ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం | Earthquake Again In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

Nov 12 2022 8:23 PM | Updated on Nov 12 2022 8:36 PM

Earthquake Again In Delhi - Sakshi

ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. నాలుగు రోజుల వ్యవధిలో భూమి మళ్లీ కంపించింది.

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. నాలుగు రోజుల వ్యవధిలో భూమి మళ్లీ కంపించింది. ఢిల్లీ వాసులు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది.

నేపాల్‌లోనూ స్వల్పంగా మళ్లీ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 గా తీవ్రత నమోదైంది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్‌లోని జోషిమట్ నుంచి 212 కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలో స్వల్ప ప్రకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప నమోదు కేంద్రం వెల్లడించింది.
చదవండి: సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన జంట.. వరుడికి బంపరాఫర్‌ ఇచ్చిన వధువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement