![Ambati Rambabu Comments On Chandrababu In Tirupati Laddu Issue](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Ambati%20rambabu.jpg.webp?itok=NFjsxb9-)
సాక్షి,గుంటూరు:తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసి చంద్రబాబు ఇరుక్కుపోయారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై సోమవారం(ఫిబ్రవరి10) అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి బయటపడడానికి బాబు ప్రయ యత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే చంద్రబాబు తిరుపతి లడ్డూపై ఆరోపణలు చేశారు.
లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని అబద్ధం చెప్పారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్ధతి ఉంది.ఏఆర్ డెయిరీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే నెయ్యి సరఫరా ప్రారంభించారు.
టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లను వెనక్కి పంపుతారు.వైఎస్ జగన్‌హయాంలోనూ ట్యాంకర్లను వెనక్కి పంపారు.దైవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు’అని అంబటి రాంబాబు అన్నారు.
![తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి బయటపడటానికి బాబు యత్నిస్తున్నారు](https://www.sakshi.com/s3fs-public/inline-images/lap.jpg)
అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..
- చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గుడు నీచుడు
- పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడు
- నిబంధనల ప్రకారం వెనుక్కు పంపించిన నెయ్యి పైన అరెస్టులు జరుగుతున్నాయి
- చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎక్కడా స్వామివారి ప్రసాదాలలో కల్తీ జరగలేదు
- చంద్రబాబు నాయుడు ఆరోపణలపై విచారణ జరుగుతోంది
- 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 15 సార్లు నెయ్యి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వెనక్కి పంపారు
- వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం 18సార్లు నెయ్యి వెనుక్కు పంపారు
- చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి ఇరుక్కుపోయాడు కాబట్టే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి
- స్వామివారి ప్రసాదంపైన జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయాడు
- లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచి హంగామా చేశాడు
- వాడని నెయ్యిని వాడినట్టు వాటిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడు
- తిరుమల నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు ఆధారాలు లేవు
- చంద్రబాబు పాలనలోనే ఏఆర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెయ్యి పంపిణీ చేసింది
- చిరంజీవి రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదు
- ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపినట్లే జనసేనను బీజేపీలో కలుపుతారా
- చిరంజీవి మాటలు వింటే అదే అర్థమవుతోంది
- ప్రజారాజ్యం రూపాంతం చెంది జనసేన అయిందన్న చిరంజీవి మాటల వెనుక బీజేపీలో జనసేనను కలుపుతారు ఏమో అని చెక్ చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment