![Ysrcp Mp Mithunreddy Speech In Loksabha Budget Session](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/MIthun%20reddy.jpg.webp?itok=FzJdzJ-Z)
సాక్షి,న్యూఢిల్లీ: మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్‌రెడ్డి లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది.
మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.
మిథున్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
- మార్గదర్శి రూ. 2600 కోట్ల రూపాయలు వసూలు చేసింది
- ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూలు చేసింది
- డిపాజిటర్లకు న్యాయం జరగాలి
- దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలి
- ఒకవైపు 75 వేల మెడికల్ సీట్లని కేంద్రం చెబుతోంది
- కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దని సరెండర్ చేస్తుంది
- ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేశారు.
- కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇప్పించాలి
- కేంద్రం విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి
- పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దు
- పోలవరం నిర్మాణానికి అరకొరగా నిధులు ఇస్తున్నారు
- రాజధాని అమరావతికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి
- పదేళ్ల తర్వాత రైల్వే జోన్ ఇచ్చారు
- వాల్తేర్ డివిజన్ రెండుగా విభజించి అన్యాయం చేశారు
- వాల్తేర్ డివిజన్ విశాఖ జోన్‌లోనే ఉంచాలి
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం
![మార్గదర్శి అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలి](https://www.sakshi.com/s3fs-public/inline-images/sc.jpg)
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై దాడిచేశారు: ఎంపీ గురుమూర్తి
- తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్‌సభలో 377 నిబంధన కింద లేవనెత్తిన ఎంపీ గురుమూర్తి
- ఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగింది
- తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారు
- ఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారు
- తిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారు
- బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారు
- ఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలి
- దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment