ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆప్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సీఈఎస్ఎమ్ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదైంది. భూకంప కేంద్రం కాబూల్కు ఈశాన్య దిశగా 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి లోపల 177 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది.
భూకంప ప్రభావానికి ఉత్తర భారత్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలియరాలేదు.