Divine vision
-
కేదార్నాథ్ సమీపంలో భారీ హిమపాతం
రుద్రప్రయాగ్: కేదర్నాథ్లో దైవదర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అద్భుత దృశ్యం ఆహ్వానం పలికింది. హిమాలయ పర్వత శిఖరాల నుంచి భారీ ఎత్తున మంచు కిందకు కూలుతున్న ‘హిమపాతం’ దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యం, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయం వెనకవైపు నాలుగు కిలోమీటర్లదూరంలోని పర్వతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంచు విరిగిపడటం ప్రారంభమైంది. భక్తులు ఒకింత భయపడుతూనే ఆ దృశ్యాలను మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. మేరు–సుమేరు పర్వతశ్రేణుల్లోని చోరాబారీ హిమానీనదం పరిధిలో గాంధీ సరోవర్‌పై హిమపాతం పడింది. మంచంతా లోయలో పడిపోవడంతో కేదర్నాథ్ ఆలయం దాకా దూసుకురాలేదు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఐదు నిమిషాలపాటు గుట్టలకొద్దీ మంచు కిందకు పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. -
దైవదర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..
ఎల్కతుర్తి/ఏటూరునాగారం: దైవదర్శనం కోసం కారులో వేములవాడ బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, శాంతినగర్ సమీపంలో హనుమకొండ–కరీంనగర్ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటాక కారు, లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రిపూట ప్రయాణంతో... ఎల్కతుర్తి ఎస్సై గోదారి రాజ్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29), మంతెన కాంతయ్య (72), మంతెన చందన (16)తోపాటు మంతెన రేణుక (55), మంతెన భార్గవ్, మంతెన శ్రీదేవి కలసి కారులో గురువారం రాత్రి ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ నుంచి పెంచికలపేట సమీపంలోకి రాగానే వరంగల్ వైపు వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అవడంతోపాటు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భరత్‌తోపాటు ఆయన తండ్రి శంకర్, మంతెన కాంతయ్య, ఆయన కుమార్తె చందన అక్కడికక్కడే మృతిచెందగా వెనుక సీటులో కూర్చున్న రేణుక, శ్రీదేవి, భార్గవ్‌లకు తీవ్ర గాయాలై కారులోనే ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై రాజ్‌కుమార్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుక మృతిచెందింది. నిద్రమత్తు, అతివేగం, పొగ మంచు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారైనట్లు తెలిపారు. హనుమకొండలో షాపింగ్ చేసుకొని.. మంతెన శంకర్, కాంతయ్యలు వరుసకు అన్నదమ్ములు. శంకర్ కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య శ్రీదేవికాగా చిన్న కుమారుడు భరత్ టీఎస్ఎండీసీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా, పెద్ద కుమారుడు భార్గవ్ వాజేడులోని రెవెన్యూ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాంతయ్య కంసాలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య రేణుకకు చాలాకాలం తర్వాత చందన జన్మించింది. అయ్యప్ప మాల ధరించిన శంకర్ చిన్న కుమారుడు భరత్‌కు మేడారం జాతర ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ కావడంతో దానిలో భాగంగానే శ్రీదేవి అక్క కొడుకుకు చెందిన కారును తీసుకొని కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు. మార్గమధ్యంలో హనుమకొండలో షాపింగ్ చేసుకొని తిరిగి వేములవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ములుగు జిల్లాకు చెందిన పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. -
Telangana: సీఎం హామీలు నేరవేరేనా..?
సాక్షి,మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారు హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న సీఎం హామీ నీరుగారిపోతోంది. 2020 అక్టోబర్ 29న గ్రేటర్ సమీపంలోని మూడు చింతలపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రాంరంభోత్సవం సందర్భంగా నగర శివారు హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తానని ఆయన హమీ ఇవ్వటంతో పాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలను ఆదేశించారు. దీనిపై స్పందించిన అధికార యంత్రాంగం శివారుల్లో హారి్టకల్చర్ హాబ్ను అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల వ్యవధిలో రూ.250 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. ► మూడేళ్లలో అదనంగా 30 వేల ఎకరాల్లో ఉద్యానవన (హార్టికల్చర్) పంట సాగు చేసేందుకు ప్రతిఏటా 10 వేల ఎకరాల చొప్పున దశలవారీగా హార్టికల్చర్ పంట సాగు పెంచుతామని నివేదించింది. ► అలాగే శాఖలో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బందికి అదనంగా ఏడుగురు హారి్టకల్చర్ అధికారులు, 10 మంది హెచ్ఈఓ పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో కోరారు. అయితే ప్రతిపాదనలు నివేదించి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఉద్యానవన పంట సాగు పెంచేందుకు కావలసిన నిధులు ఇవ్వలేదు. హారి్టకల్చర్ శాఖలో అదనపు పోస్టుల మంజూరీ అటుంచితే ఖాళీ అయిన పోస్టులను కూడా భర్తీ చేయలేకపోయారు. ► ఆగిపోయిన ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులు ► ఘట్కేసర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్డి నిర్మాణ పనులను 2009 సంవత్సరంలో రూ.39 కోట్లతో ప్రారంభించారు. నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖ తనకు సంబంధించిన సగం వాటా నిధులు సకాలంలో విడుదల చేసి, పనులు పూర్తి చేసినప్పటికిని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద విడుదల చేయాల్సిన నిధుల జాప్యం వల్ల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోయాయి. పాత పెండింగ్ బిల్లుతో కలిపి మొత్తంగా రూ.2 కోట్లు చెల్లించకపోవటం వల్లనే బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. ► చర్లపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులిలా.. ► చర్లపల్లి ఇండస్ట్రీయల్ కారిడార్‌ను దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్–కాజీపేట రైల్వే మార్గంలో చర్లపల్లి వద్ద 2018లో రూ.24 కోట్లతో ఆర్ఓబీ పనులు ప్రారంభమయ్యాయి. అందులో సగం నిధులను కేంద్రం ప్రభుత్వం విడుదల చేయగా రైల్వే శాఖ పనులు పూర్తి చేసింది. మిగతా సగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. అయితే...సదరు నిర్మాణ çసంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.9 కోట్లు చెల్లించకపోవటంతో అప్రోచ్ రోడ్ల పనులు చేపట్టకుండానే వదిలేశారు. దీంతో చర్లపల్లి ఆర్ఓబీ ప్రారం¿ోత్సవానికి నోచుకోవటం లేదు. ► కీసరగుట్ట దేవస్థానం అభివృద్ధికి రూ.75 కోట్లు మంజూరు చేయాలని మూడేళ్ల కిందట ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ► దాదాపు మూడేళ్లుగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు రెగ్యులర్ కలెక్టర్ లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొత్త కలెక్టరేట్ ప్రారంభం నేపథ్యంలో ఇన్చార్జ్ కలెక్టర్‌గా కొనసాగుతున్న మెదక్ కలెక్టర్ హరీష్‌ను ఇక్కడనే రెగ్యులర్ కలెక్టర్ నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ► నగర శివారు ప్రాంతంగా ఉన్న మేడ్చల్ జిల్లాను హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులు ఇవ్వటంతో పాటు పర్యాటక రంగంగా అభివృద్ధి చేయటానికి ఉన్న అవకాశాల మేరకు జిల్లాను పర్యాటక కేంద్రంగా అబివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సీఎం ఇప్పటికైనా నగర శివారు మేడ్చల్ జిల్లా సమస్యలపై స్పందించి తగిన నిధుల విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. (చదవండి: 30 వేల మంది విద్యార్థుల జాతీయ గీతాలాపన ) -
దారి కాచిన మృత్యువు
♦ దైవ దర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి ♦ మరొకరి పరిస్థితి విషమం పదిహేను మందికి గాయాలు ♦ అందరిదీ ఒకే కుటుంబం.. న్యూ హుమ్నాపూర్ వద్ద దుర్ఘటన ♦ ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ ఇద్దరు మహిళల మృతి పుల్కల్: దైవ దర్శనానికి వెళుతున్న భక్తులకు ఓ లారీ మృత్యు రూపంలో ప్రాణాలు హరించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పుల్కల్ మండలం న్యూ హూమ్నపూర్ వద్ద జరిగిన ప్రమాదానికి సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ గొల్లగూడెం తండాకు చెందిన కిమ్యా తోపాటు ఆయన బంధువులు కుమార్, చందర్, మాన్సింగ్, శ్రీను మరి కొందరు ఏడపాయల దుర్గామాత జాతరకు మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్లో బయల్దేరారు. హూమ్నపూరం వద్ద ముందు వెళుతున్న ఓవర్ టేక్ చేయబోగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో కిమ్యా భార్య కేలి (45), భూలీ బాయి(42) అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మవారి కోసం తీసుకెళుతున్న మేక కూడా చనిపోయింది. మరో 13 మందికి గాయలు కావడంతో 108లో సంగారెడ్డి సమీపంలోని ఎంఎన్ఆర్ అసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.ట్రాక్టర్‌ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఆలయానికి వెళుతున్న వారి సామగ్రి చెల్లాచెదరుగా పడ్డాయి. ఒకరి పరిస్థితి విషమం సంగారెడ్డి రూరల్: పుల్కల్ మండలం హూమ్నపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 13 మందిని సంగారెడ్డి మండలం ఎంఎన్ఆర్ ఆసుపత్రి తరలించారు. వారిలో చెంద్రి బాయి తలకు బలమైన గాయాలు తగలడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కిమ్యా నడుము విరగగామాలీ బాయికి చేయి విరిగింది. అనీత, సంగీత,బుజ్జి, రవీందర్, వాల్యా, శివకు గాయాలయ్యాయి. చిన్నారులు చంద్ర కిషోర్ కుడికాలు విరిగింది. హారిక, కిశోర్, సాత్వీక్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు మృతి చెందడంతో వారి గ్రామం గొల్లాగుడెం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ అంత విషాదంగా కనిపించింది.