
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికలు జరగకపోతే రూ. 5 వేల కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావనే విషయాన్ని ఇతర పార్టీలు గుర్తుంచుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు ఆగితే పశ్చిమ గోదావరి జిల్లా భారీగా నష్టపోతుందన్నారు. సకాలంలో ఎన్నికలు జరగకపోతే మే నెలలో రైతులకు సాగునీటి కోసం ఇరిగేషన్ పనులు ఎలా చేస్తారని, వేసవిలో తాగు నీటికి నిధులు ఎలా ఇస్తారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీ, జనసేన పార్టీలను ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్నికలను 6 వారాల పాటు నిలిపివేయడం వెనక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హస్తం ఉందని విమర్శించారు.
పక్కా ప్లాన్‌తో మాచర్లలో బుద్దా,బొండా ఎంట్రీ
కాగా.. రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక ఇవ్వడం జరిగిందని గ్రంధి తెలిపారు. కరోనా వైరస్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికైనా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరిగేలా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్‌ను ఆయన కోరారు. రాజమండ్రి కో ఆర్డినేటర్ శివరామ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రమేష్ కుమార్ అనే బుచిని చూసి ఎన్నికలను ఆపగలిగారు తప్ప.. ప్రజల మనసును టీడీపీ ఎప్పటికీ గెలవలేదని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైఎస్సార్ సీపీదే అన్నారు. టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి వయసుకు తగ్గ రాజకీయాలు చేయాలని హితవుపలికారు. బీజేపీ మధ్యప్రదేశ్‌లో ఒక రకమైన న్యాయం.. ఆంధ్రలో మరోకలా న్యాయం పాటిస్తుందని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment