duddukunta sreedhar reddy
-
చంద్రబాబు.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
-
చంద్రబాబు ఏదో కొత్త స్కిల్ వాడుతున్నాడు: దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి కామెంట్స్
-
2024 ఎన్నికల్లో పుట్టపర్తిపై ఎగిరేది వైఎస్సార్ సీపీ జెండానే
అనంతపురం: ‘‘పుట్టపర్తి ప్రాంత ప్రజలు మూడు పర్యాయాలు అధికారం ఇస్తే పల్లె రఘునాథరెడ్డి మొద్దు నిద్రలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. నాలుగేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు. మందళగిరి మాలోకం లోకేష్‌తో కలసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికై నా పల్లె రఘునాఽఽథరెడ్డి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. లేకపోతే ప్రజలే రాజకీయ సమాధి కడతారు’’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను పుట్టపర్తి నుంచి రోజూ 200 టిప్పర్లతో ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్నానని, బెంగళూరు నుంచి లిక్కర్ ఇక్కడికి తీసుకువస్తున్నానని, బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నానంటూ ‘యువగళం’లో లోకేష్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, ఇది అతని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. నిజంగా లోకేష్‌కు, పల్లె రఘునాథరెడ్డికి దమ్ముంటే నిరూపించాలన్నారు. 12 కేసులుంటేనే టీడీపీ టికెట్ అడగాలని లోకేష్ బహిరంగ సభలో చెప్పడం అతని రౌడీ సంస్కృతికి నిదర్శనమన్నారు. లోకేష్ లాంటివారు యూపీ, బిహార్లలో పార్టీలు పెట్టుకుంటే మంచిదని, ఏపీలో ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేయించి ఈ ప్రాంత శాశ్వత అభివృద్ధికి బాటలు వేశామన్నారు. నిజంగా పల్లె రఘునాథ రెడ్డికి ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే.. బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తున్న ‘పల్లె’ తన వ్యవసాయ కళాశాలను ఇక్కడ కాకుండా బుక్కరాయసముద్రంలో ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. మా పాలన అభివృద్ధికి నిర్వచనం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా తాము కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. అలాగే అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. అందుకే తమ పాలనను అభివృద్ధికి నిర్వచనంగా జనమే చెప్పుకుంటున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ‘ప్రజాసంకల్ప’యాత్రలో నల్లమాడ బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంతంలో కరువును శాశ్వతంగా పారదోలేందుకు రూ.864 కోట్లతో 193 చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటిని నింపే కార్యక్రమానికి పరిపాలనా అనుమతులు తెచ్చామన్నారు. 3 టీఎంసీల నీటిని కూడా అధికారికంగా కేటాయింపులు చేయించామన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల మీదుగా ఎన్‌హెచ్–342, గ్రీన్ ఫీల్డ్ హైవేలను నిర్మిస్తున్నామని, నియోజకవర్గంలోని నిరుపేదల కోసం 25 వేల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. అభివృద్ధిలో తనతో పోటీ పడలేకే ‘పల్లె’ కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారన్నారు. ఆయనకు చేతనైతే అభివృద్ధిలో తమతో పోటీ పడాలని హితవు పలికారు. ఇప్పటికై నా అసత్య ఆరోపణలు మానుకోకపోతే రాబోవు రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. న్యాయ పోరాటం చేస్తాం.. లోకేష్ తనపై చేసిన ఆరోపణలకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వెళ్లేలోపు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. పుట్టపర్తి ప్రాంత అభివృద్ధికి, ప్రశాంతతకు తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామన్నారు. ‘పల్లె’ తన రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టే చర్యలకు దిగడం వల్లే వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. -
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, శ్రీ సత్యసాయి: టీడీపీ నేతల దౌర్జన్యంతో పుట్టపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలో సత్యమ్మ ఆలయం వద్దకు శ్రీధర్ రెడ్డి చేరుకోగా.. టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఏకంగా శ్రీధర్ రెడ్డి పైకి దూసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా కారుపైకి ఎక్కి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు పల్లె. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఆరోపణలపై బహిరంగ చర్చకు లోకేష్, పల్లె సిద్ధమా? ఆరోపణలపై బహిరంగ చర్చకు లోకేష్, పల్లె రఘనాథ్‌రెడ్డిలు సిద్ధమా అని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఐదేళ్లు అధికారంలో ఉండి పుటపర్తికి పల్లె రఘునాథ్ ఏం చేశారో చెప్పాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పల్లె రఘునాథ్‌రెడ్డి కనుమరుగైన రాజకీయ నేత అని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పుటపర్తి జిల్లా ఏర్పాటు చేసుకున్నామని, పుటపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి -
సీఎం వైఎస్ జగన్‌తో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భేటీ
సాక్షి, అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాజకీయ, సామాజిక, అభివృద్ధి పనులపై చర్చించారు. సీఎం జగన్‌తో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భేటీ పుట్టపర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నియోజకవర్గంలో అత్యధికంగా జాతీయ రహదారుల మంజూరు, రికార్డు స్థాయిలో 25 వేల పక్కా గృహ నిర్మాణాలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్ నుంచి నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు మీదుగా బాగేపల్లి వరకూ జాతీయ రహదారి ఏర్పాటుకు సహకరించాలని వినతపత్రం సమర్పించారు. చదవండి: (పెద్దిరెడ్డి కాన్వాయ్ ప్రమాదంలో కుట్రకోణం) -
కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట
పుట్టపర్తి టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సకాలంలో ఆస్పత్రికి చేర్చి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా.. తన సొంత పనిపై శనివారం రాత్రి అనంతపురానికి బయలుదేరిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి... జిల్లా కేంద్రానికి చేరువవుతుండగా రోడ్డు పక్కనే రక్తం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి పరిశీలించగా క్షతగాత్రుడు చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మురళీగా గుర్తించారు. బైక్‌పై వెళుతూ అదుపు తప్పి కిందపడినట్లుగా తెలుసుకున్న ఆయన వెంటనే క్షతగాత్రుడిని తన వాహనంలో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’ -
ఆరోపణలు నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా
సాక్షి, పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, పల్లె రఘునాథరెడ్డి మతిభ్రమించి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా..లేదంటే పరువు నష్టం దావా వేస్తానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పల్లె రఘునాథరెడ్డి ఇచ్చిన పేపర్‌క్లిప్పింగ్ తీసుకొని 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు అపద్ధాలు చెప్పడంలో దిట్ట అని, అవగాహన లేకుండా తాను జగన్మోహన్రెడ్డి బినామీ అని, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌నాయుడు తన వల్లే ఉద్యోగం పోయిందని ఆరోపణలు చేయడంలో వాస్తవం లేదన్నారు. దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. 1997లో కక్షసాధింపుగా అతన్ని తొలగించాలని చూస్తే భాస్కర్‌నాయుడును తానే కాపాడానని అన్నారు. పుట్టపర్తి అభివృద్ధి పేరిట దోపిడీ పుట్టపర్తి అభివృద్ధి పేరిటరూ. 200 కోట్లు దోచుకున్న విషయం మీది అని శ్రీధర్‌రెడ్డి గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి రాగానే పిల్ల కాలవల జీవో రద్దు చేసి, 2013 భూసేకరణచట్టం ప్రకారం పెద్దకమ్మవారిపల్లి రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా అనంతపురం రైతులకు సాగు నీరు ఇవ్వకుండా కుప్పానికి హంద్రీనీవా కాలువ ద్వారా తీసుకెళ్లిన చరిత్ర చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కోడ్‌కు విరుద్ధంగా అర్ధరాత్రి నాయకులను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం పల్లెకే చెల్లిందన్నారు. అధికారం ఉన్న ఐదేళ్లూ నిద్రపోయి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూ.3200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేశానని చెప్పి, ఓటర్లను మళ్లీ మోసం చేస్తున్నారన్నారు. పల్లె గిమ్మిక్కులకు మోసం పోయే పరిస్థితులో ప్రజలు లేరన్నారు. కార్యక్రమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ మాధవరెడ్డి, గంగాద్రి, అవుటాల రమణారెడ్డి, ఏవీ రమణానెడ్డి, తిప్పన్న, శివప్ప, బిల్డర్శివ, జ్యోతికేశవ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నామినేషన్
-
రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ఓడీ చెరువు : రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఓడీ చెరువు,అమడగూరు,బుక్కపట్నం,కొత్తచెరువు మండలాలకు వాతావరణబీమా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఓడీ చెరువులో శనివారం రైతు మహాధర్నా నిర్వహించారు. దుద్దుకుంట మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు బీమా ప్రకటించి, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం నల్లమాడ,పుట్టపర్తి మండలాలకు మాత్రమే అరకొరగా మంజూరు చేసి మిగిలిన ఓడీ చెరువు, అమడగూరు, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలకు అన్యాయం చేసినట్లు తెలిపారు. 2015లో తుఫాన్‌తో పంట పూర్తిగా పొలాల్లో కుళ్లిపోతే అప్పటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఐటీ మంత్రి హోదాలో పల్లె పంటలు పరిశీలించి, ఆదుకుంటామని హామీ ఇచ్చి నేటికీ నయాపైసా ఇవ్వలేదన్నారు. 2016లో పంట పూర్తిగా ఎండిపోయి గ్రాసం కూడా దక్కలేదన్నారు. 2017లో సకాలంలో వర్షాలు కురవ పంట నష్టపోతే వాతావరణబీమా ఇవ్వలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే నియోజక వర్గంలోని 193 చెరువులకు హంద్రీనీవా ద్వారా నీరందించి, రైతుల కళ్లల్లో ఆనందాన్ని తీసుకొస్తామన్నారు. రైతు మహాధర్నాలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మలక అశ్వర్థరెడ్డి, కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, శేషురెడ్డి, గంగాధర్. మాధవరెడ్డి, రామాంజనేయులు, బీసీ జనసభ మండల అధ్యక్షుడు ఎం.ఎస్.షబ్బీర్, రైతులు ఆదిశేఖర్, రామ్మోహన్‌రెడ్డి, కేశవ, రఫిక్, ఆనంద్‌రెడ్డి, ఎద్దుల సతీష్‌రెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చెట్ల నరికివేత పిరికిపందల చర్య
బుక్కపట్నం : మండలంలోని గూనిపల్లిలో రామలింగారెడ్డికి చెందిన 400 చీనీ చెట్లు నరికివేత పిరికిపందల చర్య అని వైఎస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి బాధిత రైతు తోటను పరిశీలించారు. అండగా ఉంటానని రైతుకు భరోసా ఇచ్చారు. దుశ్చర్యకు బాధ్యుడైన రాశింపల్లికి చెందిన డీఎస్పీ కేశన్నపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత రైతుకు న్యాయం చేయాలని కొత్తచెరువు సీఐ శ్రీధర్, తహసీల్దార్ ఉషారాణితో శ్రీధర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధిత రైతు భార్య మాట్లాడుతూ డీఎస్పీ నుంచి తనకు ప్రాణహాని ఉందని విలపించింది. దుద్దుకుంట మాట్లాడుతూ అవసరమైతే ఈ విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని బాధితులను ఓదార్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.హెచ్ బాషా, మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, మారాల, గూనిపల్లి సహకార సంఘాల అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, మల్లికార్జున, గూనిపల్లి, బుక్కపట్నం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, కందుకూరి ఓబులేసు, చెరువు సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కేపీ నాగిరెడ్డి, హరినాథరెడ్డి, కేశప్ప, మాజీ ఎంపీటీసీ చెన్నారెడ్డి, కృష్ణారెడ్డి, బయపరెడ్డి, బుక్కపట్నం పంచాయితీ కమిటీ సభ్యులు శీనా, ఈశ్వర్, అగ్రహారం బాబు, పతంజలి తదితరులు పాల్గొన్నారు.