సాక్షి,తాడేపల్లి:ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని,అరాచకాలు,అక్రమాలు,దౌర్జన్యాలు చేసి మున్సిపాలిటీల్లో పదవులు దక్కించుకున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ కార్పొరేషన్,మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదు.
మా పార్టీ వారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటు. మా కార్పొరేటర్లు వెళ్లే బస్సు మీద రాళ్ల దాడి చేయడం దారుణం. తిరుపతి ప్రతిష్టను దిగజార్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ,కేజ్రివాల్‌ను తిట్టారు. అసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా? సిద్దాంతాలు,విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబు.
ఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవడానికే ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు,కుట్రల ప్రభుత్వం.వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారు.ఈ దాడులు,దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలి. అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలి’అని జోగి రమేష్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment