‘చంద్రబాబుకు జగన్‌ భయం పట్టుకుంది’ | YSRCP Leader TJR Sudhakar Babu Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు జగన్‌ భయం పట్టుకుంది’

Published Sun, Feb 9 2025 3:14 PM | Last Updated on Sun, Feb 9 2025 4:04 PM

YSRCP Leader TJR Sudhakar Babu Slams Chandrababu Naidu

తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నామస్మరణే చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు విమర్శించారు. దావోస్‌కు వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా చివరికి వారి పార్టీ మీటింగ్‌ పెట్టుకున్నా జగన్‌ పేరు తలవకుండా చంద్రబాబు ఉండలేకపోతున్నారన్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు జగన్‌ భయం పట్టుకుందనే విషయం అర్థమవుతుందని టీజేఆర్‌ సుధాకర్‌ బాబు స్పష్టం చేశారు. ‘ జగన్ పేరు ఎత్తకుండా చంద్రబాబుకు ఒక్క పూట కూడా గడవటం లేదు.మేనిఫెస్టోని మనీ ఫెస్టోగా మార్చారు. 

సూపర్ సిక్స్‌కి మాది హామీ అని జనసేన, బీజేపీ చెప్పాయి. ఇప్పుడు అసలు సంక్షేమ పథకాలు వద్దంటున్నారు. పైగా సంక్షేమం పేరు ఎత్తితే విసుగు పుడుతోందని అంటున్నారు. జనాన్ని చంద్రబాబు నిలువునా  మోసం చేస్తున్నారు.చంద్రబాబు ఏనాడూ మాట మీద నిలబడలేదు.సంక్షేమ పథకాలు విసుగు పుట్టిస్తే మరి ఇస్తామని ఎందుకు ప్రకటించారు? , జగన్ పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే సైకో అన్నారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఢిల్లో ధర్నాలు చేశారు. మళ్ళీ అదే మోదీతో జతకట్టారు. కాంగ్రెస్ పార్టీతో జతగట్టి, తర్వాత విడిపోయారు 

కమ్యూనిస్టులతోనూ పొత్తు పెట్టుకొని వదిలేశారు. ఇలా తన అవకాశవాదాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.అసెంబ్లీలో ప్రశ్నిస్తారేమోనని కనీసం మైకు కూడా ఇవ్వటం లేదు. జగన్‌పై రోజూ విషం కక్కే రఘురామకృష్ణంరాజుని డిప్యూటీ స్పీకర్‌ గా నియమిస్తే ఆ అసెంబ్లీ ఎలా జరుగుతుంది?, లక్షా 45 వేల కోట్ల అప్పులు చేసి ఆ డబ్బును ఏం చేశారు?, సూపర్ సిక్స్ హామీలు ఇవ్వకపోవడం దగాకోరుతనం’ ధ్వజమెత్తారు టీజేఆర్‌ సుధాకర్‌బాబు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement