న్యూఢిల్లీ : దేశరాజధాని సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. అఫ్ఘనిస్థాన్‌లోని హిందూఖుష్ ప్రాంతంలో సంభవించిన భూకంపమే ఇందుకు కారణమని తెలిసింది.
హిందూఖుష్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదయిదని యూరప్-మధ్యధరా భూకంప కేంద్రం ఒక ప్రకటన చేసింది. జమ్ముకశ్మీర్‌లోనూ భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సిఉంది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనల ప్రభావం ఏమిటన్నది వెల్లడికావాల్సిఉంది.
హిందూఖుష్‌లో భూకంపం; వణికిన ఉత్తర భారతం
Published Wed, Jan 31 2018 1:19 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment