![Earthquake Strikes Near Afghanistan Effect Jolts North India - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/5/Earthquake_Afghan_Northindi.jpg.webp?itok=h8TYqCx0)
సాక్షి: ఉత్తర భారతం శనివారం ఉదయం ప్రకంపనలతో వణికిపోయింది. కొద్ది సెకండ్లపాటు స్వల్ఫ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
అఫ్గనిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దు కేంద్రం ఈ ఉదయం రిక్టర్ స్కేల్‌పై భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతోనే ఉత్తర భారతంలో పలు చోట్ల భూమి కంపించింది. ఉత్తర ప్రదేశ్ నొయిడాలో సుమారు 20 సెకండ్లపాటు ప్రకంపనలు ప్రభావం చూపించినట్లు పలువురు ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంకోవైపు ఢిల్లీ, జమ్ము కశ్మీర్(లోయ), ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్), మరికొన్ని ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మన దేశంలో తీవ్రత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.6గా నమోదు అయ్యింది. ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ.. ఉదయం 9.45 నిమిషాల సమయంలో ఫైజాబాద్ దగ్గర 5.7 తీవ్రత తీవ్రతతో 181 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొంది. యూరోపియన్ మెడిటేర్రినియన్ సిస్మోలాజికల్ సెంటర్ మాత్రం తీవ్రతను 6.8గా, 209 కి.మీ. లోతులో నమోదు అయ్యిందని పేర్కొనడం విశేషం. అఫ్గనిస్థాన్ భూకంప ప్రభావంతో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment