రియాద్: సౌదీ అరేబియాలో ఎన్నడూ కానరాని వింత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎడారి ప్రాంతమైన సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడతో పాటు మంచుకురుస్తోంది. సౌదీ చరిత్రలో ఎన్నిడూ చూడని వాతావరణాన్ని ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు అంటున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం అల్-జౌఫ్ ప్రాంతంలో భారీగా మంచుకురిసింది. దేశంలో తొలిసారిగా శీతాకాలపు వాతావరణం కనిపించింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురియడం, వడగళ్ల వానలు పడటం, హిమపాతం ఏర్పడటమనేది ఎన్నడూ జరగలేదు. అల్-జౌఫ్ ప్రాంత ప్రజలు ఉదయం నిద్ర నుంచి లేవగానే తెల్లని మంచును చూశామని ఎంతో గొప్పగా చెబుతున్నారు.
📹 Incredible: Snow Blankets Parts of Saudi Arabia After Heavy Rain & Hail pic.twitter.com/mhn3VHHe5D
— RT_India (@RT_India_news) November 4, 2024
సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ ప్రాంతంలోని హిమపాతాన్ని, జలపాతాలను హైలైట్ చేసి చూపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను వచ్చే అవకాశం ఉందని, భారీ వర్షంతో పాటు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇలాంటి వాతావరణ మార్పులు కనిపించాయి.
ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు
Comments
Please login to add a commentAdd a comment