Minister DEVINENI Uma
-
మంత్రి ఇలాకాలో అక్రమ మైనింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: పర్యావరణానికి తూట్లు పొడుస్తూ కాలుష్యం వెదజల్లుతున్న అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించినా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో మాత్రం వీటికి తెరపడటం లేదు. పర్మిట్లు రద్దు చేసినా నెల దాటుతున్నా ఉన్నతస్థాయి అండదండలతో మైనింగ్ మాఫియా నిత్యం వేలాది టన్నుల కంకరను తరలిస్తోంది. జాతీయ రహదారి చెంతనే.. నందిగామ, మైలవరం నియోజవర్గాల పరిధిలోని కంచికచర్ల మండలం పరిటాల దొనబండ సర్వేనంబర్ 801లో 1,204 హెక్టార్ల కొండపోరంబోకు భూములున్నాయి. సహజవనరులు విస్తరించిన ఇక్కడి భూముల్లో 94 క్వారీలు, 72 క్రషర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఈ క్వారీలున్నాయి. నిబంధనల ప్రకారం జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో వీటిని ఏర్పాటు చేయకూడదు. కానీ వంద మీటర్ల లోపే క్రషర్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరికి 2 నుంచి 5 హెక్టార్ల చొప్పున 94 క్వారీల నిర్వహణకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 800 హెక్టార్లలో క్వారీలు తవ్వేశారు. కొండలను తొలిచేశారు. నిత్యం 500 వాహనాల్లో తరలింపు.. పరిటాల పరిధిలో మంత్రి సమీప బంధువులతోపాటు మోడరన్ క్రషర్, పవన్స్టోన్ క్రషర్, అయ్యప్ప క్రషర్, ఎన్ఎన్ఆర్ క్రషర్స్ యజమానులే అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్వారీల నుంచి పెద్ద బండరాళ్లను క్రషర్ ద్వారా 40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, డస్ట్, బేబీ చిప్స్, జీఎస్బీ వెట్మిక్స్లా మార్చి నిత్యం 500 భారీ వాహనాల్లో 21,000 టన్నుల కంకరను రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం నుంచి భవన నిర్మాణాల వరకు రవాణా చేస్తున్నారు. 10 టైర్ల వాహనంలో 16 టన్నుల లోడ్ వెళ్లాల్సి ఉంటే 30 టన్నులు తరలిస్తున్నారు. 12 టైర్ల వాహనంలో 22 టన్నులకు బదులు 60 టన్నుల చొప్పున తరలిపోతున్నా పోలీస్, రవాణాశాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. నిత్యం రూ. 1.2 కోట్ల విలువైన మెటల్‌ను తరలిస్తున్నారు. గుండెలు అదిరేలా బ్లాస్టింగ్లు.. పరిటాల క్వారీల్లో అనుమతులు లేకుండా నిత్యం రిగ్గు బ్లాస్టింగ్లు చేయడంతో దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపిస్తోంది. వాస్తవంగా క్వారీ నిర్వాహకులు 15 నుంచి 20 అడుగుల వరకు నిపుణుల పర్యవేక్షణలో బ్లాస్టింగ్ ద్వారా రెండు కొండ రాళ్ల మధ్య మట్టిని మాత్రమే తొలగించాలి. బ్లాస్టింగ్ చేసేటప్పుడు తప్పక హెల్మెట్ వాడాలి. బ్లాస్టింగ్‌లో డిప్లొమా చేసిన నిపుణులు ఉండాలి. పోలీస్, ఫైర్‌శాఖ అనుమతులు పొందాలి. కానీ ఇక్కడ ఏ ఒక్క నిబంధనా పాటించడం లేదు. బోర్లు వేసే రిగ్గు వాహనాలతో 150 నుంచి 200 అడుగుల వరకు గోతులు తవ్వి అమ్మోనియా, జెలిటిన్‌స్టిక్, యూరియా, గంధకం, సాల్టు నింపి బ్లాస్టింగ్ చేస్తున్నారు. ప్రమాదకరమైన జెలిటిన్‌స్టిక్ వాడటంతో భూమి కంపిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రితో మైనింగ్ మాఫియాకు బంధుత్వం ఉండటంతో ఎన్నికల సమయంలో నజరానాగా నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో రూ.30 కోట్లు ఫండ్‌గా అందచేసినట్లు చెబుతున్నారు. రాళ్ల కింద బతుకులు సమాధి క్వారీల్లో పనిచేసేందుకు ఒడిశా, వైజాగ్, జార్కండ్, చత్తీస్ఘడ్ ప్రాంతాల నుంచి వేలాది మందిని రప్పిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొండ రాళ్లు పడి పలువురు కార్మికులు మృతి చెందారు. చనిపోయిన విషయం కూడా వెలుగులోకి రానివ్వకుండా ప్రాణాలకు వెలకట్టి గుట్టుగా మృతదేహాలను తరలిస్తున్నారు. క్వారీల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే బెదిరించి వెళ్లగొడుతున్నారు. పర్మిట్లు రద్దు చేసినా.. భద్రతా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడం, కాలుష్యం కారణంగా పరిటాల సమీపంలోని రాతి క్వారీల్లో పనులు నిలుపుదల చేయాలని కాలుష్య నియంత్రణ మండలి గత నెల 20న ఆదేశాలిచ్చింది. కానీ కంకర తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దొనబండలో 40 క్వారీలకు పర్మిట్లు లేకపోయినా మెటల్‌ను తరలిస్తున్నారు. నిత్యం వే బిల్లులు లేకుండా క్వారీల నుంచి 500 లారీల కంకరను తరలిస్తున్నారు. లారీల బంద్ జరుగుతున్నా ఇక్కడ మాత్రం వాహనాలు తిరుగుతున్నాయి. వేబిల్లులు లేకుండా తరలిస్తున్నారు... వే బిల్లుల జారీ నెల రోజుల క్రితమే ఆపేసినా కంకర మాత్రం తరలుతోంది. నిత్యం రిగ్గు బ్లాస్టింగ్ పేలుళ్లతో బెంబేలెత్తిపోతున్నాం. భూకంపం వచ్చినట్లుగా కంపిస్తోంది. క్వారీల్లో అక్రమాలపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. – ఎన్ అమ్మారావు(గాంధీ), స్థానికుడు, పరిటాల నోటీసులు ఇచ్చినా ఆగడం లేదు... రాతి క్వారీల్లో పనులు నిలుపుదల చేయాలని పొల్యూషన్ కంట్రోలు బోర్డు ఆదేశించడంతో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చాం. పీసీబీ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ క్వారీలను నడుపుతున్నారు. క్వారీలను నిలిపేందుకు నాకు ఇబ్బందులున్నాయి. – వైఎస్ బాబు, మైనింగ్ అధికారి -
హత్యారాజకీయాలు,ఆర్థిక నేరాలు చేసింది నీవే
-
పోలీసులపై మంత్రి దేవినేని అనుచరుల దౌర్జన్యం
-
జగడం
మేయర్ x డీసీఆర్ - లెక్కలేనితనంపై మేయర్ గుర్రు - పాలనాపరమైన విషయాలు చెప్పనవసరం లేదంటున్న డీసీఆర్ బకాయిలు చెల్లించేందుకు నెలాఖరు వరకు గడువు ఉంది. వెబ్సైట్లో మొండి బకాయిదారుల జాబితా పెట్టేప్పుడు కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఇది మంచిపద్ధతి కాదు. ఆంధ్ర రత్నభవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాల యం) ఏళ్ల తరబడి పన్ను చెల్లించడం లేదు. జాబితాలో పేరు ఎందుకు చేర్చలేదు. ఏమైనా అంటే సారీ అంటున్నారు. డీసీఆర్ వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదు. కమిషనర్‌తోనే తేల్చుకుంటా. – కోనేరు శ్రీధర్,మేయర్, విజయవాడ. డిఫాల్టర్స్ లిస్ట్‌లో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అందుకే సరిచేస్తున్నాం. సర్కిళ్ల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగానే జాబితాను వెబ్సైట్లో ఉంచాం. అప్డేట్ చేయకపోవడం పొరపాటే. అయినంత మాత్రాన ఎవరిపై చర్యలు తీసుకోలేం. పరిపాలనాపరమైన అంశాలకు సంబంధించి మేయర్‌తో చర్చించాల్సినఅవసరం లేదు. అందుకే ఆయనకు చెప్పలేదు. – సుబ్బారావు,డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) విజయవాడ సెంట్రల్ : నగర పాలక సంస్థలో హద్దుమీరిన రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వివాదాస్పదమైంది. నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ డిఫాల్టర్స్ లిస్ట్‌ను వెబ్సైట్లో పెట్టడం, అందులో టీడీపీ ప్రజాప్రతినిధుల పేర్లు ప్రముఖంగా ఉండటంతో కథ అడ్డం తిరిగింది. మంత్రి దేవినేని ఉమా డీసీఆర్ సుబ్బారావుకు ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అడ్డగోలుగా అధికారులు పనిచేస్తుంటే ఏం చేస్తున్నావంటూ మేయర్‌కూ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మేయర్, డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ)ను టార్గెట్ చేశారని భోగట్టా. మొండి బకాయిదారుల జాబితాను బహిర్గతం చేసేటప్పుడు కనీసం తన దృష్టికి తేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. మేయర్ అంటే లెక్కలేదా అంటూ మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారుల వ్యవహార శైలి తరుచూ వివాదాస్పదం కావడంపై ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీసీఆర్ వ్యవహార శైలిపై కమిషనర్‌తో చర్చించాలన్న నిర్ణయానికి వచ్చారు. తప్పుల తడక ...: డిఫాల్టర్స్ లిస్ట్‌ను తప్పుల తడకగా రూపొందించిన రెవెన్యూ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. మూడు సర్కిళ్ల అసిస్టెంట్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రూపొందించిన జాబితాను పరిశీలించి డీసీఆర్‌కు అందజేస్తారు. కమిషనర్ అనుమతితో వెబ్సైట్లో ఉంచాలి. ఈ ప్రక్రియలో కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాబితాను అప్డేట్ చేయలేదని తెలుస్తోంది. గతంలో ఆరు నెలలకోసారి ఆస్తిపన్నును చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు జారీ చేసేవారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడాదికి ఒకసారే డిమాండ్ నోటీసు ఇచ్చేశారు. దీన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్టర్స్ లిస్ట్‌లో కొన్ని పేర్లను చేర్చడం వివాదాస్పదమైంది. డిఫాల్టర్స్ లిస్ట్ వెబ్సైట్లో పెట్టి మొండి బకాయిదారుల్ని అల్లరి చేయాలన్న ఎత్తుగడ బెడిసికొట్టింది. కమిషనర్ ఆదేశాలతోనే జాబితాను వెబ్సైట్లో పెట్టాం కాబట్టి తమకేం ఇబ్బంది ఉండదనే ధోరణిని రెవెన్యూ అధికారులు ప్రదర్శిస్తున్నారు. మొత్తం మీద మొండిబకాయిలు మేయర్, డీసీఆర్ మధ్య జగడం సృష్టించాయి. -
ఎట్టకేలకు...
- శాసన మండలికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అర్జునుడు ఎంపిక - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నాగుల్ మీరా సాక్షి, విజయవాడ : తెలుగుదేశంలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగుల్‌మీరాలను పదవులు వరించాయి. బచ్చుల అర్జునుడును శాసనమండలి సభ్యుడు(ఎమ్మెల్సీ)గా ఎంపిక చేయగా, నాగుల్ మీరాను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత నిర్ణయం తీసుకున్నారు. బచ్చులకు ఎమ్మెల్సీ..... టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు గతంలోనే ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడ్డారు. అయితే ఆయనకు బదులు బీసీ కోటాలో బుద్దా వెంకన్నకు అవకాశం ఇచ్చారు. దాంతో అప్పట్లోనే ఆయన కినుక వహించినా ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుని గా బచ్చులకు గుర్తింపు ఉంది. నాగుల్‌మీరా..... పశ్చిమ నియోజకవర్గం నుంచి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ వారికి పశ్చిమ నియోజకవర్గం కేటాయించసాగింది. 2014లో చివరి నిమిషం వరకు నాగుల్మీరానే పశ్చిమ అభ్యర్థిగా ప్రచారం జరిగింది. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీ దక్కించుకుంది. టికెట్ రాకపోయినా నాగుల్‌మీరా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఆయనకు ఈ సారి ఎమ్మెల్సీ సీటు ఇస్తారని అంతా భావించారు. అయితే సమీకరణల్లో భాగంగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. జిల్లా నుంచి పలువురు ప్రాతినిధ్యం కృష్ణాజిల్లా నుంచి పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే వివిధ హోదాల్లో ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా బాబూ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్నలు ఉండగా, టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జగ్గయ్యపేటకు చెందిన తొండెపు దశరధజనార్దన్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ మహిళా కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పామర్రుకు చెందిన వర్ల రామయ్య హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రామానుజయ ఉన్నారు. వీరు కాక, తాజాగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నాగుల్‌మీరాకు ఇచ్చారు. జయ‘మంగళం’..... కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ ఎమ్మెల్సీ సీటు ఆశించారు. అయితే ఆయనను పక్కన పెట్టారు. కనీసం కార్పొరేషన్ lపదవి కూడా ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గతంలో వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారు. నామినేషన్ దాఖలు.. మచిలీపట్నం : ఎమ్మెల్సీ పదవికి బచ్చుల అర్జునుడు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అంబటి బ్రాహ్మణయ్యకు అనుంగశిష్యుడిగా ఆయన పేరొందారు. బందరుకోట పీఏసీఎస్ అధ్యక్షుడిగా, కేడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. మచిలీపట్నం పురపాలక సంఘం చైర్మన్‌గా 2000 నుంచి 2005 వరకు పనిచేశారు. 2014 ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ దాదాపు బచ్చులకు ఖరారైంది. అప్పటి రాజకీయ పరిస్థితుల నేప«థ్యంలో ఆ సీటును వదులుకోవాల్సి వచ్చింది. 2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా బచ్చుల ఎంపికవుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అప్పట్లో ఆయనకు పదవి రాలేదు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మంత్రి దేవినేని ఉమాకు నమ్మకస్తుడిగా ఉన్న బచ్చులకు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. -
బెల్ పనుల్లో ‘కృష్ణ’ మాయ
విజయవాడ : మచిలీపట్నంలోని ‘బెల్’ కంపెనీ విస్తరణ ప్రాజెక్టును పామర్రు మండలం నిమ్మలూరులో 53 ఎకరాల్లో చేపట్టారు. నిర్మాణ పనులకు సంబంధించి తొలుత భూమిని మెరక (ఎత్తు పెంపు) చేయాల్సి ఉంది. రూ.ఏడు కోట్ల విలువైన ఈ మెరక పనుల కోసం ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని ఈ ఏడాది జనవరి మూడో వారంలో బెల్ టెండర్లు ఆహ్వానించగా పలు కంపెనీలు దాఖలు చేసుకున్నాయి. వాటిలో ఏడు కంపెనీలు అర్హత సాధించాయి. ఇక్కడే గూడుపుఠాణీకి తెరతీశారు. టెండర్ దాఖలు చేసిన కంపెనీలను తప్పించారు.. మెరకతోలడం కేవలం రూ.1.5 కోట్ల పని అని ఆ కంపెనీలకు ఈ–మెయిల్ పంపారు. దాంతో తక్కువ విలువ పనిగా భావించి ఐదు కంపెనీలు పక్కకు తప్పుకున్నాయి. అయితే టెండర్లు ఖరారు కావడానికి ముందురోజు మళ్లీ బెల్ కంపెనీ వారికి మెయిల్ పంపి మొదట అనుకున్నట్లు రూ.7 కోట్ల పనేనని సమాచారం ఇచ్చింది. దీంతో వారు బెల్ అధికారులను సంప్రదించడంతో ఈ మట్టిని పోలవరం కాలువ నుంచి తవ్వి తీసుకురావాలని, అది మంత్రి దేవినేని ఉమ మనిషైతేనే సాధ్యమని వారికి తెలిపారు. వేరే వారికి కాంట్రాక్టు దక్కినా పని చేయలేరని స్పష్టం చేశారు. మంత్రి అండదండలతోపాటు సీఎం సతీమణి, కుమారుడు లోకేష్, సినీనటుడు బాలకృష్ణకు స్థానిక ప్రజాప్రతినిధి బాగా కావాల్సిన వారని, ఆయన చెప్పిన సూర్య కన్స్ట్రక్షన్స్, పవర్‌మెక్ కంపెనీలకు చెందిన వారైతేనే ఈ పని చేయగలరని చెప్పారని తెలుస్తోంది. చివరి నిమిషంలో బెల్ రూటు మార్చడం, మంత్రి, సీఎం కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించడంతో ఆ కంపెనీలు మిన్నకుండిపోయాయి. చివరకు రేసులో సూర్య, పవర్‌మెక్ కంపెనీలు ఉండగా, సూర్య సంస్థకు కాంట్రాక్టు దక్కింది. ఆ తర్వాత స్థానిక టీడీపీ మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త సూర్య కంపెనీ నుంచి సబ్‌కాంట్రాక్టు తీసుకుని ఆ పని చేపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. బెల్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులతో కుమ్మక్కయి ఈ తతంగం నడిపి ఏడు కోట్ల కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే తాను సీఎం భార్య భువనేశ్వరికి ఎంత చెబితే అంతని, ఆమె దత్తత తీసుకున్న కొమరవోలులో పనులన్నీ తానే చేయిస్తున్నానని, లోకేష్, బాలకృష్ణ వచ్చినప్పుడల్లా తనకు బోలెడు ఖర్చవుతోందని, అందుకే ఈ కాంట్రాక్టు తనకు ఇప్పించారని దబాయిస్తున్నట్లు సమాచారం. -
‘ప్లంజ్‌పూల్’ గొయ్యి పూడ్చివేతకు కసరత్తు
వైఎస్ జగన్ విమర్శల నేపథ్యంలో కదిలిన సర్కారు శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని ప్లంజ్‌పూల్ ఏరియాలో 2009లో వచ్చిన వరదల వల్ల ఏర్పడిన సుమారు 100 మీటర్ల గొయ్యిని పూడ్చేందుకు ఎట్టకేలకు దాదాపు ఏడేళ్ల తరువాత చర్యలు మొదలయ్యాయి. గొయ్యిని పూడ్చేందుకు డ్యాం సేఫ్టీ అధికారులు, నిపుణులు, పలుమార్లు పరిసర ప్రాంతాలను తనిఖీచేసి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) నిపుణుల కమిటీకి నివేదికలు అందజేశారు. అయితే ప్రభుత్వం సత్వర పనులకు ఆదేశాలివ్వలేదు. గత గురువారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీశైలంలో రైతు భరోసా యాత్రను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్లంజ్‌పూల్ గొయ్యిను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. ఆయన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం హడావుడిగా విజయవాడలో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఇప్పటివరకు గొయ్యి పూడ్చేందుకు ఇచ్చిన ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయని, సీడీఓ అనుమతులను ఎందుకు తీసుకోలేదని చీఫ్ ఇంజనీర్‌తోపాటు శ్రీశైలం డ్యాం ఇంజనీర్లను మంత్రి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డ్యాం వద్ద ఏర్పడిన గొయ్యిని పూడ్చేందుకిచ్చిన నివేదికలకు సీడీఓ ఆమోదం సైతం లభించినట్టు తెలిసింది. త్వరలో పనులకు టెండర్లను పిలిచే అవకాశముంది. -
దేవినేనిని అలా వదిలేయకండి
- వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ సూచన - జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే అవాకులు, చవాకులు సాక్షి, హైదరాబాద్: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవర్తన, మాటలు చూస్తుంటే ఒక మానసిక రోగి అయిపోయారనిపిస్తోందని, ఆయన్ని అలా వదిలేయకుండా తక్షణమే వైద్యునికి చూపించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూచించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ అరాచకాలు, మోసాలు, అబద్ధపు హామీలను నరసరావుపేట బహిరంగ సభ సాక్షిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తిచూపడాన్ని తట్టుకోలేక.. ఆయనపై టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించడమే జగన్ చేసిన నేరమా? కార్లు, పొలాలు తగలబెట్టినా, ప్రజలపై దాడి చేసినా చూస్తూ ఊరుకోవాలా? అని ఆమె నిలదీశారు. జగన్ లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పలేక ఆయనపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని మంత్రికి వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. గాలి, ధూళి, మన్నూ, మశానమంతా టీడీపీలోనే.. వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలను ఆమె ప్రస్తావిస్తూ.. గాలి, ధూళి, మన్నూ, మశానం వంటి వారందరూ ఉన్న టీడీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక అసెంబ్లీకి రావద్దని దేవినేని అంటున్నారని విమర్శించారు. దమ్ముంటే వీటిపై విచారణ జరిపించడండి రాజధానిలో పొలాలు, తునిలో రైలును తగలబెట్టిన విష సంస్కృతి టీడీపీదని, దమ్ముంటే ఈ కేసులపై విచారణ జరిపించాలని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. చెప్పినట్లు వినలేదనే కారణంతో గుంటూరు ఎస్పీగా ఉన్న రామకృష్ణను టీడీపీ నేతలు బదిలీ చేయించారని ఆరోపించారు. -
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
-
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
విజయవాడ: నరసరావుపేటలో వైఎస్ జగన్ బహిరంగ సభను చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు. మంత్రి దేవినేని ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. ప్లేస్, టైమ్ దేవినేని ఉమానే డిసైడ్ చేసుకోవాలని పార్థసారధి సవాల్ విసిరారు. ప్రజలకు చేసిన మోసాలపైనా, అవినీతిపైనా వైఎస్సార్సీపీ చర్చకు సిద్ధమన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అభ్యర్థులుండరని మాట్లాడుతున్న మంత్రి ఉమ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన బహిరంగ సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి శుక్రవారం నరసరావుపేటలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
ఉమ మంత్రా లేక మానసిక రోగా?
-
మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభం
విజయవాడ స్పోర్ట్స్: 35 నుంచి 90ఏళ్ల నవయువకుల ఉరకలేసే ఉత్సాహం మధ్య ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 36వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభమైంది. జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 ఏళ్ల పైబడిన వయసులోనూ పోటీల్లో పాల్గొని గెలవాలనే ఆంక్ష ఉన్న వారంతా నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. 2018లో అమరావతిలో జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నోట్ల రద్దు ప్రభావం వల్ల తక్కువ మంది పోటీల్లో పాల్గొన్నట్లు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోటీలు నిర్వహిస్తున్న జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్‌ను అభినందించారు. గౌరవ అతిథులుగా ఎమ్యెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాంతాతయ్య, మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపాధ్యక్షుడు భగవాన్, రాష్ట్ర అ«ధ్యక్షుడు డాక్టర్ టీవీ రావు, కార్యదర్శి టి.సుబ్బారావు, పోటీల నిర్వహక కమిటీ కార్యదర్శి ఎన్ఎస్ ప్రసాద్, జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొనగా, సాంకేతిక సహకారాన్ని శాయ్ అథ్లెటిక్స్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అథ్లెట్లు హాజరయ్యారు. -
'2018 నాటికి పోలవరం పూర్తిచేస్తాం'
► ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా అమరావతి : పోలవరం ప్రాజెక్టును 2018నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు చెప్పారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్షించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల కాంక్రీట్ పనులను ఈనెల 19న ప్రారంభిస్తామన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ప్రాజెక్ట్ డిజైన్స్ పూర్తి కావస్తున్నాయన్నారు. 19 సిమెంట్ కంపెనీలతో సీఎం చంద్రబాబు సోమవారం సమావేశమయ్యారని.. సిమెంట్‌ను బస్తా రూ. 250లకు ఇస్తామని కంపెనీల వారు సీఎంకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పోలవరం డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా 2200 కోట్లు ఖర్చుచేసిందన్నారు. ఈ నిధులు త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. నవంబరులో 96శాతం వర్షపాతం తక్కువగా ఉందని, అయినా ఏ ఒక్క ఎకరాను ఎండనివ్వమన్నారు. ఖరీఫ్‌లో కోటి ఎకరాల పంట కాపాడుతున్నామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2017కు, రెండో సొరంగాన్ని 2018కి పూర్తిగా నిర్మిస్తామని, ప్రాజెక్టును అనంతరం ప్రారంభిస్తామని ఉమ చెప్పారు. -
పోలవరం పూర్తికి అన్ని చర్యలు : దేవినేని
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడి కాల్వను ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో కలిసి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును అనుకున్న ప్రకారం 2018కు పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టు వద్ద వారానికి 14 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించాల్సి ఉండగా 12 లక్షల వరకు తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ ఖరీఫ్‌లో 45 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని, 10.74 లక్షల ఎకరాల పంట పొలాలతో పాటు లక్షా 50 వేల ఎకరాల చేపల చెరువులకు సాగునీరందించామని వివరించారు. కాగా, ఎన్టీఆర్ కల అయిన తెలుగుగంగను 2017 నాటికి పూర్తి చేస్తామని మంత్రి దేవినేని చెప్పారు. పట్టిసీమ స్ఫూర్తితో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరి వెంట ఎస్ఈ శ్రీనివాసయాదవ్, ఈఈ చినబాబు తదితరులు ఉన్నారు. -
గాంధీజీ మార్గం ఆచరణీయం
విజయవాడ(చిట్టినగర్): ప్రపంచానికి మహాత్మాగాంధీ చూపిన మార్గం ఆచరణీయమని, ఆయన ఆశయాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. మహాత్మా గాంధీజీ జీవితం, గాంధీజీ దీక్షలపై రూపొందించిన పుస్తకాన్ని జలవనరుల శాఖ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిపై గాంధీజీ పోరాడిన తీరు ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మహాత్ముని ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాంధీజీ దీక్షలనుప్రారంభించదలచామని మహాత్మాగాంధీ దేవాలయ ట్రస్టు అధ్యక్షులు, స్వాతంత్య్ర సమర యోధుల వారసుల సంఘ అధ్యక్షులు రాంపిళ్ల జయప్రకాష్ తెలిపారు. గత ఐదేళ్లగా దీక్షలను వందలాది మంది విద్యార్థులు స్వీకరించారన్నారు. -
కాఫర్ డ్యాంకు అనుమతి లేదు
- డిజైన్ల సమీక్షా కమిటీతో చర్చించి ముందుకెళ్తున్నాం - జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యాం నిర్మాణానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి లేదని, ఇకపై తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. డిజైన్ల సమీక్షా కమిటీకి తమ ప్రతిపాదనలన్నీ సమర్పించి చర్చించాకే దీనిపై ముందుకెళ్తున్నామన్నారు. ‘మట్టికట్టతో కనికట్టు’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ డిజైన్లకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టును చేపడతామన్నారు. జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు మెయిన్ డ్యాంకు సంబంధించి 1983లో ప్రతిపాదించిన ఒరిజినల్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. కాఫర్ డ్యాం అంటే తాత్కాలిక కట్టడమేనని, ఈ ప్రాజెక్టులో దాన్ని క్రస్ట్ లెవెల్‌ను 41 మీటర్లకు పెంచి కాఫర్ డ్యాంను నిర్మిస్తున్నామని, తద్వారా 28 లక్షల క్యూసెక్కుల నీటిని మళ్లించే అవకాశం ఉందన్నారు. మెయిన్ డ్యాం పూర్తయ్యాక ఈ డ్యాంను తొలగిస్తామన్నారు. కాఫర్ డ్యాంలో 60 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందన్నారు. జలవనరుల శాఖ చరిత్రలో కాఫర్ డ్యాంను ప్రధానంగా చేపట్టిన సందర్భాలెక్కడైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి దేవినేనిగానీ, ఈఎన్సీ గానీ సూటిగా సమాధానం చెప్పలేదు. -
దేవినేని ఉమకు పిచ్చికుక్క కరిచిందట..
విజయవాడ: దేవినేని ఉమ అసమర్థ, అజ్ఞాన, నీచమైన మంత్రి అని వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ నీటిపారుదల శాఖ మంత్రిగా చూడలేదని అన్నారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ.. దేవినేని అసమర్థత వల్లే పులిచింత ప్రాజెక్టు ఆగిందని చెప్పారు. దేవినేని ఉమకు చిన్నప్పుడు పిచ్చికుక్క కరిచిందట, అందుకే అమావాస్య, పౌర్ణమినాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడని అన్నారు. డబ్బులు దండుకోవడానికి పట్టిసీమ ప్రాజెక్టు కట్టరని, ఇందులో 500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల చుక్కనీరు కూడా కృష్ణా డెల్టాకు రాలేదని చెప్పారు. జూన్‌లో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తామన్న విషయం ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ దోపిడీ, దుర్మార్గాలను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకోవడం తప్పా అని నిలదీశారు. ప్రాజెక్టులతో పాటు కృష్ణా పుష్కర పనుల్లోనూ దోచుకుంటున్నారని విమర్శించారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటిలోను దోపిడీయే కారణం అన్నారు. అందులో మీ వాటా ఎంతో దుర్గమ్మ సాక్షిగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిందని అన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై వైఎస్ జగన్ మాట్లాడితే వాళ్లు మాత్రం భయంతో పారిపోయి వచ్చారని చెప్పారు. దేవుడు కరుణిస్తే తప్ప సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ఉమ అని అన్నారు. దమ్ముంటే తనతో కలిసి కృష్ణా డెల్టాకు రావాలని, అలా వస్తే రైతులు కొట్టడం ఖాయం అని చెప్పారు. కృష్ణా డెల్టాను ఏడారిగా మార్చిన దద్దమ్మ ఉమనే అని జోగి మండిపడ్డారు. -
నీటి కేటాయింపుల్లో సీమకు అన్యాయం
► కృష్ణా డెల్టాకు, తెలంగాణకు నీళ్లు తరలించేందుకు కుట్ర ► హంద్రీ-నీవాకు 45 టీఎంసీలు కేటాయించాలి ► మాజీ ఎంపీ అనంత డిమాండ్ అనంతపురం సెంట్రల్ : ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు తమ ప్రాంతాల ప్రయోజనాలు చూసుకుని రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ ర్షాభావంతో సీమలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయనీ, ‘సీమ’లోని ప్రాజెక్టులన్నీ కృష్ణాజలాలపైనే ఆధారపడ్డాయని తెలిపారు. కానీ సీమకు నీళ్లు అందిచండంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద ‘సీమ’ కరువును సాకుగా చూపి ఆచరణలో మాత్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. గతేడాది కరెంట్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ , తాగునీటి ముసుగులో ఆంధ్రా పాలకులు శ్రీశైలం నీటిని త్రవ్వుకున్నారన్నారు. దీంతో సీమకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, ఈ ఏడాది కూడా గతేడాదిలాగే వారి స్వలాభాలు చూసుకుని సీమకు అన్యా యం చేసేందుకు ఇద్దరు మంత్రులు ప్రణాళిక రచించి బయటకు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ‘సీమ’ వాట అంశాన్ని బోర్డు ముందు ఉంచకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను డెల్టాకు ఇస్తున్నారనీ... ఈ క్రమంలో శ్రీశైలం నుంచి హంద్రీ-నీవాకు 45 టీఎంసీలు ఇవ్వాలన్నారు. టీబీ డ్యాంలో పూడిక కారణంగా హెచ్చెల్సీ, ఎల్ఎల్సీకి దక్కాల్సిన నికర జలాలు ఏటా 85 టీఎం సీలు శ్రీశైలంలోకి చేరుతున్నాన్నారు. ఈ నీటినీ సీమకే కేటాయించాలన్నారు. ‘సీమ’లో భూములను బీళ్లుగా పెట్టి డెల్టాలో రెండు పంటలకు నీళ్లు అందించాలని మంత్రి దేవి నేని ఆలోచిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండేలా బోర్టు చర్యలు తీసుకోవాలనీ, ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుకే యాజ మాన్య హక్కులు కల్పించి సీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. . ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధులు ప్రైవేటు డెయిరీని నిర్వహిస్తుండటం వల్ల వారి స్వలాభం కోసం ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. దాదాపు 2 లక్షల కుటుంబాలు ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తూ జీవనం సాగిస్తున్నాయని వివరించారు. జిల్లాలోనే రూ. 11 కోట్లు పాల బకాయిలు ఉంటే రైతులు ఏ విధంగా బతుకుతారని ప్రశ్నించారు. వెంటనే బకాయిలు చెల్లించి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పాడిరైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. -
నిజాలు తెలుసుకుని మాట్లాడాలి
మంత్రి దేవినేనిపై పీఏసీ చైర్మన్ బుగ్గన ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఏపీ సాగునీటి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇష్టానుసారం మాట్లాడటం ఎంత మాత్రం సరికాదని పీఏసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తానేదో ప్రభుత్వ భూమిని ఆక్రమించి గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) కాలువ తవ్వకుండా అడ్డుపడుతున్నట్లు మంత్రి చెప్పడం వాస్తవ విరుద్ధమన్నారు. కాలువ తవ్వకానికి ప్రతిపాదించిన భూమిలో తనతో పాటు పలువురు రైతులు (యజమానులు)కూడా ఉన్నారని ఆయన వివరించారు. 2010లో కాలువ తవ్వకానికి పెగ్‌మార్క్ చేసినపుడే జిల్లా కలెక్టర్‌కు, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్, జీఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్‌కు అది తమ పట్టా భూమి అని వివరిస్తూ లేఖలు రాసిన సంగతి దేవినేని తెలుసుకోవాలన్నారు. కోర్టులో ఉన్న ఈ వ్యవహారంపై మాట్లాడ టం సరికాదన్నారు. మంత్రికి తెలియదా? మంత్రి చెబుతున్న భూమికి 1929లోనే టైటిల్ డీడ్ ఉందని బుగ్గన చెప్పారు. తాను, తన పూర్వీకులు ఆ భూమిని ఆక్రమించినట్లు భావిస్తే నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలన్నీ చూస్తూ ఊరకున్నాయని మంత్రి అనుకుంటున్నారా? 1954కు ముందు అసైన్ అయిన భూములపై సర్వహక్కులు వారికే ఉంటాయన్న విషయం కూడా తెలియదా? అని ప్రశ్నించారు. మీ పరిపాలనపై విచారణకు సిద్ధమా? దేవినేని సాగునీటి మంత్రి అయ్యాక ఏఏ టెండర్లు పిలిచారో.. ఏఏ పనులు జరిగాయో సమగ్ర విచారణకు సిద్ధమేనా? అని బుగ్గన సవాలు విసిరారు. అవుకు టన్నెల్ వ్యయాన్ని రూ.44 కోట్లు పెంచారని సాక్షాత్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పిన మాట నిజమా.. కాదా? అని ప్రశ్నించారు. పట్టిసీమ మొదలు ప్రతి ప్రాజెక్టులోనూ ఏదో ఒక లొసుగు, అవినీతి దాగి ఉందన్నారు. -
కేంద్ర సంస్థల మాటున కుంభకోణాలు
♦ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్ ♦ జెన్కోలో బీహెచ్ఈఎల్ను ముందుపెట్టి అవినీతికి పాల్పడ్డారు ♦ బొగ్గు సరఫరాలో అడ్డగోలుగా దోచుకున్నారు ♦ ప్రశ్నోత్తరాల సమయంలో నిలదీసిన విపక్ష నేత సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థలను ముందుపెట్టి రాష్ట్రంలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘జెన్కోలో ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ను ముందుపెట్టి కుంభకోణానికి పాల్పడ్డారు. బొగ్గు కొనుగోలులోనూ ఇదే విధంగా చేశారు. బొగ్గు కొనుగోళ్లలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థను జెన్కో ముందు పెట్టింది. కానీ ఆదానీలతో బొగ్గు సరఫరా చేయిస్తున్నారు. బొగ్గు ధర తగ్గింది. కానీ జెన్కోకు పాత ధరతోనే సరఫరా జరుగుతోంది. ఇక్కడ కూడా పనిచేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థే. కానీ చివరకు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వసూలు చేస్తారు’ అని విపక్ష నేత వివరించారు. రాష్ట్రంలో ఇంధన పొదుపును, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం గృహ విద్యుత్ వినియోగదారులకు ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసిందని మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు జవాబిచ్చారు. దీని వల్ల 50 శాతం విద్యుత్ ఆదా అయిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో విపక్ష నేత జోక్యం చేసుకున్నారు. ‘ఎల్ఈడీ బల్బుల సరఫరాకు టెండర్లు పిలిచారా? నామినేషన్ పద్దతి మీద అప్పగించారా?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘సాధారణ బల్బులకు 60 వాట్ల విద్యుత్ కావాలి. ఎల్ఈడీ బల్బులకు 7-8 వాట్లు సరిపోతుంది. ఎల్ఈడీ బల్బులను వాడితే సహజంగానే విద్యుత్ విని యోగం తగ్గుతుంది. కానీ మంత్రి అందుకు భిన్నంగా చెబుతున్నారు. నామినేషన్ పద్దతి మీద బల్బులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం వల్లే విద్యుత్ ఆదా అయిందంటున్నారు’ అని నిలదీశారు. దీనికి మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా.. నామినేషన్ పద్దతి మీదే అయినా ప్రైవేటు వ్యక్తులకు కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చామని అన్నారు. బొగ్గు కొనుగోళ్ల అంశంపై సరైన సమయంలో సమాధానం చెబుతామని, ప్రస్తుతం ఎల్ఈడీ బల్బులకే పరిమితం అవుతున్నట్లు ప్రకటించారు. ‘సోమశిల’ నిర్వాసితులకు ఉద్యోగాలు: మంత్రి దేవినేని ఉమ సోమశిల ప్రాజెక్టు ముంపు ప్రాంతం వారికి జీవో 98(15-4-1986) ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామని సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. ముంపు ప్రాంతంలో భూ యజ మానులకు నష్టపరిహారం దాదాపుగా చెల్లించేశామని, నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రతిపాదనలు లేవని అన్నారు. పరిహారం అందక నిర్వాసితులు రోడ్డున పడ్డారని విపక్ష ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. యథాస్థానాల్లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జలీల్‌ఖాన్ మంగళవారం సభకు హాజరయ్యారు. సభ మొదలైన తర్వాత లోపలకి వచ్చిన వీరిద్దరు విపక్ష సభ్యులుగా తమకు కేటాయించిన పాత స్థానాల్లోనే కూర్చున్నారు. -
'ఉమా.. నీ నియోజకవర్గంలో చర్చకు సిద్ధమా?'
హైదరాబాద్: కృష్ణా జిల్లా మైలవరంలో సాగు, తాగు నీరు సరఫరా విషయమై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్.. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సవాల్ విసిరారు. దేవినేని ఉమా సొంత నియోజకవర్గమైన మైలవరంలో మీడియా సమక్షంలో ఇద్దరు చర్చిద్దామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ.. మంత్రి ఉమా తీరుపై మండిపడ్డారు. సొంత నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వలేని దేవినేని ఉమా.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు పులివెందులకు నీరిచ్చామని ప్రగల్భాలు చెప్పడం మానుకోవాలని జోగి రమేష్ హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఉమా కలసి జలవనరుల శాఖను ధనవనరుల శాఖగా మార్చారని విమర్శించారు. -
అనుసంధానం ముసుగు జారి.. కొల్లేటికి చేరిన అవినీతి కథ!
‘అనుసంధానం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రదర్శించిన నాటకం రక్తి కట్టలేదు. పుష్కరాల్లో చేసిన పబ్లిసిటీ వేట లాగే ఇదీ వికటించింది. పట్టిసీమ పేరుతో లేచిన అవినీతి ‘కురుపు’ కనిపించకుండా ‘అనుసంధానం’ అనే ముసుగును కప్పేశారు. ఎవరి కంటా పడకుండా హంద్రీనీవా ప్రాజెక్టు మోటారును రహస్యంగా ఎత్తుకొచ్చారు. మూడురోజులు తంటాలు పడి కాసిన్ని గోదావరి నీళ్లు తోడి పోశారు. తోడుగా కొన్ని తాడిపూడి ఎత్తి పోతల నీళ్లను కలిపారు. వీటికి కొద్దిపాటి వర్షం నీరు తోడైంది. వైఎస్సార్ హయాంలో 80% పూర్తయిన పోలవరం కుడి కాల్వను ఉపయోగించుకొని కీర్తి కిరీటం పెట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన కొద్దిపాటి కాల్వ పనులను నాసిరకంగా ముగించడంతో కృష్ణాకు వెళ్లాల్సిన నీళ్లు తమ్మిలేరులోకి జారిపోయి కొల్లేరు బాట పట్టాయి. ఒక్క మోటారు ఆన్ చేస్తేనే బద్దలైన కుడికాల్వ అక్విడెక్ట్ * పట్టిసీమను హడావుడిగా పూర్తి చేసేందుకు నాణ్యత పట్టించుకోని ప్రభుత్వం * ప్రచార ఆర్భాటం కోసం హడావుడిగా ఏర్పాట్లు * మోటార్లు లేకుండానే నదుల అనుసంధానమంటూ సీఎం ఆర్భాటం * దివంగత వైఎస్ చేసిన పనులను తానే చేసినట్టుగా * చెప్పుకోవాలనే తాపత్రయం సాక్షి, హైదరాబాద్/ఏలూరు/కర్నూలు: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో మోసం మరోసారి బట్టబయలయింది. హంద్రీనీవా నుంచి మోటారు తీసుకొచ్చి పట్టిసీమలో బిగించడానికి ప్రభుత్వం అనుమతించడం.. సర్కారు మోసపూరిత వైఖరికి నిదర్శనం. హడావుడిగా చేస్తున్న పోలవరం కుడికాల్వ పనుల్లో నాణ్యత లేదంటూ సంబంధిత ఇంజినీర్లు నెత్తీనోరూ కొట్టుకున్నా.. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోని ఫలితం ఇప్పుడు బయటపడింది. రికార్డు సమయంలోనే పట్టిసీమలో మోటారు నడిపించామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల తాగునీటికి ఆధారమైన హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) నుంచి మోటారు తీసుకురావడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రే అనుమతివ్వడం గమనార్హం. ఈనెల 11వ తేదీనే హంద్రీనీవా నుంచి మోటారు తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై రెండు, మూడు రోజుల ముందే సీఎం నుంచి మౌఖికంగా అనుమతి తీసుకున్నామని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పోలవరానికి ఉరి.. పట్టిసీమకు ఊపిరి పట్టిసీమ టెండర్ల దశలోనే దోపిడీకి ప్రభుత్వ పెద్దలు తెరతీశారు. జాతీయ హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, కాసులపై కక్కుర్తితో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఊపిరి పోశారు. ఏడాదిలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచి.. గడువులోగా పూర్తి చేస్తే 16.9 శాతం బోనస్‌గా చెల్లిస్తామంటూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టర్‌తో ముందుగా అవగాహన ఉండటం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ వెల్లువెత్తిన విమర్శలనూ ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలవరం కుడికాల్వ పనుల్లోనూ అంతా హడావుడి, అవినీతి నిర్ణయాలే తీసుకున్నారు. నాణ్యతను పరిశీలించి అధికారులు ధ్రువీకరించిన తర్వాతే బిల్లులు చెల్లించడం సాధారణంగా జరిగేది. కానీ కుడికాల్వ పనుల విషయంలో ఈ నిబంధనలకు స్వయంగా ప్రభుత్వ పెద్దలే తూట్లు పొడిచారు. నాణ్యత ధ్రువీకరణ లేకుండానే బిల్లులు చెల్లించడం వెనుక.. అధికారపార్టీ నేతల చేతివాటం ఉందని నీటిపారుదల శాఖ అధికారులే చెబుతున్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానం.. జరిగిందంటూ ముఖ్యమంత్రి అబద్దాల హోరులో వాస్తవం కనబడకుండా ప్రచార ఆర్భాటం కప్పేసే ప్రయత్నం చేసింది. అంతటా హడావుడే..: ఈనెల 16 ఉదయం పట్టిసీమలో మోటారును ప్రారంభించాలని పట్టుబట్టి హంద్రీనీవా నుంచి మోటారును అప్పటికప్పుడు ఆగమేఘాల మీద తీసుకు వచ్చి అదే రోజు మధ్యాహ్నం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నదుల అనుసంధాన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అప్పటికే హంద్రీనీవా నుంచి వచ్చిన మోటారు అక్కడికి చేరింది. కానీ పంపు అలైన్మెంట్ సరిగా కుదరక పోవడంతో మోటారు ఏర్పాటు చేయలేక కాంట్రాక్టర్, అధికారులు చేతులెత్తేశారు. పట్టిసీమలో మోటారు పెట్టకుండానే.. నదుల అనుసంధానం చేశామని సీఎం ప్రకటించారు. తర్వాత పట్టిసీమ వెళ్లి కొబ్బరికాయ కొట్టారు. అప్పటికీ అక్కడ మోటారు బిగించలేకపోయారు. హంద్రీనీవా నుంచి తెచ్చిన మోటారును 17న బిగించారు. 18న మోటారు ఏర్పాటు చేసి సాగునీటి మంత్రి దేవినేని ఉమ ఆన్ చేశారు. 19న కుడికాల్వకు గండి పడింది. పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్టు బద్ధలైంది. ఒక్క మోటారుకే తెగిపోయింది.. అన్నీ ఆన్ చేస్తే?: ఒక్క మోటారు ఆన్ చేస్తేనే కుడికాల్వ తెగిపోయింది. మరి అన్ని మోటార్లు ఆన్ చేస్తే పరిస్థితి ఏమిటి? ఇదే ప్రశ్నకు నీటిపారుదల శాఖ అధికారులు సమాధానం వెతుక్కుంటున్నారు. నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని తాము తొలి నుంచీ ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని కుడికాల్వ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’తో వాపోయారు. అన్ని మోటార్లు నడిస్తే.. గండి ఒక్కచోటకే పరిమితం కాదని, చాలా చోట్ల కాల్వకు గండ్లు పడే ప్రమాదం ఉందని చెప్పారు. మరోవైపు కాల్వ తెగడం వల్ల తమ్మిలేరులో చేరిన నీరంతా ఏలూరు నగరాన్ని ముంచెత్తేది. పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. ఎందుకంటే.. తమ్మిలేరు ఏలూరు మీదుగా ప్రవహిస్తోంది. నిజస్వరూపం బయటపడుతుందనే.... పట్టిసీమ డొల్లతనాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎప్పుడో బయటపెట్టింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని నమ్ముకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎత్తిపోతల పథకంతో నదుల అనుసంధానం అని చెప్పుకోవడమే సిగ్గుచేటని, అది కూడా కనీసం ఒక్క మోటారు పెట్టకుండానే నదులు అనుసంధానం చేశామని ఘనంగా ప్రకటించుకోవడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. కనీసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు కూడా ఆగలేకపోవడాన్ని చూస్తుంటే.. తమ నిజస్వరూపం బయటపడుతుందనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉందని స్పష్టమవుతోందని చెబుతున్నారు. గతంలో వైఎస్ మార్కు..ప్రస్తుతం ‘మమ’ 175 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో 130 కి.మీ.కు పైగా కాల్వను దివంగత వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు. కాల్వ పనులు పూర్తి చేయడమంటే.. తాత్కాలికంగా కొద్దిపాటి నీటి ప్రవాహానికి వీలుగా అరకొర పనులు చేయడం కాదు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వి లైనింగ్ సహ పనులు పూర్తి చేయిం చారు.కుడికాల్వ పనులపై అప్పట్లో రాద్ధాంతం చేసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులనే ఆసరాగా చేసుకొని, తామే ఆ పనులన్నీ చేశామనే చెప్పుకోవడానికిప్రయత్నించింది. కుడికాల్వను ఉపయోగించుకొని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ప్రయత్నించి అభాసుపాలయింది. కాల్వలో మిగిలిన 30 శాతం పనులను హడావుడిగా చేసింది. నాణ్యతను పట్టించుకోకుండా మమ అనిపించింది. కాంక్రీట్ నిర్మాణాల్లోనూ నాణ్యత లేకపోవడంతో కాల్వకు గండిపడటానికి ప్రభుత్వం కారణమయింది. ఇక పట్టిసీమ పంపు మూత పట్టీసీమ ప్రాజెక్టులో ఒకే ఒక్క పంపును ప్రారంభించి హడావుడి చేసిన ప్రభుత్వం 24 గంటలు తిరక్కముందే ఆ పంపునూ నిరవధికంగా మూసివేసింది. భారీ గండి పడి కుడికాల్వలో ప్రవహించే నీరు తమ్మిలేరులో కలిసిపోతున్న దృష్ట్యా అక్విడెక్టు ఎగువన ఆదివారం యుద్ధ ప్రాతిపదికన మరో అడ్డుకట్ట నిర్మించారు. పోలవరం కుడికాల్వ 114వ కి.మీ. వద్ద దీనిని నిర్మించారు. ఆదివారం ఉదయం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు ఈ నిర్మాణ పనులను పరిశీలించారు. సాయంత్రానికి అడ్డుకట్ట నిర్మాణం పూర్తి చేసి పోలవరం కుడి కాల్వ నీటి ప్రవాహాన్ని నిలుపుదల చేశారు. తాడిపూడి ఎత్తిపోతల నుంచి వచ్చే నీరు, వర్షపు నీరు కుడికాల్వలోకి రాకుండా ఎక్కడిక్కడ నిలిపివేస్తున్నారు. పాత మోటారుతో పక్కా మోసం పట్టిసీమ ఎత్తిపోతలకు..హంద్రీనీవా పథకానికి చెందిన పాత మోటారు బిగించి ప్రభుత్వం నయవంచనకు పాల్పడింది. హంద్రీనీవా లిఫ్ట్‌కు ఆరేళ్లపాటు ఉపయోగించిన మోటారును తొలగించి పట్టిసీమ మొదటి పంపునకు బిగించింది. ఇది బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచింది. పైగా భోపాల్ నుంచి తీసుకువచ్చామని నమ్మబలికింది. అయితే, తెచ్చిన మోటారు పరిమాణం తక్కువగా ఉండటం. కాంక్రీటు దిమ్మలో అమర్చే సమయంలో అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలోనే హంద్రీనీవా లిఫ్ట్ వద్ద ఆరో మోటారు హఠాత్తుగా కనిపించకపోవడంతో దానినే ఇక్కడకు తీసుకువచ్చి బిగించారన్న సంగతి బట్టబయలైంది. ఆ మోటారు కూడా తొలిరోజే మొరాయించింది. మరమ్మతులు చేసి ఆన్ చేశారు. విచారణ జరిపి చర్యలు పట్టిసీమ పనుల్లో ఏర్పడిన సమస్య ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగిందో.. విచారణకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆదివారం అక్విడెక్ట్‌కు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. - మంత్రి దేవినేని ఉమా -
సాగునీటి కోసమే నదుల అనుసంధానం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పల్లెర్లమూడి(నూజివీడు) : కృష్ణాడెల్టా ఆయకట్టుకు సాగునీటి కొరత తీర్చేందుకు ప్రభుత్వం గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని చేపట్టిందని, ఈ క్రమంలోనే పట్టిసీమ ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించే కార్యక్రమంలో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లాల సరిహద్దు నూజివీడు మం డలం పల్లెర్లమూడి సమీపంలోని 119వ కిలోమీటరు వద్ద గోదావరి జలాలకు పోలవరం కాలువలో పూజలు నిర్వహించి కృష్ణాజిల్లాలోకి విడుదల చేశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్లతో కలసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కాలువలోకి విడుదల చేసిన 500 క్యూసెక్కుల నీరు పల్లెర్లమూడి వద్దకు చేరుకోగా రైతులు హారతులు ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈనెల 15న ఇబ్రహీంపట్నం వద్ద గోదావరి జలాలను కృష్ణమ్మలో అనుసంధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారని తెలిపారు. ఎంపీ మా గంటి బాబు మాట్లాడుతూ గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంతో రైతాంగానికి సాగునీటి కష్టాలు తొలగిపోతాయన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పల్లెర్లమూడి సర్పంచి ఉషారాణి, ఎంపీపీ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ సంధ్యారాణి, ఆర్డీవో రంగయ్య, తహశీల్దార్ ఇంత్యాజ్పాషా పాల్గొన్నారు. -
‘విజయ’ పోరు..మళ్లీ షురూ!
విజయవాడ : కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ పాలకవర్గంలో ముగ్గురు డెరైక్టర్లను ఎన్నుకునేందుకు గురువారం పోలింగ్ జరగనుంది. పాలకవర్గంలో ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు మళ్లీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. చైర్మన్ మండవ జానకిరామయ్య, ఆయన వ్యతిరేక వర్గీయులు మూడు డెరైక్టర్ పోస్టులను కైవసం చేసుకునేందుకు పోటాపోటీగా రెండు ప్యానళ్లను రంగంలోకి దించుతున్నారు. ముగ్గు రు డెరైక్టర్లకు జానకిరామయ్య తన ప్యానల్‌ను ఇప్పటికే ప్రకటించగా, ఆయన వ్యతిరేక వర్గీయులు కూడా రెండు డెరైక్టర్ పోస్టులకు పోటీ చేస్తున్నారు. జానకిరామయ్య ప్యానల్ నుంచి అద్దా వెంకట నగేష్, కాట్రగడ్డ వెంకటగురవయ్య, తిరుమల స్వర్ణకుమారి పోటీలో నిలిచారు. వ్యతిరేక వర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థులుగా వేమూరి సాయివెంకటరమణ, ఎ.శ్రీపద్మ పోటీచేస్తున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్‌లో మొత్తం 430 మంది సభ్యులు ముగ్గురు డెరైక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంది. విజయవాడ చిట్టినగర్‌లో ఉన్న పాల ఫ్యాక్టరీలో గురువారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం ఐదు గంటలకు ఓట్లు లెక్కిస్తారు. కొనసాగుతున్న ఆధిపత్య పోరు కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గం కోసం కొన్నేళ్లుగా టీడీపీలో రెండు వర్గాలు కుమ్ములాడుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఏటా ముగ్గురు పాలకవర్గ సభ్యులు పదవీ విరమణ చేస్తుంటారు. ఆ ఖాళీలను భర్తీ చేయటానికి ఎన్నికలు జరుగుతుంటాయి. ఐదారేళ్లుగా మండవ జానకిరామయ్య వ్యతిరేకవర్గం ఆయనను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని పోరాడుతోంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావును నియమించాలని రెండేళ్ల నుంచి జానకిరామయ్య వ్యతిరేకులు పావులు కదుపుతున్నారు. ఒక దశలో పార్టీ అధినేత వద్ద జరిగిన పంచాయితీలో దాసరి బాలవర్ధనరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏడాది బాలవర్ధనరావు స్వయంగా రంగంలోకి దిగి డెరైక్టర్‌గా పోటీ చేశారు. మండవ జానకిరామయ్య కూడా తన వర్గాన్ని దాసరికి వ్యతిరేకంగా పోటీకి నిలబెట్టడంతో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. చివరకు చంద్రబాబు జోక్యంతో అప్పట్లో గొడవలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. ఆనాడు జరిగిన ఒప్పందం ప్రకారం మండవ జానకిరామయ్యను మార్చాలని పాలకవర్గంలో ఆయన వ్యతిరేక వర్గీయులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో జానకిరామయ్య జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు దగ్గరై మిల్క్ యూనియన్‌లో తన అధ్యక్ష పదవిని సుస్థిరం చేసుకున్నారు. అయినా మండవ వ్యతిరేకులు పట్టువదలకుండా మళ్లీ పోటీకి దిగారు. -
డెల్టాను ఎడారిగా మారుస్తున్న చంద్రబాబు
♦ సాగునీటిని వదలకపోతే ఉద్యమిస్తాం ♦ వైఎస్సార్ సీపీ నాయకులు నాగార్జున, శివకుమార్ హెచ్చరిక మారీసుపేట(తెనాలి) : కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటిని విడుదల చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడారిగా మారుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. డెల్టా ప్రాంతానికి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ పార్టీ తెనాలి, వేమూరు నియోజకవర్గాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ వద్ద బుధవారం సాయంత్రం రాస్తా రోకో నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ డెల్టాకు వచ్చే నీటిని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమ కృష్ణా జిల్లాలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు విధానాల వల్ల కృష్ణా డెల్టా ప్రాంతం నాశనమవుతోందన్నారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలోని పొలాలు బీడులుగా మారుతూ దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉన్నారని తెలిపారు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే సాగునీటిని విడుదల చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. నీటి విడుదలలో జాప్యం జరిగితే సహించేది లేదని, ఉద్యమించడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. సీఐ అత్యుత్సాహం... వైఎస్సార్సీపీ నాయకులు మార్కెట్ వంతెన వద్దకు చేరుకోగానే త్రీటౌన్ సీఐ వై.శ్రీనివాసరావు రాస్తా రోకో చేస్తే కేసులు బుక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నాయకులను కోరారు. దానికి వారు అంగీకరించకుండా రాస్తారోకోకు దిగడంతో పట్టణంలోని పోలీసు బలగాలను పిలిపించి బెదిరింపు సంకేతాలను పంపారు. సీఐ వైఖరిపై పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో చుండూరు ఎంపీపీ వుయ్యూరు అప్పిరెడ్డి, కౌన్సిలర్ తాడిబోయిన రమేష్, వలివేరు సర్పంచ్ గాదె శివరామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి భీమవరపు సంజీవరెడ్డి, పార్టీ నాయకులు శివనాగేశ్వరరావు, బూరెల దుర్గా, పెరికల కాంతారావు, గాలి అరవింద తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ కమిటీల తీర్మానాల మేరకే పల్లెల్లో అభివృద్ధి
- జూన్‌లో ఖరీఫ్ నారుమళ్లకు నీరు - రానున్న నాలుగేళ్లలో సాగర్ పనులకు రూ.2 వేల కోట్ల నిధులు - మినీ మహానాడులో మంత్రి దేవినేని ఉమ కంచికచర్ల : తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల తీర్మానాల మేరకు పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందుకనుగుణంగా నిధులు మంజూరు చేయటం జరుగుతుందని ఆయన చెప్పారు. మండలంలోని పరిటాల శివారు దొనబండ ఉమా హాలిడే ఇన్స్లో గురువారం జిల్లా స్థాయి మినీ మహానాడు నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉమ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, డొంక రోడ్ల అభివృద్ధి, తాగునీటి పథకం తదితర పనులకు ప్రాధాన్యత క్రమంలో కాకుండా పార్టీ సూచించిన మేరకే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. పార్టీలో పెత్తనాలు చేసే నాయకులకు పనులు చేయబోమని, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే చేస్తామని తెలిపారు. జూన్‌లో డెల్టాలోని నారుమళ్లకు కృష్ణానదీ జలా లు అందిస్తామని, రానున్న నాలుగేళ్ల కాలంలో నాగార్జునసాగర్ కాల్వల పనులకు రూ.2 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తామని వివరించారు. టీడీపీ హయాంలో అభివృద్ధికి కృషి... జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి కృషిచేస్తోందని చెప్పారు. రైతులకు రూ.23 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. టీడీపీపై బీజేపీ కన్ను... ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం టీడీపీపై కన్నేసిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కార్యకర్తల్లో నిరుత్సాహం ఉందన్నారు. గుంటూరుపై చంద్రబాబుకు ప్రేమ... ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గుం టూరు జిల్లాపై ప్రేమ ఉందని, అందుకే రాజధాని నిర్మాణం ఆ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లాకు సీఎం ఆశీస్సులుంటే కృష్ణాజిల్లాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, బోడె ప్రసాద్, వల్లభనేని వంశీ, శ్రీరాంరాజగోపాల్, విజయవాడ మేయర్ శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, నల్లగట్ల స్వామిదాసు, కమ్మిలి విఠల్‌రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, నాయకులు వర్ల రామయ్య, గొట్టిపాటి రామకృష్ణ, ఆచంట సునీత తదితరులు పాల్గొన్నారు. నేతల గైర్హాజరుపై ఉమ రుసరుస పశ్చిమ కృష్ణా నేతలకే ఎక్కువ పదవులు దక్కుతుండటంతో తూర్పు కృష్ణాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు మినీ మహానాడుకు దూరంగా ఉన్నారు. వీరుగైర్హాజరవడంతో సభా ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో మంత్రి ఉమ రుసరుసలాడారు. కార్యకర్తలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. -
జిల్లాలో సాగునీటి కోసం రూ.400 కోట్లు
నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా జలదంకి : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.400 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో చిన్నక్రాక వద్ద కావలి కాలువ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర మంత్రి నారాయణ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకటరామారావు, కురుగొండ్ల రామకృష్ణతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి రంగానికి ఎంత నిధులైనా కేటాయించేందుకు సిద్ధమన్నారు. కావలి కాలువను 49 కిలో మీటర్ల మేర ఆధునికీకరణను రూ.24 కోట్లతో నిర్వహిస్తున్నామన్నారు. గోదావరి జలాలను కృష్ణకు అక్కడ నుంచి సోమశిలకు మళ్లించి సాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలు ఉండగా 70 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్‌లో ఒక్క ఎకరా ఎండకుండా నీటిని అందించే ఏర్పాట్లను చేస్తామన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కావలి కాలువ ఆధునికీకరణ పనులు ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కాలువ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, రైతులు సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 11,000 క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల పెంచారన్నారు. చివరి పొలాలకు వరకు నీరు అందేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కావలి, ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రాంతాలు కావలి కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్నాయన్నారు. ఆయకట్టు రైతులు పడుతున్న కష్టాలను పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కావలి కాలువ సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తాను చేసిన దీక్షకు రైతులందరూ మద్దతుగా నిలిచారన్నారు. కావలి కాలువ ఆధునికీకరణకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు. అయితే ప్రస్తుతం 550 నుంచి 950 క్యూసెక్కులకు పెరిగే విధంగా కాలువ నిర్మాణం చేస్తున్నారని, దీనిని 1200 క్యూసెక్కుల పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులను కాపాడాలన్నారు. సంగం బ్యారేజి వద్ద ఇసుక బస్తాల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, కావలి నియోజకవర్గంలో డీఎం చానల్, డీఆర్ చానల్‌ను పూర్తి చేయాలన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాట్లాడుతూ కావలి కాలువ ఆధునికీకరణ పనులకోసం తాను ఎంతగానో కష్టపడ్డానన్నారు. రెండుసార్లు భూమి పూజ భూమి పూజ కార్యక్రమాన్ని రెండు సార్లు నిర్వహించారు. రాహుకాలం వస్తున్నా రాష్ట్ర మంత్రులు రాకపోవడంతో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి, వెంకటగిరి ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ ముందుగా భూమి పూజ చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రులు వచ్చిన తర్వాత మళ్లీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్‌ను కార్యక్రమం చివర్లో మాత్రమే ఆహ్వానించారు. నీరు చెట్టు కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయణ, జలదంకి మండల నేత వంటేరు జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
జగన్ బాటలో చంద్రబాబు
‘నేనే మోనార్క్‌ని ... అంతా నాకే తెలుసు...నన్నే అందరూ అనుసరించాలి. దేశమే నన్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ’ అప్పుడప్పుడూ గొప్పలకు పోతున్న చంద్రబాబు గత ఎనిమిది నెలల పాలనలో అంతా కాపీ రాయుడిలా సాగింది. మోడీ చీపురు పట్టుకుంటే ఇక్కడ రెండు చీపుర్లు, పిల్లల్ని ఎక్కువ మందిని కనండహో అని కేకేస్తే ఏపీలో కూడా సంతానం పెంచండని పిలుపునిచ్చారు. తెలంగాణాలో రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడా ‘నక్క వాతలు పెట్టుకున్నట్టు’గా అంటించుకున్నా అసలు రంగు బయటపడుతూనే ఉంది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ అంటే నేను కూడా అంటూ ఎగిరి గంతేశారు. షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడితే బాబు కూడా బూట్లు తొడిగారు. తాజాగా జగన్ ప్రాజెక్టు బాట పడితే నారా వారు ‘నేనూ’ అంటూ సమాయత్తమవుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టును జగన్ సందర్శించడంతో హడావుడిగా సీఎం షెడ్యూల్లో ‘ప్రాజెక్టు’ కొత్తగా వచ్చి చేరింది. ⇒ గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల ఏర్పాట్లు ⇒ జగన్ పర్యటన మరుసటి రోజునే ముంపు బాధితులతో కలెక్టర్ సమావేశం ⇒ వెనువెంటనే మంత్రి దేవినేని ఉమా కూడా పరిశీలనలు ⇒ తాజాగా బాబు కూడా... ⇒ వైఎస్సార్ సీపీ కన్నెర్రతోనే ఈ ముచ్చెమటలంటున్న రైతులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పట్టిసీమ పేరుతో మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలను నుంచి అనూహ్య స్పందన రావడంతో అధికారపక్షంలో గుబులు మొదలైంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కూడా ప్రాజెక్టులను సందర్శించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. మొదట ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, తాజాగా గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన కూడా ముఖ్యమంత్రి పర్యటనలో వచ్చి చేరింది. ఈ నెల 16న విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పునరావాస పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తి చూపించారు. దీంతో జగన్ పర్యటన ముగిసిన వెంటనే కలెక్టర్ మంపు బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతున్నట్లు ప్రకటించారు. నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించి ఖరీఫ్‌కు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మద్దిపాడు మండలం మల్లవరంలో రూ. 592.18 కోట్లు వ్యయంతో 11,177 ఎకరాల విస్తీర్ణంలో 80,060 ఎకరాల ఆయకట్టును స్థిరీకరంచేందుకు గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 2004లో వైఎస్ రాజశే ఖరరెడ్డి అధికారంలోకి రాగానే మూడు విడతలుగా విడుదల చేసిన నిధులతో 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మద్దిపాడు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చీమకర్తి, ఒంగోలు, అద్దంకి, ఇంకొల్లు మండలాల పరిధిలోని సుమారు 30 గ్రామాల పరిధిలోని 80,060 ఎకరాలను సాగులోకి తీసుకురావడం, ఆయా ప్రాంతాలలోని ప్రజలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. 21.795 కి.మీ పొడవున నిర్మించిన ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 50 వేల ఎకరాలు, 27.262 కి.మీ పొడవున నిర్మించిన కుడి ప్రధాన కాలువ పరిధిలో 30 వేల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణం గడువు ఈ సంవత్సరం జూన్ 30వ తేదీతో ముగియనున్నప్పటికీ భూవివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాగులుప్పలపాడు, ఇంకొల్లు మండలాల పరిధిలో దుద్దుకూరు, చదలవాడ, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు పరిధిలో 62 ఎకరాల భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఎలైన్మెంట్ మార్చాలని రైతులు పట్టుబడుతుండటంతో ఇవి ఇంకా పరిష్కారం కావలసి ఉంది. అధికారులు చొరవ తీసుకొని ఈ మధ్య కొన్ని గ్రామాలలో రైతుల సమస్యలను పరిష్కరించినప్పటికీ దుద్దుకూరులో ఇంకా 37 ఎకరాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటిని పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంవల్లే ప్రాజెక్టు పూర్తయినా సాగునీరు అందించలేని స్థితిలో ఉంది. ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఖరీఫ్‌కు నీరు ఇస్తామని చెప్పించడం ద్వారా రైతుల పక్షాన తాము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం అధికార పక్షం నుంచి జరుగుతోంది. నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారం రోజుల్లో వెలుగొండ పనులు ప్రారంభమవుతాయని చెప్పినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు పెంచకుండా, రైతులను పక్కదారి పట్టించేందుకే గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు రైతులు విమర్శిస్తున్నారు. -
వెలుగొండ ను పూర్తి చేస్తాం
2016 ఆగస్టుకు మొదటి దశ మంత్రి దేవినేని ఉమ పెద్దదోర్నాల : వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను 2016 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను శనివారం మంత్రి, నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లోకో రైలులో మొదటి సొరంగ నిర్మాణ పనులు నిలిచి పోయిన ప్రాంతానికి మంత్రి చేరుకుని టీబీఎం యంత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజలకు ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న వెలుగొండ ప్రాజెక్టుతోపాటు, జిల్లాలోని మరో ప్రాముఖ్యం ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను మెదటి ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బడ్జెట్లో వెలిగొండకు కేటాయించిన 153 కోట్లే కాకుండా అవసరమైతే ఎన్ని వేల కోట్లైనా కేటాయించి పూర్తి చేస్తామన్నారు. మరో నెల రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.13 మరుగున పడిన నేపధ్యంలో పనుల పురోగతిపై నిపుణుల కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం జీవో నెం.22ను విడుదల చేసిందన్నారు. గృహాలకు 24 గంటలు, వ్యవసాయ రంగానికి 7 గంటల నిరంతర విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం రెండో సొరంగ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకుమార్, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, సిడిసిడి వో గిరిధరరెడ్డి, క్వాలీటీ కంట్రోల్ సీఈ, జయప్రకాష్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ, వరలక్ష్మి, కడప ఇరిగేషన్ ఎస్సి కోటేశ్వరరావు, ప్రకాశం ఎస్ఈ రమణమూర్తి, సీఈ వీర్రాజు, మార్కాపురం, గిద్దలూరు మాజీ ఎమ్మేల్యేలు కందుల నారాయణరెడ్డి, అన్నా రాంబాబు, యర్రగొండపాలెం త్రిసభ్య కమిటీ సభ్యుడు అంబటి వీరారెడ్డి, జిల్లా కార్యవర ్గసభ్యుడు కాసా రఘనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హాట్ సీట్
ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ బుద్దా వెంకన్నకు ఎంపీ కేశినేని నాని మద్దతు బచ్చుల అర్జునుడి వైపు మొగ్గు చూపుతున్న మంత్రి దేవినేని ఉమ సీఎంను ప్రసన్నం చేసుకునే పనిలో పంచుమర్తి అనూరాధ నాకే ఇవ్వాలంటున్న వర్ల రామయ్య విజయవాడ : తెలుగుదేశం పార్టీలో పదవుల పోరు ముదురు పాకానపడింది. ఇప్పటికే స్థానిక పదవులు తమకంటే.. తమకంటూ.. అక్కడక్కడా టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగుతున్నారు. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఎవరికి కేటారుుంచాలనే విషయంపై గుడివాడలో బుధవారం రాత్రి జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. పార్టీని నమ్ముకున్న వాళ్లను కాదని, ఇప్పటికిప్పుడు వచ్చిన కార్పొరేట్ నాయకులకు పదవులు ఎలా ఇస్తారంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బుద్దా వెంకన్న పరిస్థితేంటి.. : ఎమ్మెల్సీ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బుధవారం రాత్రి గుడివాడలో టీడీపీ ముఖ్య నాయకులు సమావేశమై చర్చించారు. తనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మంత్రి దేవినేని ఉమాను కోరారు. అయితే, మంత్రి ఉమ మాట్లాడుతూ ‘మీరు అప్పీలు చేశారు. పరిశీలిద్దాం..’ అన్నారు. దీంతో బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ సీటు విషయం పరిశీలనకే పరిమితమనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే తన వద్దకు అర్జునుడు, వర్ల రామయ్య పేర్లు వచ్చినట్లు మంత్రి చెప్పడంతో బుద్దా వెంకన్నకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడిన వెంకన్నకు తర్వాత పదవులు చాలా ఉన్నాయంటూ నచ్చజెప్పి బాగా ఖర్చు చేరుుంచారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉంది. దీంతో మంత్రి తీరుపై బుద్దా వెంకన్న తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అరుుతే, ఎన్నికల సమయంలో పార్టీ కోసం చాలా ఖర్చు చేశానని, దానిని దృష్టిలో పెట్టుకుని తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నారు. మంత్రి మద్దతు ఎవరికీ..? : మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ అరుుతే తనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారంటూ నేరుగా ఆయనతో మాట్లాడేందుకే పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు ఎవరికనేది ఇంకా స్పష్టంకాలేదు. అరుుతే టీడీపీ జిల్లా కన్వీనర్ బచ్చుల అర్జునుడుకే ఆయన మద్దతు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడుముక్కలాటే.. బీసీలకే తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. బుద్దా వెంకన్న, పంచుమర్తి అనూరాధ, బచ్చుల అర్జునుడు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. వీరిలో ఎవరిని ఎమ్మెల్సీ పదవి వరిస్తుందనే విషయం చర్చనీయూంశమైంది. వర్ల రామయ్య కూడా తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నారు. సీనియర్ నాయకుడినైన తనను మరిచిపోవద్దంటూ పలువురికి ఇప్పటికే విన్నవించారు. అయితే, బీసీలకు తప్ప ఎస్సీలకు అవకాశం లేదని, ఏదైనా ఉంటే పరిశీలిద్దామంటూ కొందరు నాయకులు చెప్పినట్లు సమాచారం. ఎవరి మాట నెగ్గేనో...: మంత్రి దేవినేని ఉమా బచ్చుల అర్జునుడికే తన మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇక.. ఎంపీ కేశినేని నాని పార్టీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించనున్నారు. ఈ ఇద్దరి మద్దతుదారుల్లో ఎవరిని పదవి వరిస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఉమా తీరుపై ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నందున తప్పకుండా ఎంపీ అనుచరుడికే ఎక్కువ అవకాశం లభిస్తుందనేది టీడీపీలో పలువురి వాదన. మరోపక్క పంచుమర్తి అనూరాధ ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. అవసరమైతే ఎంత ఖర్చుచేసైనా పదవిని చేజిక్కించుకోవాలని, ఇందుకు చంద్రబాబు ద్వారా ప్రయత్నం చేయడమే సరైన మార్గమనే ఆలోచనలో ఆమె ఉన్నారు. మంచి రాజకీయ అవగాహన కలిగిన అనూరాధ మేయర్‌గా పనిచేసి నగరంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో మొదట అనుకున్న ప్రకారం అనూరాధకే పదవి దక్కే అవకాశమూ లేకపోలేదు.