
సాక్షి, పశ్చిమగోదావరి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పవన్‌కు మానసిక జబ్బు ఉందని.. దానికి వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... పిచ్చి కల్యాణ్ నీకు బుర్ర ఉందా లేదా పిచ్చి పట్టిందా అని ప్రశ్నించారు. ‘సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిగా పవన్ గుర్తించడట. పవన్ నీకు అసలు రాజ్యాంగం గురించి తెలుసా. ఎవరిని అవమానిస్తున్నావో తెలుసా. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 51 శాతం ప్రజలు వైఎస్ జగన్‌కు ఓటేసి గెలిపిస్తే ముఖ్యమంత్రిగా అంగీకరించనంటావా. రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను దారుణంగా అవమానించావు. దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పు’అని పవన్ కల్యాణ్‌ను డిమాండ్ చేశారు. ‘నీకు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు పవిత్రులు. వైఎస్సార్సీపీలో గెలిచిన వారు అపవిత్రులా’ అని ప్రశ్నించారు.
సిగ్గు రాలేదు.. రోజురోజుకీ..
దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా గ్రంథి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ‘తల్లులను, స్త్రీలను గౌరవించని వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేరాఫ్ అడ్రస్ జనసేన. ఆంధ్రప్రదేశ్‌కు దరిద్రం పట్టిందనడానికి జనసేన పార్టీ ఓ నిదర్శనం. నిన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్లు అసభ్యకరమైన, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. నువ్వు పోటీ చేసిన రెండుచోట్లా నీ పిచ్చి, తిక్క, లెక్క మాకు వద్దంటూ ప్రజలు నిన్ను తరిమికొట్టారు. అయినా నీకు సిగ్గురాలేదు. రోజురోజుకూ దిగజారిపోతున్నావు. పవన్ నీకేమైనా మైండ్ దొబ్బిందా’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన గ్రంథి శ్రీనివాస్ పవన్ కల్యాణ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక గాజువాకలోనూ జనసేన అధినేత ఓటమి మూటగట్టుకున్నారన్న విషయం విదితమే.(దిశ కేసు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు)