పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో బడా స్టార్ల రికార్డులను బద్దలు కొడుతూ వందల కోట్ల కలెక్షన్స్ వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లు (గ్రాస్) వసూలు చేయగా ఒక్క హిందీలోనే రూ.618 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా మూడోవారంలోకి అడుగుపెట్టింది.
ఆ కారణం వల్లే?
ఈ క్రమంలో నార్త్‌లో పుష్ప 2ను థియేటర్లలో నుంచి తీసేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. సినీ విశ్లేషకులు మనోబాలా విజయబాలన్.. పుష్ప 2 చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ నుంచి తీసేస్తున్నారని ట్వీట్ చేశాడు. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధనకు నిర్మాతలు ఒప్పుకోలేదని, అందుకే ఉన్నపళంగా పుష్ప 2 ప్రదర్శనలను నిలిపిపేయాలని మల్టీప్లెక్స్‌లు భావించినట్లు తెలుస్తోంది.
సమస్య సద్దుమణిగినట్లే!
తర్వాత ఇరు వర్గాలు కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మనోబాల మరో ట్వీట్‌లో వెల్లడించాడు. సమస్య సద్దుమణిగిందని తెలిపాడు. పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో పుష్ప 2 ఆడుతుందని పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పుష్ప 2 సినిమాను జనవరి రెండో వారంలో ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. మరి ఇప్పుడు కొత్త అగ్రిమెంట్స్ ప్రకారం ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి!
BREAKING: Pushpa 2⃣ REMOVED✖️ from all PVR INOX chains in North India from Tomorrow.
— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2024
BREAKING: Pushpa 2️⃣ PVR INOX agreement issue now resolved✅
Shows opening slowly one by one⏳— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2024
చదవండి: లక్కీ భాస్కర్.. హీరోయిన్‌ను మెచ్చుకోవాల్సిందే! : పరుచూరి గోపాలకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment