సాక్షి, తూర్పుగోదావరి: సెంట్రల్ జైల్ నుంచి షూరిటీపై. బయటకొచ్చిన చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్. బుధవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన మేనిఫెస్టో అమలుకు లక్ష కోట్ల రూపాయలు అవసరం.. సంపద ఎలా సృష్టిస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.
కొడుకు భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మార్గాని భరత్ ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన ఎంపీ.. మేనిఫెస్టోను టీడీపీ వెబ్ సైట్ నుంచి తొలగించారంటూ దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబే అవినీతి తిమింగలం అని మరోసారి నిగ్గు తేలింది. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్న షర్మిళ మరోసారి ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయింపుల్లో కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మార్గాని భరత్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ?
Comments
Please login to add a commentAdd a comment