రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదు | Parthasaradhi Slams Chandrababu Naidu Over Nandyal Accident In Tadepalli | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కూర్చుని కుట్రలు చేస్తున్నారు

Published Thu, Nov 12 2020 6:38 PM | Last Updated on Thu, Nov 12 2020 8:56 PM

Parthasaradhi Slams Chandrababu Naidu Over Nandyal Accident In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదన్నట్లు మాజీ సీఎం చంద్రబాబును చిత్తుగా ఓడించిన ఆయన దరిద్రం రాష్ట్రానికి పోలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో బాధపడుతుంటే బాబు, ఆయన కొడుకు హైదరాబాద్‌లో దాక్కున్నారన్నారు. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంటున్న బాబు టీడీపీ హాయంలో మీ పార్టీ నాయకులు ఒక వీఆర్వోను బట్టలిప్పి కొట్టారు అది రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. ఒక మహిళ అధికారిని మీ పార్టీ శాసన సభ్యుడు జుట్టు పట్టుకుని ఈడ్చిన పాలనను రాక్షస పాలన అంటారన్నారు. మీకు చేతకాక, కులం మతం పేరుతో సాగిన మీ పరిపాలన అసమర్థ పరిపాలన అని విమర్శించారు. 

ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం, తప్పు చేసినా వారిని శిక్షించిన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌దని అని పేర్కొన్నారు. నంద్యాలలో జరిగిన ఘటన బాధాకరమని, బాబు తన రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడటం కూడా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాల ఘటన నిందితులను ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మీ లాయర్‌తో బెయిల్ ఇప్పించి పనయ్యాక పక్కన పెట్టిన ఘనత మీది అని, బాధితులకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం మాది అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: 'చంద్రబాబుకు, డబ్బా ఛానళ్లకు ఇవి కనపడవు')

అధికారంలో లేనప్పుడు తను పుట్టింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసమే అంటాడు, అదే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తారని ఎమ్మెల్యే విమర్శించారు. ఆనాడు నారా హమారా అంటూ సమావేశం పెడితే అందులో విన్నపాలు చేసే వారిని దేశ ద్రోహం కేసులు పెట్టిన ఘనత మీదని, బాబు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కనీసం మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. మీ కుమారుడు నారా లోకేష్‌ను మాత్రం దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్ అని ఆ రోజు కూడా ఈ రిజర్వేషన్లను అడ్డుకోడానికి కోర్టులో కేసు వేశారన్నారు. దాదాపు 3428 కోట్ల రూపాయలు సీఎం వైఎస్ జగన్ మైనారిటీల సంక్షేమ పథకాలకు అందించారని, ఆయన పరిపాలన ఎటువంటి వివక్షకు తావులేకుండా నడుస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కూర్చుని కుల, మత రాజకీయాలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (చదవండి: 'టీడీపీ సిగ్గుమాలిన చర్యలు ఎండగడతాం')

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement