
సాక్షి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ సీఎం చేయని రీతిలో దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేశారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా వారింటికి సంక్షేమం చేరటంతో ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. ద్వారకాతిరుమల మండలంలో కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడారు.
జగనన్నకు ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంతమందితో కలిసి వచ్చినా భయపడేది లేదని అన్నారు. ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేందుకు డిసైడ్ అయిపోయారని పేర్కొన్నారు.
‘చంద్రబాబుది విజన్ అయితే.. 2019లో ఎందుకు అది పాయిజన్ అయిందో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. అమ్మ ఒడి పథకాన్ని గతంలో ఎందుకు పెట్టలేదు. రెండువేల పైచిలుకు వ్యాధులకు ఆరోగ్య శ్రీలో చికిత్స ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు విజన్ అంటే దోచుకోవడం దాచుకోవడమేనా?. నేను చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపు నుంచైనా నాకు నెలకు, సంవత్సరానికి గాని ఎవరైనా ఒక్క రూపాయి అయినా నాకు ఇచ్చారనీ నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతా’ అని తానేటి వనిత తెలిపారు.
అలాగే.. గోపాలపురం నియోజవర్గం అనేది తన స్వస్థలమని తెలిపారు. తన తండ్రి బాబాజీ రావు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ప్రజలకు తాను సుపరిచితురాలనేనని.. తనకు పుట్టింటికి వచ్చినట్లుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment