
'ఉమా.. నీ నియోజకవర్గంలో చర్చకు సిద్ధమా?'
కృష్ణా జిల్లా మైలవరంలో సాగు, తాగు నీరు సరఫరా విషయమై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్.. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సవాల్ విసిరారు.
హైదరాబాద్: కృష్ణా జిల్లా మైలవరంలో సాగు, తాగు నీరు సరఫరా విషయమై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్.. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సవాల్ విసిరారు. దేవినేని ఉమా సొంత నియోజకవర్గమైన మైలవరంలో మీడియా సమక్షంలో ఇద్దరు చర్చిద్దామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ.. మంత్రి ఉమా తీరుపై మండిపడ్డారు.
సొంత నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వలేని దేవినేని ఉమా.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు పులివెందులకు నీరిచ్చామని ప్రగల్భాలు చెప్పడం మానుకోవాలని జోగి రమేష్ హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఉమా కలసి జలవనరుల శాఖను ధనవనరుల శాఖగా మార్చారని విమర్శించారు.