
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొనియాడారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేవలం వంద రోజుల పాలనలో ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు, నిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అక్రమాలను అరికట్టి ప్రభుత్వానికి ఆర్థికాదాయాన్ని సమకూర్చడం అభినందనీయమన్నారు. గాడి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి నిర్విరామంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు గర్వపడేలా ముఖ్యమంత్రి పాలన సాగిందని తెలిపారు. ఇక ఆప్ఘనిస్తాన్‌లో టెర్రరిస్టు మూకల తుపాకీ నీడలో పరిపాలన జరిగినట్టుగా నాటి చంద్రబాబు పాలన సాగిందని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment