కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్‌గా నిలుస్తాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్నా సరే కంటెంట్‌లో దమ్ము లేకపోతే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే సినిమా అదే కోవలోకి వస్తుంది. సడక్.. 1991వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. మహేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజయ్‌దత్, పూజా భట్ ప్రధానపాత్రల్లో నటించారు.
రెండు దశాబ్దాలకు సీక్వెల్
ఐదింతలు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ప్రకటించారు. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్.. ఇలా బడా స్టార్స్‌తో 2020లో సీక్వెల్ తీసుకొచ్చారు. అయితే సడక్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో సడక్ 2 మూవీని అంతే స్థాయిలో తిప్పికొట్టారు. యూట్యూబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 70 లక్షలమంది డిస్‌లైక్ కొట్టారు.
నేరుగా ఓటీటీలో రిలీజ్
తీరా సినిమాకు థియేటర్లు దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ అత్యంత దారుణమైన రేటింగ్స్ ఉన్నాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. అంతేకాదు, ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే సడక్ 2 వంద అత్యంత చెత్త చిత్రాల్లో ఒకటిగా చేరిపోవడం గమనార్హం.
ముఖ్య కారణం!
కాగా సడక్ 2పై అంత వ్యతిరేకత రావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ మూవీ రిలీజైన ఏడాదే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలీవుడ్‌లోని నెపోటిజమే అతడి ప్రాణాలు తీసిందని జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ కారణం వల్లే బాలీవుడ్ బడా స్టార్స్ కలిసి నటించిన సడక్ 2 సినిమాకు యూట్యూబ్‌లో లక్షల్లో వచ్చిపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment