సాక్షి, గుంటూరు: కూటమి పార్టీల నేతలు శాసనసభ స్థాయిని దిగజార్చేలా మాట్లాడారని.. వైఎస్ జగన్‌పై వాడిన భాష సరికాదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బెల్టు షాపులు పెడితే ఉక్కుపాదం మోపుతామన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టు షాపులే కనిపిస్తున్నాయి.’’ అని కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
‘‘గతంలో జగన్‌పై రఘురామకృష్ణరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసిన మీపై చర్యలు తీసుకుంటే తప్పా..?. వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు రావడానికి కారణమైన కుట్ర అందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు, కూటమి నేతలు భయపడుతున్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడగల వ్యక్తిత్వం జగన్‌ది. చంద్రబాబు కుట్రలు చేసి జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు. రఘురామతో రచ్చబండ పెట్టించి తిట్టించింది చంద్రబాబే. ఏదో విధంగా జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని ప్రయత్నిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు అసెంబ్లీలో రఘురామకృష్ణంరాజును కస్టడీకి తీసుకుని హింసించారని చెప్పటం దారుణం. రఘురామ కృష్ణంరాజును హింసించలేదని సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటివరకు పవన్ కల్యాణే నటుడు అనుకున్నాను. పవన్‌ను మించిన నటుడు చంద్రబాబు. హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఎందుకు 420 కేసు నమోదు చేయకూడదు?. 100 ఎస్కో బార్లు, 1000 మంది చీటర్లు, లక్షలాదిమంది దోపిడీ దొంగలను రుబ్బి బొమ్మ తీస్తే వచ్చేదే చంద్రబాబు బొమ్మ. చంద్రబాబు అత్యంత నీచమైన స్వభావం గల వ్యక్తి.
..రచ్చబండ పేరుతో రఘురామ కృష్ణంరాజు.. వైఎస్ జగన్‌ను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఎన్నికల అయిపోయిన తర్వాత రఘురామ కృష్ణంరాజు ఇక వైఎస్ జగన్‌ను దూషించనని చెప్పాడు. ఆ విషయం చంద్రబాబుకు గుర్తులేదా?. చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తాడు. శాసనసభ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో రఘురాం కృష్ణంరాజు మాట్లాడిన మాటలపై కేసులు ఎందుకు పెట్టడం లేదు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: వైఎస్ జగన్ ఆదేశం.. వైఎస్సార్‌సీపీ ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్’
Comments
Please login to add a commentAdd a comment