2016 ఆగస్టుకు మొదటి దశ
మంత్రి దేవినేని ఉమ
పెద్దదోర్నాల : వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను 2016 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను శనివారం మంత్రి, నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లోకో రైలులో మొదటి సొరంగ నిర్మాణ పనులు నిలిచి పోయిన ప్రాంతానికి మంత్రి చేరుకుని టీబీఎం యంత్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజలకు ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న వెలుగొండ ప్రాజెక్టుతోపాటు, జిల్లాలోని మరో ప్రాముఖ్యం ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను మెదటి ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బడ్జెట్‌లో వెలిగొండకు కేటాయించిన 153 కోట్లే కాకుండా అవసరమైతే ఎన్ని వేల కోట్లైనా కేటాయించి పూర్తి చేస్తామన్నారు. మరో నెల రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.13 మరుగున పడిన నేపధ్యంలో పనుల పురోగతిపై నిపుణుల కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం జీవో నెం.22ను విడుదల చేసిందన్నారు. గృహాలకు 24 గంటలు, వ్యవసాయ రంగానికి 7 గంటల నిరంతర విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం రెండో సొరంగ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకుమార్, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, సిడిసిడి వో గిరిధరరెడ్డి, క్వాలీటీ కంట్రోల్ సీఈ, జయప్రకాష్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ, వరలక్ష్మి, కడప ఇరిగేషన్ ఎస్‌సి కోటేశ్వరరావు, ప్రకాశం ఎస్‌ఈ రమణమూర్తి, సీఈ వీర్రాజు, మార్కాపురం, గిద్దలూరు మాజీ ఎమ్మేల్యేలు కందుల నారాయణరెడ్డి, అన్నా రాంబాబు, యర్రగొండపాలెం త్రిసభ్య కమిటీ సభ్యుడు అంబటి వీరారెడ్డి, జిల్లా కార్యవర ్గసభ్యుడు కాసా రఘనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెలుగొండ ను పూర్తి చేస్తాం
Published Sun, Apr 5 2015 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement