pardhasaradhi
-
వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ కేబినెట్..
-
రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదు
సాక్షి, తాడేపల్లి: రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదన్నట్లు మాజీ సీఎం చంద్రబాబును చిత్తుగా ఓడించిన ఆయన దరిద్రం రాష్ట్రానికి పోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో బాధపడుతుంటే బాబు, ఆయన కొడుకు హైదరాబాద్‌లో దాక్కున్నారన్నారు. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంటున్న బాబు టీడీపీ హాయంలో మీ పార్టీ నాయకులు ఒక వీఆర్వోను బట్టలిప్పి కొట్టారు అది రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. ఒక మహిళ అధికారిని మీ పార్టీ శాసన సభ్యుడు జుట్టు పట్టుకుని ఈడ్చిన పాలనను రాక్షస పాలన అంటారన్నారు. మీకు చేతకాక, కులం మతం పేరుతో సాగిన మీ పరిపాలన అసమర్థ పరిపాలన అని విమర్శించారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం, తప్పు చేసినా వారిని శిక్షించిన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దని అని పేర్కొన్నారు. నంద్యాలలో జరిగిన ఘటన బాధాకరమని, బాబు తన రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడటం కూడా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాల ఘటన నిందితులను ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మీ లాయర్‌తో బెయిల్ ఇప్పించి పనయ్యాక పక్కన పెట్టిన ఘనత మీది అని, బాధితులకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం మాది అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: 'చంద్రబాబుకు, డబ్బా ఛానళ్లకు ఇవి కనపడవు') అధికారంలో లేనప్పుడు తను పుట్టింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసమే అంటాడు, అదే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తారని ఎమ్మెల్యే విమర్శించారు. ఆనాడు నారా హమారా అంటూ సమావేశం పెడితే అందులో విన్నపాలు చేసే వారిని దేశ ద్రోహం కేసులు పెట్టిన ఘనత మీదని, బాబు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కనీసం మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. మీ కుమారుడు నారా లోకేష్‌ను మాత్రం దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్ అని ఆ రోజు కూడా ఈ రిజర్వేషన్లను అడ్డుకోడానికి కోర్టులో కేసు వేశారన్నారు. దాదాపు 3428 కోట్ల రూపాయలు సీఎం వైఎస్ జగన్ మైనారిటీల సంక్షేమ పథకాలకు అందించారని, ఆయన పరిపాలన ఎటువంటి వివక్షకు తావులేకుండా నడుస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కూర్చుని కుల, మత రాజకీయాలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (చదవండి: 'టీడీపీ సిగ్గుమాలిన చర్యలు ఎండగడతాం') -
ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద ఉధృతి
సాక్షి, అమరావతి: గతవారం రోజుల పాటు మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ క్రమేణా శాంతిస్తోంది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది. దీంతో కృష్ణా కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 9467, పశ్చిమ డెల్టాకు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు బ్యారేజీ కన్జర్వేటర్ తెలిపారు. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు మరోసారి మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన.. పెనమలురు ముంపు గ్రామాల్లో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్య కొలుసు పార్థసారధి ఆదివారం ఉదయం పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు పరిశీలించారు. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. పునరావాసాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల బాధితులను అన్ని విధాలా ఆందుకుంటామని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. కరకట్ట వద్ద రిటర్నింగ్ వాల్‌ను నిర్శించాలని అక్కడి స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. -
వసతి గృహాల్లో సమస్యలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి హాస్టళ్లు పునఃప్రారంభం కానుండటం తో ఆలోపే అక్కడి సమస్యలను పరిష్కరిం చే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ వసతి గృహాలకు సెలవులు ఉన్నందున.. వీలైనన్ని ఎక్కువ హాస్టళ్లను సందర్శించాలని బీసీ సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విజిట్‌లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమా లు, పరిశీలన తీరును వివరించారు. సందర్శన అనంతరం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు నివేదికలు ఇవ్వాలని, ప్రాధా న్యతలను బట్టి నిధులు విడుదల చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశీలనకే ప్రాధాన్యత బీసీ హాస్టళ్ల పరిశీలన వ్యక్తిగతంగా చేపట్టాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితరాలను పరిశీలించాలి. ప్రస్తుతం హాస్టల్ కొనసాగుతున్న భవనం, నిర్మాణం తీరు, కరెంటు సరఫరా, బల్బులు, కరెంటు వైరింగ్, కిటికీలు, తలుపుల పరిస్థితి, హాస్టల్ పరిసరాల్లో చెత్త తొలగింపు, యూనిఫాం పంపిణీ, స్టాకు, పుస్తకాలు, కాపీల పంపిణీ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటీవల బీసీ వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వాటి వినియోగం, పనితీరు ఎలా ఉందనే దాన్ని పరిశీలించాలి. రాష్ట్రవ్యాప్తంగా 700 బీసీ హాస్టళ్లలో 634 వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 362 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. మిగతా 272 హాస్ట ళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. హాస్టల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించేందుకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పించారు. నిర్ణీత ప్రొఫార్మాలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతుంది. -
పెనమలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా నానినేషన్ వేసిన పార్థసారధి
-
‘ఓటమి భయంతోనే వరాలు’
సాక్షి, కృష్ణా: ఓటమి భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కురిపించడం హాస్యాస్పదమన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడంలో టీడీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయిందని మండిపడ్డారు. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి మోసానికి వడికట్టారని పార్థసారధి విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున బీసీలపై వరాల జల్లు కురిపిస్తూ కపట ప్రేమను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను టీటీడీ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిలో కుట్రకోణం లేదని చెప్పడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు. -
అమరావతి పేరు చెప్పి కాలం గడుపుతున్నారు
-
పోలవరం ప్రాజెక్టును టీడీపీ గాలికొదిలేసింది
-
బీజేపీ-టీడీపీకి ఉన్న అనుబంధం ఏంటి?
సాక్షి, విజయవాడ : ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును టీడీపీ గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ నేత పార్ధసారథి విమర్శించారు. అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టును కేవలం ఆర్భాటానికి, ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం ప్రాజెక్టు లోపాలకు కేంద్ర బృందం ఎత్తిచూపింది. రోజుకు 10 కోట్ల నుంచి 20 కోట్ల పనులు జరుగుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం నాణ్యతను పట్టించుకోవడంలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్‌వేలో గ్యాపులు ఉన్నాయి. కంకర తప్ప మరేమి కనబడడంలేదు. ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ముడుపులు ఇచ్చేవారికే సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. నిర్మాణంలో నాసిరకం సిమెంట్ ఉపయోగిస్తున్నారు. పర్మింట్ క్వాలిటి డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలి. 112.45 కోట్లు ఏలాంటి పనులు జరగకుండా దొచ్చుకున్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఉత్తర్వులు ఇస్తున్నారు. టీడీపీ-బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే బీజేపీ కళ్లు మూసుకుని ఉంది. వారిమధ్య ఉన్న అనుబంధం ఏంటి?. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం అవకతవకలపై విచారణ జరిపించాలి’’ అని పేర్కొన్నారు. -
రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు
-
‘పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం’
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి స్పష్టం చేశారు. అసలు పోలవరంకు పునాది వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అయితే, టీడీపీ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. పోలవరంతో సంబంధాలేని విషయాల్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాజాగా లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పార్థసారధి.. కనీసం రాజకీయ జ్ఞానం లేకుండా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దేవినేని ఉమ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఉమ చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకే జగన్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. దేవినేని స్థాయి మరచి మాట్లాడుతున్నారని, పోలవరం గురించి మాట్లాడే హక్కు వైఎస్సార్ వారసులకే ఉందనే విషయం గుర్తించుకోవాలన్నారు. ఉమ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఈ సందర్భంగా పార్థసారధి సవాల్ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు. ప్రాజెక్టులపై బీజేపీ, టీడీపీ ప్రజలను మోసం చేస్తూ ట్రిక్కులు చేస్తున్నాయని మండిపడ్డారు. ముందు మంత్రి ఉమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానేసి, రైతులకు మేలు చేసే విధంగా ఆలోచించాలన్నారు. జిల్లాల్లో చాలా చోట్ల నీరు లేక పంటలు ఎండిపోతున్న విషయం మంత్రలు గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. 2019లోగా పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం పూర్తిచేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పార్థసారధి తెలిపారు. ఉమకు సిగ్గుంటే చంద్రబాబు ప్రభుత్వంపై సీబీఐ విచారణకు చేయించుకునే దమ్ముందా? అని పార్థసారధి చాలెంజ్ విసిరారు. -
చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం దాసరి భవనంలో నాయిబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు యానాదయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బీసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ విషయాన్ని మరిచి బీసీల పట్ల అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హోదా వ్యక్తి బీసీ కులాలను కించపరిచేలా వ్యవహరించడం సబబు కాదన్నారు. నాయీ బ్రాహ్మణులపై అనుచితంగా ప్రవర్తించినందుకు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. పార్థసారధి, జంగా కృష్ణమూర్తి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ( వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), దోనెపూడి శంకర్(సీపీఐ), కుమారస్వామి, బాజీ(బీజేపీ), పలువురు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు అందుకే యూటర్న్’
సాక్షి, అమరావతి: తమకు పదవుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్సార్సీపీ నేత పార్థసారధి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమమవుతుందని, హోదా కోసం తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని అన్నారు. హోదాని చంద్రబాబు నాయుడు అవహేళన చేశారని ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏపీ సీఎం ముఖ్యకారణమంటూ విమర్శించారు. హోదాపై వైఎస్సార్సీపీ పోరాటాన్ని చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, మొదటి నుంచి ప్రత్యేక హోదాకు బాబు వ్యతిరేకమని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని పార్థసారధి పేర్కొన్నారు. ఏప్రిల్ 6న వైఎస్సార్సీపీ నేతలు తమ ఎంపీ పదవులకు చేసిన రాజీనామాలు నేడు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. -
రాయలసీమను కోనసీమ చేస్తారా?
సాక్షి, వైఎస్సార్ కడప : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎఎస్ రాజశేఖరరెడ్డేనని.. రాయలసీమ సాగునీటి కోసం వైఎస్సార్, చంద్రబాబు ఎవరేం చేశారో చర్చకు సిద్దమా అంటూ పార్థసారథి టీడీపీ నాయకులైన ఆదినారాయణ రెడ్డి, దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. వైఎస్సార్ జిల్లా జయరాజ్ గార్డెన్స్‌లో శనివారం ఏర్పాటుచేసిన కమలాపురం, జమ్మలమడుగు బూత్ కమిటీల శిక్షణా కార్యక్రమానికి హాజరైన పార్థసారిథి మాట్లాడుతూ... రాయలసీమను కోనసీమ చేస్తారా.. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచినప్పుడు ధర్నా చేసిన ఉమా ఇప్పుడు సీమ గురించి మాట్లాడతాడా అంటూ ఆయనపై ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రజలు దేవినేని ఉమను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీసీలను హైకోర్టు జడ్జి కాకుండా అడ్డుకునేందుకు లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.మైనార్టీల గురించి ఆలోచించిన మొదటివ్యక్తి వైఎస్సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఐటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్ రెడ్డి, దుగ్గాయపల్లి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలు నష్టపోవడానికి కారణం చంద్రబాబే
-
చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్
-
మీ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ముందా?
-
పోలవరాన్ని జాతీయ స్కాంగా మార్చారు
సాక్షి, హైదరాబాద్: పోలవరం జాతీయ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి కుంభకోణంగా మార్చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే ఒక నెల వ్యవధిలోనే చంద్రబాబు పదవీచ్యుతుడై జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, ఇష్టారాజ్యంగా పెంచేసిన నిర్మాణ అంచనా వ్యయం, కాంట్రాక్టు అక్రమాలపై వస్తోన్న విమర్శలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రే స్వయంగా సీబీఐ విచారణను కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో సాగుతున్న అవినీతి, అక్రమాలపై వైఎస్సార్సీపీ ఇంతకాలంగా చెప్తోందని, రైతుల నుంచి తాజాగా అందిన ఫిర్యాదులపై ప్రధాని కార్యాలయం కూడా స్పందించిందని చెప్పారు. తాము ఆరోపించిన అక్రమాలపై కేంద్రం నేడు ప్రశ్నిస్తోందని తెలిపారు. ఈ విషయాలపై పోలవరం అథారిటీ మెంబరు సెక్రటరీ æడాక్టరు ఆర్కే గుప్త ఏపీ జలవనరుల శాఖ ఇంజనీరు–ఇన్–చీఫ్‌ను వివరణ అడిగారని... గుప్త రాసిన లేఖను మీడియా ముందుంచారు. పోలవరంపై సీబీఐ విచారణ జరగాలి : చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నుంచి అందినకాడికి దోచుకోవాలనే చూస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును ఒక బంగారు బాతులాగా చూస్తున్నారని, జరగని పనిని జరిగినట్లు చూపించి కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసి తన వంతు వాటా నిధులను కొట్టేస్తున్నారని ఆరోపించారు. -
వామ్మో ఉల్లి.. పెరిగింది మళ్లీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ఘాటెక్కింది. తాత్కాలిక కొరతతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ.20–25 ఉన్న ఉల్లి.. ఇప్పుడు దాదాపు రెట్టింపయింది. రిటైల్ మార్కెట్లో కిలో రూ.40 వరకు పలుకుతోంది. మలక్‌పేట్ మార్కెట్లో హోల్‌సేల్‌గా నాణ్యమైన ఉల్లి కిలో రూ.28.. మెత్తబడి, అంతగా బాగా లేని ఉల్లి రూ. 20 వరకు పలుకుతోందని మార్కెటింగ్ వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ కొరత వల్ల రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. 10 రోజుల్లో 80 శాతం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు ఉంటాయి. వీటిలో మహారాష్ట్ర నుంచే రాష్ట్రానికి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. అయితే దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గావ్లో 10 రోజుల్లోనే 80 శాతం మేర ఉల్లి ధరలు పెరిగినట్లు తెలిసిందని, ఆ కారణంగానే తెలంగాణలో ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గతేడాది ఉల్లికి గిట్టుబాటు కాక ఈసారి సాగు విస్తీర్ణం తగ్గిందని, దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని మార్కెట్లు వారం రోజులు మూసేస్తారని, ఆ ప్రభావమూ ధరల పెరుగుదలపై ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లోనే.. మార్కెట్లో ఉన్న ఉల్లి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉత్పత్తి అయిందే. నిల్వ చేసిన ఉల్లిలోనూ 30 శాతం వరకు వానలకు దెబ్బతిన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడం.. భారీ వర్షాలు, వరదలతో పంట దెబ్బతిని ఉల్లి మార్కెట్‌కు రావడం లేదు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో 10 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. దీంతో రాష్ట్ర అవసరాలు తీరడం లేదు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచుతున్నారని ఆరోపణలున్నాయి. పెరిగింది వాస్తవమే.. మహారాష్ట్ర సహా ఉల్లి సాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిన్నది. వర్షం, తేమ వల్ల నిల్వ ఉంచిన ఉల్లి చెడిపోతోంది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి కిలో రూ.40 పలుకుతోంది. ఇది తాత్కాలికమే. త్వరలో ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాం. – పార్థసారథి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి -
పోలవరంకు శంకుస్థాపన చేసిందెవరు?
విజయవాడ: కృష్ణా డెల్టాపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. కృష్ణా డెల్టాకు తానొచ్చిన తర్వాతే నీళ్లు వచ్చాయని బాబు చెప్పుకోవడం శోచనీయమన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అప్పట్లో సీఎం ఉన్న చంద్రబాబు కృష్ణా డెల్టాకు అన్యాయం చేశారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులను తానే అనుసంధానించినట్టు ఆయన చెప్పుకోవడాన్ని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే గోదావరి, కృష్ణా అనుసంధానికి బీజం పడిందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందెవరని ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎప్పుడు అనుమతులు లభించాయని నిలదీశారు. వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టడానికి ఆయన ప్రయత్నిస్తే టీడీపీ నాయకులు, తమ వర్గంతో అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. మీ వర్గానికి సంబంధించిన రైతాంగాన్ని రెచ్చగొట్టి కేసులు వేయించి అడ్డుపడింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని పార్థసారధి అన్నారు. -
కేసీఆర్‌కు భయపడే చంద్రబాబు..
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం చంద్రబాబు పెట్టినవి అయిదు సంతకాలు కావని, అయిదు వెన్నుపోట్లు అని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబావబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని అన్నారు. కేసీఆర్‌కు భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయారన్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, 600 హామీల్లో ఏ ఒక్కటీ ఆయన అమలు చేయాలేదని విమర్శించారు. ఈ మూడేళ్లలో చంద్రబాబు ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు పెరిగాయన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రాజధాని భూముల కుంభకోణం, ఉచిత ఇసుక, చెట్టు-నీరు, పోలవరం, పట్టిసీమ, విశాఖలో భూకబ్జాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
-
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
విజయవాడ: నరసరావుపేటలో వైఎస్ జగన్ బహిరంగ సభను చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు. మంత్రి దేవినేని ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. ప్లేస్, టైమ్ దేవినేని ఉమానే డిసైడ్ చేసుకోవాలని పార్థసారధి సవాల్ విసిరారు. ప్రజలకు చేసిన మోసాలపైనా, అవినీతిపైనా వైఎస్సార్సీపీ చర్చకు సిద్ధమన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అభ్యర్థులుండరని మాట్లాడుతున్న మంత్రి ఉమ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన బహిరంగ సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి శుక్రవారం నరసరావుపేటలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
'హోదాను చంద్రబాబే అడ్డుకుంటున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా సీఎం చంద్రబాబే అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబును చూసి తుపానే కాదు మబ్బులు కూడా పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం లేదన్న వాదనను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఇప్పటికే హోదా పొందిన 11 రాష్ట్రాల్లో అభివృద్ధి లేదనడం అవివేకమన్నారు. అభివృద్ధి విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోటీపడుతున్నారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల హక్కులను బాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రమైనా తెలంగాణలోఅక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేని అసమర్థుడని విమర్శించారు. కృష్ణానదిని ఎడారిగా మారుస్తున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'ఉచిత యిసుక పేరుతో వందల కోట్ల లూటీ'
హైదరాబాద్: ఉచిత యిసుక పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయాలు లూటీ చేసి టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా ఉచిత యిసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. జన్మభూమి కమిటీల అవినీతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులో టీడీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్డీఎఫ్ ను, టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారని ఆక్షేపించారు. ఓడిపోయిన వారికి, టీడీపీ కార్యకర్తలకు వందల కోట్లు కేటాయించడానికి సీఎంకు అధికారం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల పేరు మీద జీవోలు ఇచ్చి నిధులు కేటాయించడం సరికాదన్నారు. విచారణ జరిపి పక్షపాతధోరణితో కేటాయించిన నిధులు నిలుపుదల చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు.