సాక్షి, గుంటూరు: చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని.. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అయినా నిజాయితీపరుడినని చెప్పుకుంటాడంటూ సెటైర్లు వేశారు
‘‘ఆరు నెలల్లో లక్ష 20 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. చంద్రబాబు విశ్వాస ఘాతకుడు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అభివృద్ధిని పట్టించుకోకుండా ఆరు మాసాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మీ కక్ష సాధింపు చర్యలకు భయపడం. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు’’ అని అంబటి దుయ్యబట్టారు.
‘‘నిప్పు లాంటి మనిషి అంటే తుప్పు లాంటి మనిషి అని అర్థం. ఎమ్మెల్యేను కొనడానికి చంద్రబాబు ప్రయత్నించిన విషయం అందరికి తెలిసిందే. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు కంటే గొప్ప నాయకుడు దేశంలోనే లేదు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసే దాఖలాలు ఎక్కడైనా ఉందా?. సెకీ కేసులో ఏం లేదని తెలిసే చంద్రబాబు ఊరుకున్నారు. ఆరు మాసాల్లో కక్ష సాధింపు తప్పా అభివృద్ధి లేదు. ఐపీఎస్‌ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు
..గోడౌన్‌లో బియ్యం పోతే డబ్బులు కట్టించుకోవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటీ?. పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడం కక్ష సాధింపు కాదా..?. కక్ష సాధింపునకు భయపడే వ్యక్తులం కాదు. రెడ్‌బుక్‌లో పేర్లు రాసి అరెస్ట్ చేయడం కక్ష సాధింపు కాదా?. సెకి ఒప్పందం లడ్డూలా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్.
..చంద్రబాబు అబద్దాలన్నీ లెక్కిస్తే గిన్నీస్ బుక్ లో ఎక్కించవచ్చు. ధనవంతుడైన సీఎం చంద్రబాబు అని ఒక సంస్థ ప్రకటించింది. ఇది ఆయన అక్రమ సంపాదనకు నిదర్శనం. దేశంలో ఎక్కడా లేనంతగా ఎన్నికలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబే’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ప్చ్.. Pawan Kalyan సీజ్ ద షిప్
Comments
Please login to add a commentAdd a comment