Kedarnath Yatra
-
ఐదు నెలల కిందటే పెళ్లి.. కేదార్నాథ్ యాత్రకు వెళ్లి నవ వరుడి మృతి
ఐదు నెలల క్రితం జరిగిన వివాహానంతరం కోటి ఆశలతో కొత్తజీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవజంట భవిష్యత్తు గురించి ఎన్నో కలల కంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలోనే విధికి కన్నుకుట్టడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో నవ వరుడి ప్రాణాలు గాలిలో కలిసిపోగా నవవధువు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద వార్తతో రాజాం మండల పరిధిలోని బొద్దాం గ్రామస్తులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాక్షి, విజయనగరం: రాజాం సిటీ మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవిరావుకు, పట్టణ పరిధిలోని సారథికి చెందిన కల్యాణితో ఫిబ్రవరి 12న వివాహమైంది. రవిరావు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ భార్య కల్యాణితో జీవనం సాగిస్తున్నాడు. ఈ నవజంట వారం రోజుల క్రితం కేథారినాథ్ యాత్రకు హైదరాబాద్ నుంచి బయల్దేరింది. యాత్ర జాలీగా సాగుతున్న సమయంలో శనివారం రాత్రి (తెల్లవారితే ఆదివారం) అక్కడ భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ప్రయాణికులంతా గల్లంతయ్యారని తొలుత భావించారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూటీం బాధితులను రక్షించే క్రమంలో కల్యాణితోపాటు మరికొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ముమ్మరగాలింపు చర్యలు చేపట్టిన తరువాత రవిరావు (29) మృతిచెందినట్లు గ్రామస్తులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా మృతుని కుటుంబ సభ్యులంతా తగరపువలసలో జరుగుతున్న బాలసారె కార్యక్రమంలో ఉన్నారు. రవిరావు మృతి విషయం తెలుసుకున్న వీరంతా విషాదంలో మునిగిపోయారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ అధికారుల ఆరా.. గ్రామానికి చెందిన రవిరావు దంపతులు తీర్థయాత్రకు వెళ్లి ప్రమాదం బారిన పడిన విషయంపై తహసీల్దార్ ఎస్కే రాజు, ఆర్ఐ విద్యాసాగర్‌లు గ్రామానికి వచ్చి ఆరా తీశారు. రవిరావు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లను కోరినట్లు గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ నక్క వర్షిణి, సర్పంచ్ నక్క తవిటమ్మతో పాటు గ్రామస్తులు తెలిపారు. -
కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..?
ఉత్తరాఖండ్ : చార్ధామ్ యాత్రికులకు వాతావరణం పరీక్ష పెడుతోంది. ఏటా కేవలం ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే గంగోత్రీ, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్ర.. అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్ర. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో 3584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడం మామూలు విషయం కాదు. గత మూడు రోజుల నుంచి రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండలు, కోనలు, ఆ పక్కనే లోయలు, నదులు.. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో ఆకస్మిక వర్షాలు రావడం, ఆ వెంటనే వరదలు పోటెత్తడం ఇక్కడ సాధారణం. తాజా వర్షాలు, వరదల కారణంగా కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. హరిద్వార్, రుషికేష్ల నుంచి యాత్రికులు ముందుకు రావొద్దని కోరారు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి. Char Dham Yatra halted due to bad weather, CM Dhami instructs officials to be vigilant Read @ANI Story | https://t.co/NkileHv4Xw#chardham #chardhamyatra #Kedarnath #Badrinath #PushkarSinghDhami pic.twitter.com/nM38Si9jDm — ANI Digital (@ani_digital) June 26, 2023 20 గంటలపైనే.. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ శివాలయం ఒకటి. హిమాలయాల్లో నిర్మించిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దీన్నిఆదిశంకరాచార్యులు నిర్మించారు. హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో కనీసం 20 గంటల పాటు ప్రయాణం చేస్తేనే బేస్ పాయింట్ గౌరీకుండ్ చేరుకుంటాం. అయితే ఏకబిగిన 20 గంటలు ప్రయాణం అనేది ఏ మాత్రం సాధ్యం కాని పని. ఇదీ చదవండి: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు.. ప్రతికూల వాతావరణం.. కేదార్నాథ్ మంచుకొండల మధ్య ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ కనిష్టంగా ఉంటాయి. హఠాత్తుగా కూలిపడే కొండచరియలు, దెబ్బతినే రోడ్ల నడుమ అసలు ముందుకు సాగుతుందా లేదా అన్నట్టుగా ప్రయాణం ఉంటుంది. పైగా ఆ కొండలపై ట్రాఫిక్ తరచుగా నిలిచిపోతుంది. కేదార్‌నాథ్‌కు వాహనాలు వెళ్లవు. దాని బేస్ పాయింట్ గౌరీకుండ్ వరకే వాహనాలుంటాయి. అక్కడి నుంచి నడక మార్గం లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు. హెలీకాప్టర్ ఉన్నా వాతావరణం అనుకూలిస్తేనే ప్రయాణం సాగుతుంది. కేదార్‌నాథ్‌ను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలా మంది తహతహలాడుతారు. ఈ సారి బోలెడు మంది ఇప్పటికే హరిద్వార్, రిషికేశ్ చేరుకున్నారు. తాజా వరదలతో నిరాశపడిపోయారు. दयानिधान बाबा केदारनाथ की संध्या आरती दर्शन🙏खराब मौसम और बारिश की वजह से रोकी गई केदारनाथ यात्रा।यात्रियो को सुरक्षित स्थानों पर रुकने की सलाहजय केदार🕉#Kedarnath 🚩 pic.twitter.com/ljJpeEhLaM— श्री केदारनाथ (@ShriKedarnath) June 25, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
రుద్రప్రయాగ: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తడంతో సోనప్రయాగ్ దగ్గర యాత్రను నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కేదార్‌నాథ్‌కు ప్రయాణాల్ని ఆపేయాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఆదివారం రాష్ట్ర విపత్తు నిర్వహణకు చెందిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. -
Char Dham Yatra 2023: 30దాకా కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ నిలిపివేత
రిషికేశ్: ఎగువ హిమాలయాల ప్రాంతం గర్వాల్ హిమాలయాల్లో వర్షం, హిమపాతం కారణంగా కేదార్నాథ్ యాత్ర కోసం రిషికేశ్, హరిద్వార్‌లలో జరిగే యాత్రికుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 30వ తేదీదాకా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మంగళవారం తెరుచుకోనున్న సంగతి తెల్సిందే. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌ల దర్శనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. -
Narendra Modi Birthday: 56 వంటకాలతో మోదీ థాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ‘‘శనివారం నుంచి 26వ తేదీ దాకా 56 రకాల ఉత్తరాది వంటకాలతో ప్రత్యేకంగా మోదీ థాలి వడ్డిస్తాం. 40 నిమిషాల్లో థాలీని పూర్తి చేసిన వారికి రూ.8.5 లక్షలు అందజేస్తాం. ఇద్దరు విజేతలను మోదీకెంతో ఇష్టమైన కేథార్నాథ్ సందర్శనకు పంపిస్తాం’’ అని ప్రకటించింది. ఈ థాలీలో 20 రకాల కూరలతోపాటు రకరకాల బ్రెడ్లు, పప్పు, గులాబ్ జామ్, కుల్ఫీ సహా మొత్తం 56 వెరైటీలుంటాయి. వెజిటేరియన్ థాలి రూ.2,600, నాన్ వెజ్ థాలి రూ.2,900. డిన్నర్ థాలి అయితే మరో రూ.300 ఎక్కువట. వీటిపై పన్నులు అదనం. మోదీ అంటే తమకెంతో అభిమానమని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న ఆర్డర్ 2.1 అనే ఈ రెస్టారెంట్ ఓనర్ సువీత్ కాల్రా చెప్పారు. ‘‘మా రెస్టారెంట్ అందించే వెరైటీ థాలీలకు ఎంతో ఆదరణ ఉంది. ధరలను తగ్గించాలని మోదీని కోరుతూ 10 రోజుల్లో ‘ద్రవ్యోల్బణం–మాంద్యం థాలి’ కూడా తీసుకొస్తాం’’ అన్నారు. ఈ రెస్టారెంట్లో ‘పుష్ప థాలి’, ‘బాహుబలి థాలి’ కూడా సర్వ్ చేస్తుండటం విశేషం! ప్రధాని బహుమతుల వేలం ఎగ్జిబిషన్ ప్రారంభించిన కిషన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన 1,222 మైన జ్ఞాపికలు, బహుమతుల ఈ–వేలం నాలుగో విడత ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 దాకా సాగనుంది. ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శుక్రవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. వేలం ద్వారా సమకూరే మొత్తం నమామి గంగ ప్రాజెక్టుకు వెళ్తుందని గుర్తు చేశారు. దేశ జీవనాడి అయిన గంగా నదిని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ వేలంలో అందరూ పాల్గొనాలని కోరారు. -
చార్ధామ్ యాత్ర: భక్తులకు వార్నింగ్.. 2013ను గుర్తు తెచ్చుకోండి
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఈ యాత్రను భారతీయలు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ యాత్ర కోసం భక్తులు ఎంతో ఖర్చు చేసి అక్కడి వెళ్తుంటారు. ఆ ప్రాంతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కానీ, భక్తులు ఇవ్వన్నీ మరచి.. అక్కడి వాతావరణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తున్నారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తుల్లో కొందరు అక్కడి నియమాలను ఏమాత్రం పాటించడం లేదు. ప్లాస్టిట్స్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగులు, చెత్తా చెదారం అన్నీ అక్కడే పడేసి వచ్చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రాంతాన్ని చెత్త కుండీలా మార్చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఫొటోలను షేర్ చేశాయి. ఈ క్రమంలో యాత్రికుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్లాస్టిక్ కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రం, అక్కడి వాతావరణం విపరీతంగా దెబ్బతిని పోతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ధామ్ లాంటి సున్నిత ప్రాంతాల్లో ప్లాస్టిక్ కారణంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని పర్యావరణవేత్తలు హితవు పలుకుతున్నారు. అది జీవావరణానికే పెద్ద ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లో 2013 నాటి ఉపద్రవాన్ని ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. దేవుడిని కేవలం గర్భగుడిలోనే చూడటం కాదు.. ప్రకృతిలోనూ దైవత్వాన్ని చూడాలని కోరుతున్నారు. Uttarakhand | Heaps of plastic waste & garbage pile up on the stretch leading to Kedarnath as devotees throng for Char Dham Yatra pic.twitter.com/l6th87mxD9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 22, 2022 ఇది కూడా చదవండి: యమునోత్రిలో కూలిన రహదారి భద్రత గోడ.. నిలిచిపోయిన 10 వేల మంది యాత్రికులు.. -
చార్ధామ్ యాత్రకు కోర్టు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్ధామ్ యాత్రను పాక్షికంగా తెరవాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. కోవిడ్ మహమ్మారి మధ్య యాత్ర నిర్వహించడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించి న్యాయవాదులు దుష్యంత్ మైనాలి, సచి్చదానంద్ దబ్రాల్, అను పంత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్, ఇతర ఉన్నతాధికారులు కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోవిడ్ మహమ్మారి మధ్య యాత్రికులు, పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తపరిచారు. అంతేగాక దేవాలయాలలో లైవ్ స్ట్రీమింగ్ చేయడం, ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదన, అర్చకుల భావోద్వేగాలపై సానుభూతితో చేసినట్లుగా ప్రభుత్వ వాదన ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా చార్ధామ్ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) ను తిరస్కరిస్తూ, అవి కుంభమేళా సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాల నకలు కాపీ మాత్రమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఎస్ఓపీలో హరిద్వార్ జిల్లాలో పోలీసుల మోహరింపు ప్రస్తావించారని, ఇది యాత్ర విషయంలో ప్రభుత్వం ఏమేరకు సీరియస్‌గా ఉందో చూపిస్తోందని కోర్టు తెలిపింది. చార్ధామ్ యాత్ర కుంభ్‌మేళా మాదిరిగా మరో ‘కోవిడ్ సూపర్ స్ప్రెడర్’గా మారకుండా ఉండేందుకు యాత్రను నిలిపివేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే దేవాలయాలతో ప్రజలకు ఉన్న మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ధామాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలను ప్రజలు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘శాస్తాలు రాసినప్పుడు ముఖ్యమైన ఘటనలను ప్రసారం చేసేందుకు టెలివిజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబడుతూ కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం కొంతమంది భావాలను పట్టించుకోకుండా, డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి ప్రతి ఒక్కరినీ రక్షించడం చాలా ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా, కరోనా రెండవ వేవ్ వేగం కాస్త మందగించడంతో చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల నివాసితుల కోసం పరిమితంగా చార్ధామ్ యాత్రను ప్రారంభించేందుకు ఈనెల 25న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చదవండి: Auli Bugyal: మంచు తివాచీ.. రెండు కళ్లు చాలవు! Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! -
కేదార్నాథ్ ప్రారంభం
ఆలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ కేదార్నాథ్: ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని శుక్రవారం తెరిచారు. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేదారేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇందుకోసం 16 కి.మీ ఆలయ కొండ మార్గాన్ని ఆయన కాలిబాటన చేరుకున్నారు. గురువారం లించోలీ వరకూ 10 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి రాత్రికి అక్కడే బస చేసిన ఆయన శుక్రవారం అక్కడి నుంచి మరో 6 కిలోమీటర్లు నడిచి ఆలయానికి వచ్చారు. రాహుల్ వెంట ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తదితరులు ఉన్నారు. తాను కాలిబాటన ఆలయానికి చేరుకోవడం వెనుక రెండు ఉద్దేశాలు ఉన్నాయని రాహుల్ విలేకర్లతో అన్నారు. 2013 నాటి కేదార్ వరద మృతులకు నివాళులర్పించడంతోపాటు అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్న పోర్టర్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు కాలిబాట ఎంచుకున్నానన్నారు. దేవుడిని ప్రత్యేకంగా ఏదీ కోరుకోలేదని...కానీ ఆలయంలోకి ప్రవేశించగానే అగ్ని వంటి శక్తి అనుభూతి చెందానన్నారు. -
కేదర్నాథ్ యాత్రలో విరిగిపడిన కొండచరియలు
డెహ్రాడూన్: కొండచరియలు కూలిపడటంతో కేదార్నాథ్ యాత్రకు అవరోధం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ వద్ద శనివారం కొండచరియలు కూలిపడటంతో కేదార్నాథ్ వైపు వెళ్లే తిల్వాడా-గుప్తకాశీ మార్గం మూసుకుపోయింది. కొండచరియలు పడటం వల్ల ఎవరికీ గాయాలు కాకున్నా, వాతావరణ పరిస్థితుల దష్ట్యా రాష్ట్రప్రభుత్వం కేదార్నాథ్ యాత్రను నిలిపివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్గంలో ముందుకు సాగడం ప్రమాదంతో కూడుకున్నదని, వాతావరణం మెరుగుపడేంత వరకు ఎలాంటి రిస్కు తీసుకోదలచుకోలేదని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇలాగే, వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో పదిరోజుల కిందట కూడా కేదార్నాథ్ యాత్రకు అవరోధం ఏర్పడింది. అయితే, యాత్రికుల భద్రత కోసం తగిన ఏర్పాట్లన్నీ చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. -
నిలిచిన కేదార్నాథ్ యాత్ర
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ యాత్రకు అవాంతరాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో తాజాగా మంచు కురవడంతో యాత్ర నిలిచిపోయింది. కేదార్నాథ్ లోయ అంతటా ఆదివారం మంచు కురిసిందని, దాంతో యాత్ర నిలిపివేసినట్లు రుద్రప్రయాగ ఎస్పీ బరీందర్‌జిత్ సింగ్ తెలిపారు. యాత్రీకులు సోన్ప్రయాగ వద్దే ఆగి, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉండాలని కోరినట్లు చెప్పారు. ఆరు నెలల శీతాకాలం విరామం తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తిరిగి భక్తుల కోసం తెరిచిన విషయం తెలిసిందే. ఈ నెల 13 వరకు చార్ధామ్ (కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రా మార్గంలో, హిమాలయాల్లోని 3,500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ స్థానిక కార్యాలయం అంచనా వేస్తోంది. 1. మరోవైపు ఆలయ ప్రధాన పూజారి భీమశంకర్‌లింగ కూడా వారం రోజుల పాటు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించారు. రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో యాత్రను కొనసాగించడం ప్రమాదకరమని చెప్పారు. 2. గతేడాది యాత్రా సమయంలో వరదలు ముంచెత్తడంతో సుమారు 5వేల మంది భక్తులు జలసమాధి అయిన విషయం తెలిసిందే. 3. {పముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్రాజ్ ఆదివారం మందిరం వద్ద తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన డెహ్రాడూన్లోనే ఉండిపోయారు -
కేదార్నాథ్ యాత్రకు బ్రేక్!
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఒకటైన కేదార్నాథ్ యాత్రకు అవాంతరాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో తాజాగా మంచు కురవడంతో యాత్ర నిలిచిపోయింది. కేదార్నాథ్ వ్యాలీ అంతటా ఆదివారం ఉదయం మంచు కురిసిందని, దాంతో యాత్ర నిలిపివేసినట్లు రుద్రప్రయాగ ఎస్పీ బరీందర్‌జిత్ సింగ్ తెలిపారు. యాత్రీకులను సోన్ప్రయాగ వద్దే ఆగిపోయి, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉండాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఆరు నెలల శీతాకాలం విరామం తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తిరిగి భక్తుల కోసం తెరిచిన విషయం తెలిసిందే. ఈ నెల 13 వరకు చార్ధామ్ (కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రా మార్గంలో, హిమాలయాల్లోని 3,500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ స్థానిక కార్యాలయం అంచనా వేస్తోంది. మరోవైపు ఆలయ ప్రధాన పూజారి భీమశంకర్‌లింగ కూడా వారం రోజుల పాటు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించారు. రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో యాత్రను కొనసాగించడం ప్రమాదకరమని చెప్పారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మతు, నిర్మాణ పనులను చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్రాజ్ ఆదివారం మందిరం వద్ద తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన డెహ్రాడూన్లోనే ఉండిపోయారు. గతేడాది చార్ధామ్ యాత్రా సమయంలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో సుమారు 5వేల మంది భక్తులు జలసమాధి అయిన విషయం తెలిసిందే. -
కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం
గోపేశ్వర్: మూడు నెలల వ్యవధి తర్వాత హిమాలయ క్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు శనివారం నుంచి యాత్రలు పునఃప్రారంభమయ్యాయి. తొలి బృందంలో రెండువందల మంది యాత్రికులు ఈ రెండు ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో సంభవించిన వరదల్లో భారీ ప్రాణనష్టం సంభవించిన దరిమిలా, ఈ క్షేత్రాలకు రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ క్షేత్రాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా నిర్మించిన కట్టడాలపై ఒత్తిడి ఎక్కువగా ఉండకుండా కేదార్నాథ్ ఆలయానికి రోజుకు వంద మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తున్నామని అధికారులు చెప్పారు. కేదార్నాథ్ ఆలయాన్ని శనివారం దర్శించుకున్న వారిలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ ఉన్నారు. కాగా, యాత్రల కోసం గుప్తకాశీలో రోజూ యాత్రికుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. యాత్రికుల భోజన వసతుల కోసం గౌరీకుండ్-కేదార్నాథ్ మార్గంలోని భీమబలి, లెంచౌనీలలో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయాలకు వచ్చే యాత్రికుల కోసం ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ సమితి ప్రధాన కార్యనిర్వాహక అధికారి బీడీ సింగ్ తెలిపారు.