంగా 72 గంటల 30 నిమిషాల..!
ఘనత సాధించిన రేడియో విష్ణు 90.4. వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్లపాటు నిరంతర ప్రసారం. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన వంద మంది రేడియో జాకీల్లో 90 మంది విద్యార్థినులే. శ్రావ్యమైన గొంతుతో రేడియో జాకీలుగా అలరిస్తున్న విద్యార్థినులు.‘గుడ్ మార్నింగ్... భీమవరం. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం’ అంటూ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, వాతావరణం.. ఇలా నిరంతర సమగ్ర సమాచారాన్ని శ్రావ్యమైన గొంతుతో ప్రజాపయోగకరమైన వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్ల పటు నిరంతర ప్రసారంలో అనర్గళంగా మాట్లాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.కమ్యూనిటీ రేడియో !ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్య కేంద్రీకృత, చర్చా ఆధారిత తొలి రేడియో స్టేషన్‌గా ఈ కమ్యూనిటీ రేడియో గుర్తింపు పొందింది. సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రసారాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు సుదీర్ఘ రేడియో ప్రసారం 66 గంటల 6 నిముషాల 1 సెకనుగా నార్త్ ఆఫ్రికాలోని ట్యునీషియా పేరిట గిన్నిస్ రికార్డు ఉంది.15 ఏళ్లుగా గొంతు వినిపిస్తోంది!విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిబేటింగ్ ఎబిలిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్ పెంపొందించడం లక్ష్యంగా భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో చైర్మన్ కేవీ విష్ణురాజు 2007 సంవత్సరంలో రేడియో విష్ణు ప్రారంభించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..
-
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే.. సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్‌లూ ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్‌లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్‌లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. గెలుపు కోసం ఆపసోపాలు గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్‌కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్మెంట్ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్‌పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం. అసమ్మతి సెగలు టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్‌గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు. జనసేన కేడర్‌పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
సాక్షి, భీమవరం: పార్టీతో, కేడర్‌తో ఆయనకు పనుండదు.. అధికారమే పరమావధి.. పరాజయం చెందితే తనను నమ్మి ఓట్లేసిన ప్రజల కంటికే కనిపించరు.. అందుకే ఆయన్ను ఏరుదాటాక తెప్ప తగలేసే రకమని కొందరు.. ప్యారాచూట్ నేతని మరికొందరు చెప్పుకుంటుంటారు. స్వతహాగా వ్యాపారంలో రాణించిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మరింత వెనకేసుకున్నారంటారు. చివరకు తన మల్టీఫ్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కోట్లాది రూపాయల పార్కింగ్ ఫీజు రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన ఘనుడిగా పేరొందారు భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు).కండువాలు మారుస్తూ.. కృష్ణా జిల్లాకు చెందిన అంజిబాబు భీమవరంలో స్థి రపడ్డారు. వ్యాపారవేత్తగా ఉన్న ఆయన 2009లో దివంగత వైఎస్సార్ చలవతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ కేడర్ ఆయన విజయానికి శక్తివంచన లేకుండా పనిచేసింది. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడింది అంతంతమాత్రమే. ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ ఆయనే. బినామీ పేర్లతో అన్ని పనులు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. కాంగ్రెస్ కేడర్‌ను గాలికొదిలేసి 2014 ఎన్నికల్లో పార్టీ ఫిరాయించారు. టీడీపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోగా ఆ పార్టీ శ్రేణులు ఆయన కోసం పనిచేశాయి. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన అంజిబాబుకు వైఎస్సార్సీపీ ప్రభంజనంలో ఘోర పరాజయం తప్పలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై ఓటమి చెందిన పులపర్తి ఐదేళ్లుగా టీడీపీకి, ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూట మి పొత్తులో భాగంగా భీమవరం సీటు జనసేనకు రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కండువా కప్పుకుని మరోమారు తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు.ప్రజలను పట్టించుకోలేదు : గత ఎన్నికల్లో ఓట మి అనంతరం టీడీపీ శ్రేణులకు, తనను నమ్ముకుని ఓటేసిన ప్రజలకు ముఖం చూపించకుండా చక్కగా తన వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయారు. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ నియోజకవర్గ ప్రజల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అండగా కనీసం సేవా కార్యక్రమాలు నిర్వహించలేదు. మర లా ఎన్నికలు రావడంతో ఇప్పుడు గుర్తొచ్చామా అని పులపర్తిపై ప్రజలు మండిపడుతున్నారు.మింగుడుపడని వైఖరిపులపర్తి వైఖరి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్‌కు మింగుడుపడటం లేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అంజిబాబు పార్టీ పటిష్టతకు, నాయకులు, కార్యకర్తల బాగోగులు గురించి పట్టించుకోరన్న పేరుంది. తన వెన్నంటి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలను కనీసం సంప్రదించకుండా ఆయన పార్టీ మారిపోతుంటారంటారు. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే టీడీపీ నాయకులు ఆయనతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు పలువురు ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క జనసేన కేడర్ ఎన్నికల్లో తేడా వస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ఉన్నారంట.వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం పదేళ్ల పాటు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన అంజిబాబుకు తన వ్యాపార ప్రయోజనాలే ప్రధానమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టర్‌గా వందల కోట్లు వెనకేసుకున్నారంటారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తీర ప్రాంత ప్రజలకు రక్షిత నీటిని అందించేందుకు సంకల్పించిన ప్రాజెక్టు విషయంలోనూ వ్యాపార ధోరణి చూపించారంటారు. ప్రాజెక్టు కోసమని భీమవరం రూరల్ మండలం చిన అమిరంలో సుమారు 50 ఎకరాల భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు సేకరించి తన సొంతానికి వినియోగించుకున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. భీమవరంలోని తన మల్లీఫ్లెక్స్ వద్ద ఆర్అండ్బీ, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా పార్కింగ్ ఏర్పాటుచేసి పదేళ్ల పాటు కో ట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేశా రు. 2019లో భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికై న గ్రంధి శ్రీనివాస్ కన్నెర్రజేయడంతో పార్కింగ్ ఫీజు అక్రమ వసూళ్లకు తెరపడింది. -
మాకొద్దు టీడీపీ కేడర్!
భీమవరం: బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలంతా నిన్ను నమ్మంబాబూ అంటుంటే.. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాత్రం టీడీపీ నాయకులను నమ్మే పరిస్థితి లేదని పలువురు అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యరి్థగా పోటీచేసిన అంజిబాబు ఓటర్లకు పంపిణీ కోసం ఇచ్చిన సొమ్మును సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాహా చేయడంతో పోలింగ్ రోజున ఓటర్లు ఆ పార్టీ కార్యాలయానికి వచ్చి గందరగోళం సృష్టించారు. అప్పటి ఎన్నికల్లో అంజిబాబు ఘోరంగా ఓడిపోగా ఆయనకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఐదేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ వ్యా పార, వ్యవహారాలు చక్కబెట్టుకున్నారు. దీంతో భీమవరం నియోజకవర్గంలో టీడీపీ చుక్కాని లేని నావలా మారింది.ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో అంజిబాబు జనసేన పార్టీ అభ్యరి ్థగా బరిలో నిలిచారు. పార్టీలు మారడంలో దిట్ట అనే ముద్ర వేసుకున్న అంజిబాబు నుంచి అందిన కాడికి అందిపుచ్చుకోవాలనే ప్రయత్నాలు టీడీపీ శ్రేణులు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎంతోకొంత ఆయన నుంచి చేజిక్కుంచుకోకపోతే ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ప్రయోజనం ఏంటనే నిర్ణయానికి టీడీపీ శ్రేణులు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులు అంజిబాబు అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సొమ్ముల కోసం జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంట.సొంత మనుషులతోనే కార్యాచరణ టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో పెత్తనం చేయడానికి ప్రయత్నించగా గత అనుభవాల దృష్ట్యా అంజిబాబు జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. దీంతో నామినేషన్ కార్యక్రమానికి జనాన్ని తరలించడం దగ్గర నుంచి ఎన్నికల ప్రచార వ్యవహారాలు కూడా తన బంధువులు, కావాల్సిన వారితోనే చేయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా డబ్బులు విషయంలో అంజిబాబు అతి జాగ్రత్తగా వ్యవహరించడం టీడీపీ, జనసేన కేడర్‌కు మింగుడు పడటంలేదు. ఎన్నికల్లో ఓడిపోతే అంజిబాబు పత్తా ఉండరు కాబట్టి అయినకాడికి దండుకునే ప్రయత్నాలను కేడర్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సొంత మనుషులతోనే అంజిబాబు ఎన్నికల కా ర్యాచరణ రూపొందించినట్టు సమాచారం. జనసేన శ్రేణుల చిందులు నరసాపురం: పట్టణంలోని దర్గా సెంటర్లో జనసేన ప్రచార కార్యక్రమంలో ఇద్దరు జర్నలిస్టులపై ఆ పార్టీనాయకులు అసభ్య పదజాలంతో దూషణలు దిగడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం డ్యాన్ మాస్టర్ శేఖర్ దర్గా సెంటర్లో జనసేన తరఫున ప్రచార కార్యక్రమానికి వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కవరేజీకి వెళ్లిన ఓ పత్రిక విలేకరి, మరో న్యూస్ చానల్ జర్నలిస్ట్‌పై అక్కడున్న జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ కెమెరామెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలకు అడ్డువస్తున్నారు, మీరు ఎవరు? అంటూ రుసరుసలాడాడు.తాము జర్నలిస్టులమని చెప్పబోతుండగా.. జర్నలిస్టులైతే ఐడీ కార్డులు వేసుకుని తిరగాలని గర్జించారు. ‘నేనవరు అనుకుంటున్నావు.. నాయకర్ కెమెరామెన్‌ని, కాబోయే మంత్రి మనిషిని’ అంటూ శివాలెత్తారు. ఇప్పటికే నాయకర్ వ్యవహార తీరుపై నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా నాయకర్ అనుయాయుల దురుసు ప్రవర్తనతో ముందుకు వెళుతున్నారు. జనసేన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. -
పవన్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోంది
-
భీమవరంలో పవన్ కు షాక్..వైఎస్సార్సీపీలోకి ముఖ్య నేతలు
-
తాను ఒంటరిని కాదని, ప్రతి ఇంటా ప్రజాసైన్యం తనకు తోడుగా ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పేదలపై బాణాలా?: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు.. అందరికీ మంచి చేసిన జగన్‌కు ప్రతి ఇంటా మద్దతు ఉంది. ఏ ఇంట్లో చూసినా తోడుగా పేదల సైన్యం ఉంది. జగనే మళ్లీ రావాలని కోట్ల హృదయాలు ఆశీర్వదిస్తున్నాయి. ఒక్క జగన్ మీద చంద్రబాబు 10 మంది సేనానులను తోడు తెచ్చుకుని బాణాలు గురి పెడుతున్నారు. అవి తగిలేది జగన్‌కా? లేక పేదలకా?’’ అనేది ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. 16వ రోజు బస్సు యాత్ర సందర్భంగా మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.. బాబు గురించి చరిత్ర చెబుతున్న నిజం.. భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది. శబరి, ఇంద్రావతి కలసి ఉప్పొంగిన గోదావరిని తలపిస్తోంది. మంచి చేసి మనం, జెండాలు జతకట్టి వాళ్లు తలపడుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? సంక్షేమ రాజ్యాన్ని అబద్ధాలు, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. మీ ఐదేళ్ల భవిష్యత్తు, అక్కచెల్లెమ్మల సాధికారత, పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న భరోసా, పేదలకు సామాజిక న్యాయం కొనసాగుతూ మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి మళ్లీ నష్టపోవాలా? అనేది నిర్ణయించే ఎన్నికలు ఇవి. అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఇవి మన తలరాతలను మార్చే ఎన్నికలు. ఇవి కేవలం చంద్రబాబు – జగన్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు – చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని గుర్తు పెట్టుకోండి. మీ ప్రతి ఓటు వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది కాబట్టి మీ కుటుంబమంతా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ అంతటితో ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఆయన సాధ్యం కాని అలవిమాలిన హామీలతో వస్తున్నారనేది నిజం. కొంగ జపం.. నటిస్తావెందుకయ్యా? మీరంతా ఈమధ్య చూసే ఉంటారు. చంద్రబాబుకు నాపై కోపం చాలా ఎక్కువగా వస్తోంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు హైబీపీ కనిపిస్తోంది. ఏవేవో తిడుతుంటాడు.. శాపనార్ధాలు పెడుతుంటాడు. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. రాళ్లు వేయండి.. అంతం చేయండని పిలుపునిస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి. అక్కచెల్లెమ్మలూ.. నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకో తెలుసా? బాబూ.. చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకోపక్క జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకయ్యా? కొంగ జపాలు ఎందుకు చేస్తున్నావ్? అని అడిగా. అలా అడగడం తప్పా? మీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకంగానీ మంచి పనిగానీ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అని చంద్రబాబును అడిగా. ఆయన పేదలకు చేసింది ఏమీ లేకపోగా చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలే గుర్తుకొస్తాయి. భార్యలను వదిలేసి.. నియోజక వర్గాలనూ మార్చేసి! ఇక దత్తపుత్రుడి విషయానికి వస్తే.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను కూడా పుట్టించి నాలుగైదేళ్లకు ఒకసారి కార్లను మార్చేసినట్లుగా భార్యలను వదిలేసి, ఇప్పుడు నియోజక వర్గాలను కూడా అలవోకగా వదిలేస్తున్నావ్! ఏం మనిషివయ్యా నువ్వు? అని ఆయన్ను అడిగా. అందుకే దత్తపుత్రుడిలో కూడా ఈమధ్య బీపీ బాగా కనిపిస్తోంది. ఒకసారి చేస్తే అది పొరపాటు! మళ్లీ మళ్లీ చేస్తే అలవాటు అంటారయ్యా.. దత్తపుత్రా! పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డుపైకి తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపడం ఘోరమైన తప్పుకాదా? ఇదే విషయం నేను అడిగితే తప్పు అట! నిన్ను చూసి అదే తప్పు ప్రతి ఒక్కరూ చేయడం మొదలుపెడితే.. ఇలా నాలుగేళ్లకు, ఐదేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? అని కనీసం ఆలోచన కూడా చేయడు. ఆ పెద్దమనిషికి నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఇలా.. ఊగిపోతుంటాడు. చేతులు, కాళ్లు, తల..అన్నీ ఊపేస్తుంటాడు. ఇలా అడిగినందుకే బాబుకు, దత్తపుత్రుడికి నాపై కోపం. బాబు వదిన గారికి కూడా కోపం వచ్చింది. బాబు భజంత్రీలకు కూడా పిచ్చి కోపం.. వీళ్లంతా ఊగిపోతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లలో పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు. పేదలపై బాబు బాణాలు.. జగన్ ఒక్కడే.. చంద్రబాబుకు మాత్రం పది మంది సేనానులు. వారంతా బాణాలు గురి పెట్టారు. కానీ అవి తగిలేది ఎవరికి? జగన్‌కా? లేక పేదలకు జగన్ అందిస్తున్న పథకాలకా? వలంటీర్లు–సచివాలయాల వ్యవస్థలకా? ఆర్బీకేలు–విలేజ్ క్లినిక్స్ వ్యవస్థలకా? నాడు – నేడు, ఇంగ్లీషు మీడియంతో మారిన పిల్లల చదువులకా? వారి బాణాలు తగిలేది ఎవరికి? ఇంటింటికీ అందించే పెన్షన్లకు వారి బాణాలు తగులుతున్నాయి. మీ బిడ్డ బటన్ నొక్కడంతో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు పలు పథకాల ద్వారా గత 58 నెలల్లో పేదలకు అందాయి. మరి వాళ్లు వేసే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? లేక ఆ రూ.2.70 లక్షల కోట్లు అందుకున్న అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తగులుతున్నాయో ఆలోచన చేయమని కోరుతున్నా. వారంతా బాణాలు ఎక్కుపెట్టింది మీ అందరి మంచి కోరుతూ మనం తీసుకొచ్చిన వ్యవస్థలపై, పథకాలపై. అక్క చెల్లెమ్మల సాధికారత, పేద బిడ్డల బంగారు భవిష్యత్తు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న రైతు భరోసాపై చంద్రబాబు, ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధమిది. పుట్టుకతోనే రొయ్యకు మీసాలు.. బాబుకు మోసాలు రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతో ఎలా వచ్చాయో భీమవరంలో తేల్చేద్దాం. బాబు వస్తే జాబులు రావడం కాదు.. ఉన్నవి ఎలా ఊడిపోతాయో, రైతులను ఎలా ముంచాడో మొన్ననే పిడుగురాళ్ల సిద్ధం సభలో చెప్పా. టీడీపీ, ఎల్లో మీడియా చంద్రబాబును జాకీలు, పొక్లెయిన్లతో లేవనెత్తుతూ చేస్తున్న మోసాలు, పచ్చి అబద్ధాల గురించి ఇవాళ తేలుద్దాం. ఆ ప్రచారాల్లో ఎంత నిజం ఉందో చూద్దాం. ఖాళీ డబ్బాలో రాళ్లు వేస్తే డబడబ సౌండ్ వచ్చిన తరహాలో బాబు వల్లే అభివృద్ధి అంటూ ఊదరగొడుతుంటారు. అసలు బాబుకు – అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉందేమో మీరే చెప్పండి. సెల్‌ఫోన్‌ను కనిపెట్టిందీ, సత్య నాదెళ్లను చదివించిందీ తానేనని చెప్పుకునే బాబు పాత డైలాగులు కాసేపు పక్కనబెట్టి మీ అందరికీ బాగా గుర్తున్న 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారో చూద్దాం. కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన బాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ఎల్లో గ్యాంగ్ డప్పు కొట్టింది. జగన్‌కు అనుభవం లేదు, పిల్లోడని.. బాబుకైతే బాగా అనుభవం ఉంది, ఆయన వస్తేనే అభివృద్ధి అని ఊదరగొట్టారు. చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా.. అదిగో హైపర్ లూప్.. బుల్లెట్ రైలు.. మైక్రోసాఫ్ట్ వచ్చేసిందని.. ఏపీలో ఒలంపిక్స్ అని.. ఆమ్స్టర్ డ్యామ్, సింగపూర్, వెనిస్తో పోటీపడే నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా కొట్టుకోలేదా? మరి సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ రైలు వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తెచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలంపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులు కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? కనీసం ఎయిర్‌పోర్టులు ఏమైనా కొత్తవి కట్టాడా? జిల్లాకో హైటెక్ సిటీ మీకేమైనా కనిపించిందా? ఎక్కడైనా ఓ మెడికల్ కాలేజీ కట్టాడా? ఇవన్నీ కట్టకపోతే పోనివ్వండి. ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ స్కూల్‌ని, కనీసం వార్డునైనా బాగు చేశాడా? ఎక్కడైనా ఒక ఊరిలో సచివాలయం, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాడా? గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్‌ను తెచ్చాడా? మీ ఇంటివద్దకే ఆరోగ్య సురక్ష వచ్చిందా? డిజిటల్ లైబ్రరీలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించాడా? రైతన్నకు మేలు చేస్తూ ఆర్బీకే వ్యవస్థను తెచ్చాడా? ఒక వలంటీర్ వ్యవస్థను తెచ్చాడా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని అభివృద్ధి కింగ్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు? మీదంతా బోగస్ రిపోర్టు కాదా? మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్టు.. ► వాయువేగంతో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీల పనులు ► కొత్తగా, శరవేగంగా మరో నాలుగు సీ పోర్టుల పనులు ► కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్ల పనులు వడివడిగా ► కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ► 15 వేలకుపైగా సచివాలయాల ఏర్పాటు ► నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు ► కొత్తగా 15 వేలకుపైగా విలేజ్, వార్డు క్లినిక్స్ ► కొత్తగా 11 వేలకుపైగా ఆర్బీకేలు ► కొత్తగా ఇప్పటివరకు 3 వేలకుపైగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ► గ్రామానికే ఫైబర్ గ్రిడ్ సదుపాయం ► రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడుల రాక ► విమానాశ్రయాల విస్తరణ, వాయువేగంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు ► 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్స్, ఎంఎస్ఎంఈలకు ఆపన్న హస్తం ► స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు, నేతన్ననేస్తం, ► దేశంలో అభివృద్ధిలో టాప్ 5 రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ ► ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటివద్దకే పథకాలు, సేవలు 2014లో బాబు మోసాలిలా.. రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాడా?రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా చేశాడా? ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, ఇల్లు కూడా ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామని నమ్మబలికిన బాబు చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మించాడా?.. భీమవరంలో కనిపిస్తోందా? ఇన్ని ప్రధాన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా? ప్రత్యేక హోదా తెచ్చాడా? సూపర్ సిక్స్, సెవన్ అంటూ ఇప్పుడు మళ్లీ మోసాలకు బాబు తయారు. వెలిగించండి ఫోన్లలో టార్చిలైట్లు.. ఇవాళ ఎక్కడైనా లంచాలు అనే మాట వినిపిస్తోందా? 58 నెలల్లో ఎలాంటి వివక్ష లేని పారదర్శక వ్యవస్థలను తెచ్చింది మీ బిడ్డ కాదా? గతంలో పెన్షన్ కావాలంటే లంచం.. సబ్సిడీ లోన్లు కావాలన్నా లంచాలే.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే. మాయలు, మోసాలు చేసి గ్రాఫిక్స్ చూపించేవాడిని ఏమంటాం? ఛీటర్.. మోసగాడనే కదా? మాయలోడు అనేకదా అంటాం. మన ఖర్మ ఏమిటోగానీ ఐదేళ్ల క్రితం ఆ మనిషిని మనం ముఖ్యమంత్రి అని అన్నాం. చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికీ వివరించండి. మోసాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీరంతా సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, వ్యవస్థలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లలో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. జగన్‌కు తోడుగా కోట్ల గుండెలు.. ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా సిద్ధమేనా? జగన్ ఎన్నడూ ఒంటరి కానే కాదు. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం తోడుగా ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో జగనే ఉండాలి.. జగనే రావాలి.. మా బిడ్డే కావాలి అని కోట్ల మంది దీవిస్తున్నారు. ఇంటికే వస్తున్న రూ.3 వేల పెన్షన్ అందుకుంటున్న అవ్వాతాతలు జగన్‌కు తోడుగా ఉన్నారు. అమ్మ ఒడి నుంచి చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నావడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన దాకా ప్రతి ఇంట్లో పథకాలు అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు నా తమ్ముడు, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. బాగుపడ్డ ఆస్పత్రులు, మెరుగైన ఆరోగ్యశ్రీ, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, ఇంటివద్దే పరీక్షలు – మందులు .. వీటన్నిటితో జీవితాలు మెరుగైన పేదలంతా మాకు తోడుగా నిలబడే వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని భావిస్తూ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. జగన్ ఉంటేనే స్కూళ్లు, పిల్లల చదువులు బాగుంటాయని, మరో 10–15 ఏళ్లలో మా బిడ్డలు కూడా పెద్దవారి పిల్లల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఒక్క జగన్ ఉంటేనే క్రమం తప్పకుండా రైతు భరోసా వస్తుందని, గ్రామాల్లో ఆర్బీకేలు పని చేస్తాయని, దళారీలు లేకుండా పంటను అమ్ముకునే పరిస్థితి ఉంటుందని నమ్ముతూ ప్రతి రైతన్నా నాకు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టే ప్రతి ఇంట్లోనూ జగన్‌కు అండగా ఉన్నారు. మరి ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉండగా జగన్ ఒంటరి కానే కాదు. హత్యాయత్నంపై దిగజారుడు వ్యాఖ్యలా? నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం చేయడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. జగనన్నను ఆప్యాయంగా చేయి పట్టుకుని పలకరించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. భగవంతుడి దయ వల్ల సీఎంకు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటుంటే మానవత్వం లేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 60 ఏళ్లకే రూ.3 వేల చొప్పున íపింఛన్లను ఇంటివద్దే అందిస్తున్నందుకు కక్ష గట్టారా? నిరుపేద బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నందుకు కక్షగట్టారా? సీఎం జగన్‌కు కోట్లాదిమంది ఆశీర్వాదం ఉంది. స్వల్ప వ్యవధిలో సీఎం రెండోసారి భీమవరం రావడం సంతోషంగా ఉంది. పశ్చిమ గోదావరిపై ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. – గ్రంధి శ్రీనివాస్, ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే -
చంద్రబాబు, పవన్‌ను ఓ ఆటాడుకున్న సీఎం జగన్..
నిజమే.. కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత సున్నితంగా స్పందిస్తారో కొన్ని అంశాల్లో అయన అంత నిర్దయగా ఉంటారు అని ఒక్కోసారి అనిపిస్తుంది. పేదలు, రోగులు, ఆపన్నులు.. వృద్ధులు, వికలాంగులు ఎదురైతే అయన ఎంతగా ఆర్తిగా అల్లుకుపోతారన్నది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. వేలాదిమంది హాజరయ్యే జనంలో తన కోసం వెతికే కళ్ళు ఎవరివన్నది అయన క్షణంలో గుర్తించి వాళ్ళను తనవద్దకు తీసుకురమ్మని సిబ్బందిని, పోలీసులను ఆయనే పురమాయిస్తారు.. అంటే ఆర్తితో ఉన్నవాళ్లను అయన అంతగా దగ్గరకు తీసుకుంటారు. అదే తనను అవమానించినవాళ్లను, తనను అవహేళన చేసి వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళను, ప్రజలను వంచించేవాళ్ల విషయంలో సైతం అంతే జోరుగా స్పందిస్తారు. ఈ విషయం భీమవరం సభలో మరోమారు రుజువైంది. ఎక్కడా.. ఈ కోశనా.. చంద్రబాబు, పవన్‌లను బంతి ఆట ఆడేసుకున్నారు. దాదాపు గంటసేపు సాగిన ఈ ప్రసంగంలో సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూ లేని రీతిలో ప్రతిపక్షాల మీద విరుచుకు పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను నియంత్రించడం ఫీల్డర్లకు ఎంతటి కష్టమో భీమవరం సభలో జగన్ గళం నుంచి దూసుకొచ్చిన మాటలతూటాలకు సమాధానం ఇవ్వడం అంతకన్నా కష్టం అని ప్రతిపక్ష కూటమికి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టదు. రొయ్యకు మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వస్తాయి.. ఒక చీటర్.. ఒక మోసగాడు.. మాయలోడు.. అనదగిన చంద్రబాబు మన ఖర్మకొద్దీ మొన్నటి వరకు మనకు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇంకా ఈ డెబ్బై ఐదేళ్ల వయసొచ్చినా బుద్దిరాని చంద్రబాబు నామీద రాళ్లు వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. పోనీ ఆయన ఇన్నేళ్ల పాలనలో తనకు, రాష్ట్రానికి ..ప్రజలకు గుర్తుండే పథకం..ప్రాజెక్టు ఒక్కటైనా తీసుకొచ్చారా అంటూ పదేపదే జగన్ వేస్తున్న ప్రశ్నకు ఇంతవరకూ అటునుంచి సమాధానం రాలేదు. ఇక గతంలో అనుభవజ్ఞుడు అంటూ గెలిపించిన చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ప్యారిస్.. లండన్.. సింగపూర్.. మలేషియా అంటూ బొమ్మలు చూపించారు తప్ప.. ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశారా? జిల్లాకో సైబర్ సిటీ కట్టారా? ప్రతి జిల్లాకు బులెట్ రైలు తెచ్చారా? ఉద్యోగాలు తెచ్చారా? పరిశ్రమలు ఏర్పాటు చేశారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా అంటూ బ్రహ్మోస్ మిస్సైళ్ళ మాదిరిగా దూసుకొచ్చిన ప్రశ్నలు జనాన్ని ఆలోచింపజేశాయి. మన ప్రభుత్వంలో తెచ్చినట్లుగా పోర్టులు.. మెడికల్ కాలేజీలు.. ఆర్బీకేలు.. సచివాలయాలు.. ఆస్పత్రులు.. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. వీటిలో ఒక్కటైనా చంద్రబాబు తెచ్చాడా? అలాంటి చేతగాని చంద్రబాబును జాకీలతో లేపడానికి ఎల్లోమీడియాలు ఎంతో ఆరాటపడుతున్నాయి. రాష్ట్రం ఇలా తయారవడానికి చంద్రబాబు, దత్తపుత్రుడితోపాటు ఎల్లోమీడియా బాధ్యత వహించాలి అంటూ అయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. అంతేగాక గతంలో టీడీపీ తీసుకొచ్చిన మ్యానిఫెస్టోను సైతం మళ్ళీ ప్రజలముందుకు తెచ్చి ఒక్కో హామీని విడమర్చి చెబుతూ ఇది చేశారా? ఈ పథకం వచ్చిందా? ఈ ప్రాజెక్టు తెచ్చారా అంటూ ప్రజలనుంచే సమాధానాలు రాబడుతూ స్వైరవిహారం చేసారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నేను గుర్తు చేయడమే నా తప్పా? నేను ఆయన్ను అడగడమే నా నేరమా.. అందుకే నామీద చంద్రబాబు కోపమా అంటూ గూటం దించేశారు. మొత్తంగా భీమవరం సభలో జగన్ ప్రసంగం గతంలో సభలకన్నా కాక పుట్టించింది. మొత్తంగా ప్రతిపక్షాలను ఏకిపారేశారు. ఈ టైప్ పొలిటికల్ బౌలింగుతో అయన చిరుత వేగంతో ప్రత్యర్థుల మీదకు విసిరే యార్కర్లకు అట్నుంచి సమాధానం రావడం కష్టమే. - సిమ్మాదిరప్పన్న -
నా మీద ఎందుకంత కోపం బాబు
-
మీ జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు: వైఎస్ జగన్
-
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు
-
దత్తపుత్రుడిలో కూడా ఈ మధ్య బీపీ కనిపిస్తోంది: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ వైఎస్ జగన్‌ది పేదలపక్షమని.. తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పపశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై నిప్పులు చెరిగారు. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. వీళ్లందరూ నాపై బాణాలు ఎక్కుపెట్టారు. వారి బాణాలు తగిలేవి.. జగన్‌కా? సంక్షేమ పథకాలకా? అని సభకు హాజరైన అవేష జనవాహినిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రసంగం మంచి చేసి మనం.. జెండాలు జతకట్టి వారు.. తలపడబోతున్న ఎన్నికలు ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్తు. ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమే.. దుష్టచతుష్టయ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? నాకేదో అయిపోవాలని చంద్రబాబు ఆరాటం చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువ. నాకేదో అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు రాళ్లు వేయండి.. అంతమోందించండని పిలుపునిస్తున్నాడు. చంద్రబాబును ఆడగకూడని ప్రశ్న అడిగా. అందుకే కోపం ఎక్కువా. బాబు, బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తింటూ మరోవైపు జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకని బాబును అడిగా. చంద్రబాబు పేరు చెబితే.. పేదలకు గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా? ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది కుట్ర మోసం, వెన్నుపోటు నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు దత్తపుత్రుడు భార్యలను మారుస్తున్నాడు ఇప్పుడు నియోజకవర్గాలను సైతం అలవోకగా మారుస్తున్నాడు. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేశాడు దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు అంటారు. దత్తపుత్రా.. ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడటం తప్పు కాదా? ఇదేం అన్యాయం అని దత్తపుత్రుడిని అడిగితే ఆయనకు కూడా ఈ మధ్య బీపీ వస్తుంది.. ఊగిపోతా అంటాడు ఇలా అడిగినందుకు బాబుకు, దత్తపుత్రికిడి, చంద్రబాబు వదినకు కూడా కోపం వస్తుంది. లంచాలు, వివక్ష లేకుండా 2.70 లక్షల కోట్లుపేదల ఖాతాల్లో వేశాం నాడు-నేడు ద్వారా విద్య, వైద్యరంగంలో మార్పులు తీసుకొచ్చాం మీ బిడ్డకు రైతన్న, అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉన్నారు ఇంతమంది తోడుగా ఉన్న మీ జగన్ ఎప్పుడూ ఒంటరికాదు. రొయ్యకు మీసం, బాబు మోసం పుట్టుకతో వచ్చాయి చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, కుట్రలు, పొత్తులతో రాజకీయాలు చేస్తున్నారు దలకు మంచి చేసిన ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి యుద్ధానికి వస్తున్నారు రొయ్యకు మీసం, బాబు మోసం పుట్టుకతో వచ్చాయి చంద్రబాబుకు అభివృద్ధికి అసలు సంబంధమే లేదు విపక్షాలు విసిరే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? ప్రజలకు తగులుతున్నాయా? బాబు వస్తే జాబ్‌లు రావడం కాదు.. ఉన్నవి కూడా ఊగిపోతాయి. సంక్షేమ పథకాలు అందుకున్న వారు నాతో ఉన్నారు. 2014లో రంగురంగుల మేనిఫెస్టో ఇంటింటికీ పంపిణీ చేసిన కూటమి నేతలు హామీలు గాలికొదిలారు జగన్‌కు అనుభవం లేదని. బాబుకు అనుభవం ఉందని ఊదరగొట్టారు ఇదిగో మైక్రోసాఫ్ట్, అదిగో సింగపూర్ అంటూ బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ఇన్ని అబద్దాల తర్వాత చంద్రబాబు సింగపూర్ కట్టాడా?బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? ఒలింపిక్స్ జరిగాయా? జగన్ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్టు కాదా? -
భీమవరం సభకు చేరుకున్న సీఎం జగన్
-
మళ్లీ జగనే.. బాబు వెన్నులో వణుకు.
-
భీమవరంలో పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్
-
దయచేసి పవన్ కు ఓటేయకండి పవన్ పై భీమవరం ప్రజలు సంచలన వ్యాఖ్యలు
-
భీమవరంలో పిల్లాడిని అడిగినా చెప్తాడు..పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే..!
-
పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాస్ వార్నింగ్.