Kedarnath Yatra Temporarily Closed Due To Heavy Rains - Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..? 

Published Mon, Jun 26 2023 4:18 PM | Last Updated on Mon, Jun 26 2023 6:49 PM

Kedarnath Yatra Temporarily Closed Due To Heavy Rains - Sakshi

ఉత్తరాఖండ్‌ : చార్‌ధామ్‌ యాత్రికులకు వాతావరణం పరీక్ష పెడుతోంది. ఏటా కేవలం ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే గంగోత్రీ, యమునోత్రి, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ యాత్ర.. అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్ర. 

ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో 3584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్‌ ఆలయానికి చేరుకోవడం మామూలు విషయం కాదు. గత మూడు రోజుల నుంచి రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండలు, కోనలు, ఆ పక్కనే లోయలు, నదులు.. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో ఆకస్మిక వర్షాలు రావడం, ఆ వెంటనే వరదలు పోటెత్తడం ఇక్కడ సాధారణం. తాజా వర్షాలు, వరదల కారణంగా కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌ ప్రకటించింది ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం. హరిద్వార్‌, రుషికేష్‌ల నుంచి యాత్రికులు ముందుకు రావొద్దని కోరారు ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి.

20 గంటలపైనే..
హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో కేదార్‌నాథ్ శివాలయం ఒకటి. హిమాలయాల్లో నిర్మించిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దీన్నిఆదిశంకరాచార్యులు నిర్మించారు. హరిద్వార్‌ లేదా రిషికేశ్‌ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో కనీసం 20 గంటల పాటు ప్రయాణం చేస్తేనే బేస్‌ పాయింట్‌ గౌరీకుండ్‌ చేరుకుంటాం. అయితే ఏకబిగిన 20 గంటలు ప్రయాణం అనేది ఏ మాత్రం సాధ్యం కాని పని. 

ఇదీ చదవండి: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు..

ప్రతికూల వాతావరణం..
కేదార్‌నాథ్‌ మంచుకొండల మధ్య ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ కనిష్టంగా ఉంటాయి. హఠాత్తుగా కూలిపడే కొండచరియలు, దెబ్బతినే రోడ్ల నడుమ అసలు ముందుకు సాగుతుందా లేదా అన్నట్టుగా ప్రయాణం ఉంటుంది. పైగా ఆ కొండలపై ట్రాఫిక్‌ తరచుగా నిలిచిపోతుంది. కేదార్‌నాథ్‌కు వాహనాలు వెళ్లవు. దాని బేస్‌ పాయింట్‌ గౌరీకుండ్‌ వరకే వాహనాలుంటాయి. అక్కడి నుంచి నడక మార్గం లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు. హెలీకాప్టర్‌ ఉన్నా వాతావరణం అనుకూలిస్తేనే ప్రయాణం సాగుతుంది. 

కేదార్‌నాథ్‌ను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలా మంది తహతహలాడుతారు. ఈ సారి బోలెడు మంది ఇప్పటికే హరిద్వార్‌, రిషికేశ్‌ చేరుకున్నారు. తాజా వరదలతో నిరాశపడిపోయారు.

ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement