north india
-
ఉత్తరాదిని వణికిస్తున్న చలిగాలులు
-
వణుకుతున్న ఉత్తరాది.. ఢిల్లీలో తగ్గిన విజిబిలిటీ
-
ఉత్తర భారతం గజగజ
-
పలు రాష్ట్రాలకు కోల్డ్‌వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ:ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(IMD) అలర్ట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్,పంజాబ్,హర్యానా,రాజస్థాన్,ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి(కోల్డ్‌వేవ్) ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు,పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు మంచు(Snow) కురుస్తుందని వెల్లడించింది. కశ్మీర్లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీకి వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఇదీ చదవండి: హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్ -
థియేటర్ల నుంచి పుష్ప 2 అవుట్? ఏం జరిగిందంటే?
పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్నాడు. బాలీవుడ్లో బడా స్టార్ల రికార్డులను బద్దలు కొడుతూ వందల కోట్ల కలెక్షన్స్ వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లు (గ్రాస్) వసూలు చేయగా ఒక్క హిందీలోనే రూ.618 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా మూడోవారంలోకి అడుగుపెట్టింది. ఆ కారణం వల్లే?ఈ క్రమంలో నార్త్‌లో పుష్ప 2ను థియేటర్లలో నుంచి తీసేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. సినీ విశ్లేషకులు మనోబాలా విజయబాలన్.. పుష్ప 2 చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ నుంచి తీసేస్తున్నారని ట్వీట్ చేశాడు. థియేటర్లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధనకు నిర్మాతలు ఒప్పుకోలేదని, అందుకే ఉన్నపళంగా పుష్ప 2 ప్రదర్శనలను నిలిపిపేయాలని మల్టీప్లెక్స్‌లు భావించినట్లు తెలుస్తోంది. సమస్య సద్దుమణిగినట్లే!తర్వాత ఇరు వర్గాలు కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మనోబాల మరో ట్వీట్లో వెల్లడించాడు. సమస్య సద్దుమణిగిందని తెలిపాడు. పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో పుష్ప 2 ఆడుతుందని పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పుష్ప 2 సినిమాను జనవరి రెండో వారంలో ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. మరి ఇప్పుడు కొత్త అగ్రిమెంట్స్ ప్రకారం ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి! BREAKING: Pushpa 2⃣ REMOVED✖️ from all PVR INOX chains in North India from Tomorrow.— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2024 BREAKING: Pushpa 2️⃣ PVR INOX agreement issue now resolved✅Shows opening slowly one by one⏳— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2024చదవండి: లక్కీ భాస్కర్.. హీరోయిన్ను మెచ్చుకోవాల్సిందే! : పరుచూరి గోపాలకృష్ణ -
చలితో వణికిపోతున్న ఉత్తర భారతం
-
చలి గుప్పెట ఉత్తరాది
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లతో పాటు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజ లాడుతున్నాయి. చాలా చోట్ల ఆదివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే, కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఇది 3.1 డిగ్రీలు తక్కువ. ప్రస్తుతానికి శీతల గాలులు లేవని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ పేర్కొంది. అత్యల్పంగా ఫరీద్‌కోట్‌లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హరియాణాలోని హిస్సార్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్తాన్‌లోని ఫతేపూ ర్లో వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని కొండ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతల గాలుల ప్రభా వంతో 0.2 డిగ్రీలు, సుందర్‌నగర్‌లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో, సొలాన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 24.7 డిగ్రీలు, సిమ్లాలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో –3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో –4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నట్లు వెల్లడించింది. -
డబుల్ ఇస్మార్ట్ కు కిక్ ఇచ్చే న్యూస్..
-
భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వరదల ధాటికి పలు చోట్ల రోడ్డు రవాణా స్తంభిస్తోంది. భారీ వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం(జులై )1 వెల్లడించింది.వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న ఏడు రాష్ట్రాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశంలోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. -
India Meteorological Department: ఉత్తరాదిన కుండపోత వర్షాలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో భీకర వర్షం కురిసింది. ఉత్తరాదిన రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షాల ధాటికి మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. వసంత్ విహార్ ప్రాంతంలో కూలిపోయిన ఓ భవనం కింద చిక్కుకున్న ముగ్గురు కార్మికుల మృతదేహాలను శనివారం వెలికి తీశారు. నగరంలో వరుసగా రెండో రోజూ భారీగా వర్షపాతం నమోదైంది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో 8.9 మిల్లీమీటర్లు, లోధీ రోడ్డులో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో 35.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లో అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాంగ్రా, కులూ, సోలన్ జిల్లాలో పలు రహదారులను మూసివేశారు. రాష్ట్రంలో ధరంపూర్లో గత 24 గంటల్లో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. -
ఉత్తరాదిలో భానుడి భగభగలు..
-
India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాజస్తాన్‌లో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నా యి. రాజస్తాన్‌లోని ఫలోదీలో తాజాగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత రికా ర్డు కావడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2019 జూన్ 1న రాజస్తాన్‌లోని చురూలో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్యంలోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండల ధాటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాజస్తాన్‌లోని బార్మర్‌లో 48.8, జైసల్మేర్‌లో 48, బికనెర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. పశి్చమ బెంగాల్‌లోని కూచ్ బెహార్లో 40.5 డిగ్రీలు, అస్సాంలోని సిల్చార్‌లో 40, లుమిడింగ్‌లో 43, అరుణాచల్‌లోని ఈటానగర్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
ఉత్తర భారతానికి హీట్‌వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) తాజాగా హీట్‌వేవ్ అలర్ట్ ఇచ్చింది. రాజధాని ఢిల్లీ సహా మొత్తం ఉత్తర భారతమంతా మే 21వ తేదీ వరకు భానుడు చండ ప్రచండంగా నిప్పులు కురిపించనున్నాడని తెలిపింది. శుక్రవారం(మే17) దేశంలోనే రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. హీట్‌వేవ్ అలర్ట్ నేపథ్యంలో జైపూర్ నహార్ఘర్ బయలాజికల్ పార్కులోని జంతువులకు చల్లదనం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పార్కు అధికారులు తెలిపారు. -
కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశానికి ప్రత్యేక దేశం కావాలని అన్నారు. కేంద్రం నుంచి కర్ణాటకకు రావాల్సిన నిధులు సరిగా అందడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. దక్షిణానికి రావాల్సిన నిధులు ఉత్తరానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక దేశం డిమాండ్ చేయడం తప్పా మరో మార్గం లేదని అన్నారు. డీకే సురేష్ ప్రకటనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి విభజించు-పాలించే స్వభావం ఉందని విమర్శించారు. డీకే సురేష్ ప్రస్తుతం ఉత్తరం, దక్షిణ విభజించాలని కోరుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కర్ణాటకకు పన్నుల పంపిణీ ఎలా పెరిగిందో తెలిపే డేటాను సూర్య షేర్ చేశారు. Rashtrakavi Kuvempu, in our Nada Geethe, says, "Jaya Bharatha Jananiya Tanujaate, Jaya Hey Karnataka Mathe (Victory to you Mother Karnataka, The Daughter of Mother India!). While the Congress Party has a history of 'Divide and Rule', its MP Sri @DKSureshINC plays the trick again… pic.twitter.com/ou5cPNz5r7 — Tejasvi Surya (@Tejasvi_Surya) February 1, 2024 'ఒకవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశాన్ని ఏకం చేసేందుకు అని చెబుతూ పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు దేశాన్ని విభజించేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. విభజించు.. పాలించే విధానం కాంగ్రెస్ స్వభావమే. వలసవాదులు అనుసరించిన దానికంటే చాలా ఘోరం.' అని తేజస్వీ సూర్య అన్నారు. In 2023, we took up initiatives in sectors like health, education & sports in Bengaluru South. Bengaluru's key infra projects like Metro, Suburban Rail & STRR were also constantly monitored & fast-tracked. Here's 2023's Annual Report!#BharatIn2023https://t.co/Vywz7RTfQy pic.twitter.com/dtZew8c2Q6 — Tejasvi Surya (@Tejasvi_Surya) December 31, 2023 ఇదీ చదవండి: అభివృద్ధి నినాదం.. బడ్జెట్ విధానం: నిర్మలా సీతారామన్ -
బెంబేలెత్తిస్తున్న పొగమంచు.. ఢిల్లీ అతలాకుతలం
ఢిల్లీ: ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో.. చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశ రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో(zero visibility) రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 100 దాకా విమానాలు, పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఇక రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉండగా.. చలి కారణంగా వేళల్లో మార్పులు చేశారు. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి.. పొగ మంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఉదయం వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు గంటకు తక్కువ కాకుండా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోరుతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగుతోంది. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ నమోదు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
రాగల రెండు రోజుల్లో చలి మరింత తీవ్రం!
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుండి 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలి మరింత తీవ్రమయ్యింది. గంగాతీరంలోని మైదాన ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. దీని కారణంగా రైళ్లు, రహదారి రవాణాకు తీవ్ర ఆటంటాలు ఎదురువుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, పంజాబ్లలోని చాలాచోట్ల చలి విపరీతంగా ఉన్నదని ఢిల్లీ, ఉత్తర మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇటుంటి పరిస్థితులే ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 10 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యింది. హర్యానాలోని అంబాలాలో గరిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7.5 డిగ్రీలు తక్కువ. పంజాబ్‌లోని పాటియాలాలో ఉష్ణోగ్రత 11.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు కంటే 7.5 డిగ్రీల సెల్సియస్ తక్కువ. రాజస్థాన్‌లోని సికార్‌లో ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇది ఈ సీజన్లో సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువ. మధ్యప్రదేశ్‌లోని గుణాలో గరిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని, ఫలితంగా చలి మరింత తీవ్రం అవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. -
ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 274 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం
న్యూఢిల్లీ/బాగ్పట్: ఉత్తర భారతదేశం పొగ మంచు గుప్పిట్లో చిక్కుకుంటోంది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో మూసుకుపోతున్నాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకుతోడు చలి తీవ్ర నానాటికీ పెరుగుతోంది. నగరంలో నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్నింటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని సూచించింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ సున్నాకు పడిపోవడం గమనార్హం. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డయిం్యంది. ఇది ‘వెరీ పూర్’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు వల్ల 8 మంది మృతి విపరీతమైన పొగమంచు వల్ల దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత, బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మరణించారు. మరో 25 మందికిపైగా గాయాలపాలయ్యారు. బరేలీ జిల్లాలోని హఫీజ్‌గంజ్‌లో మోటార్ సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. -
ఉత్తర భారతంతో పాటు నేపాల్ లో అర్ధరాత్రి భూకంపం
-
ఉత్తర భారతదేశంలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలో శుక్రవారం రాత్రి భూప్రకంపలను సంభవించాయి. నేపాల్‌లో సంభవించిన తీవ్ర భూకంపం ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. ఉత్తర ప్రదేశ్, బిహార్, హరియాణా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలిసింది. నేపాల్‌లో భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదయ్యింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు నేపాల్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు తెలియజేసింది. నేపాల్‌లో భూకంపం చోటుచేసుకోవడం గత నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి. నేపాల్‌లో తాజా భూకంపంలో ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. -
ఉత్తర భారతాన్ని వదలని వానలు
డెహ్రాడూన్: రుతుపవనాలు మొదలైంది మొదలు దేశవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వానలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దక్షిణాదిన వరుణుడు కాస్త కనికరించినా ఉత్తరాదిన మాత్రం ఇప్పటికీ అలజడి సృష్టిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీలో రాష్ట్రాల్లో అయితే ఈ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రోజులకు రోజలు జనం ఎటూ కదలడానికి లేకుండా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వర్షాల ఉధృతి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా తాకింది. ఆ రాష్ట్రంలో వరణుడు మరోసారి సృష్టించిన బీభత్సానికి ఎటు చూసినా భీతావాహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది ప్రవాహానికి తెగిపోయిన వంతెనలు, కూలిపోయిన ఇళ్ళే దర్శనమిస్తున్నాయి. మరోపక్క భారీ వర్షాల తాకిడికి గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్దాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 19 మంది గల్లంతయ్యారని, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేశామని అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరినీ బయటకు రావొద్దంటూ ప్రకటనలు జారీ చేశామన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది! -
ఉత్తర భారతంలో భారీ వర్షాలు
-
గిరిసీమ విధ్వంసం రేపుతున్న ప్రశ్నలు
ఉత్తరాదిలో కురిసిన వానలకు ముఖ్యంగా పర్వత ప్రాంతాలు జలమయమైనాయి. జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం బాధాకరమే అయినప్పటికీ ఇదేదో ప్రకృతి ప్రకోపమని సర్ది చెప్పుకునేందుకు వీల్లేదు. ఇది ప్రకృతి హెచ్చరికలను పెడచెవిన పెట్టిన మనిషి దురాశ ఫలితమే. పర్వత ప్రాంతాల్లోని నదులు, వంకలు, వాగులు చిన్న వానకే అకస్మాత్తుగా ఉరకలెత్తే అవకాశాలెక్కువ. అయినా ఇళ్ల నిర్మాణాల కోసం డిజైన్ కోడ్ పాటించకపోవడం; సరైన రీతిలో తయారు చేసిన కాంక్రీట్, తగిన పిల్లర్లు వాడకపోవడం వల్లనే ప్రస్తుత విధ్వంసం జరిగింది. పర్వతాల్లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడు ప్రకృతిని గౌరవించడం అలవర్చుకోవాలి. అవసరమైనంత మాత్రమే కట్టుకోవడం, మిగిలినది ప్రకృతి ఛాయలోనే ఉంచడం మేలు. వారం అంటే వారం చాలు... ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాల్సిన హాలిడే సీజన్ కాస్తా పర్యావరణ విధ్వంసంగా మారిపోయేందుకు! అప్పుడే వేసిన రోడ్లు కొట్టుకుపోవడం, వంతెనలు నదుల్లోకి చేరి ప్రవహించడం, కొండచరియలు విరిగిపడటం, పెద్ద పెద్ద భవంతులు పునాదులు కదిలిపోయి నీళ్లలోకి చేరిపోవడం చూశాం. బహుశా ఇవేవీ కొత్త దృశ్యాలు కాకపోవచ్చు కానీ, ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈమధ్య తరచూ చూడాల్సి వస్తోంది. వార్తాపత్రికల్లోని వార్తలు, సోషల్ మీడియా పోస్టులు హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రకృతి వైపరీత్యాన్ని కళ్లకు కడుతున్నాయి. అనూహ్యమైన వర్షాలు, ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాయి. యాత్రీకులు దిక్కుతోచని విధంగా చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కూడా మరీ కష్టసాధ్యంగా మారాయి. ఒక ఆర్కిటెక్ట్‌గా ఈ గిరిసీమలో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను. చిన్నప్పుడు భూటాన్‌లో పెరిగినప్పటి నుంచి పర్వతాలతో నాకు అనుబంధం ఉంది. అయితే పర్వత ప్రాంతాల్లోని భవనాల గురించి మొదట తెలిసింది విఖ్యాత అధ్యాపకులు ఎంఆర్ అగ్నిహోత్రి వద్ద రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడే. పర్వతారోహకుడు, ఆర్కిటెక్ట్, విద్యావేత్త కూడా అయిన ప్రొఫెసర్ అగ్నిహోత్రి లాంటి వ్యక్తి ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఉత్తరకాశీ ప్రాంతంలో నేనూ, ఆయనా కలిసి ఎన్నో చోట్ల పర్యటించాం. 1992 నాటి భయంకరమైన భూకంపం తరువాత పదేళ్లపాటు పునరావాస కార్యక్రమాలను పరిశీలించాం. సమీక్షించాం. ప్రాజెక్టులో నాలుగు నెలలు పనిచేస్తే, సగం క్షేత్రస్థాయిలో మిగిలిన సగం ఆఫీసులో ఉంటూ ‘వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మిటిగేషన్ ’ కోసం నివేదిక సిద్ధం చేస్తూ గడిపాము. అదో అద్భుతమైన అనుభవం. ఇప్పటికీ నాకు ఎంతో అపురూపమైంది. అనుభవంలో తలపండిన వ్యక్తి ద్వారా పర్వత ప్రాంతాలు ఒక అకెడమిక్ కోణంలో పరిచయం కావడం నా అదృష్టం. ఆ ప్రాజెక్టులోనే నాకు ఓ అద్భుతమైన విషయం తెలిసింది. భాగీరథి నదీ తీరం వెంబడి ఉన్న మానేరి గ్రామంలో ఓ చిన్న జలవిద్యుత్ కేంద్రం ఉంది. డ్యామ్‌కు రహదారికి మధ్య నదీ తీరంలో ఉంటుంది ఈ గ్రామం. ఆర్సీసీ ‘పిల్లర్లు’, ‘లింటార్’ నిర్మాణాలతో అన్నీ ‘పక్కా’ ఇళ్లే ఉండేవి అక్కడ. ప్రాజెక్టు నిర్మాణానికి వాడిన ఉక్కు, కాంక్రీట్‌తోనే వీటినీ కట్టారేమో అనుకునే వాడిని. 1992 భూకంపంలో ఈ గ్రామం మొత్తం ధ్వంసమైపోయిందని తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఆ భూకంపంలో మరణించినట్లు తెలిసింది. భూకంపం కదా, ప్రాణనష్టం ఉంటుందని అనుకోవచ్చు. ఆర్సీసీ స్తంభాలు వాడారని చెప్పుకున్నాం కదా... దాన్ని చాలా సున్నితంగా పరిస్థితులకు తగ్గట్టుగా వాడాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పట్టించుకోకపోయినా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది అదే. సరైన రీతిలో తయారు చేయని ఆర్సీసీ, డిజైన్ కోడ్ పాటించకపోవడం వల్లనే ప్రస్తుత విధ్వంసం జరిగింది. స్థానిక కాంట్రాక్టర్ మాటల ప్రకారం, అక్కడ ఇళ్ల నిర్మాణానికి ‘3 అడుగులు బై 3 అడుగుల’ కాలమ్స్‌ను ఉపయోగిస్తునారు. భవనం ఎత్తు ఎంత ఉన్నా ఇంతే సైజు స్తంభాలను వాడుతున్నారు. కొందరైతే వీటి మీదే నాలుగైదు అంతస్తుల భవనాలు కట్టారు. ఆ ప్రాంతం బిల్డింగ్ కోడ్ ప్రకారం రెండు అంతస్తుల కంటే ఎత్తయిన భవనాలు కట్టరాదు. ఎక్కువ అంతస్తులుండటం లాభాలు తెస్తుంది కానీ, ప్రమాదం కూడా చెప్పకుండా వచ్చేస్తుంది. అల్మోరా(ఉత్తరాఖండ్)లో చాలా ఏళ్ల క్రితం నేను ఓ భవనం కట్టించా. ఆ సందర్భంలో కాంట్రాక్టర్ ఆందోళనతో ఫోకస్ చేశాడు. భవన నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్స్ సరిగానే ఉన్నాయా? అని అడిగాడు. ఎందుకంటే ఆ చిత్రాల్లో స్తంభాల అడుగు భాగాలు (ఫుటింగ్స్) భారీ సైజుల్లో ఉన్నాయి. ఆ సైజులో ఫుటింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఖర్చులు ఎక్కువవుతాయన్నది ఆయన ఆందోళన. ఎలాగైనా వీటి సైజులు తగ్గించాలని అభ్యర్థించాడు. అంత మొత్తంలో ఉక్కు కూడా ఎవరూ వాడరని వాదించాడు. అయితే నేను వాటిని తగ్గించలేదు. ఎందుకంటే భూకంపం రాగల ప్రమాదమున్న జోన్లలో అత్యంత ప్రమాదకరమైన ఐదవ జోన్ లో అంత మొత్తం కాంక్రీట్ వాడాల్సిందే. భవనం కట్టిస్తున్న వారితో మాట్లాడి... ఈ విషయాలన్నీ వారికి వివరించి కాంట్రాక్టర్‌కు కొంచెం ఎక్కువ చెల్లించేలా ఒప్పించి మరీ భవన నిర్మాణాన్ని కొనసాగించాము. పర్వతాలిప్పుడు భవనాలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. స్థానిక మేస్త్రీలే కాంట్రాక్టర్ల అవతారమెత్తి కట్టేస్తున్నారు. స్థానికులు కూడా చౌకగా అందుబాటులో ఉన్నారని వీరికే పనులప్పగిస్తున్నారు కూడా. ఆధునిక సమాజంలో ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానాలతో అద్భుతాలు సృష్టించవచ్చునని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ టెక్నాలజీలు, ఆధునిక హంగులకు కొంత ఖర్చూ అవుతుంది. కొన్నిసార్లు ఈ ఖర్చు చాలా ఎక్కువ. సైజు, స్థాయి పెరిగే కొద్దీ ఖర్చు ఇబ్బడిముబ్బడి అవుతూంటుంది. అయితే టెక్నాలజీ వాడకంలో నష్టాలూ లేకపోలేదు. తగిన విధంగా ఉపయోగించకుంటే, నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం అమలు చేయకుంటే దారుణ వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. టీవీల్లో చూపినట్లు భవనాలు, వంతెనలు కుప్పకూలిపోవడం, ప్రవహిస్తూండటం టెక్నాలజీని సక్రమంగా వాడని ఫలితమే. మానేరి గ్రామం వద్ద గడిపిన సమయంలో నేను కొన్ని సాధారణ పాఠాలు నేర్చుకోగలిగాను. ఇందులో అతి ముఖ్యమైంది... నీటి ప్రవాహానికి సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు చేపట్టకూడదన్నది! పర్వత ప్రాంతాల్లోని నదులు, వంకలు, వాగులు ఒక్క చిన్న వానకే అకస్మాత్తుగా ఉరకలెత్తే అవకాశాలెక్కువ అన్నది గుర్తించాలి. రెండో పాఠం... పర్వత సానువులను కోయవద్దు. దీనివల్ల పైభాగంలోని చెరియలు విరిగిపడిపోయే అవకాశాలెక్కువ. దురదృష్టవశాత్తూ హైవేల నిర్మాణంలో, వెడల్పు పెంచే సందర్భంలో సానువుల కోత తరచూ జరుగుతోంది. మూడో అంశం... స్థానిక భవన నిర్మాణ శైలిని గౌరవించాలి. వీలైనంత వరకూ భవన నిర్మాణ వ్యవస్థలు స్థానికమైనవిగా ఉండేలా చూసుకోవాలి. నిర్మాణం విషయంలో స్థానికులకు ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. చివరగా... పర్వతాల్లో నిర్మాణాలు చేపడుతూంటే ప్రకృతిని గౌరవించడం అలవర్చుకోవాలి. అవసరమైనంత మాత్రమే కట్టుకోవడం... మిగిలినది ప్రకృతి ఛాయలోనే ఉంచడం మేలు. ప్రకృతి నుంచి మనకు కావాల్సింది తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాకూడదు; వీలైనంత వరకూ మొక్కలు, చెట్లు, అడవులు పెంచాలి. పర్వత ప్రాంతాలను దక్షిణ ఢిల్లీ, శిమ్లా నగరాల్లా మార్చవద్దు. నిజానికి ఇవేవీ కొత్త విషయాలు కావు. కానీ వీటిని పట్టించుకోకపోవడం మన అజ్ఞానం, అంతే. ప్రస్తుతం శూన్య కర్బన ఉద్గారాలు, సుస్థిరాభివృద్ధి, ప్లాటినమ్ రేటింగ్ అంటూ చాలా కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సరే కానీ, భవనాలపై కూడా దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చేసింది. పర్వతాల్లో, నదుల్లో, అడవుల్లో వాతావరణ మార్పుల మధ్యన ఉండేవి ఇవే. తరచూ వరదల బారిన పడుతున్నవి కూడా ఇవే. ఈ అంశాలపై కనీసం కొన్ని ఆర్కిటెక్చరల్ పాఠశాలల్లోనైనా చర్చ మొదలు కావాలి. వ్యాసకర్త ఆర్కిటెక్ట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఉత్తరాదిన విలయం సృష్టిస్తున్న వరదలు
-
ఉత్తరాదిలో వరద-బురద.. మన పాపమే... ఈ ప్రకృతి శాపం!
కనీసం నలభై, యాభై ఏళ్ళుగా ఎన్నడూ చూడనంతటి వర్షం. ఎడతెరిపి లేకుండా నాలుగు రోజులుగా వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ – కశ్మీర్‌లలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. ఉత్తర భారతావనిలో అనేక చోట్ల ఎత్తైన ఆలయ శిఖరాలను సైతం ముంచేస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు. పేరుకుపోయిన బురదలో కూరుకుపోయిన ఆవాసాలు. ఆకస్మిక వరదలతో సిమ్లాలో కుప్పకూలిన భవనాలు. చమోలీలో కొట్టుకుపోయిన బ్రిడ్జీలు. విరిగిపడ్డ కొండచరియలు, కోతపడ్డ రహదారులు. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నదితో దేశ రాజధాని ఢిల్లీకి సైతం వరద ముప్పు. హిమాచల్‌లో 70 మందికి పైగా దుర్మరణం. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే రూ.4 వేల కోట్లకు పైగా నష్టం. వరదలో చిక్కుకున్న వందలాది గ్రామాలు, వేలాది జనం. ప్రకృతి కోపిస్తే, మనిషి పిపీలకమేనని ఇవన్నీ మరోసారి ఋజువు చేస్తున్నాయి. వాతావరణ మార్పుతో పాటు అభివృద్ధి పేరిట మనం చేస్తున్న పర్యావరణ విధ్వంసమూ ఈ బీభత్సానికి కారణమని వెక్కిరిస్తున్నాయి. పట్టణాభివృద్ధి ప్రణాళికలో మన డొల్లతనాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి. హిమాలయ సానువుల్లోని పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్కేంద్రాలే మునిగిపోయి, మట్టి పేరుకుపోవడంతో కరెంట్ లేదు. సాయం చేసే మనిషి లేడు. అనుకోకుండా వచ్చి ఇరుక్కుపోయిన వేల మంది పర్యటకులు ఎలాగోలా బయటపడదామంటే బస్సులు లేవు. విమాన సర్వీసులు లేవు. దోవ, ధైర్యం చెప్పే నాథుడు లేడు. కాసింత రోడ్డు దాటడానికి సైతం వేలకు వేలు దోపిడీ చేస్తున్న కొందరు దళారుల నడుమ ప్రభుత్వ యంత్రాంగం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.కుల్లూ, మనాలీ లాంటి ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నది ధాటికి ఆపి ఉంచిన వాహనాలు సైతం లక్కపిడతల్లా కొట్టుకుపోయాయి. ఇరుకైన జనావాసాల మధ్య నుంచి భారీ వృక్షాలు, కొయ్య దుంగలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పదేళ్ళ క్రితం 2013 జూన్ మధ్యలో ఉత్తరాఖండ్‌ను వణికించిన ‘హిమాలయన్ సునామీ’ లాంటి ప్రళయ భీకర దృశ్యాలనే తాజా సన్నివేశాలూ తలపిస్తున్నాయి. దృశ్యాలే కాదు... ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణాలూ దాదాపు అప్పటి లాంటివేనని శాస్త్రవేత్తలు అనడం గమనార్హం. అప్పుడైనా, ఇప్పుడైనా ఒక పక్కన ఋతుపవనాలు, మరోపక్కన మధ్యధరా సముద్రంలో తలెత్తి, ఉత్తర భారతావనికి ఆకస్మిక వర్షాలు తెచ్చే తుపాను – రెండూ ఏకకాలంలో కలగలసి ఈ ముప్పు తెచ్చాయి. జూన్ చివరి వరకు వర్షపాతం 10 శాతం కొరవ పడితే, వారం రోజుల్లో ఈ వాతావరణ ఉత్పాతంతో 2 శాతం అధిక వర్షపాతం స్థాయికి చేరుకున్నామన్న లెక్క నివ్వెరపరుస్తోంది. అంతకన్నా కలవరమేమిటంటే, భూతాపం రోజురోజుకూ పెరుగుతున్నవేళ ఇలా ఉమ్మడిగా ముప్పు మీదపడడం పోనుపోనూ ఎక్కువవుతుందట! అలాగే, పర్యావరణ రీత్యా అతి సున్నిత హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ప్రాజెక్టుల పేరిట సాగిస్తున్న విధ్వంసకర అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చుకోకుంటే వినాశనం తప్పదనడానికి తాజా ఘటన మరో హెచ్చరిక. తాజా ఘటనలు ఋతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావానికీ అద్దం పడుతున్నాయి. వర్షం పడదు. పడితే కాసేపే భారీ వర్షం, ఆ వెంటే వరద. ఆకస్మిక వాన, వరదల్ని ముందుగా అంచనా వేయడం కష్టమే. వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తూ, ఆకస్మిక వరదలొచ్చే ప్రదేశాలను గుర్తించి హెచ్చరించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదభరిత వాతావరణ ఘటనల్ని పసిగట్టా లంటే రాడార్ల వినియోగమే శరణ్యమని వాతావరణ శాస్త్రవేత్తల మాట. దానివల్ల 3 గంటల ముందే ముప్పును పసిగట్టవచ్చు. అయితే, ఇకపై హిమాలయాలు, పడమటి కనుమల లాంటి పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు, భూపతనాలు పెరుగుతాయన్న హెచ్చరికను చెవికెక్కించుకోవాలి. నిరుడు జనవరి మొదటి నుంచి సెప్టెంబర్ 30 మధ్య మొత్తం 273 రోజుల్లో ఏకంగా 242 రోజుల్లో ఏదో ఒక ప్రకృతి విలయం తప్పలేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కథనం. అంటే, తరచూ ఎదురయ్యే ముప్పు రీత్యా దీర్ఘకాలిక ప్రణాళికలే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. ఇక, దేశ రాజధాని ఢిల్లీ సైతం మొన్నటి దాకా ఎర్రటి ఎండతో, ఆపైన ముంచెత్తిన వానతో చిగురుటాకులా వణికిపోయింది. వీవీఐపీలు తిరిగే ఇండియా గేట్, జనక్‌పురి సహా మూడు ప్రధానమైన చోట్ల గత వారంలో రహదారులు కుంగిపోయాయి. కొన్నిచోట్ల 8 అడుగుల లోతు గుంటలుపడ్డాయి. ఇవన్నీ మన పట్టణ ప్లానింగ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అద్దం పడుతున్నాయి. ఇప్పటికే ముంబయ్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో పదే పదే ఇలాంటి పరిస్థితులే చూస్తున్నాం. చెట్ల నరికివేత, చెరువులు – నదీతీరాల్ని ఆక్రమించేలా విచ్చలవిడి నిర్మాణాలకు అనుమతి వీటికి కారణం. కాసింత వానకే మురుగునీటి పారుదల వ్యవస్థ కుప్పకూలుతోంది. ఇవన్నీ మన పాపాల ఫలితమే. ఇకనైనా, పాలకులు ఉష్ట్రపక్షి స్వభావాన్ని విడనాడాలి. విచ్చలవిడి అభివృద్ధితో వినాశనమే అని గ్రహించాలి. అంతకంతకూ పట్టణాలకు వలసలు పెరుగుతున్నందున పెరిగే అవసరాలకు తగ్గట్టు సరైన రీతిలో పట్టణాభివృద్ధి ప్రణాళిక చేయాలి. చెరువులు, కాలువలను మొత్తం పట్టణ స్వరూపంలో భాగమని గుర్తించాలి. వాటిని సవ్యంగా కాపాడి, నిర్వహిస్తేనే అర్బన్ ఫ్లడ్స్‌ను నివారించవచ్చు. అలాగే, ఇప్పటికే భారీ అప్పుల్లో పీకల లోతు కూరుకుపోయిన హిమాచల్ లాంటి రాష్ట్రాలు ఈ జలవిలయ నష్టాల నుంచి బయటపడాలంటే కష్టమైనా కొన్ని కఠిననిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. -
ఉత్తర భారతంలో వర్ష బీభత్సం
-
ఉత్తరాది అతలాకుతలం.. ప్రమాదస్థాయికి చేరుకున్న యమున
న్యూఢిల్లీ/సిమ్లా/జైపూర్: ఉత్తరభారతంలో మూడో రోజూ వర్ష బీభత్సం కొనసాగింది. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. వానల ప్రభావం హిమాచల్ ప్రదేశ్‌పైనే ఎక్కువగా పడింది. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటి వరకు 18 మంది, పంజాబ్, హరియాణాల్లో 9 మంది, రాజస్తాన్‌లో ఏడుగురు, యూపీలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఉత్తరాదిన వరదల్లో ఇప్పటిదాకా 37 మంది చనిపోయారు. హిమాచల్‌లోని వివిధ ప్రాంతాల్లో 200 మంది పర్యాటకులు చిక్కుబడిపోయారు. ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ప్రధాని మోదీ సోమవారం సీనియర్ మంత్రులు, అధికారులతో కలిసి ఉత్తరాదిన భారీ వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ హిమాచల్, ఉత్తరాఖండ్ సీఎంలతో మాట్లాడి, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం మరో నలుగురు చనిపోయారు. సిమ్లా–కాల్కా హైవేలో కొంతభాగం కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లా–కాల్కా మార్గంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం వరకు రైళ్ల రాకపోకలను ఆపేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా 120 రోడ్లపై రాకపోకలు బందయ్యాయని, 484 నీటి సరఫరా పథకాలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. జూలై 1–9 తేదీల మధ్య సాధారణ వర్షపాతం 160.6 మిల్లీమీటర్లకు మించి 69 శాతం ఎక్కువగా 271.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌పుర విద్యుత్ప్లాంట్లోకి చేరిన నీరు ఎగువనున్న హరియాణాలోని హత్నికుండ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నదిలో వరద పెరుగుతోంది. సోమవారం మధ్యాహా్ననికి ప్రమాద స్థాయి దాటి 205.33 మీటర్లకు చేరింది. మంగళవారం మధ్యాహా్ననికి 206.65 మీటర్లకు చేరి, క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. నదిలో నీరు 206 మీటర్ల మార్కును దాటితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. యమునా నదికి అత్యంత సమీపంలో సుమారు 41 వేల మంది నివసిస్తున్నట్లు అంచనా. గత ఏడాది సెపె్టంబర్లో రెండుసార్లు యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహించింది. పంజాబ్, హరియాణాల్లో వానల తీవ్రత సోమవారమూ కొనసాగింది. పంజాబ్ రాష్ట్రం పటియాలా జిల్లాలోని రాజ్‌పుర విద్యుత్ ప్లాంట్‌లోకి వరద చేరడంతో 700 మెగావాట్ల యూనిట్‌ను అధికారులు మూసివేశారు. సట్లెజ్ యయునా లింక్ కెనాల్ పొంగిపొర్లి రాజ్‌పురలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలోకి నీరు చేరింది. ఆస్పత్రుల్లోకి చేరిన వరద రాజస్తాన్‌లోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్ రైల్వేస్టేషన్లో పట్టాలపైకి, జేఎల్ఎన్ ఆస్పత్రి వార్డుల్లోకి వరద నీరు ప్రవేశించింది. టోంక్‌లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్, బదౌన్ జిల్లాల్లో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. షహరాన్‌పూర్‌లో 15 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాదిన మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. -
Heavy Rains: ఉత్తర భారతానికి ఈ పరిస్థితి ఎందుకు?
ఢిల్లీ: ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు, బిపర్జోయ్ తుపాను ప్రభావమూ ఓ పక్క.. ఇంకోపక్క అధిక ఉష్ణోగ్రతల ప్రభావమూ ఈ యేడు వానల్ని ఆలస్యం చేశాయి. అయితే ఈలోపు రికార్డు స్థాయిలో ఉత్తరాదిన కురుస్తున్న వర్షాలు.. అతలాకుతలం చేస్తున్నాయి. భీకర వర్షాలతో సగానికి పైగా ఉత్తర భారతం నీట మునిగింది. మరోపక్క ఆస్తి నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేని స్థితిలో.. మృతుల సంఖ్యా వందకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఉత్తరాదిపై వరుణుడు ఇంతగా ప్రతాపం చూపించడానికి కారణంపై భారత వాతావరణ శాఖ స్పందించింది. ఉత్తర భారతంలో నెలకొన్న అసాధరణ పరిస్థితిపై ఐఎండీ స్పష్టత ఇచ్చింది. పశ్చిమ భాగంలో నెలకొన్న సంక్షోభం(వాతావరణ మార్పులు).. అదే సమయంలో రుతుపవనాల ప్రభావం వల్ల ఉత్తర భారత దేశంలో ఈ భీకర వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అంటోంది. అలాగే జులై మొదటి వారంలో కురిసిన వర్షాలు.. మొత్తం దేశానికి లోటును భర్తీ చేశాయని తెలిపింది ఐఎండీ. ये आवाज किसकी है? #DelhiRains . Who know this ? #Chandigarh #Atlee #JawanPrevue #Heavyrainfall #Manali #PriyAnkit #TejRan #oriele #emeutes #himachalfloods pic.twitter.com/TC2OgiNqwd — Baba Chuskiwale (@BabaChuskiWale) July 10, 2023 #WATCH | Himachal Pradesh: Latest visuals from Mandi around Victoria Bridge and Panchvakhtra Temple. pic.twitter.com/1jnhmTr8V6 — ANI (@ANI) July 10, 2023 వర్షాకాలంలో సంచిత వర్షపాతం 243.2 మిల్లీమీటర్లకు చేరుకుంది, ఇది సాధారణం 239.1 మిమీ కంటే రెండు శాతం ఎక్కువ అని IMD ప్రకటించింది. అలాగే.. జూన్ చివరి నాటి కల్లా దేశం మొత్తం మీద 148.6 మి.మీ నమోదు కాగా.. అది సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తక్కువ తెలిపింది. వాస్తవానికి ఈ జులైలో సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. కానీ.. వాతావరణ మార్పుల వల్ల అంచనాలు తప్పి అధిక వర్షాలు కురుస్తున్నాయి. जितना हम प्रकृति को नुकसान पहुंचाएंगे, वो हमे भी उतना ही नुकसान पहुंचाएगी 😥 Pray for Himachal #Heavyrainfall #HimachalPradesh #flood #Himachalrain #himachalflood #staysafe #mandi #Kullu pic.twitter.com/j222xFbmbc — कंचन शर्मा (@itsKanchan7) July 10, 2023 ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపోవడం, ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడుతున్నారు. వరదల ధాటికి.. వాహనాలు, రోడ్లు, వంతెనలు, భవనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. #WATCH | Water level in Yamuna river reaches near danger mark at Old Railway Bridge. pic.twitter.com/oNfL7qwe1c — ANI (@ANI) July 10, 2023 #Heavyrainfall #HimachalPradesh pic.twitter.com/L0RGEKkzbI — Satendra Pandit (@SatendraPandi10) July 10, 2023 రాజధాని ఢిల్లీ రీజియన్ సహా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్, రాజస్థాన్‌కూ ఇంకా వాన ముప్పు తప్పలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. యమునా నది ఉగ్ర రూపం దాల్చి.. ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. మరోవైపు సెంట్రల్ వాటర్ కమిషన్.. నీటి నిల్వలపైనా ఒక ప్రకటన చేసింది. రిజర్వాయర్లోల నీటి సామర్థ్యం మెరుగుపడిందని పేర్కొంది. -
ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..
న్యూఢిల్లీ: ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. అయితే.. ఆయా రాష్ట్రాల్లో మరింత వర్షం సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీతోపాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్ సహా పలు నగరాలు పట్టణాల్లో రహదారులపై నీరు నిలవడంతో జనం ట్రాఫిక్ కష్టాలపై వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర రైల్వే 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. హిమాచల్ అస్తవ్యస్తం హిమాచల్ ప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సిమ్లా జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, కులు, చంబా జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు. గత 36 గంటల్లో 14 కొండ చరియలు విరిగి పడిన ఘటనలు, 13 ఆకస్మిక వరదల ఘటనలు నమోదయ్యాయి. వరదలతో కొట్టుకుపోయిన 700 రోడ్లను మూసివేశారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం లాహోల్ స్పిటిలోని చంద్రతాల్‌లో 200 మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. బియాస్ వరదల్లో చండీగఢ్–మనాలి హైవేలోని కొంతభాగం కొట్టుకుపోయింది. మనాలి, కిన్నౌర్, చంబాల్లో వరదల్లో దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇదీ చదవండి: Heavy Rains: హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. ఉత్తరాఖండ్‌లో ముగ్గురు గల్లంతు ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళ్తున్న జీపు రిషికేశ్–బద్రీనాథ్ నేషనల్ హైవేపై గంగా నదిలో పడిపోయి ముగ్గురు మృతి చెందారు. జీపులో 11 మంది ఉండగా, ఐదుగురిని కాపాడామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని యంత్రాంగం తెలిపింది. కశ్మీర్లో ఇద్దరు జవాన్ల దుర్మరణం జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్, హరియాణాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదీ చదవండి: ఉప్పొంగిన బియాస్ నది.. జాతీయ రహదారిపై చొచ్చుకువచ్చి.. వీడియో వైరల్ -
ఉత్తరాదిలో వరద బీభత్సం. మండీలో కూలిన స్టీల్ బ్రిడ్జ్
ఢిల్లీ: ఉత్తరాదిలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలకు 12 మంది మృత్యువాత పడ్డారు. మరికొన్ని రోజులు ఇదే రకంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన ఐఎండీ స్పష్టం చేయడంతో ఉత్తరాది ప్రజలు అల్లాడిపోతున్నారు. దక్షిణ ఢిల్లీలోని మండీలో స్టీల్ బ్రిడ్జ్ కూలిపోవడం వరద తీవ్రతకు అద్దం పడుతోంది. రేపు ఢిల్లీలో స్కూళ్లకు సెలవు ప్రకలించారు. 41 ఏళ్ల తర్వాత రికార్డు స్తాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1982 జూలైలో ఢిల్లీని అతాలకుతలం చేసిన వర్షాలు తర్వాత ఆ తీవ్రతను దాటి వర్షాలు పడటం నగర వాసుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్‌లోని పలుప్రాంతాలు నీట మునిగాయి. తద్వారా పలు ప్రాంతాల్లో రహదారుల్ని మూసివేశారు. ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు. Capital of the world’s fifth largest economy. Video from GK1. Flooding, long power cuts, garbage on roads, massive traffic jams… Delhi is a shit show! #DelhiRains pic.twitter.com/yQosD51XO2 — Shweta Sengar (@ShwetaSengar) July 8, 2023 చదవండి: జైలులో నన్ను చంపాలని ప్లాన్ చేశారు.. సుఖేష్ సంచలన లేఖ -
నార్త్ ఇండియాలో కుమ్మేస్తున్న వర్షాలు
-
వడగాడ్పులకు 100 మంది బలి!
బలియా/పట్నా: ఉత్తరాదిన కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 100 మంది వరకు ప్రజలు చనిపోయారు. భరించలేని ఎండలు, వడగాడ్పులకు తాళలేక యూపీలో 54, బిహార్‌లో 44 మరణాలు నమోదయ్యాయి. ఈ నెల 15, 16, 17 తేదీల్లో యూపీలోని బలియా ఆస్పత్రిలో చేరిన సుమారు 400 మంది జ్వర బాధితుల్లో 54 మంది వివిధ కారణాలతో చనిపోయారని అధికారులు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలకు గురై ఆస్పత్రికి వస్తున్నారని బలియా ప్రధాన వైద్యాధికారి(సీఎంవో) డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. మొత్తం 54 మందిలో 40 శాతం మంది జ్వరంతో, 60 శాతం మంది ఇతర వ్యాధులతో చనిపోయారని డాక్టర్ కుమార్ చెప్పారు. ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వారేనన్నారు. మరణాలకు కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు లక్నో నుంచి వైద్య బృందాలను పంపించింది. బల్లియా జిల్లా ఆస్పత్రిలో మరిన్ని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేశారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచామని అధికారులు తెలిపారు. ఆజంగఢ్ డివిజన్ ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ ఓపీ తివారీ శనివారం మీడియాతో మాట్లాడుతూ..లక్నో నుంచి రానున్న ఆరోగ్య శాఖ బృందం బల్లియాకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తుందని, మరణాలకు కారణాలను నిర్ధారిస్తామని చెప్పారు. బహుశా గుర్తించని ఏదో ఒక వ్యాధి మరణాలకు కారణమై ఉండొచ్చు, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వేసవి, శీతాకాలాల్లో డయాబెటిక్ రోగులతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తపోటు ఉన్నవారిలో మరణాల రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది’అని తివారీ చెప్పారు. శుక్రవారం బలియాలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉషో్టగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే ఇది 4.7 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది. సీఎంఎస్ తొలగింపు బలియా జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్(సీఎంఎస్) డాక్టర్ దివాకర్ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆస్పత్రిలో మరణాలకు కారణాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆజంగఢ్‌కు బదిలీ చేసింది. డాక్టర్ ఎస్కే యాదవ్‌కు సీఎంఎస్ బాధ్యతలను అప్పగించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిత్యం 125 నుంచి 135 మంది రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారని తెలిపారు. 15న 23 మంది, 16న 20 మంది, 17న 11మంది వేర్వేరు కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. బిహార్‌లో 44 మంది.. బిహార్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. గత 24 గంటల్లో తీవ్ర వడగాల్పుల కారణంగా 44 మంది చనిపోయారు. వీరిలో ఒక్క పటా్నలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వంద మంది వరకు వడదెబ్బ బాధితులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎండలకు తోడు రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు, నాలుగు చోట్ల వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయని అధికారులు తెలిపారు. షేక్‌పురాలో అత్యధికంగా 44.2 డిగ్రీలు, పటా్నలో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీలకు వేసవి సెలవులను 24 వరకు పొడిగించింది. -
ఉత్తర భారతాన్ని వణికించిన భారీ భూకంపం..!
-
ఉత్తరాదిని వణించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.7గా నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 తర్వాత సంభవించిన భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్‌లో ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌ని శ్రీనగర్‌లో భూమి బలంగా కంపించింది. దోడా జిల్లాలోని గండోహ్ భలెస్సా గ్రామ సమీపంలో 5.7 తీవ్రత నమోదైంది. మణిపూర్‌లో స్వల్పంగా భూమి కంపించగా.. పాకిస్థాన్‌లోని లాహోర్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపం దాటికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చూస్తుంటే భూకంపం ప్రభావంతో ఇంట్లోని వస్తువులు ఊగిపోతున్నట్లు కనిపిస్తుంది. కాగా ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో గత నెల చివర్లో ఢిల్లీలో తేలికపాటి ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. An earthquake of magnitude 5.7 on the Richter scale occurred 30km southeast of Kishtwar in Jammu & Kashmir: EMSC#Earthquake! #Delhi pic.twitter.com/K8WW2XjR6R — Siddhant Anand (@JournoSiddhant) June 13, 2023 Visuals of #earthquake in Lahore..! pic.twitter.com/UiWWKlaXLb — Adeel Asif 🇵🇰 (@AdeelAsifPk) June 13, 2023 Earthquake rocks Lahore pic.twitter.com/WyLASStX3W — Raftar (@raftardotcom) June 13, 2023 #earthquake felt in Delhi and northern part of India.pic.twitter.com/NRBm3zndwU — Amit Kumar 🇮🇳 (@Imamit521) June 13, 2023 -
ఉత్తరంలోనే బీజేపీ హవా... దక్షిణాదిన అంతంతే, మెరుగవుతున్న కాంగ్రెస్
కర్ణాటక ఫలితాలతో దేశ రాజకీయ ముఖచిత్రం మారింది. బీజేపీ ఇప్పటికీ ఉత్తరభారతం, ఈశాన్య భారతంలో తన పట్టు ప్రదర్శిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులే వచ్చాయి. దక్షిణాదిలో పెద్దగా బలం పుంజుకోలేకపోయినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం బీజేపీ తన పట్టు కొనసాగిస్తూ వస్తోంది.. దక్షిణం మినహా... దశాబ్ద కాలంగా బీజేపీ అత్యధికంగా పట్టు నిలుపుకున్నది ఉత్తరాది రాష్ట్రాల్లోనే. అయితే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2017 నాటికి 60 శాతం అసెంబ్లీ స్థానాలు బీజేపీ ఖాతాలో ఉంటే, 2022 నాటికి 47 శాతానికి తగ్గాయి. 2023కు మరింత తగ్గి 44 శాతానికి పరిమితమైంది. ఉత్తరాదిన యూపీలో బీజేపీ వరస విజయాలతో ఊపు మీదుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు కూడా బీజేపీ వైపే ఉన్నాయి. 2012లో అక్కడ ఏమాత్రం బలం లేని కమలదళం పదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 498 ఈశాన్య అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి అప్పట్లో కేవలం 2 శాతం స్థానాలే ఉండగా ఇప్పుడది ఏకంగా 36 శాతానికి పెరిగింది పశ్చిమ భారతంలోనూ బీజేపీయే కీ ప్లేయర్. గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి 2012లో 44% సీట్లుండగా ఇప్పుడు 52 శాతానికి పెరిగాయి. తూర్పుభారతంలోనూ బీజేపీ మెరుగవుతూ వస్తోంది. బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో 2012లో బీజేపీకి ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరే ఉండగా ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరున్నారు. ప్రాంతాలవారీగా ఎమ్మెల్యేల బలాబలాలు ► గత 11 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం తగ్గుతూ వస్తోంది. 2013, 2018లో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. ► ఇన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌యేతర పార్టీలు అసెంబ్లీల్లో తమ పట్టు కొనసాగిస్తూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగానున్న ఎమ్మెల్యేలలో 50% మంది ప్రాంతీయ పార్టీల్లోనే ఉన్నారు. రాష్ట్రాల్లోని 3వ వంతు మంది ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన వారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతీ 10 మంది ఎమ్మెల్యేలలో బీజేపీకి ఒకరే ఉన్నారు. ► 2012 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 1,224 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీకి 845 మంది ఉన్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా హస్తం హవా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టేసి క్రమంగా బీజేపీ బలపడుతూ వచ్చింది. 2023 మే నాటికి దేశంలో 4,033 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో బీజేపీకి చెందినవారు 1,329 కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 735కి తగ్గిపోయారు. కాంగ్రెస్ మరింత పట్టు పెంచుకుంటుందా? 2012–22 మధ్య దేశవ్యాప్తంగా బీజేపీ అదనంగా 540 ఎమ్మెల్యే స్థానాలను సంపాదించుకుంటే కాంగ్రెస్ 505 సీట్లు కోల్పోయింది! రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత కర్ణాటకలో సాధించిన విజయం నేపథ్యంతో మున్ముందు తన పట్టు ఇంకా పెరుగుతుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం గ్రాఫ్ మరింత మెరుగవుతుందని ఆశిస్తోంది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ టీటీడీ దేవాలయంలో మే 3నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్ ఛైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. మే 3న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 8న కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 'ఢిల్లీ టీటీడీ టెంపుల్ లో త్వరలోనే యాగశాల, పోటు ప్రారంభోత్సవం ఉంటుంది. జూన్ 3 నుంచి 8 మధ్య జమ్ములో టీటీడీ దేవాలయం ప్రారంభోత్సవం. జమ్ములో జూన్ 3న కుంభాభిషేకం, 8 న విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంటుంది. టీటీడీ దేవాలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నాం.' అని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ► మే 3 బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ ► మే 4 ఉదయం 8:30 నుంచి 9.30 మధ్య ధ్వజారోహణ ; సాయంత్రం 7:30 నుంచి 9:30 మధ్య వృషభ లగ్నం పెద్ద శేష వాహనం ► మే 5 ఉదయం 8 నుంచి 9 మధ్య చిన్న శేష వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి 8:30 మధ్య హంస వాహనం ► మే 6 శనివారం ఉదయం 8 నుంచి 9 మధ్య సింహ వాహనం ; సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్య ముత్యాల పందిరి వాహనం ► మే 7 ఆదివారం ఉదయం 8 నుంచి 9 మధ్యలో కల్పవృక్ష వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య సర్వభూపాల వాహనం ► మే 8 సోమవారం ఉదయం 8 నుంచి 9 మధ్య మోహిని అవతారం; సాయంత్రం 5 నుంచి 9 మధ్య కల్యాణోత్సవం , రాత్రి 8 నుంచి 9:30 మధ్య గరుడ వాహనం ► మే 9 ఉదయం 8 నుంచి 9 మధ్య హనుమంత వాహనం ; సాయంత్రం 7 నుంచి 8:30 మధ్య గజవాహనం ► మే 10 ఉదయం 8 నుంచి 9 మధ్య సూర్యప్రభ వాహనం ; సాయంత్రం 7.30 నుంచి 8.30 మధ్య చంద్రప్రభ వాహనం ► మే 11 ఉదయం 7:55 నుంచి 9.30 మధ్య రథోత్సవ మిధున లగ్నం ; సాయంత్రం 7.30 నుంచి 8:30 మధ్య అశ్వ వాహనం ► మే 12 ఉదయం 11:50 నిమిషాలకు చక్రస్నానం కన్యా లగ్నం ; సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ధ్వజారోహణం ► మే 13 శనివారం సాయంత్రం 6 నుంచి 8 మధ్య అకంకార స్నపనం పుష్య యాగం చదవండి: టీటీడీ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు -
వణుకుతున్న ఉత్తరాది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వరుసగా నాలుగో రోజూ శీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆదివారం అత్యల్పంగా 1.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండేళ్లలో జనవరిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ తెలిపింది. హరియాణాలోని హిస్సార్‌లో 1.4 డిగ్రీలు, రాజస్తాన్‌లోని చురులో మైనస్ 0.5 డిగ్రీలు, పిలానీలో 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశ ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు 480కి పైగా రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. 335 రైళ్లు ఆలస్యం కాగా, 88 రైళ్లను రద్దు చేసి, మరో 33 రైళ్ల ప్రయాణాలను కుదించినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పొగమంచు కారణంగా ఆదివారం ఉదయం 25 విమానాలు ఆలస్యంగా నడిచాయని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ట్వీట్ చేసింది. ప్రయాణికులు అప్డేట్ చేసే విమానాల రాకపోకల సమాచారాన్ని సరి చూసుకోవాలని కోరింది. పొగమంచు కారణంగా పంజాబ్‌లోని భటిండా, యూపీలోని ఆగ్రాల్లో ఆదివారం దృగ్గోచరత 25 మీటర్లకు, అమృత్సర్, లూథియానా, వారణాసి తదితర నగరాల్లో 50 మీటర్లకు దృగ్గోచరత పడిపోయిందని ఐఎండీ పేర్కొంది. అతి శీతల వాతావరణం కారణంగా ఢిల్లీలో శుక్రవారం రికార్డు స్థాయిలో 5,526 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించారు. ప్రజలు సాధ్యమైనంత మేర ఇళ్లలోనే ఉండిపోవాలని ఐఎండీ సూచించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతానికి ఐఎండీ ఆరంజ్ అలెర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని అంచనా వేసింది. -
ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. నాలుగు రోజుల వ్యవధిలో భూమి మళ్లీ కంపించింది. ఢిల్లీ వాసులు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. నేపాల్లోనూ స్వల్పంగా మళ్లీ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 గా తీవ్రత నమోదైంది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్‌లోని జోషిమట్ నుంచి 212 కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలో స్వల్ప ప్రకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప నమోదు కేంద్రం వెల్లడించింది. చదవండి: సోషల్ మీడియాను షేక్ చేసిన జంట.. వరుడికి బంపరాఫర్ ఇచ్చిన వధువు -
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న కుండపోత వర్షాలు
-
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ టి.మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ స్వదేశ్ దర్శన్‌లో భాగంగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్సర్ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నెల 27న రేణిగుంట–తిరుపతి నుంచి బయల్దేరే రైలు విజయవాడ, సికింద్రాబాద్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని ఏడు రాత్రులు, 8 పగళ్లు ప్రయాణించి వచ్చే నెల 3న గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. భోజన వసతితో పాటు స్లీపర్ క్లాస్ ప్రయాణ ధర రూ.18,120, థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.22,165గా ఉంటుందన్నారు. వారణాసి, ప్రయాగ సంగమ్, గయ యాత్రకు సెప్టెంబర్ 15న సికింద్రాబాద్ నుంచి మహాలయ పిండ్‌దాన్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 5 రాత్రులు, 6 పగళ్లు స్లీపర్ క్లాస్ ప్రయాణ ధర రూ.14,485, థర్డ్ ఏసీ రూ.18,785గా నిర్ణయించినట్టు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో ప్రయాణికులు రైలు ఎక్కే సౌకర్యం ఉంటుందన్నారు. మరోవైపు విజయ గోవిందం ఎక్స్‌ప్రెస్ పేరుతో తిరుమల, తిరుచానూరుకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నామన్నారు. 2 రాత్రులు, 3 పగళ్లు ప్రయాణ టికెట్ ధర విజయవాడ నుంచి రూ.3,410, రాజమండ్రి–సామర్లకోట నుంచి రూ.3,690 ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఆసక్తి గలవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 8287932312, 9701360675 ఫోన్ నంబర్లు లేదా విజయవాడ రైల్వే స్టేషన్‌లోని కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు. పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేక రైళ్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే నాన్–టెక్నికల్ కేటగిరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రాంతీయ విమాన ప్యాకేజీలు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి ప్రాంతీయ విమాన టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలి పారు. ఈ నెల 27న అల్టిమేట్ ఉత్తరాఖండ్ పేరుతో డెహ్రాడూన్, హరిద్వార్, ముస్సోరి, రుషికేష్ చుట్టివ చ్చేలా రూ.23,635తో ప్రత్యేక ప్యాకేజీ రూపొందించామన్నారు. 29న రాయల్ నేపాల్‌యాత్రలో భాగం గా ఖాట్మండు, పోఖరా ప్రయాణానికి రూ.40 వేల నుంచి టికెట్ ధర ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12, 14, 19, 21, 26, 28 తేదీల్లో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమలతో కలిపి రూ.12,260తో విమాన ప్యాకేజీని నిర్వహిస్తున్నట్టు వివరించారు. చదవండి: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. నెల గ్యాప్ తర్వాత రూ.50 పెంపు -
ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు.
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాల పర్యటనకు స్వదేశీ దర్శన్ పర్యాటక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డిఫ్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. కోవిడ్ అనంతరం అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ పర్యటనలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారన్నారు. గత ఏప్రిల్‌లోనే రూ.1.5 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. గతేడాది సుమారు 50 వేల మంది ఐఆర్సీటీసీ ప్యాకేజీలను వినియోగించుకున్నారని, ఈ ఏడాది 70 వేల మందికి పైగా ఐఆర్సీటీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూర్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఐఆర్సీటీసీ టూర్లు ఇవీ... తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా ఈ నెల 27న స్వదేశీ దర్శన్ రైలు బయలుదేరనుంది. జూన్ 3వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుంది. ఈ టూర్లో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. అన్ని రకాల సదుపాయాలతో స్లీపర్ క్లాస్ రూ.18,120, ఏసీ క్లాస్ రూ.22,165 చొప్పున ప్యాకేజీ ఉంటుంది. మరో ట్రైన్ మహాలయ పిండదాన్– సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15న బయలుదేరి 20న తిరిగి చేరుకుంటుంది. ఈ పర్యటనలో వారణాసి, ప్రయాగ్, గయ, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. స్లీపర్ రూ.14,485, ఏసీ రూ.18,785 చొప్పున చార్జీ ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి. షిరిడి సాయి దర్శనానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికి, ఒడిషా జగన్నాధ రథయాత్రకు ప్రత్యేక డొమెస్టిక్ పర్యాటక ప్యాకేజీలను కూడా సిద్ధం చేశారు. కేరళ, జమ్ముకాశ్మీర్, అస్సామ్, మేఘాలయ, తదితర ప్రా ంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా రాయల్ నేపాల్ టూర్ ను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 26 నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అన్ని వసతులతో కలిపి రూ.40 వేల వరకు చార్జీ ఉంటుంది. (చదవండి: మాస్కు మస్ట్... ఆలస్యమైన అనుమతించరు) -
ఉన్నత విద్యలోనూ ఉత్తర, దక్షిణాలే!
సాక్షి, హైదరాబాద్: భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నంగా ఉండే ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలు.. విద్యార్థుల చదువు విషయంలోనూ విభిన్నంగా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు సంప్రదాయ కోర్సులు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తుంటే.. దక్షిణాదిలో ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సుల వైపే మొగ్గుచూపుతున్నారు. ఉత్తరాదిన పోటీ పరీక్షలపై ఎక్కువగా దృష్టిపెడుతుండగా.. దక్షిణ రాష్ట్రాల్లో దేశ, విదేశాల్లో ప్రైవేటు ఉద్యోగాల వైపు చూస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అంశంపై దేశవ్యాప్తంగా అధ్యయనం చేసిన ఏఐసీటీఈ దీనికి గల కారణాలనూ గుర్తించి, నివేదికను విడుదల చేసింది. నేరుగా ఉపాధి దొరికేలా.. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నట్టు ఏఐసీటీఈ సర్వేలో వెల్లడైంది. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక, వృత్తివిద్య పూర్తిచేసి.. ఉద్యోగాల్లో చేరడంపై దృష్టిపెడుతున్నట్టు తేలింది. ఈ కారణంగానే ఆయా కోర్సులకు దక్షిణాదిలో భారీగా డిమాండ్ ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని ఏఐసీటీఈ పేర్కొంది. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో సగం మేర అంటే 6,74,697 సీట్లు కేవలం ఐదు దక్షిణాది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కలిపి ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే.. దక్షిణాదిలోనే 30,812 (44 శాతం) సీట్లు ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి మొత్తంగా 3,39,405 సీట్లు ఉంటే.. ఇందులో దక్షిణాదిలోనే 1,57,632 సీట్లు ఉండటం గమనార్హం. ఇక్కడి విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగానే.. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు భారీగా పెరిగాయని ఏఐసీటీఈ అంచనా వేసింది. 2015–16లో దేశంలోని మొత్తం బీటెక్ సీట్లలో 48.77 శాతం మేర దక్షిణాదిలోనే ఉండగా.. గత ఆరేళ్లలో మరో 5.3 శాతం పెరిగి 54 శాతానికి చేరాయని తేల్చింది. విదేశీ మోజు.. ప్రైవేటు కాలేజీలు.. దక్షిణాది విద్యార్థులు బీటెక్ తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేసి, ఉద్యోగంలో స్థిరపడటంపై మక్కువ చూపుతున్నారు. వీరిలో పోటీ పరీక్షలవైపు మొగ్గుచూపుతున్నవారు ఉత్తరాదితో పోలిస్తే చాలా తక్కువని ఏఐసీటీఈ పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రైవేటు కాలేజీలు భారీగా ఉండటం కూడా విద్యార్థులు వృత్తివిద్య వైపు వెళ్లడానికి కారణమని అంచనా వేసింది. వీటిలోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లోనే చేరుతున్నట్టు తెలిపింది. ఈ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. వృత్తి విద్య కోర్సులే అయినా.. సివిల్, మెకానికల్ సీట్లు కూడా పూర్తిస్థాయిలో నిండటం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఇంజనీరింగ్ కోర్సులు చేసేవారు భారీగా ఉంటున్నట్టు ఏఐసీటీఈ పేర్కొంది. అయితే ఉన్నత విద్య విషయంగా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని భావిస్తోంది. విభిన్న ధోరణులే కారణం ఉత్తర, దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో విద్యార్థుల ఆలోచనలు విభిన్నంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మొదట్నుంచీ విద్యార్థులు గణితం నేర్చుకోవడం ఇష్టపడతారు. తల్లిదండ్రులు ఈ దిశగానే ప్రోత్సహిస్తున్నారు. ఐటీ, ఇతర సాంకేతిక విభాగాలు గణితంతో మిళితమై ఉంటాయి. దీంతో ఎక్కువగా బీటెక్ కోర్సుల్లో చేరుతున్నారు. అమెరికాతో మనకు సంబంధాలు పెరిగాక సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఆసక్తి పెరిగింది. ఉత్తరాదిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి విద్యార్థుల్లో మొదట్నుంచీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్ల భాష మీద పట్టు ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్లు ఎక్కువగా అకౌంటింగ్, మార్కెటింగ్, నిర్వహణ సామర్థ్యం ఉండే ఉపాధి వైపు చూస్తున్నారు. అందుకు తగ్గ కోర్సులను ఎంచుకుంటున్నారు. మరో ముఖ్య విషయం ఏమంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉత్తరాది నుంచే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. – ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో విద్యార్థులు దాదాపు ఒకేరకమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బీటెక్, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఇందులోనూ ఐటీ ఆధారిత కోర్సులే ఎక్కువగా చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించారు. -
ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశ యాత్రకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టూరిజం) జీపీ కిషోర్‌సత్య తెలిపారు. బుధవారం విజయవాడలోని రైల్వే స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ ‘మహాలయ పిండదాన్’ పేరుతో వారణాసి, ప్రయాగ్ సంగం, గయా ప్రాంతాలు చుట్టివచ్చేలా ఐదు రాత్రులు, ఆరు రోజుల ప్యాకేజీతో రైలును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15వ తేదీన ఈ రైలు బయలుదేరి..20వ తేదీ గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఏఎం మురళీకృష్ణతో కలిసి ప్యాకేజీ కరపత్రాలను ఆవిష్కరించారు. మాత వైష్ణోదేవి యాత్ర.. స్వదేశీ దర్శన్ పేరుతో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్‌సర్‌లో పర్యటించేలా ప్రత్యేక రైలు ప్యాకేజీలను రూపొందించామని కిషోర్‌సత్య తెలిపారు. మే 27వ తేదీన తిరుపతి–రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు జూన్ 3వ తేదీనమ గమ్య స్థానానికి చేరుకుంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కేరళ, తమిళనాడు, ఉత్తరాఖాండ్, నేపాల్, తిరుపతికి విమాన ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. వివరాలకు ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్, 9701360675, 9701360701 నంబర్లలో సంప్రదించాలని కిషోర్‌సత్య సూచించారు. విజయవాడ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి (07433) ఈ నెల 15న రాత్రి 7.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07434) ఈ నెల 16న రాత్రి 8.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుంది. నాందేడ్–విశాఖపట్నం (07082) రైలు ఈ నెల 15న సాయంత్రం 4.35 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07083) 17న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. -
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ‘భారత్ దర్శన్’
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘భారత్ దర్శన్’ పేరుతో పుణ్యక్షేత్రాలు, ఆహ్లాదకర ప్రాంతాలను కలుపుతూ ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు ఐఆర్సీటీసీ టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ జీపీ కిశోర్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని రైల్వే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. మాతా వైష్ణోదేవి దర్శనంతో పాటు ఆగ్రా, మధుర, అమృత్సర్, హరిద్వార్‌లోని ప్రముఖ ప్రాంతాలను చుట్టి వచ్చేలా రైలు ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ రైలు మార్చి 19న రాజమండ్రి నుంచి బయలుదేరి పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి 27వ తేదీన గమ్య స్థానానికి చేరుకుంటుందన్నారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు సామర్లకోట, తుని, విశాఖపట్నంలో రైలు ఎక్కొచ్చన్నారు. 8 రాత్రులు, 9 పగళ్లు మొత్తం 8 రాత్రులు, 9 పగళ్ల ప్రయాణానికి భోజన వసతితో కలిపి స్లీపర్ క్లాస్ ధర రూ.8,510, త్రీటైర్ ఏసీ ధర రూ.10,400గా నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రతి శుక్రవారం విజయ్ గోవిందం పేరుతో విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ప్యాకేజీ నడుస్తోందన్నారు. 2 రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీలో స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ టికెట్ ధర రూ.3,410, రూ.3,690గా ఉందన్నారు. సికింద్రాబాద్ నుంచి తెనాలి, గుంటూరు మీదుగా ప్రతి మంగళవారం కేరళకు 5 రాత్రులు, 6 పగళ్ల ప్యాకేజీలో అలప్పి–కొచ్చి–మున్నార్‌కు రూ.10,610, అలప్పి–మున్నార్‌కు రూ.10,280, అలప్పి–గురువాయుర్–కొచ్చికు రూ.8,910, కూనూర్–ఊటీకి రూ.9,730 టికెట్ రేటు నిర్ణయించామన్నారు. ఎయిర్ టూర్ ప్యాకేజీలు ఐఆర్సీటీసీ ద్వారా ప్రాంతీయ విమాన పర్యాటక ప్యాకేజీలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. మార్చి 1, 11, 21 తేదీల్లో, ఏప్రిల్ 15, 21 తేదీల్లో, మే 10, 17 తేదీల్లో కాశ్మీర్‌కు హౌస్‌బోటు అకామిడేషన్‌తో (శ్రీనగర్, సోమ్‌నగర్, గుల్మార్గ్, ఫహల్గామ్) రూ.27,750, ఏప్రిల్ 10న హిమాచల్–పాపులర్ పంజాబ్ (చంఢీగర్, సిమ్లా, ధర్మశాల, అమృత్సర్) పేరుతో రూ.33,100, మార్చి 3,5,10,12,17,19,24, ఏప్రిల్7,9,14,16,21,23,28 తేదీల్లో తిరుపతి బాలాజీ దర్శన్ (తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం) పేరుతో రూ.10,315 టిక్కెట్ ధరతో హైదరాబాద్ నుంచి విమాన సేవలందిస్తున్నామన్నారు. జూలై నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి లేక్, లద్దాక్, లేహ్, కాశ్మీర్, తిరుపతి, రాజస్థాన్, కేరళ వంటి ప్రాంతాలకు ఎయిర్ టూర్ ప్యాకేజీలు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఏరియా మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు. వివరాలకు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు 82879 3232, 97013 60675 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
Earthquake: ఉత్తర భారతంలో పలుచోట్ల భూప్రకంపనలు
సాక్షి: ఉత్తర భారతం శనివారం ఉదయం ప్రకంపనలతో వణికిపోయింది. కొద్ది సెకండ్లపాటు స్వల్ఫ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అఫ్గనిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దు కేంద్రం ఈ ఉదయం రిక్టర్ స్కేల్‌పై భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతోనే ఉత్తర భారతంలో పలు చోట్ల భూమి కంపించింది. ఉత్తర ప్రదేశ్ నొయిడాలో సుమారు 20 సెకండ్లపాటు ప్రకంపనలు ప్రభావం చూపించినట్లు పలువురు ట్విటర్లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంకోవైపు ఢిల్లీ, జమ్ము కశ్మీర్(లోయ), ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్), మరికొన్ని ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మన దేశంలో తీవ్రత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.6గా నమోదు అయ్యింది. ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ.. ఉదయం 9.45 నిమిషాల సమయంలో ఫైజాబాద్ దగ్గర 5.7 తీవ్రత తీవ్రతతో 181 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొంది. యూరోపియన్ మెడిటేర్రినియన్ సిస్మోలాజికల్ సెంటర్ మాత్రం తీవ్రతను 6.8గా, 209 కి.మీ. లోతులో నమోదు అయ్యిందని పేర్కొనడం విశేషం. అఫ్గనిస్థాన్ భూకంప ప్రభావంతో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తర భారత యాత్ర
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను తక్కువ ఖర్చుతో సందర్శించేందుకు ‘ఉత్తర భారత యాత్ర’ పేరుతో ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్టు ఐఆర్సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునేందుకు ఈ నెల 19న ఈ రైలును నడపుతున్నట్టు వెల్లడించారు. రేణిగుంటలో ప్రారంభమమ్యే ఈ రైలుకు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, నాగ్‌పూర్ స్టేషన్లలో బోర్డింగ్ ఉందని పేర్కొన్నారు. 10 రాత్రిళ్లు, 11 పగటి పూటలు సాగే రైలు ప్రయాణంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ ఉదయం టీ, కాఫీ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం, పర్యాటక ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రవాణా, రాత్రిళ్లు బస ఏర్పాట్లుంటాయని పేర్కొన్నారు. స్టాండర్డ్(స్లీపర్ క్లాస్), కంఫర్ట్ (ఏసీ 3 టైర్)గా రెండు కేటగిరీల్లో ఉండే ప్యాకేజీలో.. స్టాండర్డ్ ధర ఒక్కొక్కరికి రూ.10,400, కంఫర్ట్ ధర ఒక్కొక్కరికి రూ.17,330గా నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆసక్తి గల వారు దగ్గర్లోని ఐఆర్సీటీసీ కార్యాలయాల్లోగానీ, విజయవాడ స్టేషన్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలోగానీ, లేదా ఫోన్ నంబర్లు 8287932312, 9701360675, వెబ్సైట్ www.irctctourism.comలో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. -
హైదరాబాద్ నుంచి గోవా టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
పర్యాటకం పంథా మారింది. ఎక్కడికైనా సరే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేందుకు పర్యాటక ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో పర్యాటకుల అభిరుచి మారింది. గంటలు, రోజుల తరబడి బస్సులు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొని ఎక్కువ ప్రాంతాలను సందర్శించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. గోవా, కాశ్మీర్, హంపీ తదితర ప్రాంతాలతో పాటు కొత్తగా లద్దాక్, లేహ్, డార్జిలింగ్ వంటి ఇతర ప్రాంతాలపైనా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ఐఆర్సీటీసీ ఎయిర్ప్యాకేజీలను అందజేస్తోంది. సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకు విమాన ప్రయాణానికే ఓటేస్తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ అనంతరం గత 2 నెలల్లో సుమారు 20 ఎయిర్ ప్యాకేజీలను నిర్వహించినట్లు ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ నర్సింగ్‌రావు తెలిపారు. కోవిడ్ మొదటి ఉధృతి అనంతరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 38 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. 2019లో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఏకంగా 175 ఎయిర్ ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వేలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో రైల్ టూర్లు, ఉత్తర, దక్షిణాది పర్యాటక రైళ్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవిగో ఎయిర్‌ప్యాకేజీలు... గోవా టూర్ సెప్టెంబర్ 24న ప్రారంభంకానుంది. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు, రవాణా, గోవాలో హోటల్ సదుపాయం, తదితర అన్ని ఏర్పాట్లు ఐఆర్సీటీసీ అందజేస్తుంది. ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ (మూడు రాత్రులు..నాలుగు పగళ్లు)ఒక్కరికి ర.15,780 చొప్పున ఉంటుంది. ♦ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పర్యటన ప్యాకేజీ(ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) విలువ ర.23,150. అక్టోబర్ 1వ తేదీన ఈ పర్యటన మొదలవుతుంది. అహ్మదాబాద్, ద్వారక, సోమ్‌నాథ్ ఆలయాలతో పాటు సర్ధార్ వల్లభ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించవచ్చు. ♦ హౌస్‌బోట్ సదుపాయంతో కూడిన కశ్మీర్ పర్యటన సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో( ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గావ్, సోన్మార్గ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ ప్యాకేజీ రూ.24.480 చొప్పున ఉంటుంది. ♦ రాయల్ రాజస్థాన్ యాత్ర (ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) సెప్టెంబర్ 2న ప్రారంభం కానుంది. జైపూర్, జోథ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ర.23,900 చొప్పున ఈ పర్యటన ప్యాకేజీ ఉంటుంది. ఉత్తరభారత యాత్ర... ♦ ట్రైన్లో వెళ్లే పర్యాటకుల కోసం ఉత్తర భారత యాత్ర, వారణాసి–గయ–ప్రయాగ్‌రాజ్, దక్షిణభారత యాత్ర రైళ్లను సిద్ధం చేసింది. ఉత్తర భారత యాత్ర, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, దిల్లీ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఒక్కొక్కరికి అన్ని సదుపాయాలతో ర.10,400 చొప్పున ఉంటుంది. ♦ దక్షిణభారత యాత్ర అక్టోబర్ 19న ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుచురాపల్లి, తంజావూరు,రామేశ్వరం, మధురై, కన్యాకువరి, మహాబలిపురం, కాంచీపురం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీ రూ.6,620 చొప్పున ఉంటుంది. -
ఢిల్లీని వణికిస్తున్న చలి
న్యూఢిల్లీ: ఉత్తరభారతం చలి దుప్పటి కప్పుకుంది. ఢిల్లీపై తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో నూతన సంవత్సరం తొలిరోజున రాజధానిలో 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గత పదిహేనేళ్లలో ఇదే కనిష్ఠం కావడం విశేషం. అంతకుముందు 2006లో 0.2 డిగ్రీలు, 1935లో మైనస్ 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత(ఆల్‌టైమ్ కనిష్ఠం) ఢిల్లీలో నమోదయింది. గతేడాది జనవరిలో 2.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్ర ఢిల్లీలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. చలిపులి కారణంగా ఉదయం 6గంటల సమయంలో దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్ముకుంది. దీంతో కనీసం మీటర్ దూరంలో వస్తువులు కూడా కనిపించకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. గత గురువారం ఢిల్లీలో 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జనవరి 2 నుంచి 6 వరకు మధ్యధరా ప్రాంతం నుంచి వీచే గాలుల(వెస్టర్న్ డిస్ట్రబెన్సెస్) కారణంగా ఉత్తర భారతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరగవచ్చని ఐఎండీ అధిపతి కులదీప్ శ్రీవాస్తవ చెప్పారు. -
దేశంపై మళ్లీ కరోనా పడగ
న్యూఢిల్లీ: చలికాలం వణికిస్తున్న కొద్దీ కరోనా కూడా విజృంభిస్తోంది. ప్రధానంగా ఉత్తర, మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో పడగ విప్పింది. రోజు రోజుకీ కేసులు ఎక్కువ అయిపోతూ ఉండడంతో నిబంధనల చట్రంలోకి ఒక్కో రాష్ట్రం వెళ్లిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణా వంటి రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఈ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మొదలైందన్న ఆందోళన నెలకొంది. హరియాణాలో మొదటిసారిగా రోజుకి 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెలాఖరువరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో అయిదు జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. భోపాల్, ఇండోర్, గ్వాలియర్, రాట్లామ్, విదిశ జిల్లాల్లో కోవిడ్–19 రేటు 5% కంటే ఎక్కువ పెరిగిపోయింది. దీంతో కర్ఫ్యూ విధించక తప్పడం లేదని సీఎం చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్‌కోట్‌లో నిరవధికంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. రాజస్తాన్‌లో రోజుకి సగటున 3 వేల కేసులు నమోదవడంతో 33 జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లు కదిలి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మహారాష్ట్రలో 9,10 తరగతులకు తిరిగి పాఠశాలలను తీయాలని భావించినప్పటికీ, మళ్లీ కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఈ ఏడాది చివరి వరకు పాఠశాలలను మూసివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఒకే రోజు 7,500 కేసులు దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లో 7,500 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో కరోనా కట్టడికి కేజ్రీవాల్ సర్కార్ పలు చర్యలు తీసుకున్నప్పటికీ కేంద్రం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డిసెంబర్లో కేసులు మరింతగా పెరిగిపోతాయని అంచనాలున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచిన కేంద్రం నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తోంది. దీపావళి తర్వాత పెరిగిపోతున్న కేసులు ఆరు నెలల కాలంలో భారత్‌లో రోజు వారీ కేసులు అత్యధిక స్థాయికి చేరుకొని మళ్లీ తగ్గినట్టే తగ్గి పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ 10న ఇంచుమించుగా లక్ష వరకు రోజువారీ కేసులు (99,181 కేసులు నమోదు) చేరుకున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచి తగ్గు ముఖం పట్టిన కేసులు, మళ్లీ ఇప్పుడు పెరిగిపోతూ ఉండడంతో సెకండ్ వేవ్ మొదలైందనే భావించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ మహమ్మారి కరోనాకు వ్యతిరేక పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటి వరకూ 13,06,57,808 పరీక్షలు చేశారు. వీటిలో చివరి కోటి పరీక్షలను 10 రోజుల వ్యవధిలో నిర్వహించడం గమనార్హం. యూరప్, అమెరికన్ దేశాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్న సమయంలో, మనదేశంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించాయి. అయితే 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే తక్కువ పరీక్షలను నిర్వహించాయి. ఈ రాష్ట్రాల్లో పరీక్ష స్థాయిలను పెంచాలని కేంద్రం సూచించింది. 33 మంది అధికారులకు కరోనా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న 428 మంది ఆఫీసర్ ట్రైనీలలో 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అకాడమీలోని పలు డిపార్ట్మెంట్లను ముందు జాగ్రత్తగా మూసివేసిట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 30 వరకూ క్లాసులను ఆన్లైన్ ద్వారా బోధించనున్నట్లు తెలిపారు. కొత్త కేసులు.. 46 వేలు దేశంలో గత 24 గంటల్లో 46,232 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.50 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 564 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 84.78 లక్షలకు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.67 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,39,747గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.86 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. ఈ నెల 20 వరకూ 13.06 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం 10,66,022 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
దక్షిణాదికి, ఉత్తరాదికి ఎంత వ్యత్యాసం!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య భాష, సంస్కృతుల పరంగానే కాకుండా సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెల్సిందే. అయితే ఇది మహిళల విషయంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాదితో పోలీస్తే దక్షిణాది మహిళలు ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఎక్కువ విద్యావంతులు, చిన్నతనంలో కాకుండా యుక్త వయస్సు వచ్చాకే పెళ్లిళ్లు చేసుకుంటారు. తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవడంతో కొంత స్వేచ్ఛ ఉంది. భర్తలతో ఎక్కువ చనువుగా ఉంటారు. తక్కువ సంతానం కలిగి ఉంటారు. సొంతంగా ఆస్తులు కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఇచ్చే కట్నాలకు తామే హక్కుదారులుగా ఉంటారు. స్నేహితులతో కలసిమెలసి తిరుగుతారు. ఆఫీసుల్లో మగవాళ్లతో కలసి పనిచేస్తారు. ఉత్తర, వాయువ్య భారత్‌లో మహిళలు ఎక్కువగా పురుషుల ఆధిపత్యం కింద ఒదిగి జీవిస్తారు. వారిలో విద్యార్హతలు తక్కువే. సెకండరీ స్కూల్ పూర్తి చేసిన మహిళలు కూడా జీవిత భాగస్వామిని సొంతంగా ఎంపిక చేసుకోరు. కుటుంబ సభ్యులపైనే ఆధార పడతారు. మహిళలు ఉద్యోగాలు చేయడం తక్కువే. అక్షరాస్యత, స్వయం ప్రతిపత్తి, ఉద్యోగం చేయడంలోను తక్కువే. వీరితో పోలిస్తే దక్షిణాది మహిళలు కులం, మతం విషయంలోనూ స్వేచ్ఛా జీవులే. ఉత్తర భారత్‌తో పోలిస్తే, దక్షిణ భారత్‌కు చెందిన ఆడి పిల్లల్లో శిశు మరణాలు తక్కువ. 1800 శతాబ్దంలో మద్రాస్, ముంబై ప్రాంతాల్లో సతీసహగమనం చాలా తక్కువకాగా, బెంగాల్లో 90 శాతం సతీసహగమనం సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1876–78లో మద్రాస్‌ను కరవు పరిస్థితులు కబళించినప్పుడు లింగ నిష్పత్తిలో పెద్దగా వ్యత్యాసం రాలేదు. 1896–97లో పంజాబ్‌లో కరవు పరిస్థితులు తాండవించినప్పుడు అధిక సంఖ్యలో బాలికలు మరణించారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 1880లోనే 15, 16 ఏళ్లు వచ్చాకే ఆడ పిల్లలు పెళ్లి చేసుకోగా, రాజస్థాన్ బాలికలు ఆ స్థాయికి చేరుకోవడానికి వందేళ్లు పట్టింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో చదువుకునే మహిళల సంఖ్య చాలా తక్కువ. ఉత్తరాదిలో స్త్రీ, పురుషుల మధ్య విద్యాభ్యాసంలో వ్యత్యాసం 26 శాతం ఉండగా, అదే దక్షిణాదిలో ఈ వ్యత్యాసం 9 శాతం మాత్రమే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాది మహిళలు చురుగ్గా పాల్గొనడం, గాంధీ, నెహ్రూ, సరోజని నాయుడు లాంటి వారు సంఘ సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం, దక్షిణాది మహిళలను వారు ఎక్కువ ప్రభావితం చేయడం, కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్తలు దక్షిణాదికి చెందిన వారవడం, దక్షిణాదిలో మహిళల విద్యను ప్రోత్సహించడం, మహిళా సంఘాలు పుట్టుకురావడం, వ్యవసాయ పనుల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల నేడు ఉత్తరాదికన్నా దక్షిణాది మహిళలు ముందున్నారు. 1900 దశాబ్దంలోనే మద్రాస్‌లో ‘విమెన్స్ ఇండియన్ అసోసియేషన్’ ఏర్పడడం, ఆ తర్వాత 1917లో పుణె కేంద్రంగా ‘ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్’ ఏర్పాటవడం ఇందుకు ఉదాహరణ. (లండన్ కింగ్స్ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేస్తోన్న ఎలైస్ ఎవాన్స్ తన వెబ్సైట్లో రాసిన పరిశోధనా వ్యాసం నుంచి) చదవండి: యూపీలోనే ఎక్కువ.. ఎందుకిలా? -
దేశంలో సాధారణం కంటే 6 % అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే 6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. కానీ, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే లోటు వర్షపాతమే కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ, మధ్య, ఈశాన్య, తూర్పు భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షం కురిసిందని తెలియజేసింది. వాయవ్య భారతదేశంలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మరో రెండు నెలలపాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి వాయవ్య భారతంలోనూ పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా చెప్పారు. దక్షిణాదిలో సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం రికార్డు అయ్యిందని ఐఎండీ స్పష్టం చేసింది. -
రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు
న్యూఢిల్లీ: గడిచిన వారం రోజులుగా ఒక్కసారిగా దేశంలో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైన నమోదవుతుండగా.. రాబోయే రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్, రాజస్థాన్, చంఢీఘర్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదివారం 'రెడ్ అలర్ట్' ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా వడగాలు వీస్తాయని ఐఎండీ 'ఆరెంజ్ వార్నింగ్' జారీ చేసింది. చదవండి: గాడ్సే దేశాన్ని రక్షించారంటూ ఎఫ్బీలో పోస్ట్ ఈ విషయంపై ఐఎండీ రీజినల్ మెటీరియాలజీ సెంటర్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరణ ఇస్తూ.. రాబోయే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి నమోదవుతాయి. ఈ సంవత్సరం వేసవిలో అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకూ సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఏప్రిల్, మే మధ్య వరకు వర్షాలు కురవడంతో ఎండలు తీవ్రత అంతగాలేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకూ కొనసాగుతాయనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీలుగా నమోదైంది. దీనికి తోడు వేడిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ వార్నింగ్ జారీచేసిన ప్రాంతాల్లోని ప్రజలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ఐఎండీ సూచించింది. చదవండి: కరోనా : టాటా గ్రూపు సీఈవోల కీలక నిర్ణయం -
ఉత్తర భారతంలో రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించిపోవడంతో భారత వాతావరణ శాఖ(ఐఎండీ)ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హరియాణా, చండీగఢ్, రాజస్తాన్‌లకు మరో రెండు రోజుల పాటు ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది. వడగాడ్పులు వీచే ప్రమాదమున్నందున తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్లు ఐఎండీ పేర్కొంది. వచ్చే 2, 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు కావచ్చని హెచ్చరించింది. ఈ వేసవిలో రెడ్ అలర్ట్ జారీ చేయడం ఇదే మొదటిసారని తెలిపింది. ఉత్తర, మధ్య భారత్‌లో ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు వానలు కురియడంతో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని పిలానీలో శనివారం అత్యధికంగా 46.7 డిగ్రీలు నమోదైంది. పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, విదర్భల్లో వచ్చే అయిదు రోజుల్లో తీవ్ర వడగాడ్పులు వీచేందుకు అవకాశ ముందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, యానాం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3, 4 రోజుల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీస్తాయంది. వాతావరణ పరిస్థితుల్లో తీవ్రతను బట్టి గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే రోజులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించడమే రెడ్ అలర్ట్ ఉద్దేశం. ఈనెల 28వ తేదీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త నరేశ్ కుమార్ అన్నారు. -
ఉద్రిక్త భారతం
-
బ్రేకింగ్: ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్,హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్ర 4:30 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రంగా భూప్రకంపనలు వచ్చాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండిలో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదుగా నమోదయింది. దీంతో కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో ప్రకంపనలు మరికొంత తీవ్రంగా నమోదయ్యాయి. -
ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు
సిమ్లా/డెహ్రాడూన్/చండీగఢ్:/న్యూఢిల్లీ: ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. గంగా, యమున, సట్లెజ్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 37 మంది చనిపోయారు. అత్యధికంగా హిమాచల్‌లో 25 మంది మృతి చెందారు. మరో 24 గంటలపాటు వానలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నడూలేని విధంగా భాక్రా జలాశయం ఈ ఏడాది ముందుగానే నిండింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కంగ్రా, కుల్లు జిల్లాల్లో సోమవారం మరో ముగ్గురు చనిపోవడంతో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. శనివారం నుంచి కురుస్తున్న వానలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలడంతోపాటు, కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 500 మందిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.. పంజాబ్ ప్రభుత్వం హైఅలర్ట్ విడవని వానల కారణంగా యమునా నది ఉప్పొంగడంతో పంజాబ్, హరియాణాల్లోనూ వరద ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. కర్నాల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, చిన్నారులు సహా 9 మందిని ఐఏఎఫ్ బృందాలు కాపాడాయి. రోపార్ ప్రాజెక్టు నుంచి వరదను విడుదల చేయడంతో దిగువన ఉన్న షాకోట్, నకోదర్, ఫిల్లౌర్ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. అలాగే, సట్లెజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలంధర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 నుంచి 72 గంటల వరకు భారీ వర్ష సూచన ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో ఆగిన వాన హిమాచల్‌ప్రదేశ్– ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 9 మృతదేహాలు బయటపడటంతో రాష్ట్రంలో వానల కారణంగా జరిగిన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 12కు చేరుకుంది. హరిద్వార్ వద్ద ప్రమాదస్థాయిని మించి, రిషికేశ్ వద్ద ప్రమాదస్థాయికి చేరువలో గంగ ప్రవహిస్తోంది. వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు చిక్కుకుపోగా వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నదీ తీరం వెంట ఉన్న 30 గ్రామాల వారిని అప్రమత్తం చేశామని, వరద తీవ్రత పెరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని యంత్రాంగం తెలిపింది. ఢిల్లీకి వరద ముప్పు యమునా నది హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమయింది. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు, ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం కేజ్రీవాల్ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. సోమవారం యమునా నీటి మట్టం 204.7 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని హతినికుండ్ జలాశయం నుంచి 8.28 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేయనుండటంతో మంగళవారం ఉదయానికి నీటిమట్టం 207 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, పౌర రక్షక దళాల సాయంతో ఖాళీ చేయించాలని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. యమున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది. -
గ్రాండ్ ఎంట్రీ?
ప్రస్తుతం చిన్ని బ్రేక్‌లో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ త్వరలో నార్త్ ఇండియాకు పయనం కానున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్స్ పుణే, అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్‌కు పాతిక కోట్లు, రామ్‌చరణ్ ఎంట్రీ సీన్‌కు పదిహేను కోట్ల రూపాయలను టీమ్ కేటాయించిందట. ఆల్రెడీ రామ్‌చరణ్ ఎంట్రీ సీన్ పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో చరణ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి ఎన్టీఆర్‌పై చిత్రీకరణ స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు తండ్రి పాత్రలో అజయ్ దేవగణ్ నటించనున్నారని తాజా సమాచారం. ఈ నార్త్ ఇండియా షెడ్యూల్స్‌లోనే ఆలియా, అజయ్ పాల్గొంటారట. సముద్రఖని, రాహుల్‌రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి స్వరకర్త. ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఉడికిపోతున్న ఉత్తర భారతం
జైపూర్: ఉత్తరభారతం వడగాడ్పులతో ఉడుకెత్తిపోతోంది. ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా నమోదైన 15 అత్యంత వేడి ప్రదేశాల్లో 10 ఉత్తర భారతంలోవే కావడం విశేషం. మిగతా ఐదు పాకిస్తాన్లో ఉన్నాయి. రాజస్థాన్‌లోని చురు (48.9 డిగ్రీలు) , శ్రీ గంగానగర్ (48.6 డిగ్రీలు)లు ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి . తర్వాత స్థానాల్లో పాకిస్తాన్‌లోని జకోబాబాద్(48 డిగ్రీలు), ఉత్తర ప్రదేశ్‌లోని బండా(47.4డిగ్రీలు), హరియాణాలోని నర్నాల్(47.2డిగ్రీలు) ఉన్నాయి. ఈఐ డొరాడో వెదర్ వెబ్సైట్ ఈ వివరాలు వెల్లడించింది. శనివారం నుంచి అగర్తలలో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నా ఈ ప్రాంతంలో ఎండలు మండిపోయాయి. దేశంలోని పర్వత ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా ఎండ ఎక్కువుండే రోజులు పెరుగుతున్నాయని, ముస్సోరీ లాంటి ప్రాంతంలో ఈ జూన్ 1న 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర చెప్పారు. పశ్చిమ దిశ నుంచి వస్తున్న పొడిగాలులు పాకిస్తాన్, రాజస్తాన్ ఎడారుల్లోని వేడిని గ్రహించడమే ప్రస్తుతం వేడిగాలుల ఉధృతికి కారణమని ఆయన చెప్పారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ పెరుగుతుండటం వల్ల భూతలం బాగా వేడెక్కుతోందని,ఫలితంగా వేడిగాలులు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయని, రెండు దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితిని గమనిస్తున్నామని మహాపాత్ర వివరించారు. 2010–2018 మధ్య కాలంలో దేశంలో వడగాడ్పుల కారణంగా 6,167 మంది చనిపోయారని, ఒక్క 2015లోనే 2,081 మంది వడగాడ్పులకు బలయ్యారు. మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే వడగాడ్పుగా పరిగణిస్తారు. రెండు దశాబ్దాలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు -
పాలరాపు గుట్టల్లో గ్రిఫెన్ రాబందులు
పెంచికల్పేట్ (సిర్పూర్): కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలంలోని ప్రాణహిత, పెద్దవాగు సంగమ ప్రాంతంలోని నందిగామ వద్ద గల పాలరాపు గుట్టల్లోకి రెండు గ్రిఫెన్ రాబందులు వలస వచ్చాయి. ఇక్కడున్న పొడుగు ముక్కు రాబందుల సంరక్షణ కేంద్రంలో భిన్నంగా ఉన్న రెండు రాబందులను గుర్తించి ఉన్నతాధికారులకు వాటి ఫొటోలను పంపారు. వాటిని హిమాలయ పర్వతశ్రేణిలో నివాసం ఉండే హిమాలయన్ గ్రిఫెన్ రాబందులుగా గుర్తించినట్లు కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో రాజారమణ రెడ్డి తెలిపారు. ఏటా శీతాకాలంలో నార్త్ ఇండియా హిమాలయాల నుంచి దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, ఏపీలోని కోస్తా ప్రాంతాలకు రాబందులు వలస వస్తుంటాయని అధికారులు తెలిపారు. కానీ తొలిసారిగా రాష్ట్రంలోని పాలరాపు గుట్ట వద్ద స్థావ రం ఏర్పరుచుకున్నాయని వివరించారు. ఇవి పొడుగుముక్కు రాబందుల కంటే పెద్దగా ఉన్నాయని, రోజూ వాటి దినచర్యను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
మంచు దుప్పట్లో ఉత్తరాది..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న శీతల గాలులు, తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను వణికిస్తున్నాయి.ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరాదిని మంచు కప్పేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో ఆదివారం కనీస ఉష్ణోగ్రత 7.2 డిగ్రీలకు పడిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లో చలిగాలులు వణికిస్తున్నాయి. ఇక రాజస్ధాలోని సికార్, భిల్వార పంజాబ్‌లోని ఆదంపూర్‌లో అతితక్కువ కనిష్ట ఉష్ణోగ్రత 03.0 డిగ్రీలుగా నమోదవడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్ ప్రాంతంలో శనివారం దేశంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతగా మైనస్ 19 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఈనెల 17న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, కాకినాడల మధ్య తీరం దాటుతున్న క్రమంలో ఏపీ, ఒడిషా, తెలంగాణ, చత్తీస్‌గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. -
ఉత్తరభారతంలో విస్తారంగా వర్షాలు
-
ఉత్తరాదిన రెడ్అలర్ట్
చండీగఢ్ : మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంజాబ్, హర్యానా సహా ఉత్తరాది రాష్ట్రాలు తడిసిముద్దయ్యాయి. భారీ వర్షాలతో పంజాబ్‌లో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో వరద పరిస్థితి నెలకొనడంతో ఆ ప్రాంతంలోనూ హై అలర్ట్ ప్రకటించారు. కాంగ్రా జిలాలలోని నహాద్ ఖాడ్ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని భీతిల్లిన ఓ వ్యక్తి మరణించాడు. పంజాబ్‌లో ఆగకుండా కురుస్తున్న వర్షాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.. అతివృష్టితో రాష్ట్రంలో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేయాలని కోరారు. మరోవైపు ఎలాంటి విపత్కర పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సహాయ, పునరావస ప్రణాళికపై కసరత్తు చేయాలని అధికారులను సీఎం అమరీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా అమృత్సర్ జిల్లాలోని స్కూళ్లకు అమృత్సర్ డిప్యూటీ కమీషనర్ సోమవారం సెలవు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. -
భారత్ బంద్ : ఉత్తరాదిలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణను నిరసిస్తూ పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం భారత్ బంద్ సందర్భంగా ఉత్తరాదిలో ఉద్రిక్తత నెలకొంది. బిహార్‌లో నిరసనకారులు పలు రైళ్లను నిలిపివేయగా, యూపీ, మధ్యప్రదేశ్‌ల్లో దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బిహార్‌లో విద్యాసంస్థలు, పెట్రోల్ పంపులు మూసివేశారు. బిహార్, జార్ఖండ్‌ల్లో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. దర్భంగా, ముంగర్ మసుదాన్, అర్రాలలో ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. 34 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను వివిధ జిల్లాల్లో మోహరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న దళిత సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్‌లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో భారత్ బంద్ ప్రభావం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపై టైర్లను దగ్ధం చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశామని, 35 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించామని పోలీసు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్, యూపీలో వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయని, బస్సుల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. -
భారత్ జనాభా పెరుగుదలలో అసమతుల్యం
జనాభాతో భూగోళం కిటకిటలాడిపోతోంది. ప్రతీ ఏడాది అదనంగా 13 కోట్ల మంది పుట్టుకొస్తూ ఉండడంతో ఈ ఆధునిక కాలంలో కూడా కుటుంబ నియంత్రణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెంచాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఈ ఏడాది కూడా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణ మానవ హక్కు అన్న నినాదాన్ని యూఎన్ ప్రచారం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య జనాభా పెరుగుదల ఏకరీతిలో లేకపోవడం, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ యువతరం ఎక్కువగా ఉంటే, యూరప్ దేశాల్లో జనాభా పెరుగుదల ఆగిపోయి వృద్ధతరం పెరిగిపోతోంది. ఈ అసమతుల్యత రకరకాల సవాళ్లను విసురుతోంది. క్రాస్ రోడ్స్‌లో భారత్ భారత్‌లో వివిధ రాష్ట్రాల మధ్య జనాభా ఏకరీతిలో పెరగకపోవడం కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో యువతరం ఉరకలేస్తూ ఉంటే, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధ జనాభా పెరిగిపోతోంది. ఉత్పాదక రంగంలో భాగస్వామ్యులయ్యే జనాభా (15నుంచి 64 ఏళ్ల వయసు) కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, పని చెయ్యలేని జనాభా (14 ఏళ్ల కన్నా తక్కువ, 65 ఏళ్లకు పైన ఉన్నవారు) మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేరళ, పంజాబ్, చండీగఢ్‌లో సంతాన సాఫల్య రేటు చాలా తక్కువగా ఉండడం వల్ల మానవ వనరుల సమస్యని ఎదుర్కొంటూ ఉంటే, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం వంటి రాష్ట్రాల్లో జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. భారత్ జనాభాలో 44శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉంది. ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కారణంగానే 2024 నాటికే చైనాను అధిగమిస్తామనే అంచనాలున్నాయి. భారత్ జనాభాలో 27 శాతం 14 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే, 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న జనాభా 64.7శాతంగా ఉందని నేషనల్ హెల్త్ ప్రొఫైల్ వెల్లడించింది. ఇక 60 ఏళ్లకు పై బడిన జనాభా భారత్‌లో 2016 నాటికి 8.3 శాతం ఉంటే, 2050 నాటికి 19 శాతానికి పెరుగుతుందని అంచనాలున్నాయి. సంతాన సాఫల్య రేటులో (ఒక మహిళ ఎంతమంది పిల్లల్ని కంటోందనే విషయం ఆధారంగా అంచనా వేస్తారు) తేడాల కారణంగా మన రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తీరు ఏకరీతిగా ఉండడం లేదు. 2006లో 2.7 గా ఉన్న సంతాన సాఫల్య రేటు 2016లో 2.2 కి తగ్గింది. పిల్లలు లేకపోవడం వల్ల ఒంటరితనం ఎదుర్కోవడం, వృద్ధ్యాప్యంలో చూసే దిక్కులేక వయసు మీద పడిన వారికి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వయోవృద్ధులు పెరిగిపోవడం వల్ల వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ ఇక సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు తరుముకొస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘వయోవృద్ధుల సంరక్షణ, ఒంటరిగా ఉండేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రక్షణ బడ్జెట్ కోసం కోట్లకి కోట్లు ఖర్చు చేస్తున్నాయే తప్ప జనాభాలో అసమతుల్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు‘ అని మానవ వనరుల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విద్య, ఉపాధి, జీవన ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఆయా ప్రాంతాలకు వలసలు పెరిగిపోతున్నాయి. పేదరికంలో మగ్గిపోతున్న ఉత్తరాది రాష్ట్రాల నుంచి పంజాబ్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వలసలు పెరిగిపోతున్నాయి. అసంఘటిత రంగంలో వలసదారులు పెరిగిపోయి స్థానికులకు, వారికి మధ్య ఘర్షణలు ప్రభుత్వాలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుత ప్రపంచ జనాభా 750 కోట్లు ప్రతీ నిముషానికి 250 మంది జననం 2024 నాటికే చైనా జనాభాను దాటేయనున్న భారత్ 2050 నాటికి భారత్‌లో 160 కోట్లకు పైగా జనాభా 2050 నాటికి భారత్ జనాభాలో 65 శాతం మాత్రమే చైనా జనాభా ఉంటుందనే అంచనాలు అమెరికన్ల కంటే నైజీరియన్లు ఎక్కువగా ఉంటారు గత 200 ఏళ్లలో ప్రపంచ జనాభా 600 శాతం పెరుగుదల ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో జనాభా పెరుగుదల అత్యధికం పశ్చియ యూరప్, రష్యా, జపాన్లలో జనాభా విపరీతంగా తగ్గిపోయి ఆ దేశాలకు మానవ వనరుల కొరత 2100 నాటికి భూమిపై ఉండే జనాభా 1100 కోట్లకి చేరుకుంటుందని ఒక అంచనా -
దేశమంతా రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. పశ్చిమ రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌ను రుతుపవనాలు తాకాయనీ, దేశంలో రుతుపవనాలు చేరుకునే చివరి చోటు ఇదేనని తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు శ్రీగంగానగర్‌ను జూలై 15 నాటికి తాకుతాయనీ, ఈసారి 17 రోజుల ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకున్నాయని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయన్నారు. ఈ ఏడాది మూడు రోజుల ముందుగానే, మే 29నే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉండిన రుతుపవనాలు మళ్లీ గతవారంలో పుంజుకున్నాయి. గతవారం ముందు వరకు దేశవ్యాప్తంగా సగటున 10 శాతం లోటు వర్షపాతం ఉండగా, శుక్రవారానికి అది ఆరు శాతానికి తగ్గింది. దేశంలో వ్యవసాయానికి అవసరమైన వర్షాల్లో 70 శాతం నైరుతి రుతుపవనాల కాలంలోనే కురుస్తాయి. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోయర్ సియాంగ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల ప్రభావంతో కొండపై వదులైన భారీ బండరాయి ఒకటి బసర్–అకజన్ రోడ్డుపై వెళుతున్న ఐటీబీపీ సిబ్బంది మినీబస్సుపై పడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. జమ్మూ–శ్రీనగర్ జాతీయరహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు మూసుకుపోయింది. దీంతో అమర్నాథ్ యాత్రకు వెళుతున్న పలువురు భక్తులు బేస్‌క్యాంప్‌లకు తిరిగివెళ్లాల్సి వచ్చింది. అస్సాంలో వరదలకు గురువారం ఒకరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 32కు చేరుకుంది. -
మళ్లీ తుపాను బీభత్సం
న్యూఢిల్లీ: పెనుగాలులు, ఇసుక తుపాను, పిడుగుపాటులతో కూడిన భారీ వర్షం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఆదివారం బీభత్సం సృష్టించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం 43 మంది చనిపోగా, నష్టం కూడా భారీగానే వాటిల్లింది. పశ్చిమ బెంగాల్లో నలుగురు చిన్నారులు సహా 12 మంది మరణించారు. యూపీలో 18 మంది, ఏపీలో 11 మంది, ఢిల్లీలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గంటకు 100 కి.మీకు పైగా వేగంతో వీచిన పెనుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్రం నాలుగు గంటలకే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. నోయిడా, పరిసర ప్రాంతాలు ఇసుక తుపానులో చిక్కుకున్నాయి. దీంతో మెట్రో, రైలు, విమాన సేవలకు అంతరాయం కలిగింది. పిడుగుపాటుకు పలు రాష్ట్రాల్లో వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఆదివారం నోయిడాకు సమీపంలోని ఇటాడా గ్రామాన్ని కప్పేసిన ఇసుక తుపాను -
భయం గుప్పిట్లో వాయువ్య,ఉత్తర భారతదేశం
-
అలర్ట్.. సాయంత్రం బయటికి రావొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. నేటి సాయంత్రం(మంగళవారం) అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర భారతదేశాలకు ముప్పు పొంచి ఉన్నట్లు ఐఎండీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రచండగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలను కోరింది. రాజస్థాన్‌లో మరోసారి ఇసుక తుఫాన్ వచ్చే అవకాశాలున్నాయని చెప్పటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హెచ్చరికల నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. బలమైన గాలులు... దక్షిణ భారతదేశంలో కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందని ఐఎండీ ఆ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, తెలుగురాష్ట్రాల్లో గంటకు 70 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో 2 నుంచి 7 సెం.మీల మేర వర్షం పడే అవకాశం ఉందని, ఉరుములు-మెరుపులోతో కూడిన వర్షం పడొచ్చని ప్రకటలో వివరించింది. గత వారం గాలిదుమారం వానలతో దేశవ్యాప్తంగా 124 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
‘ముద్రల’ రాజ్యం!
మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఛాతీపై కులం ముద్రలు వేయాలని నిర్ణయించిన ఘనులెవరోగానీ దేశంలో వర్తమాన స్థితిగతులకు చక్కగా అద్దంపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం తప్పేనని ఆ జిల్లా ఎస్పీ వీరేంద్ర సింగ్ అంగీకరించారు. మంచిదే. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. కానీ అది జరగడానికి ముందే ఇందులో ‘చెడు ఉద్దేశం’ ఏమీ లేదని ఆయన సమర్థిస్తున్నారు. మరింక విచారణ దేనికి? ఇది వెలుగులోకొచ్చి 72 గంటలు గడుస్తున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీన్ని గురించి మాట్లాడలేదు. జరిగింది తప్పేనని అంగీకరించడానికి ఆయనకు తీరిక చిక్కలేదు. పాలకుల తీరు ఇలా ఉన్నది గనుకే దేశంలో ఏదో ఒక మూల దళితులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ఈ పోలీసు నియామకాల ఉదంతానికి ముందూ వెనకా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ. రాజస్థాన్‌లోని గోర్ధన్పురా గ్రామంలో తన పెళ్లి వేడుకలకు గుర్రంపై ఊరేగుతూ వెళ్తున్న దళిత యువకుణ్ణి అక్కడి ఆధిపత్య కులాలవారు కిందకు పడదోసి అతన్ని తీవ్రంగా కొట్టడంతోపాటు ఊరేగింపులోని ఇతరులపై కూడా దాడి చేశారు. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు ఇప్పుడు ఆసుపత్రిలో గాయాలకు చికిత్స చేయించుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం వెల్లడైన ఘటన మరింత దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలోని బదాయీలో తమ పొలంలో కోతలకు రానన్నాడని ఆగ్రహించి ఒక దళిత యువకుడిని ఆధిపత్య కులాలవారు ఊరంతా తిప్పి కొట్టుకుంటూ తీసుకెళ్లి చెట్టుకు కట్టి కొట్టారు. అతనితో మూత్రం తాగించారు. ఈ దేశం శాంతి సామరస్యాలకు పుట్టినిల్లని, ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇక్కడ నాగరికత వెల్లివిరిసిందని కొందరు గర్వంగా చెప్పుకుంటారు. కానీ దళితుల పట్ల అమలవుతున్న దౌర్జన్యాలు గమనిస్తే కనీసం ఇప్పటికైనా మనం నాగరికతను అలవర్చుకోగలిగామా అన్న సందేహం కలుగుతుంది. జీవితంలో ప్రతి దశలోనూ తననూ, తనలాంటి కోట్లాదిమందిని అణగదొక్కడానికి ప్రయత్నించిన కులం మహమ్మారి బారిన దళిత వర్గాల్లో మరెవరూ పడకూడదని కాంక్షించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వలసపాలనలోనే ఎన్నో పోరాటాలు చేశారు. సంఘ సంస్కరణ మార్గం మన దేశంలో కంటకావృతమైనదని, దానికి మిత్రులు కొద్దిమంది అయితే, శత్రువులు అనేకమందని ఆయన 1936లో వెలువరించిన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి డబ్భై ఏళ్లు దాటుతున్నా ఏమాత్రం మారని దళితుల పరిస్థితిని గమనిస్తే ఆయన మాటల్లో ఎంత నిజమున్నదో అర్ధమవుతుంది. దళిత సంక్షేమం గురించి, సమానత్వం గురించి, అణగారిన వర్గాల ఉద్ధరణ గురించి సమయం చిక్కినప్పుడల్లా ఉపన్యాసాలివ్వడమే తప్ప అందుగురించిన చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని మధ్యప్రదేశ్ ఘటన రుజువు చేసింది. దీని గురించి మీడియాలో వచ్చిన మర్నాడే గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది డాక్టర్ అంబేడ్కర్, ప్రధాని నరేంద్ర మోదీ బ్రాహ్మణులంటూ వ్యాఖ్యానించారు. పైగా ‘బాగా చదువుకున్నవారిని బ్రాహ్మణులుగా సంబోధించవచ్చున’ని తన వ్యాఖ్యను సమర్ధించుకున్నారు. ఈ వ్యాఖ్యల లోలోతుల్లోకెళ్తే వాటి అంతరార్ధం సులభంగానే బోధపడుతుంది. మన నేతల్లో నరనరానా జీర్ణించుకుపోయిన కులతత్వం... కుల నిర్మూలన కోసం జీవితాంతం పాటుబడిన మేధావిని సైతం చివరకు కుల చట్రంలో ఇరికించింది! అవి పల్లెటూర్లా, పట్టణాలా లేక నగరాలా అన్న తేడా లేకుండా దేశంలో అడుగడుగునా దళితులు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. అవి ఎప్పటికప్పుడు మీడియాలో వెల్లడవుతూనే ఉన్నాయి. వాటిని నివారించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో, దోషుల దండనపై ఏమేరకు అవి దృష్టి పెడుతున్నాయో ఎవరికీ తెలియదు. మధ్యప్రదేశ్ సంగతినే చూస్తే ఎస్సీ, ఎస్టీలపై ఆగడాలు శ్రుతిమించుతున్న రాష్ట్రాల్లో అది అగ్రస్థానంలో ఉంది. అక్కడ దళితులపై దాడుల పెరుగుదల 49.4 శాతం ఉంది. ఎస్టీల విషయంలో ఆ పెరుగుదల 15.6 శాతం. ఇవి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో చెబుతున్న గణాంకాలు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల) నిరోధక చట్టంపై జారీ అయిన మార్గదర్శకాలను నిరసిస్తూ గత నెల 4న దేశవ్యాప్త బంద్ జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 8మంది చనిపోయారు. నిరుడు గుజరాత్‌లోని ఉనాలో గోహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నడిరోడ్డుపై తమను కొరడాలతో హింసించిన దుర్మార్గులపై చర్యలు లేకపోవడంతో విసుగెత్తిన దళిత కుటుంబం ఆదివారం బౌద్ధమతంలోకి మారింది. వారితోపాటు మరో 300 మంది సైతం బౌద్ధాన్ని స్వీకరించారు. కనీసం ఇలాంటి పరిణామాలైనా ఆధిపత్యకులాల్లోనూ, పాలకుల్లోనూ పరివర్తన తీసుకురావాలి. ‘ముద్రల’ ఉదంతంపై రకరకాల తర్కాలు పుట్టుకొస్తున్నాయి. పోలీసు నియామకాలకు హాజరైనవారెవరూ దీనిపై ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదన్నది అందులో ఒకటి. నానా అగచాట్లూ పడి ఈ స్థాయి వరకూ వచ్చిన అభ్యర్థులు తమను అవమానించారని ఫిర్యాదు చేయడానికి సాహసిస్తారా? ఈ తర్కం లేవదీసిన అధికారులు కేసును మూసేయడానికి ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారని అనుకోవాలి. ఎవరూ ఫిర్యాదు చేయలేదు గనుక దీన్ని ఇంతటితో ముగిస్తున్నామని ఏణ్ణర్థం తర్వాత ప్రకటించినా ప్రకటించవచ్చు. కులం, మతం, జాతి, ప్రాంతం వగైరాలతో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సమానత్వాన్ని, సమాన హక్కుల్ని, న్యాయాన్ని అందించాలని నిర్దేశిస్తున్న రాజ్యాంగాన్ని మధ్యప్రదేశ్‌లోని ‘ముద్రలు’ ఉల్లంఘించాయి. శతాబ్దాలనుంచీ ఇక్కడ అమలవుతున్న కులజాడ్యాన్నే తలకెత్తుకున్నాయి. కనుక ఆ ముద్రలకు నైతికబాధ్యత వహించకపోతే, అందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాలి. -
ఉత్తర–దక్షిణాది ఘర్షణ తప్పదా ?
రాబోయే రోజుల్లో ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర నిధుల కేటాయింపు విషయంలో తమ రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన వాటా రావడం లేదనే భావనలో దక్షిణాది నాయకులున్నారు. రాష్ట్రాలకు 1971 జనాభా లెక్కలకు బదులు 2011 జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర పన్నుల రాబడిని ( సెంట్రల్ టాక్స్ రెవెన్యూ) పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం సిఫార్సు చేయడం మళ్లీ మాటల యుద్ధానికి తెర లేపింది. కేంద్రం సిఫార్సు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని, దీనిని తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నేతలు అడ్డుకోవాలంటూ శుక్రవారం కర్నాటక సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌ను ఆయా రాష్ట్రాల సీఎంఓలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కూడా ఆయన ట్యాగ్ చేశారు. ఇదే సెంటిమెంట్‌ను వ్యక్తం చేస్తూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పది బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. పదహేనో∙ఆర్థిక సంఘం పరిశీలనలోని కొన్ని పరిశీలనాంశాలు (టీఓఆర్) లోపభూయిష్టంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటి వల్ల రాష్ట్రాలకు కేంద్ర పన్నుల రాబడి సమాన ంగా∙పంపిణీ చేయడం పై ప్రభావం పడుతుందని, ఈ రాష్ట్రాలకు మున్సిపాలిటీల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని స్టాలిన్ పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కలతో నష్టం ? కేంద్ర పన్నుల రాబడి (టాక్స్ రెవెన్యూ)ని ప్రతీ అయిదేళ్లకు వివిధ రాష్ట్రాలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే అంశాన్ని రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన కేంద్ర పన్నుల్లో 42 శాతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తారు. మిగతా 58 శాతాన్ని జాతీయ అవసరాల కోసం కేంద్రం వినియోగిస్తుంది. వివిధ రాష్ట్రాలకు కేటాయించే 42 శాతం నిధులపై ఆర్థికసంఘం నిర్ణయిస్తుంది. గతేడాది నవంబర్ 27న ఎన్కే సింగ్ అధ్యక్షతన 15వ ఆర్థికసంఘాన్ని కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఫైనాన్స్ కమిషన్ 2020–25 కాలానికి సంబంధించిన పన్నుల కేటాయింపుపై వచ్చే ఏడాది అక్టోబర్ 30 లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా కమిషన్ సిఫార్సు చేస్తుందని టీఓఆర్‌లో పేర్కొన్నారు. గతంలో ఇందుకు 1971 సెన్సస్ వివరాలను ( ఈ జనాభా లెక్కల తర్వాతే దేశంలో కుటుంబనియంత్రణ విధానాలు వేగవంతం చేయడంతో) ప్రామాణికంగా తీసుకునేవారు. ఈ డేటా ప్రకారమే 1976లో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచారు. నియోజకవర్గాల సంఖ్య మార్చకుండా 2008లో పునర్విభజన జరిగింది. 2026 తర్వాత(2031) జరిగే జనాభా లెక్కల ఆధారంగానే మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. 2011 జన గణన ప్రకారం సమకాలీన భారత్‌లో ఉత్తర,దక్షిణ రాష్ట్రాల మధ్య తేడాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఆర్థికాభివృద్ధి రేటు, నాణ్యమైన జీవనం, ప్రభుత్వపాలన, జనాభా, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. 1991లో సరళీకర ఆర్థిక విధానాల అమలు మొదలయ్యాక ఆ తర్వాతి ఇరవై ఏళ్లలో ఉత్తరప్రదేశ్,బీహార్లలో కలిపి 25 శాతం జనాభా పెరుగుదల రికార్డయింది. అదే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కేరళల్లో కలిపి 12 శాతమే జనాభా పెరిగింది. ఈ రెండు దశాబ్దాల్లో కేరళలో 5 శాతం జనాభా వృద్ధి కాగా బిహార్‌లో ఎన్నోరెట్లు పెరిగింది. జాతీయ సగటు, దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల సగటు కంటే కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధికశాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమైంది. దక్షిణాదిపై చిన్నచూపా ? 1971–91 సంవత్సరాల మధ్య ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు పెరిగిందని, తమ రాష్ట్రాల్లో క్రమేణా తగ్గుతూ వస్తోందనేది దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా వాదిస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం లెక్కిస్తే రాష్ట్రాలకు కేంద్రనిధులు గణనీయంగా తగ్గిపోతాయన్నది సిద్ధరామయ్య, స్టాలిన్ వంటి నేతల «నిశ్చితాభిప్రాయం. సంతానోత్పత్తి శాతాన్ని తగ్గించేందుకు, అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు దక్షిణాది రాష్ట్రాలు విద్య, ఆరోగ్య పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నందుకు కేంద్రం శిక్షిస్తున్నట్టుగా ఇది ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. 1971–2011 మధ్య ఉత్తరప్రదేశ్‌లో 138. 02 శాతం, జమ్మూ,కశ్మీర్లో 171.82 శాతం జనాభా వృద్ధితో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిందని,అదే తమిళనాడులో 56 శాతం, కేరళలో 75 శాతమే వృద్ధి చెందిందని గణాంకాలు ఉటంకిస్తున్నారు. యూపీ, బిహార్‌లతో పోల్చితే కేరళ, తమిళనాడు మహిళా అక్షరాస్యత గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల యూపీలో రూ. 36 వేల కోట్లతో రైతు రుణమాఫీని ప్రకటించడంతో (ఆ రాష్ట్రం రూ.50 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా) దీనిని అమలు చేసేందుకు అవసరమైన రుణాలకు కేంద్రమే పూచీ ఉండాల్సి రావడాన్ని ఎత్తిచూపుతున్నారు. అయితే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నుల వాటాలో పెద్దగా ప్రభావం పడదని ఆర్థికసంఘం అధ్యక్షుడు ఎన్కే సింగ్ చెబుతున్నారు. పదిహేనో ఆర్థికసంఘం పరిశీలనాంశాల (టీఓఆర్)ను సమర్థిస్తూ జనాభా వృద్ధిని అదుపు చేసే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నందున ఈ రాష్ట్రాల లెక్క సరిచేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హిందూఖుష్‌లో భూకంపం; వణికిన ఉత్తర భారతం
న్యూఢిల్లీ : దేశరాజధాని సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. అఫ్ఘనిస్థాన్‌లోని హిందూఖుష్ ప్రాంతంలో సంభవించిన భూకంపమే ఇందుకు కారణమని తెలిసింది. హిందూఖుష్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదయిదని యూరప్-మధ్యధరా భూకంప కేంద్రం ఒక ప్రకటన చేసింది. జమ్ముకశ్మీర్‌లోనూ భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సిఉంది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనల ప్రభావం ఏమిటన్నది వెల్లడికావాల్సిఉంది. -
కార్గిల్ @మైనస్ 15.4 డిగ్రీలు
న్యూఢిల్లీ: ఉత్తర భారత్‌లో చలి గాలుల ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం కార్గిల్‌లో ఉష్ణోగ్రత మైనస్ 15.4 డిగ్రీలు, లేహ్‌లో మైనస్ 12.7 డిగ్రీలుగా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యల్పంగా కీలాంగ్లో మైనస్ 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 7.1కు పడిపోయింది. పంజాబ్‌లోని అదాంపూర్లోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. ఇక్కడ కనిష్టంగా 3.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హరియాణాలో హిసార్‌లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా ముజఫర్‌నగర్‌లో 3.4 డిగ్రీలుగా నమోదైంది. -
ప్రమాదంలో ఉత్తర భారత నగరాలు
సాక్షి, న్యూఢిల్లీ : శత్రుదేశాల భయంకన్నా.. వాతావరణ కాలుష్యమే భారతీయ నగరాలను భీకరంగా వణికిస్తోంది. పాకిస్తాన్ అణు దాడికన్నా గాలి కాలుష్యమే భారతీయులను దారుణంగా పొట్టన పెట్టుకునేలా ఉంది. దేశం రాజధానిలో ఆవరించిన పొగమంచు, కాలుష్యం అందరికీ తెలిసిందే. ఇదొక్క ఢిల్లీకే పరిమితం కాకుండా పలు ఉత్తర భారతీయ నగరాలపై పంజా విసురుతోంది. నగరాలు.. కాలుష్య కాసారాలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు, పట్నా, కాన్పూర్, లక్నో, మొరాదాబాద్, జైపూర్, హౌరా వంటి నగరాలపై వాయు కాలుష్యం పడగలు చాస్తోంది. గత మంగళవారం నాడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 448 సూచిస్తోంది. ఇదే ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 500 తాకింది. ఆయా నగరాల్లో గాలి నాణ్యత అత్యంత కనిష్టానికి చేరింది. గడచిన వారం రోజులుగా మొరాబాదాబద్లో గాలి నాణ్యత 450 నుంచి 500 మధ్యలోనే ఉంటోంది. భయపడాల్సిన పని లేదు మరో వారం రోజుల్లో ఢిల్లీ, మొరాదాబాద్ నగరాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. వాయు కాలుష్యాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదపు అంచుల్లో నగరాలు గంగాతీర మైదానంలో ఉన్న ఉత్తర భారత ప్రధాన నగరాలపై వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని నాసా తెలిపింది. ప్రధానంగా లక్నో, ఆగ్రా, కాన్పూర్, ముజఫర్‌పూర్, పట్నా వంటి నగరాలపై వాము కాలుష్య ప్రభావం అత్యంత తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. -
అక్కడ ప్రతిరోజు 34 మరణాలు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకు రోడ్లు నెత్తురోడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతిరోజు 34 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు హరియానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లలో ప్రమాదాల శాతం ఎక్కువగా ఉంది. 2016 ఏడాదిలో 12,481 మంది మృత్యువాత పడగా, 2015లో ఈ సంఖ్య 11,914గా నమోదైనట్లు ఆ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 'భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2016' నివేదిక ప్రకారం ఈ నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలోనే ప్రమాద మృతుల సంఖ్య అధికంగా ఉంది. గతేడాది పంజాబ్‌లో 5077 మంది, హరియానాలో 5024 మంది, హిమాచల్ ప్రదేశ్ 1,271 మంది, జమ్ముకశ్మీర్‌లో 958 మంది వ్యక్తులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం, సైకిల్, బైక్, కారు, ఇతర వాహనాల మీద వెళ్తుండగా జరిగిన ప్రమాదాల్లో మృతిచెందారు. 333 మంది సైక్లిస్ట్‌లు చనిపోగా, అత్యధికంగా పంజాబ్‌లో 202 మంది, హరియానాలో 102 మంది, చండీగఢ్‌లో 28 మంది, జమ్ముకశ్మీర్‌లో ఒక్కరు చనిపోయారు. హరియానాలో 1596 మంది పాదచారులు చనిపోయారని, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాత నాల్గో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో 60 మంది మహిళలు సహా 433 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. పాదచారుల మృతుల సంఖ్యలో చండీగఢ్ 38 మందితో చివరి స్థానంలో ఉండగా, జమ్ముకశ్మీర్ 58 మందితో చివరి నుంచి రెండోస్థానంలో ఉంది. పాదచారులు రోడ్డుపై సురక్షితంగా ఉండాలంటే కాలిముద్రలు రోడ్డుపై అచ్చువేస్తే కొద్దిమేరకు ఈ కేటగిరిలో చావులను అరికట్టవచ్చునని రోడ్డ భద్రతా నిపుణుడు నవదీప్ అసిజా అన్నారు. పంజాబ్‌లో 2014లో 566 మంది పాదచారులు చనిపోగా, 2016లో ఈ సంఖ్య 635కు చేరిందన్నారు. లైసెన్స్లేనివారు, 18 ఏళ్లలోపు టీనేజర్లు వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అదే రీతిలో వారి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 18 ఏళ్లలోపు వారి వల్ల జరిగిన ప్రమాదాలు.. హరియానా 591 పంజాబ్ 327 జమ్ముకశ్మీర్ 137 హిమాచల్‌ప్రదేశ్ 48 చండీగఢ్ 5 -
ఉత్తరాదిన భారీ వర్షాలు
-
కొంచెం బద్ధకం వదిలించుకోవాలి మరీ..
► ఫిట్‌నెస్‌లో ఉత్తరాదికంటే వెనుకబడ్డ దక్షిణాది ► రీబాక్ ఫిట్ ఇండియా సర్వే వెల్లడి ► 7.6 స్కోరుతో ముందంజలో పుణె ► 6.6 స్కోరుతో ఐదోస్థానంలో హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతోపాటు వ్యాయామమూ తప్పనిసరి. రకరకాల కాలుష్యాల మధ్య జీవనం సాగిస్తున్న నగర జీవులకైతే ఇది మరీ ముఖ్యం. కానీ దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాయామం, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంపై అవగాహన తక్కువే అంటోంది ప్రముఖ స్పోర్ట్స్ షూ తయారీ సంస్థ రీబాక్. వ్యాయామం విషయంలో భారతీయుల ఆలోచనలు, అలవాట్లను గుర్తించేందుకు రీబాక్ ఇటీవలే ‘ఫిట్ ఇండియా’ పేరిట ఒక సర్వే నిర్వహించింది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఉత్తరాదివారే బెటర్ అని ఇందులో తేలింది! దేశవ్యాప్తంగా ఎనిమిది మహా నగరాల్లో 20–25 మధ్య వయసున్న 1,500 మందిని సర్వే చేయడం ద్వారా రీబాక్ ఈ ఫలితాలను రాబట్టింది. ఈ సర్వే ద్వారా భారతీయులకు ఫిట్నెస్ లేదన్న అపోహలు తొలగిపోయాయని, పది మందిలో కనీసం 6.5 మంది వ్యాయామాలపై అవగాహన కలిగి ఉన్నారని రీబాక్ ఇండియా సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ సిల్వియా టలోన్ తెలిపారు. అయితే దక్షిణాది నగరాల్లో దీనిపై అవగాహన మరింత పెరగాల్సి ఉందని అన్నారు. సర్వే వివరాలు స్థూలంగా.. ► ఫిట్‌నెస్‌పై అవగాహన విషయంలో పుణె అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం స్కోరు 7.6 కాగా... చండీగఢ్ 7.3 స్కోరుతో రెండోస్థానంలో నిలిచింది. కోల్‌కతా (6.71), ఢిల్లీ/ఎన్సీఆర్ (6.68), హైదరాబాద్ (6.6), బెంగళూరు (6.34), చెన్నై (6.21) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ► ఈ తరం యువత అత్యధికంగా పాల్గొనే ఫిట్నెస్ కార్యక్రమం ‘యోగా’. బెంగళూరులో అత్యధికులు (74 శాతం) యోగా చేస్తున్నట్లు చెబితే... ఈ సంఖ్య చెన్నైలో 71 శాతంగా, హైదరాబాద్‌లో 67 శాతంగా ఉంది. ► వ్యాయామం కోసం ఉండే రకరకాల కొత్త పద్ధతులపై అవగాహన తక్కువ. చెన్నై, బెంగళూరుల్లో పది శాతం కంటే తక్కువ మంది మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వంటి కొత్త పద్ధతులపై ఆసక్తి చూపారు. ఇతర నగరాల్లో దాదాపు సగం మందికి ఇలాంటి వాటిపై అవగాహన ఉంది. ► వ్యాయామానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అత్యధికులు యూట్యూ బ్పై ఆధారపడు తున్నారు. సర్వే చేసిన వారిలో 69 శాతం మంది హైదరాబాదీలు యూట్యూబ్‌ను ఫాలో అవుతూంటే.. ఈ సంఖ్య బెంగళూరులో 68 శాతం.. చెన్నైలో 58 శాతం మాత్రమే. ► ఫిట్నెస్ విషయంలో దక్షిణాది నగరాలు కాస్త వెనకబడి ఉన్నా మారథాన్ పరుగు పోటీల్లో మాత్రం ఇతర నగరాలకంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. ► హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఏమీ భిన్నంగా లేదని.. యూట్యూబ్‌లో ఫిట్నెస్ వీడియోలు చూడటం, వాటిని గుడ్డిగా ఫాలో అయిపోవడం హైదరాబాదీల స్టైలని అంటోంది ఈ సంస్థ -
ఉత్తర భారతం
-
రైళ్లు గంటల కొద్దీ ఆలస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. జనజీవనం, రవాణ వ్యవస్థ స్తంభించిపోతోంది. మంగళవారం ఉత్తరాదిన 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో ఆరు రైళ్లను రద్దు చేశారు. ఇస్లాంపూర్-న్యూఢిల్లీ మగధ్ ఎక్స్‌ప్రెస్ 48 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ 22 గంటలు, భువనేశ్వర్-న్యూఢిల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ 38 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఏ విమానం కూడా రద్దు కాలేదు. కాగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా వచ్చాయి. -
ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలు
– ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నవంబరు 8న ప్రారంభం – మాత వైష్ణోదేవి, అమృత్సర్, హరిద్వార్, న్యూ ఢిల్లీ, మధుర, ఆగ్రాల సందర్శనం – 11రోజుల యాత్ర టికెట్ ధర రూ.9,625, ఏసీలో రూ.13,075 – ఇందులోనే రవాణా, భోజన చార్జీలు – కర్నూలు మీదుగా తొలి ప్రత్యేక రైలు : డీజీఎం సంజీవయ్య కర్నూలు(రాజ్‌విహార్): ఉత్తర భారత యాత్రకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. అలాంటి వారి కోసం కర్నూలు మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటర్నింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) డీజీఎం ఎన్. సంజీవయ్య వెల్లడించారు. బుధవారం స్థానిక కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌లోని మేనేజరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రైలు ద్వారా ఉత్తర భారతదేశంలోని మాత వైష్ణో దేవి ఆలయంతోపాటు అమృత్సర్, హరిద్వార్, న్యూ ఢిల్లీ, మథుర, ఆగ్రాలను సందర్శించవచ్చని చెప్పారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, టీ ఉచితంగా అందిస్తామన్నారు. రైలు చార్జీలతోపాటు స్థానిక ప్రదేశాలు చూసేందుకు నాన్ ఏసీ బస్సు సౌకర్యం, రాత్రి బసకు ధర్మశాలలు లేదా డార్మెటరీ హాలు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికి కలిపి సాధారణ స్లీపర్ బోగీలో బెర్త్‌కు రూ.9,625, ఏసీ త్రీ టైర్ బోగీలో బెర్త్‌కు రూ. 13,075 చార్జీ ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల వయస్సు పైబడిన వారందరికీ పూర్తి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందనా్నరు. కర్నూలు మీదుగా తొలిసారి ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలును రాయితీ చార్జీలతో నడుపుతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో స్టేషన్ మేనేజరు మక్బూల్ హుసేన్, ఐఆర్సీటీసీ మేనేజరు ఎ.ప్రసన్న, ఎగ్జిక్యూటీవ్ పవన్ తదితరులు పాల్గొన్నారు. - యాత్ర ఇలా.. నవంబరు 8వ తేదీన మధ్యాహ్నం 12:20గంటలకు రేణిగుంటలో బయలుదేరి కడపలో 14:20కి, ఎర్రగుంట్ల 15:00, తాడిపత్రి 16:05, కర్నూలు సిటీ 17:10 (సాయంత్రం 5:10గంటలు), మహబూబ్ నగర్ 21:15, కాచిగూడ 23:30, కాజీపేట 9న 01:35 గంటలకు చేరుతుంది. ఈ స్టేషన్లలో ఐదు నిమిషాలు ఆగి కదులుతుంది. కేవలం యాత్రికుల కోసమే కావడంతో ఇతరులు ఎక్కడం, దిగడం ఉండదు. కాజిపేట నుంచి నేరుగా 10న సాయంత్రం జమ్మును చేరుకుంటుంది. అక్కడి నుంచి 40కిలో మీటర్లు బస్సులో కాట్రా వరకు తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి 14కిలో మీటర్లు కాలి నడక లేదా గుర్రాలు, డోలీల ద్వారా వెళ్లవచ్చు. 11న మాత వైష్ణో దేవి దర్శనం అనంతరం 12 ఉదయం అమృత్‌సర్‌కు బయలుదేరుతారు. రాత్రి హరిద్వార్‌కు బయలుదేరి 13న చేరుకుంటారు. అక్కడ గంగా స్నానం, మానసాదేవి ఆలయం దర్శించుకుని రాత్రి ఢిలీకి బయలుదేరి 14న చేరుకుంటారు. అక్కడ 15వరకు స్థానిక ప్రదేశాల సందర్శన, షాపింగ్‌కు సమయం ఉంటుంది. 16న మధురలో శ్రీకృష్ణ జన్మస్థలం, ఆగ్రాలో తాజ్‌మహాల్ చూపిస్తారు. అదే రోజు రాత్రి బయలుదేరి 17న రాత్రి 21:10లకు కాజీపేట, కాచిగూడకి 23:10గంటలకు చేరుకుంటారు. 18వ తేదీన తెల్లవారు జామున 03:25గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. - వసతులు: ఈరైలులో 72బెర్త్‌లతో కూడిన 13బోగీలు, 64బెర్త్‌లతో కూడిన 2బోగీలు ఉంటాయి. పక్కా బెర్త్ రిజర్వేషన్, రైలులో, ఉండే చోట సూపర్వైజర్లు, గైడు ఉంటారు. యాత్రికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. సమయానికి టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనాలు, టీ ఇస్తారు. స్థానిక ప్రదేశాలు చూసేందుకు నాన్ ఏసీ బస్ సౌకర్యం, ఉండేందుకు వసతి, భద్రత (సెక్యూరిటీ) ఉంటుంది. కర్నూలులో రైలు ఎక్కితే యాత్ర అనంతరం తిరిగి ఇక్కడ దించుతారు. టికెట్లు ఇలా పొందాలి: యాత్ర టికెట్లును ఆన్లైన్ వెబ్సైట్ www.irctctourism.com నుంచి లేదా సికింద్రాబాదులోని ఎస్డీ రోడ్డులో ఉన్న ఆక్స్ఫర్డ్ ప్లాజాలోని కార్యాలయం నుంచి పొందవచ్చు. యాత్రికుల సంఖ్య పది మందికి పైగా ఉంటే సంస్థ ప్రతినిధి ఇక్కడికి వచ్చి టికెట్లు ఇస్తారు. వివరాలకు 040- 27702407, 97013 60701 నంబర్లకు సంప్రదింవచ్చు.