ఢిల్లీ: నేపాల్‌లో 6.4 తీవ్రతతో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం.. అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఉత్తర భారతం వణికిపోయింది.
నేపాల్‌లో భూకంప నమోదు ప్రాంతానికి 500 కి.మీపైగా దూరంలో ఉన్న ఉత్తర భారత దేశంలోనూ ఈ ప్రభావం కనిపించింది. ఢిల్లీతో పాటు యూపీ, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. సుమారు 20 సెకన్ల పాటు భారీగానే భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌తో పాటు యూపీ ప్రయాగ్‌రాజ్, ఫరీదాబాద్, గురుగ్రామ్, భాగ్‌పట్, వారాణాసి, సుల్తాన్‌పూర్, కుషీనగర్, గోరఖ్‌పూర్, మీర్జాపూర్‌లోనూ ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు.
North India including bihar patna , delhi ncr , Gurgaon , haryana and Nepal hit by a scary earthquake.#earthquake #Delhi #Nepal #DelhiNCR #Noida #Tremors #भूकंप #Bihar #Patna #lucknow pic.twitter.com/TK72oCKfOV
— Dr. Shivam dubey (@ShivamdubeYspn) November 4, 2023
#WATCH | Bihar: People come out of their homes as tremors felt in Patna pic.twitter.com/PoINrMXIA1
— ANI (@ANI) November 3, 2023
Comments
Please login to add a commentAdd a comment