
రిషికేశ్: ఎగువ హిమాలయాల ప్రాంతం గర్వాల్ హిమాలయాల్లో వర్షం, హిమపాతం కారణంగా కేదార్‌నాథ్ యాత్ర కోసం రిషికేశ్, హరిద్వార్‌లలో జరిగే యాత్రికుల రిజిస్ట్రేషన్‌లను ఈ నెల 30వ తేదీదాకా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మంగళవారం తెరుచుకోనున్న సంగతి తెల్సిందే. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌ల దర్శనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment