టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కాయని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కాయని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వీరవాసరం మండలం తోలేరు, చింతలకోటి గరువు, బలుసుగొయ్యిపాలెం, ఉత్తరపాలెంకు చెందిన వందలాది మంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం వైసీపీలో చేరారు.
తొలుత వీరవాసరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారాయణ పార్టీలో చేరగా, ఆయన ఆధ్వర్యంలో గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో మిగిలినవారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రంధి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే అప్పటి సంక్షేమ పథకాలు మళ్లీ అమలవుతాయన్నారు.
పినిశెట్టి రామారావు, జంపన సూర్యనారాయణరాజు, కొత్తపల్లి రాంబాబు, కంకటాల సత్యనారాయణ, ఇంటి కాంతారావు, భాస్కరరావు తదితరులు పార్టీలో చేరారు. వైసీపీ నాయకులు వేండ్ర వెంకటస్వామి, కోటిపల్లి బాబు, గుండా జయప్రకాష్ నాయుడు, ఎన్.శ్రీనివాసరాజు, మద్దాల రమణ, కొప్పర్తి సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.