సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని,పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్సార్‌సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌరసేవలందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారు?. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయించడమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చుకున్నాడు.
..చంద్రబాబు లెటర్లు రాసి, ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదు. సీఎం జగన్‌ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడ కలలు వస్తాయి.
..పెన్షనర్ల పరిస్థితికి చంద్రబాబే కారణం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం అవస్థలు పడ్డారు. చంద్రబాబు ఏనాడు సరిగ్గా పెన్షన్లు అందించలేదు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. చంద్రబాబు, ఆయన ముఠా కారణంగా పెన్షనర్లకు అవస్థలు.
.. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరచిపోలేదు. పెన్షనర్ల శాపాలు చంద్రబాబుకు తగులుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఉంది. కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం.
.. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అడ్డగోలుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించటం లేదు. ఈ దేశంలో ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయాడు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment