సాక్షి, శ్రీ సత్యసాయి: టీడీపీ నేతల దౌర్జన్యంతో పుట్టపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలో సత్యమ్మ ఆలయం వద్దకు శ్రీధర్ రెడ్డి చేరుకోగా.. టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఏకంగా శ్రీధర్ రెడ్డి పైకి దూసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా కారుపైకి ఎక్కి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు పల్లె. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
ఆరోపణలపై బహిరంగ చర్చకు లోకేష్, పల్లె సిద్ధమా?
ఆరోపణలపై బహిరంగ చర్చకు లోకేష్, పల్లె రఘనాథ్‌రెడ్డిలు సిద్ధమా అని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఐదేళ్లు అధికారంలో ఉండి పుటపర్తికి పల్లె రఘునాథ్ ఏం చేశారో చెప్పాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పల్లె రఘునాథ్‌రెడ్డి కనుమరుగైన రాజకీయ నేత అని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పుటపర్తి జిల్లా ఏర్పాటు చేసుకున్నామని, పుటపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment