
రుద్రప్రయాగ్: కేదర్‌నాథ్‌లో దైవదర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అద్భుత దృశ్యం ఆహ్వానం పలికింది. హిమాలయ పర్వత శిఖరాల నుంచి భారీ ఎత్తున మంచు కిందకు కూలుతున్న ‘హిమపాతం’ దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యం, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని కేదర్‌నాథ్ ఆలయం వెనకవైపు నాలుగు కిలోమీటర్లదూరంలోని పర్వతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంచు విరిగిపడటం ప్రారంభమైంది.
భక్తులు ఒకింత భయపడుతూనే ఆ దృశ్యాలను మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. మేరు–సుమేరు పర్వతశ్రేణుల్లోని చోరాబారీ హిమానీనదం పరిధిలో గాంధీ సరోవర్‌పై హిమపాతం పడింది. మంచంతా లోయలో పడిపోవడంతో కేదర్‌నాథ్ ఆలయం దాకా దూసుకురాలేదు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఐదు నిమిషాలపాటు గుట్టలకొద్దీ మంచు కిందకు పడుతున్న వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment