hindukush
-
ఢిల్లీలో భూ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ ప్రాంతంలో ఉంది. దీంతో దేశరాజధానితో పాటు పంజాబ్, చండీగఢ్, జమ్మూకశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కొద్దిసేపు భూమి కంపించింది. పాక్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. -
హిందూఖుష్‌లో భూకంపం; వణికిన ఉత్తర భారతం
న్యూఢిల్లీ : దేశరాజధాని సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. అఫ్ఘనిస్థాన్‌లోని హిందూఖుష్ ప్రాంతంలో సంభవించిన భూకంపమే ఇందుకు కారణమని తెలిసింది. హిందూఖుష్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదయిదని యూరప్-మధ్యధరా భూకంప కేంద్రం ఒక ప్రకటన చేసింది. జమ్ముకశ్మీర్‌లోనూ భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సిఉంది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనల ప్రభావం ఏమిటన్నది వెల్లడికావాల్సిఉంది. -
ఉత్తర భారతంలో భూప్రకంపనలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆప్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సీఈఎస్ఎమ్ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదైంది. భూకంప కేంద్రం కాబూల్‌కు ఈశాన్య దిశగా 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి లోపల 177 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. భూకంప ప్రభావానికి ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలియరాలేదు.