మంచు, నీళ్లతో నిండిన ఉత్తర భారతం
ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలు అకస్మాత్తుగా వచ్చిన వర్షం కారణంగా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీగా మంచు పడింది. కొండచరియలు విరిగిపడ్డాయి. ఢిల్లీ, హర్యానా, ఛండీగడ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో కూడా ఓ మోస్తరుగా వర్షాలు, మంచు కురిసింది.
ఢిల్లీలోని చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయి, రవాణా రాకపోకలు సోమవారం నిలిచిపోయాయి. జమ్ముశ్రీనగర్లో తీవ్రంగా మంచు కురవడంతోపాటు కొండచరియలు విరిగి పడటంతో కొన్ని రహదారులు మూసి వేశారు. చాలా చోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.