
సాక్షి, భీమవరం: బలుసుపూడిలో కూలేందుకు సిద్ధంగా ఉన్న శ్రీనివాస అపార్ట్‌మెంట్.. తీవ్ర భయాందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. బీటలు రావడంతో తాత్కలికంగా జాకీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ వాసులు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. అపార్ట్‌మెంట్ వాసుల సమస్య విన్న ఎమ్మెల్యే వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇక అపార్ట్‌మెంట్ పిల్లర్లు దెబ్బతిన్నా ఇప్పటి వరకు బిల్డర్ సత్యనారాయణ ఈ సమస్యపై స్పందించలేదు. ఇదిలా ఉండగానే అపార్ట్‌మెంట్‌లో మరో పిల్లర్‌కు బీటలు రావడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇక దీని గురించి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికి బిల్డర్ సత్యానారయణ సోదరుడు ఇంకా ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment