
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
విజయవాడ: నరసరావుపేటలో వైఎస్ జగన్ బహిరంగ సభను చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు.
మంత్రి దేవినేని ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. ప్లేస్, టైమ్ దేవినేని ఉమానే డిసైడ్ చేసుకోవాలని పార్థసారధి సవాల్ విసిరారు. ప్రజలకు చేసిన మోసాలపైనా, అవినీతిపైనా వైఎస్సార్సీపీ చర్చకు సిద్ధమన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అభ్యర్థులుండరని మాట్లాడుతున్న మంత్రి ఉమ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన బహిరంగ సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి శుక్రవారం నరసరావుపేటలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.