సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు. అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు అంటూ ప్రశ్నించారు.
‘‘వైఎస్ జగన్ తిరుపతి ఎట్లా వస్తాడో చూస్తామని కొందరు మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ నేతలు, తిరుపతి జనసేన నేతలు, టీడీపీ వారిదీ అదే మాట. ఇంత విచిత్రమైన పరిస్థితిని నేనెప్పుడూ చూడలా. వైఎస్ జగన్ ఓ ఆరుగురితో కలిసి తిరుపతి వెళ్తున్నారు. అధికారికంగా అందరికీ తెలిసినదే. ఆయన వెంట ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలు పెట్టడమేంటి?. వేంకటేశ్వరస్వామిని మాజీ సీఎం దర్శించుకోవడానికి అనుమతి లేకపోవడమేంటి?. దేవుడి దర్శనానికి ఒకరి అనుమతి కావాలా. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా? అని అంబటి రాంబాబు నిలదీశారు.
ఇదీ చదవండి: తిరుపతిలో వైఎస్ జగన్‌పై దాడికి కుట్ర?!
‘‘డిక్లరేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతాడు. బీజేపీ పురంధేశ్వరి మాట్లాడతారు. వేంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం వాడుకోవడం నీచాతినీచం. వైఎస్సార్, వైఎస్ జగన్ అనేక మార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ జగన్ తిరుమల వెళ్లారు. అప్పుడెప్పుడూ రాని అభ్యంతరం ఇప్పుడెందుకు?. లడ్డూ చుట్టూ రాజకీయం చేసి మీరు బాగుపడాలని ప్రయత్నం చేస్తే మీకే నష్టం. పదివేల మందితో జగన్ దర్శనానికి వెళ్తున్నారని పోలీసులు నోటీసులివ్వడం బాధాకరం. చంద్రబాబు అగ్లీ చేష్టలను ప్రజలు హర్షించరు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment