చెట్ల నరికివేత పిరికిపందల చర్య | sreedhar reddy consoles victims | Sakshi
Sakshi News home page

చెట్ల నరికివేత పిరికిపందల చర్య

Jan 1 2017 11:24 PM | Updated on May 25 2018 5:49 PM

చెట్ల నరికివేత పిరికిపందల చర్య - Sakshi

చెట్ల నరికివేత పిరికిపందల చర్య

మండలంలోని గూనిపల్లిలో రామలింగారెడ్డికి చెందిన 400 చీనీ చెట్లు నరికివేత పిరికిపందల చర్య అని వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు.

బుక్కపట్నం : మండలంలోని గూనిపల్లిలో రామలింగారెడ్డికి చెందిన 400 చీనీ చెట్లు నరికివేత పిరికిపందల చర్య అని వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి బాధిత రైతు తోటను పరిశీలించారు.  అండగా ఉంటానని రైతుకు భరోసా ఇచ్చారు. దుశ్చర్యకు బాధ్యుడైన రాశింపల్లికి చెందిన డీఎస్పీ కేశన్నపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత రైతుకు న్యాయం చేయాలని కొత్తచెరువు సీఐ శ్రీధర్, తహసీల్దార్‌ ఉషారాణితో శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా బాధిత రైతు భార్య మాట్లాడుతూ డీఎస్పీ నుంచి తనకు ప్రాణహాని ఉందని విలపించింది. దుద్దుకుంట మాట్లాడుతూ అవసరమైతే ఈ విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని బాధితులను ఓదార్చారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ కేశవరెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.హెచ్‌ బాషా, మండల కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, మారాల, గూనిపల్లి సహకార సంఘాల అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, మల్లికార్జున, గూనిపల్లి, బుక్కపట్నం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, కందుకూరి ఓబులేసు, చెరువు సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కేపీ నాగిరెడ్డి, హరినాథరెడ్డి, కేశప్ప, మాజీ ఎంపీటీసీ చెన్నారెడ్డి, కృష్ణారెడ్డి, బయపరెడ్డి, బుక్కపట్నం పంచాయితీ కమిటీ సభ్యులు శీనా, ఈశ్వర్, అగ్రహారం బాబు, పతంజలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement