grandhi srinivas
-
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు గ్రంధి శ్రీనివాస్ కౌంటర్
-
పవన్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోంది
-
పవన్ కు మంచి బుద్ధి పుట్టించాలని దేవుడిని కోరుతున్నా: గ్రంధి శ్రీనివాస్
-
ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగనే మళ్లీ వస్తారు: గ్రంధి శ్రీనివాస్
-
భీమవరంలో పిల్లాడిని అడిగినా చెప్తాడు..పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే..!
-
పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాస్ వార్నింగ్.
-
పవన్ ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయించాలి...!
-
పవన్ కళ్యాణ్ కు ఒక అభిమానిగా చెప్తున్నా.. ఎమ్మెల్యే గ్రంధి
-
పవన్ తోక వంకర..!
-
దమ్ముంటే పులివెందులో పోటీ చెయ్
-
సొంత అన్ననే స్విచ్ ఆఫ్ చేసి కూర్చో పెట్టాడు: గ్రాంధి శ్రీనివాస్
-
పవన్‌కు మానసిక చికిత్స అవసరం: గ్రంధి శ్రీనివాస్
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం. పవన్ మానసిక స్థితి ఆశ్చర్యం కలిగిస్తుందని సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బుధవారం ఉదయం గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ నన్ను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్‌కు నామీదు ఎందుకంత అసూయ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గత నెలలో భీమవరం వచ్చి నామీద ద్వేషం లేదన్నాడు. ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడు. తాను స్థలం కొందామంటే నేను అడ్డుకున్నానని అంటున్నాడు. పవన్ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఎక్కడ ఉన్నారు?. చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 21 సీట్లు తీసుకున్నావ్. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నావు. జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వదంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే భాష ఏంటి?. నీకు ఎకరం స్థలం కావాలా?. నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను. మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులకు కనీసం సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు. మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం పవన్ సీఎం అంటూ వారు అరుస్తున్నారు. ఇప్పటికే 21 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరుగబడుతుంది. నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో అంటూ హితవు పలికారు. సౌమ్యుడు, వివాదరహితుడైన చిరంజీవికి.. పవన్‌కు అసలు పోలికే లేదు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారు. పవన్‌కు లాగా సంస్కారం లేక విమర్శలు చేయలేక రాజకీయాల నుండివెళ్ళిపోయారు. మరో సొంత అన్న నాగబాబుకి కూడా పవన్ అన్యాయం చేశారు. 2019లో ఓటమి తర్వాత పవన్ మళ్లీ భీమవరం వైపు చూడలేదు. కోవిడ్ సమయంలో కూడా ఇక్కడి ప్రజల్ని ఏమయ్యారో అని పట్టించుకోలేదు. భీమవరం ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో పవన్ తెలుసుకోవాలి. నేను రౌడీనని పవన్ అంటున్నారు. మరి నా మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు కదా? అని జనసేన అధినేతను గ్రంధి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కంఠస్తం పట్టి మాట్లాడుతున్నాడు. కోవిడ్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా మీరు?. సినీ ఇండస్ట్రీకి చెందినవారు రాజకీయాల్లో ఇమడలేరు. నేను ఎమ్మెల్యేగా ఉండగానే పెద్ద పెద్ద సంస్థలన్నీ భీమవరం వచ్చాయి. వాటిని నా చేతులతో ప్రారంభించాను. అభివృద్ధి, నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్నాను. భీమవరం జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవి సైతం వదులుకున్నాను. 100 పడకల ఆసుపత్రి కోసం మా కుటుంబానికి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఇచ్చాను. ఇప్పటివరకు 185 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొలేకనే చంద్రబాబు కూటమితో వస్తున్నాడు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారు. కరోనా సమయంలో కూడా పేదలకు సంక్షేమ పథకాలు చేరువ చేశారు. చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో ఇచ్చిన వెబ్సైట్ నుంచి తొలగించాడు. చంద్రబాబు ఎన్నికల ముందు దండాలు పెట్టి ఎన్నికల తర్వాత పంగనామాలు పెడతారని ప్రజలకు తెలుసు. ప్రజలు సీఎం జగన్ వెంట ఉన్నారు. కూటమికి అధికారం వచ్చే ఛాన్స్ లేదు. అవినీతికి తావు లేకుండా పేదల గడప వద్దకు సంక్షేమాన్ని చేరువ చేశారు. నిలకడ లేని మాటలు పూనకాలు వచ్చే ప్రసంగాలతో పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ మానసిక స్థితి బాలేదు. ముద్రగడ పద్మనాభం ఇంటిని 5,000 మంది పోలీసులు మొహరించి.. వారి కుమారుడిని కొట్టుకుంటూ తీసుకువెళ్లి వారి భార్యను అనకూడని మాటలంటే నాడు ఆయనకు ఎందుకు సంఘీభావం తెలపలేదు. వంగవీటి రంగాను హత్య చేసిన వారితో పవన్ చేతులు కలిపారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని హరిరామజోగయ్య సలహాలు ఇస్తే ఆయన్ను కూడా అవమానించిన వ్యక్తి పవన్. చంద్రబాబుకు పవన్ బానిసలా మారిపోయారు. పవన్‌కు సంబంధించి చంద్రబాబు దగ్గర ఏ వీడియోలు ఉన్నాయో.. ఎంత ప్యాకేజీ ఇస్తున్నాడో.. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ స్థాయి దిగదారి నన్ను విమర్శలు చేస్తున్నారు అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకున్న రామాంజనేయులును కృష్ణాజిల్లా నుంచి తరిమికొడితే ఇక్కడికి వచ్చారు. తరిమికొడితే పారిపోయే వ్యక్తిని కాదు నేను.. చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాను. ప్రజల ఆశీర్వాదంతో ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పనిచేశాను. వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో సీఎం జగన్ ఆశీస్సులతో సంక్షేమ పాలన అందిస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి జగన్ వల్ల మీ ఇంట్లో మేలు జరిగిందా లేదా?. మీరు పార్టీ, కులం వదిలి సీఎం జగన్‌ను బలపరచండి’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా: గ్రంధి శ్రీనివాస్
సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమైనట్టు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఆధారాలు లేకుండా తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని తన పరువుకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి చెత్త రాతలు రాసిందన్నారు. వారి రాతలపై కోర్టు వచ్చి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాగా, గ్రంధి శ్రీనివాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రైతులకు సొంత డబ్బు ఇచ్చి పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చాము. నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలంటే 180 ఎకరాల భూమి కావాలి కానీ 75 ఎకరాల భూమిని దొరికింది. ఆంధ్రజ్యోతి పత్రికలో భూములు ఎక్కువ ధరలు ఇచ్చేసారని మా బంధువులకు తొమ్మిది కోట్ల రూపాయలు లాభం పొందామని అక్రమాలు చేశామని తప్పుడు రాతలు రాసుకొచ్చారు. మా పరుపుకి భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి రాతలు రాసింది. కనీసం కామన్ సెన్స్ లేకుండా బురద చల్లాల్నే రాతలు రాస్తున్నారు. ప్రజలకు సేవ చేయడం నేరమా?.. వంద పడకల ఆసుపత్రికి నాలుగు ఎకరాలు మా సొంత భూమి ఇచ్చాము. జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం మా సొంత భూమి ఇచ్చాము. నన్ను డామేజ్ చేయాలని ఎన్నో అవాస్తవాలను రాసింది. ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. పూర్తి ఆధారాలతో కోర్టుకి వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నాము. లేఅవుట్స్, మట్టి పూడికలు, బిల్డింగ్ పర్మిషన్ల అంశంలో నా ప్రమేయాలు ఉన్నట్లు వక్రీకరించారు. ప్రజలకు మేము సేవ చేయడం నేరమా?. వారు మా దగ్గరికి వచ్చి అడగటం నేరమా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు ప్లాట్లు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్లు జరగకపోతే వారి తరఫున నిలబడితే దీన్ని కూడావక్రీకరించారు. ప్రజలకు మంచి చేస్తున్నాము కాబట్టే.. ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఎల్లో మీడియాకు బాబు స్కామ్‌లు కనిపించవా? చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 850 ఎకరాల్లో లక్ష కోట్ల కుంభకోణం చేశాడు. దీనిపై సీబీఐ విచారణ వేయమంటే మాకు సిబ్బంది లేరు అని నాడు వారు చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడో అది ఆంధ్రజ్యోతికి కనపడదు. చంద్రబాబు అవినీతి లక్ష కోట్ల కుంభకోణం మీద ఎక్కడైనా రాశారా?. ఎల్లో మీడియా రైతులు, పేదల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా రాతలు రాస్తుంది. చంద్రబాబును గద్దెనెక్కించడం కోసం.. అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా పనిచేసే మాలాంటి వారిని అల్లరి చేయాలని చూస్తున్నారు. దగా, వెన్నుపోటు, కుట్ర రాజకీయాలకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ప్రజలను మోసం చేయడం, దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడం.. వారికి పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు మామూలే. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే 23 సీట్లు కూడా రావని చంద్రబాబుకు తెలిసింది. అందుకే అందరితో పొత్తులు పెట్టుకుంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన నిలుస్తూ పొత్తులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. చెప్పాడంటే చేస్తాడు.. అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీకు ఇక సినిమా షూటింగ్ లే.. పవన్ పై ఎమ్మెల్యే గ్రంధి సెటైర్లు
-
పవన్ భీమవరం పర్యటన... ఏకిపారేసిన ఎమ్మెల్యే గ్రంధి
-
పురందేశ్వరిపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
-
పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు గ్రంధి శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్
-
టిడ్కో ఇళ్ళలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు
-
జనసైనికులను కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
-
పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
-
పవన్, లోకేష్ పై గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు
-
పక్కా ప్రణాళికతోనే భీమవరంలో టీడీపీ గూండాల దాడి
-
నారా లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. చదవండి: భీమవరంలో మరో పుంగనూరు.. -
‘ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకే బాబు అరాచకం’
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే చంద్రబాబు లక్ష్యమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, పుంగనూరులో చేసిన అరాచకాన్నే భీమవరంలో చేశారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఎంత ప్రయత్నించినా తన పాదయాత్రకు ఎలాంటి స్పందన లేకపోవటం, మరోవైపు తండ్రి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులతో దిక్కుతోచక ఉక్కిరి బిక్కిరి అవుతున్న లోకేశ్, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. తాజాగా ఉంగుటూరులో టీడీపీ గుండాలు చేసిన అరాచకాలు అందరూ చూశారు. సంయమనం పాటించాం లోకేశ్ పాదయాత్రతో రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలు మా పార్టీ ఫ్లెక్సీ చింపేసినా, మేం సంయమనం పాటించాం. పూర్తి సహనంతో ఉన్నాం. భీమవరంలో మా పార్టీ ఆరు నెలల క్రితం పేదలకు, పెత్తందారులకు పోరాటం పేరుతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. భీమవరంలోకి లోకేశ్ ప్రవేశానికి ఒక రోజు ముందు టీడీపీ గూండాలు ఆ ఫ్లెక్సీపై రాళ్లు వేశారు. చింపేశారు. అందుకు ఈ పోటోనే సాక్ష్యం.. అంటూ ఒక ఫోటో చూపారు. ఆ విధంగా శాంతిభద్రతల సమస్యలు çసృష్టించి మమ్మల్ని రెచ్చగొట్టాలని టీడీపీ ప్రయత్నం చేసినా, మేం పూర్తి సంయమనం పాటించాం. నిజానికి మేం తల్చుకుంటే టీడీపీకి చెందిన ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండేది కాదు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకో భీమవరం ప్రజల మనస్సు గెలిచి నేను ఎమ్మెల్యేను అయ్యాను. నీలా దొడ్డిదారిన ఎమ్మెల్సీని అయి, మంత్రి పదవి చేపట్టలేదు. మా ఫ్లెక్సీ చింపేసినా, మేము మౌనంగా ఉండడం లోకేశ్‌కు మింగుడు పడలేదు. దీంతో మాటలు, అసభ్య పదజాలంతో మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను గజదొంగ, క్యాన్సర్ గడ్డ అంటూ లోకేశ్ నోరు పారేసుకున్నాడు. లోకేశ్ ఇకనైనా తగ్గు. నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అవెక్కడున్నాయో చూపాలి భీమవరంలో లోకేశ్ పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్. యాత్రకు ఎక్కడా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. పట్టుమని 500 మంది కూడా యాత్రలో పాల్గొనలేదు. దీంతో వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బులతో జనాన్ని పోగేశారు. అయినా, స్థానిక ప్రజలు పట్టించుకోకపోవడంతో.. నేను గజదొంగనని, అవినీతి పరుడ్ని అని, రూ.52 కోట్లు దోచుకున్నానని, వంద ఎకరాల భూమిని ఆక్రమించుకున్నానని, ఇంకా భూదందాలు చేస్తున్నానని లోకేశ్ పిచ్చిపిచ్చిగా వాగాడు. రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నట్లు లోకేశ్ పప్పు మాత్రమే కాదు. అతడొక సన్నాసి. నీవు ఆరోపించిన ఆ రూ.52 కోట్లు, 100 ఎకరాల భూమి ఎక్కడున్నాయో చూపించు. నేను లోకేశ్ మాదిరిగా అడ్డగోలు సంపాదనతో కాకుండా, అప్పు చేసి స్థలాలు కొన్నాను. ఈరోజు లోకేశ్ పక్కన కూర్చున్న చాలా మంది దొంగనోట్ల మార్పిడి చేసి కోట్లు సంపాదించారు. ఈ విషయం భీమవరంలో చాలా మందికి తెలుసు. ఎవడు రాసిచ్చాడో తెలియదు కానీ.. లోకేశ్ నాపై పిచ్చి ఆరోపణలు చేశాడు. ఆ రూ. 52 కోట్లు ఎక్కడున్నాయో లోకేశ్ చెబితే, ఆయన ఫోటోకు దండేసి, రెండు అరటిపళ్లు, నాలుగు అగరబత్తులతో దండం పెట్టుకుంటాను. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నా: నేను భీమవరంలో ప్యాలెస్ కట్టుకుంటున్నానని లోకేశ్ ఆరోపించాడు. చంద్రబాబుకు, లోకేశ్‌కు మాత్రమే ఇళ్లు ఉండాలా? మాలాంటి వాళ్లకు ఉండకూడదా? నేను ఉంటున్న ఇళ్లు నాది కాదు. మా తాత మా తమ్ముడికి రాసిచ్చారు. తమ్ముడి ఇంట్లో ఉంటున్నాను. రెండో తమ్ముడు నాకు కొంత భూమి దానంగా ఇస్తే బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. వారే అభివృద్ధికి శాపం నిజానికి ఇక్కడ అభివృద్ధి పనులకు టీడీపీనే ఒక శాపంలా మారింది. ఆ పార్టీ నాయకులే భీమవరం అభివృద్ధికి అడ్డంకులు సృష్టించారు. టీడీపీ నుంచి 5 ఏళ్లు ఎంపీగా (రాజ్యసభ సభ్యురాలిగా) పని చేసిన ఆమె, కనీసం తన ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేక పోయింది. మున్సిపాలిటీలో 10 ఏళ్లు ఆ పార్టీనే అధికారంలో ఉన్నా, ఊరి కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదు. చివరకు ఛైర్మన్ కనీసం ఇంటి ముందు కూడా రోడ్డు వేయించుకోలేకపోయాడు. భీమవరంలో నీటి సరఫరా కోసం చినమెరం ప్రాంత రైతుల నుంచి భూసేకరణ మొదలుపెడితే టీడీపీ వారే అడ్డుపడ్డారు. ఆ భూములు ప్రభుత్వానికి అప్పగిస్తే.. డబ్బులు రావని టీడీపీ నాయకుడు తన పేరు మీద రాయించుకున్నారు. తర్వాత ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించకుండా భీమవరం మండలానికి తాగునీటి సమస్య వచ్చేలా చేసింది టీడీపీ నాయకుడే. పట్టణంలో కంపోస్టు యార్డు కోసం 10 ఎకరాలు సేకరిస్తే, ఆ పక్కనే 50 ఎకరాలు తక్కువ ధరకు కొట్టేసిన టీడీపీ నాయకులు, ఆ తర్వాత కోర్టులో కేసు వేసి, కంపోస్టు యార్డు ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారు. ఇవన్నీ తెలిసినా, లోకేశ్ మాత్రం మమ్మల్నే నిందిస్తూ భీమవరంలో కంపోస్టు యార్డు ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించడం సరికాదు. ఇవీ మేం చేసిన అభివృద్ధి పనులు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, భీమవరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కంపోస్టు యార్డు కోసం సేకరించిన భూమి అన్యాక్రాంతమైతే, అందులో 6 ఎకరాల 60 సెంట్లు తిరిగి స్వాధీనం చేసుకున్నాం. 60 ఎకరాల్లో సమ్మర స్టోరేజీ ట్యాంక్ ఏర్పాటు చేశాం. టిడ్కో ఇళ్లకు బకాయి పెట్టిపోతే, ఆ సంస్థ పనులు పూర్తి చేయలేదు. దీంతో రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్లీ టెండర్లు పిల్చి, పనులు అప్పగించాం. దీని వల్ల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. టిడ్కో ఇళ్లూ పూర్తవుతున్నాయి. నాడు మహానేత వైఎస్ఆర్ హయాంలో సేకరించిన భూముల్లోనే మా ప్రభుత్వం టిడ్కో ఇళ్లు కడుతోంది. వాటిని పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించబోతున్నాం. రూ.2 కోట్లతో ఓల్డ్ యనమలదుర్ర డ్రైయిన్ నిర్మాణం, సోమగుండం ఔట్లెట్, సోమగుండం చెరువు అభివృద్ధి చేశాం. తాడేరు బ్రిడ్జిని యుద్దప్రాతిపదికన పూర్తి చేశాం. యనమలదర్రు డ్రైయిన్ మీద అప్రోచ్ బ్రిడ్జిలకు త్వరలో రూ.32 కోట్లతో టెండర్లు పిలిచి రోడ్లకు అనుసంధానం కార్యక్రమం చేస్తున్నాం. భీమవరానికి జిల్లా కేంద్రాన్ని తెచ్చాం. వారే దాడి చేసి.. మాపై ఎదురుదాడి టీడీపీ గూండాలు ఇళ్లలోకి వెళ్లి వృద్ధులు, మహిళలపై దాడి చేశారు. మా పార్టీకి కంచుకోట అయిన ఇందిరమ్మ కాలనీపై టీడీపీ గూండాలు దాడి చేశారు. మా పార్టీ అభిమానులు జెండాలు పట్టుకుంటే వాటిని లాక్కొని దహనం చేసి.. కాళ్లతో తొక్కి.. వారి ఇళ్లలోకి ప్రవేశించి దాడులకు తెగబడ్డారు. రాళ్లతో దాడులు చేశారంటూ.. ఇలాంటి గులకరాళ్లు ఈ ప్రాంతంలో ఉంటాయా?.. అంటూ వాటిని చూపారు. వ్యాన్లలో రాళ్ల బస్తాలు పెట్టుకొచ్చిన టీడీపీ గుండాలు, ప్రజల ఇళ్లపై దాడి చేశారంటూ.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వీడియోలు ప్రదర్శించారు.ఆ విధంగా యథేచ్ఛగా దాడి చేసిన టీడీపీ గుండాలు.. మమ్మల్ని నిందిస్తూ, మాపైనే ఎదురుదాడికి దిగారు. ఎప్పుడూ శాంతియుతంగా ఉండే భీమవరంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మీడియా అండగా ఉందని.. మీడియా ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? లోకేశ్ నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా జిల్లా దాటిపోవు. ఇక ఎల్లో మీడియా కూడా పచ్చిగా వాస్తవాలు వక్రీకరిస్తోంది అంటూ.. తమ పార్టీ ఫ్లెక్సీపై ఎవరు రాళ్లు విసిరి, చింపేశారో చూడండి అంటూ.. ఆ ఫోటోలు చూపిన ఎమ్మెల్యే.. వాళ్లు ఎవరో చెప్పాలని ప్రెస్మీట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులను ప్రశ్నించారు. చదవండి: భీమవరంలో మరో పుంగనూరు.. -
భీమవరంలో మరో పుంగనూరు..
సాక్షి, భీమవరం / భీమవరం (ప్రకాశంచౌక్): నిన్న రాయలసీమ.. నేడు పచ్చని సీమ! అక్కడ చల్లా బాబు.. ఇక్కడ చింతమనేని..!! యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయాయి. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారి నుంచి తప్పించుకొని స్థానికంగా ఉన్న ఇళ్లలో తలదాచుకున్నా వదలకుండా వెంటాడారు. మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ దారుణంగా కొట్టారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ నేరుగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపైకి వెళ్లి దాడులకు పురిగొల్పారు. ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో దళితులు నివసిస్తుండటం గమనార్హం. యువగళంలో ఒక టీమ్ ఆ ప్రాంతాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తూ దూరంగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల గురించి టీడీపీ శ్రేణులకు సమాచారాన్ని చేరవేసింది. దీంతో రౌడీమూకలు అక్కడకు చేరుకుని దాడులకు తెగించాయి. రెచ్చగొట్టి.. రచ్చ చేసి లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. వన్‌టౌన్ సీఐ అడబాల శ్రీను, ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో వారిని వారించగా తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు సహనంతో వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కాగా, బహిరంగ సభ కోసం టీడీపీ నాయకులు మహిళలకు రూ.300, పురుషులకు రూ.500 చొప్పున ఇచ్చి జనాన్ని తరలించారు. భీమవరంతో పాటు పాలకోడేరు, కుముదవల్లి, శృంగవృక్షం, వీరవాసరం తదితర ప్రాంతాల నుంచి ఆటోలు ఏర్పాటు చేసి వృద్ధులను సైతం డబ్బు ఆశ చూపి లోకేశ్ సభకు తీసుకొచ్చారు. లోకేశ్ ప్రసంగం ప్రారంభించగానే వారంతా వెనుదిరిగారు. ముగ్గురు పోలీసుల తలలకు తీవ్ర గాయాలు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను టీడీపీ రౌడీ మూకలు తీవ్రంగా గాయపరిచాయి. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి దిగడంతో వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, టూటౌన్ కానిస్టేబుల్ రమేష్‌తో పాటు మరో కానిస్టేబుల్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతర పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరికి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాదయాత్రలో తనతో పాటు రౌడీ గ్యాంగ్‌ను వెంటేసుకుని తిరుగుతున్న లోకేశ్ తీరును ప్రశాంతతకు నిలయమైన భీమవరం ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర ఎవరి కోసమని మండిపడుతున్నారు. కానిస్టేబుళ్లు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శ టీడీపీ రౌడీ గ్యాంగ్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు, కార్యకర్తలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శించారు. లోకేశ్ పాదయాత్రకు బందోబస్తుగా ఉన్న పోలీసులపై సైతం దాడి చేసి తీవ్రంగా గాయపరచటాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయన్నారు. కవ్వింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత పవన్‌కు ఉందా?: గ్రంధి శ్రీనివాస్ ఫైర్
సాక్షి, పశ్చిమ గోదావరి: జనాలను మోసం చేసే పార్టీ జనసేన అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. పేదలు సుఖంగా ఉంటే పవన్ కల్యాణ్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ముద్రగడను చంద్రబాబు ఏ రకంగా హింసించారో నీకు తెలియదా? అని పవన్‌ను ప్రశ్నించారు. కాగా, గ్రంధి శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ. పవన్ ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మహోన్నతుల పేర్లు ఉచ్చరించి నీచమైన రాజకీయం చేస్తున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత పవన్‌కు ఉందా?. ముద్రగడను చంద్రబాబు ఏ రకంగా హింసించారో నీకు తెలియదా?. పవన్ కుటిల రాజకీయం గమనించి 2019లోనే ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబు మీకోసం భీమవరంలో సభ పెట్టలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు -
పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలు చేస్తున్నారు
-
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై గ్రంథి శ్రీనివాస్ ఫైర్
-
చంద్రబాబు పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
-
ఎమ్మెల్యే గ్రంధిని కలిసిన శ్రీనివాస అపార్ట్మెంట్ వాసులు
సాక్షి, భీమవరం: బలుసుపూడిలో కూలేందుకు సిద్ధంగా ఉన్న శ్రీనివాస అపార్ట్మెంట్.. తీవ్ర భయాందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. బీటలు రావడంతో తాత్కలికంగా జాకీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. అపార్ట్మెంట్ వాసుల సమస్య విన్న ఎమ్మెల్యే వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక అపార్ట్మెంట్ పిల్లర్లు దెబ్బతిన్నా ఇప్పటి వరకు బిల్డర్ సత్యనారాయణ ఈ సమస్యపై స్పందించలేదు. ఇదిలా ఉండగానే అపార్ట్మెంట్లో మరో పిల్లర్‌కు బీటలు రావడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇక దీని గురించి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికి బిల్డర్ సత్యానారయణ సోదరుడు ఇంకా ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. -
ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు.. కానీ
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు కానీ.. రాజకీయాల్లో అలా కుదరదన్నారు. విలువలు, సిద్ధాంతాలు ఉంటాయని హితవు పలికారు. మొన్నటి దాకా కమ్యూనిస్ట్ పార్టీలను పవన్ కల్యాణ్ మోసం చేశారని.. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని మండిపడ్డారు. బాబు, పవన్ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. చదవండి: మిగిలింది.. ఒకటే జెండా, ఒకటే అజెండా ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..? -
పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ
సాక్షి, భీమవరం: భీమవరం అర్బన్ బ్యాంకును దోచేశానని, తానొక ఆకు రౌడీనంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పవన్‌కల్యాణ్ స్టేట్‌రౌడీ మాదిరిగానూ, జనసైనికులు ఆకు రౌడీలుగానూ ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఓ సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ వాళ్ల తలలు తీస్తానని, మెడమీడ తలకాయలుండవని మాట్లాడిన వీడియోలను శ్రీనివాస్ మీడియా ఎదుట ప్రదర్శించారు. భీమవరం అర్బన్ బ్యాంకును దోచేశానని చెబుతున్న పవన్ తన మిత్రుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపై ఎందుకు కేసులు పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్ మానసిక రోగి అని, అందువల్లనే చిన్నతనంలోనే అనేకసార్లు ఆత్మహత్యాయత్నాలు చేశాడని విమర్శించారు. మత్స్యపురి గ్రామంలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో నివేదిక తెచ్చుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందన్నారు. -
'అవినీతికి, అక్రమాలకు చంద్రబాబు పెట్టింది పేరు'
సాక్షి, పశ్చిమగోదావరి: అవినీతికి, అక్రమాలకు చంద్రబాబు పెట్టింది పేరని, తన పాలనలో రెండు లక్షల కోట్లు దోచుకున్నాడంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అమరావతి భూ కుంభకోణానికి పాల్పడిన వారందరిని కఠినంగా శిక్షించాలి. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ నాలుగు వందల ఎకరాల భూములను ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు పొందాడు అంటే ఏజీ వెనుక చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. అమరావతి భూములను దళిత, పేద రైతుల నుంచి బలవంతంగా తీసుకొని భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణకు అమరావతిలో వేలాది ఎకరాలు తక్కువ ధరకే కేటాయించడం వెనక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. అవినీతి, అక్రమాలు, వెన్నుపోట్లుకు చంద్రబాబు పెట్టింది పేరు. అందుకునే రెండు ఎకరాల ఆసామి లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని అసమర్ధుడు నారా లోకేష్ దొడ్డిదారిన శాసనమండలికి వెళ్లి, ప్రతి అవినీతి వెనక ఉండి కోట్లు సంపాదించి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. కానీ అవినీతిపరుడైన చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అని గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ('అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది') వారిని కఠినంగా శిక్షించాలి: వీఆర్ ఎలీజా అమరావతి భూ కుంభకోణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే 4వేల పైచిలుకు భూములను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కొనుగోలు చేశారు. ఈ భుముల ద్వారా లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే టీడీపీ నాయకులు బినామీల పేర్లతో కొన్నారు. అమరావతి పేరిట 900 ఎకరాల భూములను దళిత, పేద రైతుల నుంచి బలవంతంగా తీసుకొన్నారు. 900 ఎకరాలు తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం చాలా దారుణమన్నారు. భూకుంభకోణానికి పాల్పడిన ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్షించాలని ఎమ్మెల్యే ఎలీజా కోరారు. (కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి) భూకుంభకోణంపై ఏసీబీ కేసు హర్షించదగిన విషయం: కొట్టు సత్యనారాయణ అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హర్షించదగిన విషయమని తాడేపల్లిగూడెంశాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ అన్నారు. 'అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తూనే ఉంది. రాజధాని పేరుమీద వేలకోట్లు తెలుగుదేశం నాయకులు దోపిడీ చేశారు. పూలింగ్ వ్యవస్థను తెలుగుదేశం నేతలు అపహాస్యం చేశారు. 900 ఎకరాల అసైన్డ్ భూములు దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన దుర్మార్గులు చంద్రబాబు అండ్ కో. సీఆర్డీఏ పరిధిని ఇష్టమొచ్చినట్లు మార్చేసి రాజధాని ప్రకటనకు ముందే 4,075 ఎకరాలు టీడీపీ నాయకులు కొనుగోలు చేశారు. కచ్చితంగా రాజధాని భూముల్లో చేసిన అక్రమాలు బయటపడతాయి. ఖచ్చితంగా అక్రమాలు చేసిన ప్రతిఒక్కరూ జైలుకి వెళ్లడం ఖాయం' అని సత్యనారాయణ పేర్కొన్నారు. -
'అజ్ఞాతవాసి ఇకనైనా కళ్లు తెరువు'
సాక్షి, ఏలూరు: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్రలను సమాధి చేసిన శుభదినం. రాజధాని ఎప్పటికీ మారదు మారదు అంటూ చంద్రబాబుకు వంత పాడిన పవన్ కల్యాణ్‌కి ఇది దుర్దినం. ప్రజలకు శుభదినం. మూడు రాజధానులు ప్రజల కోరిక. మూడు ప్రాంతాల అభివృద్ధి విజ్ఞులు ఆలోచన. ఇకనైనా అజ్ఞాతవాసి ట్విట్టర్ నివాసి పవన్ కల్యాణ్ కళ్లు తెరువు అని గ్రంధి శ్రీనివాస్ హితువు పలికారు. రాష్ట్ర ప్రజల విజయం: కొట్టు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష పరిపాలన వికేంద్రీకరణగా మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం ఎంతో శుభసూచకమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేయడం ఎంతో ఆనందదాయకం. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతం కావటం రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారు. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని ఈ రోజు గవర్నర్ నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రముఖమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనడంలో ఎలాంటి సందేహం లేదని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్టానికి శుభదాయకం: ఎంపీ భరత్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతో పాటు.. రెండు రాజధానుల నడుమ ఉన్న గోదావరి జిల్లాలు కూడా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. వెనుకబడిన 3 ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు 4 రాయలసీమ జిల్లాలు కూడా రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు ఈ నిర్ణయం వెలువడటం రాష్టానికి శుభదాయకం అని మార్గాని భరత్ తెలిపారు. కృష్ణా: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందునునట్లు ఉదయభాను వివరించారు. -
పార్టీలు మారడం ఆయన నైజం
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల్లో ఆయనకు అంతపేరు ప్రఖ్యాతలు ఉంటే.. ఆయనే సొంతపార్టీ పెట్టుకుని పోటీ చేయాలన్నారు. పార్టీని కాకుండా తనను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజుకు, నరసాపురం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు కంటే ఎందుకు తక్కువగా ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన రోజు గోడ ఎందుకు దూకారో మోదీకి చెప్పాలన్నారు. తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టంతోనే గెలిచామని మంత్రి పేర్కొన్నారు. తమది టీడీపీ, బీజేపీ లాంటి పార్టీ కాదని, రఘురామకృష్ణంరాజు పప్పులు ఇక్కడ ఉడకవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు : మంత్రి శ్రీరంగనాథరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కేబినెట్లో చోటు కల్పించారని ప్రశంసించారు. ఎంపీ రఘురామకృషంరాజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదు వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేశారు కాబట్టే రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. రఘురామ కృష్ణంరాజు ఏ మాత్రం పద్దతిగా మాట్లాడడం లేదని విమర్శించారు. నరసాపురంలో ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదని ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణంరాజు గతం మర్చిపోయారు: ఎమ్మెల్యే గ్రంధి ఎంపీ రఘురామకృషంరాజు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. గతంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, జిల్లా నేతలంతా సీఎం జగన్‌ను కలిసి విన్నవిస్తే.. రఘురామకృష్ణంరాజును మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఆయన ఎంపీగా గెలిచారన్నారు. టిక్కెట్ కోసం మూడు పార్టీలు మారిన వ్యక్తి .. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. -
భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోటి 82 లక్షల 4వేల 312 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని భీమవరం ప్రజల తరపున సీఎంకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీసివాస్ పేర్కొన్నారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. -
ప్రజలంతా భౌతిక దూరం పాటించాలి: గ్రంధి శ్రీనివాస్
-
‘ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు ఆగిపోతాయి’
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికలు జరగకపోతే రూ. 5 వేల కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావనే విషయాన్ని ఇతర పార్టీలు గుర్తుంచుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు ఆగితే పశ్చిమ గోదావరి జిల్లా భారీగా నష్టపోతుందన్నారు. సకాలంలో ఎన్నికలు జరగకపోతే మే నెలలో రైతులకు సాగునీటి కోసం ఇరిగేషన్ పనులు ఎలా చేస్తారని, వేసవిలో తాగు నీటికి నిధులు ఎలా ఇస్తారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీ, జనసేన పార్టీలను ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్నికలను 6 వారాల పాటు నిలిపివేయడం వెనక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హస్తం ఉందని విమర్శించారు. పక్కా ప్లాన్‌తో మాచర్లలో బుద్దా,బొండా ఎంట్రీ కాగా.. రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక ఇవ్వడం జరిగిందని గ్రంధి తెలిపారు. కరోనా వైరస్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికైనా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరిగేలా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్‌ను ఆయన కోరారు. రాజమండ్రి కో ఆర్డినేటర్ శివరామ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రమేష్ కుమార్ అనే బుచిని చూసి ఎన్నికలను ఆపగలిగారు తప్ప.. ప్రజల మనసును టీడీపీ ఎప్పటికీ గెలవలేదని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైఎస్సార్ సీపీదే అన్నారు. టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి వయసుకు తగ్గ రాజకీయాలు చేయాలని హితవుపలికారు. బీజేపీ మధ్యప్రదేశ్‌లో ఒక రకమైన న్యాయం.. ఆంధ్రలో మరోకలా న్యాయం పాటిస్తుందని ఆయన మండిపడ్డారు. -
రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుంది
-
పవన్‌కళ్యాణ్ అవకాశవాది
-
ఆయన నుంచి ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టే..
సాక్షి, భీమవరం: టీడీపీ కర్ర పత్రాలుగా ఎల్లో మీడియా పనిచేస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అంశంపై పదేపదే మీడియా ముందుకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఏమయ్యారని ప్రశ్నించారు. తన మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ శాఖ దాడులు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మీడియా ముందుకు రాలేదన్నారు. చంద్రబాబు నుంచి ఆర్థికంగా ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఐటీదాడులపై నోరు మెదపడం లేదన్నారు. (ఐటీ దాడులపై వారు నోరు మెదపరేం..!) చంద్రబాబు భజనపరులు తమ నాయకుడి మెప్పు కోసం ఐటీదాడులపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. దేవినేని ఐటీ దాడులు గురించి మాట్లాడకుండా బొత్సపై విమర్శలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజం కోసం మీడియా పనిచేయాలని..కానీ అవినీతి ఆధారాలు లభ్యమైన కూడా చంద్రబాబు తొత్తులుగా కొన్ని పత్రికలు,ఛానెల్స్ పనిచేస్తున్నారని మండిపడ్డారు.('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా') పవన్ కల్యాణ్ అహంకారి.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ప్రజలు నమ్మేస్థితిలో లేరని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పవన్ అవకాశవాది అని.. ప్రజలను మోసగించడంలో చంద్రబాబు వద్ద తర్ఫీదు పొందిన వ్యక్తి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పక్కన కూర్చీ వేసి మరొకరిని కూర్చో పెట్టుకోవడానికి అంగీకరించని అహంకారి పవన్ అని విమర్శించారు. సిద్ధాంతాలు మాట్లాడే పవన్.. ఆచరణలో మాత్రం పెట్టరని దుయ్యబట్టారు. తను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని నెలల్లోనే భీమవరంలో వంద పడకల ఆసుపత్రికి తన కుటుంబం తరపున నాలుగు ఎకరాల స్థలాన్ని ఇచ్చామని తెలిపారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం
-
‘పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చూస్తుంటే ‘మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ’ అనే సామెత గుర్తుకు వస్తుందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబును ప్రజలు 23 స్థానాలకే పరిమితం చేశారని విమర్శించారు. తన కొడుకునే గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడుతున్నారని ఈ సందర్భంగా గ్రంధి తెలిపారు. -
చంద్రబాబుకు నిజాయితీ,నిబద్ధత లేదు
-
చంద్రబాబును ప్రజలు క్షమించరు
సాక్షి, భీమవరం: ప్రాముఖ్యత కలిగిన పాలన,వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి తిప్పి పంపడం దారుణమని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మండలి చైర్మన్ షరీఫ్ మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి చేత తప్పుడు పని చేయించిన చంద్రబాబుని ప్రజలు క్షమించరన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శాసనమండలి అవసరం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. టీడీపీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసిందని, మరికొందరు టీడీపీ పెద్దల బండారం కూడా బయటపడుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమైక్యత కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. బీజేపీతో కలిసిన తర్వాత పవన్‌కల్యాణ్ మంచి జోష్ మీద ఉన్నారని.. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్లు.. మోదీ, అమిత్ షా స్థానంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పడగొడతానని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పుస్తకాలు చదువుతున్నానంటారు.. చట్టాలు కూడా చదవాలని పవన్‌కు ఎమ్మెల్యే శ్రీనివాస్ హితవు పలికారు. -
పవన్ అప్పుడేందుకు ప్రశ్నించలేదు?
సాక్షి, పశ్చిమ గోదావరి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పవన్ తన సొంత లాభం కోసం అధికారంలో ఉన్న ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. చేగువేరా సిద్ధాంతాలు పాటిస్తున్నానని చెబుతున్న పవన్.. ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. పవన్ పెయిడ్ ఆర్టిస్టుగా రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. జనసేనతో పొత్తుపై బీజేపీ ఆలోచించాలని సూచించారు. ప్రత్యేక హోదాపై బీజేపీని తీవ్రంగా విమర్శించిన పవన్‌తోనే.. ఆ పార్టీ పొత్తు పెట్టుకుందని గుర్తుచేశారు. అనాలోచిత నిర్ణయంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేస్తే పవన్‌ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో పాటు అసెంబ్లీని కూడా నిర్మించాలని కోరారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్.. గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాపులను నట్టేట ముంచిన వ్యక్తి పవన్.. : యడ్ల తాతాజీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవని పవన్ కల్యాణ్ బీజేపీని ఏమి ఉద్ధరిస్తాడా అని పాలకొల్లు డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ ఎద్దేవా చేశారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. గన్నేరు చెట్టును ఎంత స్థాయిలోకి తీసుకెళ్లి ఉంచిన విషం చిమ్మే కాయలే కాస్తాయని.. జనసేన పార్టీ కూడా అంతేనని మండిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో మాదిరిగానే పవన్.. పార్టీలను మార్చడంలో కూడా పెద్ద వింతేమిలేదని విమర్శించారు. కాపులను నట్టేట ముంచిన పవన్.. తన స్వార్ధం కోసం బీజేపీతో కలుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాజధానిపై, పాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ విషయాలు కూడా తెలియని వ్యక్తి.. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం సిగ్గుచేటని అన్నారు. -
పవన్.. నీకు మైండ్ దొబ్బిందా: శ్రీనివాస్
సాక్షి, పశ్చిమగోదావరి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పవన్‌కు మానసిక జబ్బు ఉందని.. దానికి వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... పిచ్చి కల్యాణ్ నీకు బుర్ర ఉందా లేదా పిచ్చి పట్టిందా అని ప్రశ్నించారు. ‘సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిగా పవన్ గుర్తించడట. పవన్ నీకు అసలు రాజ్యాంగం గురించి తెలుసా. ఎవరిని అవమానిస్తున్నావో తెలుసా. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 51 శాతం ప్రజలు వైఎస్ జగన్‌కు ఓటేసి గెలిపిస్తే ముఖ్యమంత్రిగా అంగీకరించనంటావా. రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను దారుణంగా అవమానించావు. దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పు’అని పవన్ కల్యాణ్‌ను డిమాండ్ చేశారు. ‘నీకు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు పవిత్రులు. వైఎస్సార్సీపీలో గెలిచిన వారు అపవిత్రులా’ అని ప్రశ్నించారు. సిగ్గు రాలేదు.. రోజురోజుకీ.. దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా గ్రంథి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ‘తల్లులను, స్త్రీలను గౌరవించని వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేరాఫ్ అడ్రస్ జనసేన. ఆంధ్రప్రదేశ్‌కు దరిద్రం పట్టిందనడానికి జనసేన పార్టీ ఓ నిదర్శనం. నిన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్లు అసభ్యకరమైన, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. నువ్వు పోటీ చేసిన రెండుచోట్లా నీ పిచ్చి, తిక్క, లెక్క మాకు వద్దంటూ ప్రజలు నిన్ను తరిమికొట్టారు. అయినా నీకు సిగ్గురాలేదు. రోజురోజుకూ దిగజారిపోతున్నావు. పవన్ నీకేమైనా మైండ్ దొబ్బిందా’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన గ్రంథి శ్రీనివాస్ పవన్ కల్యాణ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక గాజువాకలోనూ జనసేన అధినేత ఓటమి మూటగట్టుకున్నారన్న విషయం విదితమే.(దిశ కేసు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు) -
‘అందుకే పవన్ దారుణంగా ఓడిపోయారు’
సాక్షి, పశ్చిమగోదావరి: పవన్ కల్యాణ్ విశాఖ వేదికగా డ్రామాకు తెరలేపారని భీమవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ ఎప్పటికి చంద్రబాబుకి దత్తపుత్రుడేనన్నారు. ‘తాను ఏ పార్టీకి దత్తపుత్రుడిని కాదంటూ పవన్ ఈ ఏడాది బిగ్ జోక్ చెప్పారని’ ఎద్దేవా చేశారు. ‘2019 ఎన్నికల ప్రచారానికి పవన్‌కు రూ.35 కోట్లు అందాయి. నర్సాపురం పార్లమెంటులో తన సోదరుడు నాగబాబుని గెలిపించేందుకు ఆ డబ్బును పంచారు. చంద్రబాబు డబ్బు ఇస్తే, ఆ డబ్బును జనసేన పంచింద’ని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆరోపించారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ నుండి పవన్ ఎంత తీసుకున్నారో అందరికి తెలుసునన్నారు. జన సైనికులను పవన్ తీవ్రవాదులుగా మార్చి సమాజంపై వదిలేశారని.. అందుకే గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. పవన్ ఎప్పటికీ రియల్ హీరో కాలేరు.. పవన్ కల్యాణ్ రీల్ హీరో మాత్రమేనని.. రియల్ హీరో మాత్రం ఎప్పటికీ కాలేరని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ అన్నారు. పాలకొల్లులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ రెండు కిలోమీటర్లు కారుపై ప్రయాణించి.. లాంగ్ మార్చ్‌ను రాంగ్ మార్చ్‌గా మార్చి కొత్త నిర్వచనాన్ని కొనుగొన్నారని’ ఎద్దేవా చేశారు. టీడీపీ అక్రమాలపై ఎప్పుడు ప్రశ్నించని పవన్‌కల్యాణ్.. రాంగ్‌మార్చ్ పెట్టి అజ్ఞానవాసిగా మిగిలిపోయారన్నారు. 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ పాలన చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. -
‘ఇప్పటి దాకా విన్నాం..ఇక కళ్లారా చూస్తాం’
సాక్షి, భీమవరం: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేయబోతున్నారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం భీమవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. గ్రామ స్వరాజ్యం గురించి ఇప్పటిదాకా విన్నామని.. వైఎస్ జగన్ పాలనలో కళ్లారా చూడబోతున్నామన్నారు.దేశంలో మిగతా రాష్ట్ర్రాలు కూడా జగన్ నాయకత్వాన్ని అనుసరించే విధంగా ఏపీలో పాలన సాగుతోందన్నారు.మళ్లీ మన రాష్ట్ర్రం రాజన్న రాజ్యం చూస్తోందని తెలిపారు. -
ప్రమాదంలో కొల్లేరు సరస్సు..
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కొల్లేరు సరస్సు ఉప్పు నీటి సరస్సుగా మారిపోతుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరుకు ఉన్న 67 మేజర్, మైనర్ డ్రెయిన్ల నుంచి నీరు రాకపోవడంతో ఎండిపోతుందన్నారు. కొల్లేరు లోతు పెంచి నీటి సామర్థ్యం పెంచాల్సిన అవసరం ముందన్నారు. సముద్రం నుండి ఉప్పు టేరుకు, ఉప్పుటేరు నుండి కొల్లేరుకు ఉప్పు నీరు రాకుండా రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తీర ప్రాంతంలో సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లేరును పరిరక్షించి పక్షి జాతులను కాపాడాలని, కొల్లేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. గత నెల 28న కొల్లేరు పరిరక్షణకు కలెక్టర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం జరిగిందని తెలిపారు. -
చంద్రబాబుది టెర్రరిస్టుల పాలన
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొనియాడారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేవలం వంద రోజుల పాలనలో ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు, నిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అక్రమాలను అరికట్టి ప్రభుత్వానికి ఆర్థికాదాయాన్ని సమకూర్చడం అభినందనీయమన్నారు. గాడి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి నిర్విరామంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు గర్వపడేలా ముఖ్యమంత్రి పాలన సాగిందని తెలిపారు. ఇక ఆప్ఘనిస్తాన్‌లో టెర్రరిస్టు మూకల తుపాకీ నీడలో పరిపాలన జరిగినట్టుగా నాటి చంద్రబాబు పాలన సాగిందని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. -
అక్రమంగా పన్ను వసూలు చేస్తే.. కఠిన చర్యలు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరం చేపల మార్కెట్, పాత బస్టాండ్లను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇరిగేషన్ సైట్లో ఉన్న గంగాలమ్మ చేపల మార్కెట్ వ్యాపారుల వద్ద టీడీపీ నాయకులు అన్యాయంగా పన్నులు వసూలు చేస్తున్నారనే విషయంపై భీమవరం ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్రమంగా పన్ను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ప్రైవేటు బస్సులకు అడ్డాగా మారిన పాత బస్టాండ్‌లోని బస్సులను తొలగించి, మళ్లీ ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారులను సూచించారు. -
‘వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లు కూడా రావు’
సాక్షి, పశ్చిమగోదావరి: ఇప్పటికైనా టీడీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఈ 23 సీట్లు కూడా రావు జాగ్రత్త అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఇసుక కోసం పోరాటం చేయడం చూస్తే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ఇసుక దోపిడిని అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని జుట్టు పట్టుకుని కొట్టలేదా అని ప్రశ్నించారు. అందువల్లే రాష్ట్ర ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక దోపిడిని అరకట్టడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అక్రమాలు జరగకుండా న్యాయమైన ధరలకే వినియోగదారులకు ఇసుక అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అవినీతి, అక్రమాలు, దందాలు, రౌడీయిజం చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు. పోలవరం, రాజధాని విషయంలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ మంత్రులు వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపించారు. టీడీపీ తన తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించాడనికి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. -
‘‘సాహో’ రికార్డులు సృష్టించాలి’
సాక్షి, భీమవరం : హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆకాంక్షించారు. శనివారం భీమవరంలోని పద్మాలయా థియేటర్లో ఆయన సాహో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ట్రైలర్ వీక్షించిన అనంతరం అభిమానులు బైక్‌లతో భారీ విజయోత్సవ ర్యాలీ జరిపారు. -
గత పాలకుల నిర్లక్ష్యంవల్లే..
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి) : భీమవరం పట్టణంలోని మంచినీటి సమస్యకు గత పదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం, అవగాహన లోపమే కారణమని స్ధానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ఎక్కువ నీరు, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు తక్కువ నీరు పంపిణీ చేస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేశారని ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎన్.అమరయ్యతో కలసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లుగా మున్సిపాల్టీని పాలిస్తున్న టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే కూడా మంచినీటి సమస్యపై దృష్టిపెట్టలేదని విమర్శించారు. పదేళ్లుగా పట్టణ జనాభాతోపాటు పట్టణానికి వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజల సంఖ్య పెరిగినా ఆ మేరకు నీటి సరఫరా చేయడానికి ఎలాంటి ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదన్నారు. మంచినీటి సరఫరా కోసం కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం నిధులు మంజూరు చేసినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో గత పాలకులు విఫలమయ్యారని శ్రీనివాస్ దుయ్యబట్టారు. అమృత పథకంలో పైపులైన్లు వేయాల్సివుంటుందని తెలిసిన ప్రాంతాల్లో సైతం సిమెంట్ రోడ్డు నిర్మించి ఆ తరువాత వాటిని «పగులగొట్టి మంచినీటి పైపులైను వేయడం మున్సిపల్ పాలకుల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా ఒక పక్క పట్టణ శివారు ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందక ఇక్కట్లు పడుతుంటే ఎలాంటి ఆలోచన లేకుండా కొత్తగా 1,500 కుళాయి కలెక్షన్లు కొత్తగా ఇచ్చి మరింత ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణం మొత్తం మీద వన్‌టౌన్, త్రీటౌన్ ప్రాంతంలో సుమారు లక్షా 65 వేల మంది జనాభా ఉండగా వారికి నాలుగు ఓహెచ్‌ఆర్ ద్వారా కేవలం 53 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంటే కేవలం 32 వేల మంది జనాభా ఉన్న రెండో పట్టణ పరిధిలో రెండు ఓహెచ్‌ఆర్‌ల ద్వారా ఏకంగా 31 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయడం విచిత్రంగా ఉందన్నారు. వన్‌టౌన్ పరిధిలోని ఓహెచ్‌ఆర్‌ల ద్వారా పంపిణీ చేసే 53 లక్షల లీటర్ల నీటిలో 10 లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని వివరించారు. పట్టణానికి అవసరమైన సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్‌తోపాటు మరో మంచినీటి చెరువు ఉన్నా నీటి సరఫరా చేయడానికి అవసరమైన ఓహెచ్‌ఆర్‌లు, పైపులైనులు లేవని, వీటిని నూతనంగా ఏర్పాటుచేయడానికి గత పాలకులు ఎలాంటి కృషిచేయలేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రధానంగా మంచినీటి సమస్యపైనే దృష్టిసారించానని దానిలో భాగంగా మున్సిపల్ కమిషనర్, మునిసిపల్ ఇంజనీర్లతో సమీక్షించినట్లు చెప్పారు. పట్టణ ప్రజల అవసరాలకు కోటి 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సివుండగా పైపులైన్లు అస్తవ్యస్థంగా ఉండడం, సరిపడా ఓహెచ్‌ఆర్‌లు లేకపోవడం వల్ల కేవలం 85 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. పట్టణానికి మరో మూడు ఓహెచ్‌ఆర్‌లు అవసరమవుతాయని అమృత్ పథకంలో దుర్గాపురంలో నిర్మాణం చేపట్టారని, మరో రెండు ఓహెచ్‌ఆర్‌ల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సివుందన్నారు. మంచినీటి సమస్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తాగునీటి కష్టాలు వచ్చినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా ఉంటేనే తాను సంతోషంగా ఉంటానని శ్రీనివాస్ స్పష్టం చేశారు. డ్రయిన్లలో పూడికతీతలోను అలసత్వమే.... మున్సిపల్ పాలకులు పట్టించుకోకపోవడంతో పట్టణంలోని డ్రయిన్లలో పూడికతీత పనులు జూన్, జూలైలో చేపడుతున్నారని శ్రీనివాస్ విమర్శించారు. పూడిక మట్టి వర్షాల కారణంగా తిరిగి డ్రయిన్లలోకి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
దానికి కారణం మున్సిపల్ పాలకులే!
సాక్షి, పశ్చిమ గోదావరి : భీమవరంలో మంచినీటి సమస్యపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భీమవరంలో ప్రజలు మంచి నీటికోసం చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపల్ పాలకులు మంచినీటి వ్యాపారం చేయటమే ఇందుకు కారణమన్నారు. ప్రజలు త్రాగవలసిన మంచినీటిని విచ్చలవిడిగా రొయ్యల ఫ్యాక్టరీలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. వాటర్ హెడ్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు దగ్గర పెట్టిన సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి దోపిడీ చేశారన్నారు. అమృత పథకం అని మొదలు పెట్టి, ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. అమృత పథకం పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా, క్వాలిటీ లేకుండా పైపులైన్లు వేయడానికి రోడ్లు తవ్వి పడేశారని, రోడ్లను చిధ్రం చేశారని మండిపడ్డారు. పైపులైన్లు వేసి దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. -
రైతుల గుండెల్లో గ్రంధి శ్రీనివాస్
భూములున్నా.. పంట పండించుకోవడం తప్ప.. వారికి ఎటువంటి హక్కులేదు. పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నా బ్యాంకుల్లో కుదవ పెట్టుకునే అవకాశం లేదు. దీంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరం. అటువంటి సమయంలో భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి శ్రీనివాస్ వారికి అండగా నిలిచారు. ప్రభుత్వాన్ని ఒప్పించి సీఏడీ భూములకు పట్టాలు ఇప్పించారు. దీంతో అక్కడ సుమారు 1000 మంది రైతులకు మేలు కలిగింది. అటువంటి శ్రీనివాస్‌ను తాము ఎప్పటికీ మర్చిపోలేం అని రైతన్నలు చెప్పారు. మళ్లీ ఆయన్ని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారంతా నడుం బిగించారు. సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి): భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో సర్కార్ అగ్రికల్చర్ డెవలప్మెంట్(సీఏడీ)భూములు సుమారు 1532 ఎకరాలు ఉన్నాయి. వాటిని 1921 సంవత్సరం నుంచి గ్రామానికి చెందిన కొంతమంది పేదలు సాగుచేయడం ప్రారంభించారు. అడవి మాదిరిగా చెట్లు, చేమలు, రుప్పలతో అస్తవ్యస్థంగా ఉండే ఆ భూములను అప్పటి రైతులు ఎంతో కష్టపడి సాగుకు అనుకూలంగా మార్పుచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ భూములపై రైతులకు చట్టబద్ధంగా ఎటువంటి హక్కులేకపోయింది. ఆ భూములు మావేనని చెప్పడానికి వారి వద్ద ఎటువంటి ఆధారం ఉండేది కాదు. కనీసం తమ ఆడబిడ్డలకు పిల్లలకు కట్న కానుకలుగా ఇచ్చే అవకాశం లేకపోయింది. ఎంతోకాలంగా పట్టాలిప్పించాలని రైతులు అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం. ఎంతో నిరాశలో ఉన్న రైతులకు 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి శ్రీనివాస్ ఆశాదీపంగా కనిపించారు. రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను గుర్తించిన ఆయన వెంటనే వారికి పట్టాలు ఇప్పించడానికి కృషి ప్రారంభించారు. 1532 ఎకరాల సీఏడీ భూముల్లో సుమారు 902 మంది రైతులకు 950 ఎకరాలకు పట్టాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపారు. అయితే మిగిలిన భూములకు పట్టాలు ఇప్పించడానికి పదేళ్లుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఎటువంటి శ్రద్ధ చూపించలేదని విమర్శిస్తున్నారు. మళ్లీ శ్రీనివాస్ ఎమ్మెల్యే అయితే మిగిలిన భూములకు పట్టాలు వస్తాయని వారంతా నేడు ఆశగా ఉన్నారు. మా కష్టం తెలిసిన మహనీయుడు శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యేగా ఎంతోమంది పని చేశారు. కానీ రైతుల కష్టాలు ఎవరూ గుర్తించేవారు కాదు. గ్రంధి శ్రీనివాస్ గుర్తించి 950 ఎకరాలకు పట్టాలిచ్చి 900 మందికి పైగా రైతుల కళ్లలో ఆనందాన్ని చూసిన వ్యక్తి. మా వంశంలోని తరతరాలకు గుర్తుండిపోతారు. –జి.వెంకట సుబ్బలక్ష్మి, మహిళా రైతు, గొల్లవానితిప్ప రైతు బిడ్డ కనుకనే.. రైతులంటే రైతు బిడ్డ అయిన శ్రీనివాస్‌కు అభిమానం ఎక్కువ. రైతులు కనబడితే కారు ఆపి పలకరిస్తారు. ఇప్పటివరకు శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేను చూడలేదు. –మెంటే పల్లయ్య, రైతు, గొల్లవానితిప్ప కట్నంగా ఇస్తున్నాం పట్టాలు ఇవ్వక ముందు మా ఆడబిడ్డలకు భూమిని కట్నంగా ఇచ్చే అవకాశం ఉండేది కాదు. శ్రీనివాస్ చలువ వల్ల ఇప్పుడు కట్నాలుగా ఇస్తున్నాం. –పాకల రంగారావు, రైతు, గొల్లవానితిప్ప నాలుగు మెతుకులు తింటున్నాం అప్పట్లో మా పొలానికి పట్టాలు ఏమి లేకపోవడంతో భూమికి విలువ ఉండేది కాదు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టాలు ఇచ్చిన తరువాత భూమికి విలువ పెరిగింది. ఆయన దయవల్లే నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. - గుద్దటి పెద్దిరాజు, రైతు, గొల్లవానితిప్ప -
నేను లోకల్..
సాక్షి, భీమవరం : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం, వారికి కష్టం వచ్చినప్పుడు అండగా ఉండటమే నాకు తెలిసింది. ఎక్కడి నుంచో దిగుమతి అయిన నాయకులు గెలిస్తే ఎలా ఉంటుందో గడిచిన పది సంవత్సరాలుగా భీమవరం ప్రజలు అనుభవిస్తున్నారు. మరోసారి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే స్థానికుడిని గెలిపించాలని భీమవరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర ఉద్యమంలో రెండో బార్డోలిగా పేరొందిన భీమవరం నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ఓటర్లలో ఉత్కంఠతను రేపుతున్నాయి. ప్రధానంగా ప్రజాసమస్యలపై పోరాటమే శ్వాసగా భావించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, సినీనటుడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ తన మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రశ్న: నియోజకవర్గంలో మీ ప్రాధాన్యతలు ఏమిటి? గ్రంధి: భీమవరం పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య, యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన, యనుమదుర్రు డ్రెయిన్‌పై అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన, అప్రోచ్‌రోడ్లు, బైపాస్ రోడ్డును విస్సాకోడేరు శివారు వరకు అభివృద్ధి చేయడం వంటివి ప్రధానమైన అజెండా. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్స్ నిర్మాణం, పట్టణ శివారు ప్రాంతాల్లో కొత్తరోడ్లు ఏర్పాటు, వీరవాసరం, భీమవరం మండలాల్లో మంచినీరు, మురుగునీరు సమస్య, పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మాణం వంటివాటిని ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్తాను. ప్రశ్న: మీరు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏమిటి? గ్రంధి: భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళా ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువ చేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చాను. పట్టణ మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమిని సేకరించి దానిలో 60 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేయించాను. పేదలకు సొంతింటి కల నెలవేర్చడానికి 82 ఎకరాల భూమిని సేకరించాను. 700 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చాను. యనమదుర్రు డ్రెయిన్‌పై ఆరు బ్రిడ్జిల నిర్మాణం, బైపాస్‌రోడ్డుకు శ్రీకారం చుట్టాను. ఓల్డ్ యనమదుర్రు డ్రెయిన్ అభివృద్ధికి రూ.2 కోట్లు ఖర్చు చేశాను. తోపుడు బండ్ల వర్తకులకు హాకర్ల జోన్ ఏర్పాటు చేయించాను. పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం వద్ద గల సోమగుండం చెరువు అభివృద్ధికి కృషి చేశాను. ప్రశ్న: ఎన్నికల బరిలో మీ బలం ఏమిటి? గ్రంధి: ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటాను. ఏ సమయంలోనైనా నా వద్దకు రావచ్చు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటమే నా బలం. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఉంది. అందుకే మరోసారి రాజన్న రాజ్యం సాకారం చేయాలనే ఎన్నికల బరిలో నిలిచాను. ప్రశ్న: రాజకీయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు? గ్రంధి: మా నాన్న గ్రంధి వెంకటేశ్వరరావే నాకు రాజకీయంగా స్ఫూర్తి. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్‌పేయ్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సూపర్‌స్టార్ కృష్ణ నా అభిమాన నాయకులు. ప్రశ్న: రాజకీయ ప్రవేశం ఎప్పుడు? గ్రంధి: విద్యార్థిదశలో ఉండగానే దాదాపు 1977 ప్రాంతంలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నా. ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతాపార్టీలో చురుకుగా పనిచేశా. ప్రశ్న: చేపట్టి రాజకీయపదవులు? గ్రంధి: మొట్టమొదటిసారిగా భీమవరం పట్టణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పదవిని చేపట్టి వెనువెంటనే జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి వరించింది. ప్రశ్న: ప్రజాక్షేత్రంలో ఎప్పుడు పోటీలో పాల్గొన్నారు? గ్రంధి: 1995లో భీమవరం అర్బన్బ్యాంక్ అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించా. అనంతరం 2004లో భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించా. ప్రశ్న: ఎన్నికల్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం? గ్రంధి: నా తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సాహంతోనే ఎన్నికల బరిలో దిగా. కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమేగాక ఎంతో అండదండగా ఉంటున్నారు. ప్రశ్న: రాజకీయాల్లో మీ లక్ష్యం? గ్రంధి: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించడమే లక్ష్యం. -
అందరివాడు..అందనివాడు
భీమవరం నియోజకవర్గ ప్రజల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సింది నిత్యం తమ మధ్యే ఉంటూ ఎప్పుడూ అందుబాటులో ఉండే వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్నా? సినీగ్లామర్‌తో రాజకీయాల్లోకి ప్రవేశించి రెండుచోట్ల నుంచి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్నా? ఏ సమస్య వచ్చినా ప్రజల ముందుండి పోరాడే గ్రంధి శ్రీనివాస్ ఒకవైపు బరిలో ఉంటే, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎలా కలవాలో తెలియని పవన్ కళ్యాణ్ మరోవైపు బరిలో ఉన్నారు. మరోవైపు పవన్ ఎన్నికల తర్వాత గాజువాకను ఉంచుకుని భీమవరాన్ని వదిలేస్తారనే ప్రచారం జనసేన వర్గాల్లోనే జోరుగా జరుగుతుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యల కోసం ఏనాడూ ముందుకు రాలేదు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినన్ని రోజులు ఇక్కడ పోలీసుల నిర్బంధకాండపై, మొగల్తూరులో ఆక్వా పరిశ్రమలో ఐదుగురు చనిపోయినా ఎన్నడూ స్పందించలేదు. నామినేషన్ వేసిన తర్వాత కూడా కేవలం వైఎస్సార్ సీపీ అభ్యర్థిని మాత్రమే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్, పదేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంజిబాబును పల్లెత్తు మాట కూడా అనలేదు. దీన్నిబట్టి అక్కడ తెలుగుదేశం–జనసేన బంధం ఎంత గట్టిగా ఉందో అర్థం అవుతుంది. కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీపీఎఫ్) అంటూ హడావిడి మొదలుపెట్టిన పవన్‌కళ్యాణ్ దాని పేరిట రూ.2 కోట్లు డిపాజిట్ చేస్తున్నామని.. ఎవరు కష్టంలో ఉన్నా నైతికంగా, ఆర్థికంగా ఆదుకుంటామని సినిమా డైలాగులు చెప్పారు. తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. సీపీఎఫ్ ఏమైందో తెలియదు. మళ్లీ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకుని బాబుతో జతకలిశారు. టీడీపీ గుర్తు సైకిల్‌కు ఓటెయ్యాలని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. 2019.. మళ్లీ ఎన్నికలొచ్చాయి.. బాబుకు కటీఫ్ చెప్పారు. నేరుగా పోటీ చేస్తున్నామంటూ గాజు గ్లాసుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇలా ప్రతి ఎన్నికకి గుర్తులు మారుస్తూ ప్రజల ముందుకు వచ్చి ఆ తర్వాత కనపడకుండా పోయే పవన్ కళ్యాణ్ ఇప్పుడు భీమవరం నుంచి పోటీకి సై అంటున్నారు. ఎన్నికల తర్వాత కన్పించని అందనివాడు కావాలా, నిత్యం భీమవరంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే అందరివాడు గ్రంధి శ్రీనివాస్ కావాలా? గ్రంధి శ్రీనివాస్.. గ్రంధి శ్రీనివాస్ భీమవరంలోనే పుట్టి పెరిగారు. చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరితో కలివిడిగా ఉంటున్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళా ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువ చేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చారు. పట్టణ మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమిని సేకరించి దానిలో 60 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేశారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చడానికి 82 ఎకరాల భూమిని సేకరించారు. 700 మంది పేదలకు గ్రంధి శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. యనమదుర్రు డ్రైయిన్‌పై ఆరు బ్రిడ్జిల నిర్మాణం, బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. ఓల్డ్ యనమదుర్రు డ్రెయిన్ అభివృద్ధికి రూ.2 కోట్లు ఖర్చు చేశారు. భీమవరం మండలంలో పేదలకు 1,000 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. తోపుడుబండ్ల వర్తకులకు హాకర్లజోన్ ఏర్పాటు చేయించారు. పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం వద్ద గల సోమగుండం చెరువు అభివృద్ధికి కృషి చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు. ప్రజలతో మమేకం అవుతారు, 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. స్థానిక టీడీపీ నేతల అక్రమాలపై, తుందుర్రు ఆక్వాఫుడ్ పార్కుపై అలుపెరుగని పోరాటం చేశారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఇచ్చారు. 2019లో మళ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. గెలిచినా ఓడినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న చరిత్ర గ్రంధి శ్రీనివాస్‌ది. స్థానికుడు కావడంతో నియోజకవర్గ సమస్యలపై అవగాహన పవన్ కళ్యాణ్ చిరంజీవి పుట్టిన ఊరు మొగల్తూరు. ఇది నరసాపురం నియోజకవర్గంలో ఉంది. కానీ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు నరసాపురంలో పోటీ చేయకుండా పాలకొల్లులో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ రెంటికి సంబంధం లేని పక్క నియోజకవర్గం అయిన భీమవరాన్ని ఎంచుకున్నారు. నాకు కులమతాలే లేవని చెప్పిన పవన్ కాపుల ఓట్లు ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు? దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు ఈ జిల్లాలో నుంచున్నానని సెలవిచ్చారు. నిజంగా అదే కారణం అయితే దెందులూరులో నిల్చోవచ్చు కదా? భీమవరంలోనే గెలిచేటట్లైతే గాజువాకలో ఎందుకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపుపై అపనమ్మకమా? అన్న పరాజయం భయపెట్టిందా? ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో రెండింటిలో గెలిస్తే ఏ సెగ్మెంట్ వదిలేస్తారు?ఖచ్చితంగా భీమవరమే.. అనుమానం ఏమైనా ఉందా?.. రూ.కోట్లు ఖర్చు చేసి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకే సహకరించకుండా ఏడిపించిన చరిత్ర ఆయనది? అలాంటిది ఓటేసిన ప్రజలకేం చేస్తారు? పోనీ గెలిచినా.. ఓడినా భీమవరంలో ఉంటారా? ఇంతకుముందు ఏలూరులో ఆఫీసు పెడతానని, ఇక్కడి నుంచే ఓటు నమోదు చేయించుకుని తర్వాత విజయవాడ వెళ్లి అక్కడే ఓటు నమోదు చేయించుకోలేదా? ఏ మాత్రం నిలకడలేని మనస్తత్వం ఉన్న ఆయన్ను నమ్మేదెలా? రూ. 50 లక్షలు బ్లాక్‌మనీ లేదని మొదటి నుంచి నమ్ముకున్న తనను తప్పించి అవినీతిపరుడైన చిర్రి బాలరాజుకు టిక్కెట్ ఇచ్చారంటూ దివ్వెల సృజన ఆవేదన నిజం కాదా? పార్టీలో కీలకమైన బాధ్యతలు చూసే సృజనకే 20 రోజులు ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ కలవలేదు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? వారికి ఏమైనా ఇబ్బంది కలిగితే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో విజ్ఞత గలిగిన ఓటర్ ఆలోచించే సమయం వచ్చింది. -
భీమవరంలో పవన్ ఓడిపోవడం ఖాయం
సాక్షి, భీమవరం : ఎన్నికల ముందే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయడం మంచిదని భీమవరం వైఎస్సార్ సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా సంజీవినా అన్నా చంద్రబాబు నాయుడుతో పవన్ చేతులు కలిపారని, ఆయన అంత దిగజారుడు రాజకీయవేత్త ఎవరూ ఉండరని విమర్శలు గుప్పించారు. తడిగుడ్డతో గొంతు కోసే చంద్రబాబుతో పవన్ జతకట్టారని, రాష్ట్రం ముక్కలు చేసేందుకు లేఖ ఇచ్చిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌కు వెనుక నుంచి సలహాలు ఇస్తున్నారని, అలాంటి వారితో కలిసి రాజకీయాలు చేయవద్దని సూచించారు. గ్రంధి శ్రీనివాస్ శనివారమిక్కడ మాట్లాడుతూ.... ‘పవన్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. గతంలో కేసీఆర్‌తో అరగంట మంతనాలు జరిపిన మీరు...ఇప్పుడు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా పని చేసింది కేవలం అయిదేళ్లే. భీమవరాన్ని మురికి కూపం చేశారంటున్న మీరు... మీ స్నేహితుడు గంటా శ్రీనివాసరావు వియ్యకుడు రామాంజనేయులు పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఈ పదేళ్లలో భీమవరంలో ఏ అభివృద్ధి జరగలేదు. మరి ఆయనపై పవన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. గంటా, అంజిబాబు, పవన్ మధ్య ఉన్న అనుబంధం ఏంటో అందరికీ తెలుసు. జనసేన చాలా చోట్ల అభ్యర్థులను పెట్టి ఇంకా కొన్ని చోట్ల సీపీఎం, సీపీఐ, బీఎస్సీ అభ్యర్థులను పెట్టారు. సోషల్ మీడియాలో యువత మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు ఏమైనా నీతిమంతుడా అని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు టీడీపీలోకి వచ్చారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన బాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఆ తరువాత టీడీపీని లాక్కుని ఎన్టీఆర్‌నే బయటకు పంపించిన ఘనత చంద్రబాబుది. అలాంటి చంద్రబాబుతో జత కట్టిన చరిత్ర పవన్‌ది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని, వెన్నుపొటు పొడిచిన చంద్రబాబు మీకు గొప్ప వ్యక్తా?. పవన్ మీరు మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలు అని ప్రజలకు అర్థం అవుతోంది. జనసేను టీడీపీలో కలిపిస్తే ప్రజల్లో క్లారిటీ వస్తుంది. మీ విశ్వసనీయత, నిజాయితీ అనేవి నీటిమీద రాతలే అని ప్రజలకు అర్థం అయిపోయింది. మీ అభిమానిగా చెబుతున్నా ప్రజల ముందు మరింత చులకన కావద్దు. దయచేసి మీ నామినేషన్ విత్ డ్రా చేసుకోండి. కనీసం గౌరవం అయినా మిగులుతుంది. గతంలో మీ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఆ సమయంలో నేను పీఆర్పీలోనే ఉన్నా. పార్టీ విలీనం అయినా నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరలేదు. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. అప్పటికీ, ఇప్పటికీ టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. అదే విధానంతో మేము వెళుతున్నాం. మీరు మాత్రం ఎలాంటి విధానం లేదు. మీరెందుకు రంగులు మార్చుతున్నారో. ఎదుట వాళ్లకు మాత్రం నీతులు చెబుతారు. మీరు చెప్పే మాటలకు, చేసే పనులకు పోలికే ఉండదు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మీకు అసలు ఓ విధానం, సిద్ధాంతం అనేదే లేదు. ఇక మీ బాడీ లాంగ్వేజ్, మైండ్ సెట్ చూస్తుంటే ...కేఏ పాల్, మీరు సోదరుల్లాగే ఉన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ఓడిపోవడం ఖాయం. ఆయన తన నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే గౌరవంగా ఉంటుంది.’ అని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్... తెలుగుదేశం-జనసేన అనైతిక పొత్తు బయటపడిందని నర్సాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఒక్క మాట అనని పవన్ కల్యాణ్...ఆయన డైరెక్షన్లోనే వైఎస్సార్ సీపీ, కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో విద్వేషాలు రగిల్చే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఇకపోతే నాగబాబు తనపై పోటీ చేస్తున్నారని, ఆయనకు తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తనపై నాగబాబు పోటీలోనే ఉండాలని అన్నారు. -
పవన్ నీస్థాయి దిగజార్చుకోవద్దు
సాక్షి, భీమవరం: జనసేన అధ్యక్షుడిగా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన పవన్ కల్యాణ్ భీమవరంలో పరిస్థితులు తెలియకుండామాట్లాడి స్థాయిని దిగజార్చుకోవడం, ప్రజల్లో చులకన కావడం పవన్ అభిమానిగా బాధించిందని వైఎస్సార్ సీపీ భీమవరం నియోజవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తన హయాంలో భీమవరంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియని వారు చెప్పిన మాటలు విని అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ గత ఐదేళ్లుగా టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో జతకడితే లేని తప్పు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని టీఆర్ఎస్తో వైఎస్సార్ సీపీ కలసి పనిచేస్తే తప్పేంటని శ్రీనివాస్ ప్రశ్నించారు. తాను 2004లో ప్రజాభిమానంతో ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, పట్టణ ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమి సేకరించి దానిలో 60 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేశానన్నారు. పేదల సొంతింటి కల నెలవేర్చడానికి 82 ఎకరాల భూమి సేకరించానని, అంతేకాకుండా 700 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు. యనమదుర్రు డ్రైన్‌పై బ్రిడ్జిలు, బైపాస్ రోడ్డు నిర్మించామన్నారు. గత పదేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బైపాస్ రోడ్డు వద్ద రైల్వే గేట్ ఏర్పాటు చేయించలేకపోయారని విమర్శించారు. భీమవరం మండలంలో పేదలకు వెయ్యి ఎకరాల భూమి పంపిణీ చేశామన్నారు. తోపుడు బండ్ల వర్తకులకు హాకర్లజోన్ ఏర్పాటుచేయడమేగాక, భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళ ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువచేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్ గుర్తు చేశారు. తాను భీమవరం అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేసిన రోజుల్లో బ్యాంకును ఎంతో అభివృద్ధి చేసి సుమారు రూ.100 కోట్ల డిపాజిట్లు సేకరించడమేగాక దానిలో రూ.60 కోట్ల వరకు రుణాలుగా ఇచ్చామని చెప్పారు. అయితే దీనిలో అవకతవకలు జరిగాయని పవన్ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్నేహితుడు కృషిబ్యాంకు వెంకటేశ్వరరావు కారణంగా అప్పట్లో అనేక సహకారం బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. అయినా డిపాజిట్‌దారులకు దాదాపు 98 శాతం తిరిగి తాము చెల్లించామని శ్రీనివాస్ తెలిపారు. తాను డిపాజిట్‌దారులకు అన్యాయంచేసి ఉంటే 2004 ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించేవారుకాదని, అలాగే 2014 ఎన్నికల్లో 74 వేల మంది ఓట్లు వేసే అవకాశం లేదని, దీనిని పవన్ గుర్తించాలన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గట్టిపోటీ ఇస్తున్నందున తనపై అసత్య ఆరోపణలు చేయడం పవన్‌కు తగదని శ్రీనివాస్ హితవు పలికారు. -
భీమవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా గ్రంధి శ్రీనివాస్ నామినేషన్
-
ఏనాడైనా కాపు పెద్దలతో మాట్లాడారా?
విశాఖపట్నం/భీమవరం: కాపు ఐక్య గర్జన సందర్భంగా తునిల చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిపక్షంపై చంద్రబాబు ఎదురుదాడికి దిగడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఉన్న తేడా కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమేనని గుర్తు చేశారు. తుని ఘటనలపై ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించిన మీడియాపై కూడా ముఖ్యమంత్రి ఎదురుదాడి చేశారని చెప్పారు. ఏనాడైనా కాపు పెద్దలతో చంద్రబాబు మాట్లాడారా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతరూపం దాలుస్తుందని భయపడే కమిషన్ వేశారని అన్నారు. చంద్రబాబు అసత్యవాది అంటూ దుయ్యబట్టారు. తుని ఘటనలకు చంద్రబాబే కారణమని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు అబద్దాలు చెప్పడం వల్లే ఈ ఘటనలు జరిగాయన్నారు. తుని ఘటనలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
పవన్ కల్యాణ్ తీరుతో కాపులకు నష్టం
-
వైసీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కాయని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వీరవాసరం మండలం తోలేరు, చింతలకోటి గరువు, బలుసుగొయ్యిపాలెం, ఉత్తరపాలెంకు చెందిన వందలాది మంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం వైసీపీలో చేరారు. తొలుత వీరవాసరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారాయణ పార్టీలో చేరగా, ఆయన ఆధ్వర్యంలో గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో మిగిలినవారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రంధి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే అప్పటి సంక్షేమ పథకాలు మళ్లీ అమలవుతాయన్నారు. పినిశెట్టి రామారావు, జంపన సూర్యనారాయణరాజు, కొత్తపల్లి రాంబాబు, కంకటాల సత్యనారాయణ, ఇంటి కాంతారావు, భాస్కరరావు తదితరులు పార్టీలో చేరారు. వైసీపీ నాయకులు వేండ్ర వెంకటస్వామి, కోటిపల్లి బాబు, గుండా జయప్రకాష్ నాయుడు, ఎన్.శ్రీనివాసరాజు, మద్దాల రమణ, కొప్పర్తి సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. -
వైసీపీలోకి వలసల వెల్లువ
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ కాగా.. తాజాగా టీడీపీ నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరుతున్నారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో టీడీపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే పలు వార్డులకు చెందిన టీడీపీ నాయకులు వైసీపీలో చేరగా తాజాగా ఒకటో వార్డు, 18వ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది కామన నాగేశ్వరరావు, ముత్యాల వెంకట రామారావుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. కామన రాంబాబు, మేకా త్రినాథ్, వీరవల్లి సుబ్బారాయుడు, సామన భాస్కరరావు, పోలిశెట్టి ఏడుకొండలు, మేకా మధు, మట్టా సుబ్బారావు, మేకా నరసింహారావు, ముద్దే మధు, యాతం ఏసు, మణికంఠ సతీష్, నంది నాగరాజు, కఠారి చిన్ని, యాతం సురేష్, లక్ష్మణరావు, వేమవరపు శ్రీనివాసరావు, నక్కా శివశంకర్ తదితరులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. వారందరికీ గ్రంధి శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీపై ప్రజలు ఎనలేని ఆదరణ చూపిస్తున్నారన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజనకు కారకులయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, మద్దాల రమణ, వర్ధినీడి సత్యనారాయణ, షేక్ అన్సారీ, ఇంటి సత్యనారాయణ పాల్గొన్నారు. -
సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది
సమైక్యవాద ముసుగులో ఉన్న విభజనవాది రఘురామ కృష్ణంరాజు అని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ మండిపడ్డారు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని, తెలంగాణ ఏర్పాటుకు కూడా కట్టుబడి ఉన్నామని చెప్పిన బీజేపీలోకి ఇప్పుడు ఆయనెలా వెళ్లారని ప్రశ్నించారు. వ్యాపార భాగస్వాములను, ప్రజలను కూడా రఘురామ కృష్ణంరాజు మోసం చేస్తున్నారని, ఆయన నిజస్వరూపం ఇన్నాళ్లకు బయటపడిందని గ్రంధి శ్రీనివాస్ అన్నారు.